Three Idiots
-
చక్కని ‘ఫాంగ్’కు చాంగు భళా.. ఇదే!
కొడితే ‘ఫాంగ్’ జాబ్ కొట్టాలి అనుకుంటోంది యువతరం. ప్రపంచంలోని ఉత్తమ పనితీరు కనబరిచే దిగ్గజ కంపెనీల సంక్షిప్త నామం–ఫాంగ్ (ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫిక్స్, గూగుల్) ‘ఫాంగ్’ కంపెనీలలో ఉద్యోగం చేయాలనే కలను నెరవేర్చుకోవడానికి స్కిల్ లెర్నింగ్ కాన్ఫరెన్స్‌లకు హాజరు కావడం నుంచి సీనియర్ ఉద్యోగులతో మాట్లాడడం వరకు ఎంతో కసరత్తు చేస్తున్నారు. కలను నెరవేర్చుకుంటున్నారు.ప్రతిష్ఠాత్మకమైన ఫాంగ్ (ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్) కంపెనీలలో ఉద్యోగం చేయాలని యువతరం బలంగా అనుకోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే... కాంపిటీటివ్ స్పిరిట్, వర్క్–లైఫ్ బ్యాలెన్స్, గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీపై పనిచేసే అవకాశం అనేవి ముఖ్య కారణాలు.‘ఫాంగ్’ కంపెనీలలో పనిచేయాలనే కలను నెరవేర్చుకోవడానికి తగిన కసరత్తు చేస్తున్నారు. ‘ఫాంగ్’ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడుతున్నారు. ‘ఫాంగ్’ రిక్రూటర్స్, ఎం.ఎల్. ఇంజినీర్స్, రిసెర్చర్లు హాజరయ్యే స్కిల్ లెర్నింగ్ కాన్పరెన్స్లకు హాజరవుతున్నారు. ‘ఫాంగ్’ ఇంటర్వ్యూల గురించి అవగాహన చేసుకోవడానికిప్రొఫెషనల్స్తో మాట్లాడుతున్నారు.‘నా ఫ్రెండ్ ఒకరు మోస్ట్ టాలెంటెడ్. అయితే మొదటి ప్రయత్నంలో ఫాంగ్ కంపెనీలలో ఒకదాంట్లో ఎంపిక కాలేదు. అలా అని డిప్రెస్ కాలేదు. ఏ పొరపాట్ల వల్ల తనకు ఉద్యోగం రాలేదో లోతైన విశ్లేషణ చేసుకుంది. ప్రొఫెషనల్స్‌తో మాట్లాడింది. పొరపాట్లను సరిదిద్దుకొని రెండో ప్రయత్నంలో విజయం సాధించింది’ అంటుంది బెంగళూరుకు చెందిన షాలిని.‘ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నా ఫాంగ్ కల నెరవేరలేదు. మొదట బాధ అనిపించింది. అయితే ఆ బాధలో నుంచి త్వరగా కోలుకున్నాను. మాస్టర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్‌పై దృష్టి పెట్టాను. మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్–సాల్వింగ్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నాను’ అంటున్న శైలిమ శ్రీవాస్తవ రెండవ ప్రయత్నంలో విజయం సాధించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోవాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఖుష్బు గుప్తా గూగుల్‌లో ఉద్యోగం చేయాలనే తన కలను నెరవేర్చుకుంది.సవాళ్లను అధిగమిస్తే విజయం ఎప్పుడూ మనదే అవుతుంది. ‘గూగుల్‌లో చేరిన కొత్తలో చాలా మిస్టేక్స్ చేసేదాన్ని. అయితే సీనియర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ద్వారా తప్పులు జరగకుండా జాగ్రత్త పడడం నేర్చుకున్నాను’ అంటుంది ఖష్బు గుప్తా.అమెజాన్ పాపులర్ డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ను మన దేశంలో లాంచ్ చేసిన బృందంలో లీలా సోమశేఖర్ ఒకరు. అమెజాన్‌లో పనిచేయాలనేది ఆమె కల. కంటెంట్ ఎడిటర్‌గా అమెజాన్‌లో అడుగులు మొదలు పెట్టిన లీల ఆ తరువాత ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్‌లోకి వచ్చింది. ‘ఆన్ది–జాబ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది’ అంటున్న లీల సక్సెస్ మంత్రకు ఇచ్చే నిర్వచనం... కొత్తగా ఆలోచించడం. చిన్న వయసులోనేపోలియో బారిన పడిన రేఖాపోడ్వాల్కు వీల్ చైర్‌పై ఆధారపడడం తప్పనిసరి అయింది. అయితే ఏదో సాధించాలనే తపన మాత్రం గట్టిగా ఉండేది. ఆ తపనే ఆమెను అమెజాన్ ఇండియా స్టార్ ఉద్యోగులలో ఒకరిగా చేసింది.‘కలను నెరవేర్చుకోవడానికి అదృష్టం, అల్లావుద్దీన్ అద్భుతదీపంతో పనిలేదు. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే ఆత్మవిశ్వాసం ఉంటే చాలు’ అంటుంది పుణెకు చెందిన రేఖాపోడ్వాల్. సుందర సందేశం..ఇటీవల గూగుల్ సీయీవో సుందర్ పిచాయ్ని యూట్యూబర్ వరుణ్ మయ్యా ‘ఫాంగ్’కు సంబంధించి యువత కల గురించి అడిగినప్పుడు అమీర్ ఖాన్ బ్లాక్బాస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’లోని ఒక సన్నివేశాన్ని గురించి ప్రస్తావించాడు పిచాయ్. ‘ఆ సీన్లో మోటర్ అంటే ఏమిటో వివరించే వెర్షన్ ఉంది. మోటర్ అంటే ఏమిటో అర్థం చేసుకునే వెర్షన్ ఉంది. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారానే నిజమైన విజయం లభిస్తుంది’ అంటాడు సుందర్ పిచాయ్. సినిమా సీన్ విషయానికి వస్తే ‘మెషిన్ అంటే ఏమిటో నిర్వచనం చెప్పండి’ అనిప్రొఫెసర్ అడిగిన దానికి అమీర్ సింపుల్‌గా చెప్పిన సమాధానం, ‘మెషిన్స్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ బాడీస్ సో కనెక్టెడ్ దట్ రిలేటివ్ మోషన్స్....’ అంటూ మార్కులు బాగా తెచ్చుకునే స్టూడెంట్ చెప్పిన సుదీర్ఘ, సంక్లిష్ట నిర్వచనం... ఒక విషయాన్ని వివరించడానికి, అర్థం చేసుకోడానికి మధ్య ఉండే తేడాను తెలియజేస్తుంది.ధైర్యమే దారి చూపుతుంది..కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన సోనాక్షి పాండే స్వభావరీత్యా సిగ్గరి. ఇంట్రావర్ట్. నలుగురిలో ధైర్యంగా మాట్లాడేది కాదు. డేటాబేస్ గురించి ఒక చర్చాకార్యక్రమంలో టెక్ ఎక్స్పర్ట్ ఒకరు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్న, చర్చిస్తు్తన్న యూట్యూబ్ వీడియోను చూసింది పాండే. ఈ వీడియో ఆమె కెరీర్ గమనాన్ని మార్చేసింది. ఈ వీడియోతో ఇన్స్పైర్ అయిన పాండే నలుగురిలో ధైర్యంగా మాట్లాడడం అలవాటు చేసుకుంది. అమెజాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయింది. ఆ తరువాత అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి సొల్యూషన్ ఆర్కిటెక్చర్లోకి వచ్చింది. ఇందులో పబ్లిక్ స్పీకింగ్, క్లయింట్ ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అయిదు సంవత్సరాలు అమెజాన్‌లో పనిచేసిన తరువాత మైక్రోసాఫ్ట్, గూగుల్‌కు అప్లై చేసింది. రెజ్యూమ్‌లోని కీ ఎలిమెంట్స్ వల్ల రెండు దిగ్గజ సంస్థల్లోనూ పాండేకు ఉద్యోగం వచ్చింది. -
జపాన్‌లోనూ 'ఆర్ఆర్ఆర్' జోరు.. త్రీ ఇడియట్స్ రికార్డు బ్రేక్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా రికార్డ్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం జపాన్‌లోనూ దూసుకెళ్తోంది. అక్కడి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా అమిర్ ఖాన్ బాలీవుడ్ చిత్రం త్రీ ఇడియట్స్ రికార్డును అధిగమించింది. జపాన్‌లో విడుదలైన 17 రోజుల్లోనే 185 మిలియన్ల జపాన్ యెన్ల వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది. దీంతో జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్' నిలిచింది. గతంలో రజినీకాంత్ నటించిన ముత్తు చిత్రం జపాన్‌లో 400 మిలియన్ల జపాన్ యెన్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత బాహుబలి- 2 300 మిలియన్లతో రెండో స్థానంలో ఉండగా.. తాజాగా 185 మిలియన్లతో ఆర్ఆర్ఆర్ మూడో స్థానానికి చేరింది. ఈ జాబితాలో రెండు సినిమాలు రాజమౌళి తెరకెక్కించినవే. (చదవండి: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!) అయితే ఆర్ఆర్ఆర్ మూవీ త్వరలోనే కేజీఎఫ్-2 అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలవనుందా? అనే నెట్టింట్లో పెద్ద చర్చ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.1150 కోట్లు వసూళ్లు రాబట్టింది ఆర్ఆర్ఆర్. యష్ నటించిన కేజీఎఫ్-2 రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లతో ఆ రికార్డును బద్దలు కొట్టింది. ప్రస్తుతం జపాన్‌లో అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం మూడు వారాల్లోనే జపాన్ కరెన్సీలో 185 మిలియన్ల(రూ.10 కోట్లు) వసూళ్ల రాబట్టిందని ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా తెలిపారు. ఇకముందు ఇదే జోరు కొనసాగిస్తే 2022లో కేజీఎఫ్ కలెక్షన్లను దాటి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించే అవకాశముంది. #RRRMovie is having a remarkable run at Japan Box Office, collecting 185M ¥ by 3rd weekend (17 days) with 122K+ footfalls Fastest Indian Film to achieve this & becoming the 3rd highest grossing film after Muthu & Baahubali2@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @onlynikil pic.twitter.com/X8noPqROfb — Ramesh Bala (@rameshlaus) November 7, 2022 -
తల్లి నేర్పిన ఓనమాలే ‘శాపం’ గా మారాయి..
ఒక పోటీలో వందకు పది మంది ఓడితే.. అది పెద్ద సమస్య కాకపోవచ్చు. అదే వందలో 70 మంది విఫలమైతే.. మొత్తం వ్యవస్థ వైఫల్యమే అవుతుంది. ఆ వైఫల్యాన్ని గుర్తించి తన అనుభవంతో మార్పు తేవడానికి ప్రయత్నించాడు సోనమ్ వాంగ్‌చుక్. సంప్రదాయేతర సిలబస్‌ను రూపొందించి ‘ఆసాన్ భాషామే’(సులభమైన భాషలో) పిల్లలకు పాఠాలు బోధించడం, మంచు నీటి ప్రవాహాలను గడ్డ కట్టించి.. వర్షాభావ పరిస్థితులప్పుడు వాడుకోవడం, సోలార్ ఆర్మీ టెంట్లు.. ఇలా ఆయన బుర్రలోంచి పుట్టిన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఒక ఇంజినీర్‌గా, ఆవిష్కరణకర్తగా, విద్యావేత్తగా గుర్తింపు పొందిన వాంగ్‌చుక్.. తన జీవితం కంటే ఆవిష్కరణలు, వాటి వెనుక ఆలోచనలే పిల్లలకు పాఠంగా ఉండటాన్ని ఇష్టపడతానని చెప్తుంటాడు. సోనమ్ వాంగ్‌చుక్ పుట్టినరోజు ఇవాళ. 1966 సెప్టెంబర్ 1న లడఖ్‌లోని లే జిల్లా ఉలెటోక్పో లో వాంగ్‌చుక్ జన్మించాడు. ఇంజినీర్ కమ్ సైంటిస్ట్ అయిన సోనమ్ వాంగ్‌చుక్ స్ఫూర్తి నుంచే త్రీ ఇడియట్స్ సినిమా తెరకెక్కిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. అందులో అమీర్ క్యారెక్టర్ పున్షుక్ వాంగ్డూ(రాంచో) చూపించే ప్లాన్లన్నీ వాంగ్‌చుక్ నిజజీవితంలో అమలు చేసినవే. తల్లి నేర్పిన పాఠాలే.. వాంగ్‌చుక్ పుట్టిన ఊళ్లో బడి లేదు. దీంతో 9 ఏళ్ల వయసుదాకా ఆయన బడి ముఖం చూడలేదు. ఆ వయసులో గృహిణి అయిన తల్లి నేర్పిన ఓనమాలే ఆయనకు దిక్కయ్యాయి. వాంగ్ చుక్ తండ్రి రాజకీయ వేత్త(మాజీ మంత్రి కూడా). అందుకే ఎలాగోలా శ్రీనగర్‌లోని ఓ స్కూల్లో కొడుక్కి అడ్మిషన్ తెచ్చాడు. అయితే వాంగ్చుక్కు తల్లి నేర్పిన భాషంతా స్థానిక భాషలో ఉండడంతో.. స్కూల్లో బాగా ఇబ్బందిపడేవాడు. టీచర్లు అడిగిన దానికి సమాధానాలు చెప్పలేక మౌనంగా ఉంటే.. ‘సుద్దమొద్దు’ అనే ముద్ర పడింది. తన తల్లి నేర్పిన ఆ ఓనమాలే తన పాలిట శాపం అయ్యాయని, అలా జరిగి ఉండకపోతే తన జీవితం కుటుంబానికి దూరం అయ్యేది కాదని ఇప్పటికీ గుర్తు చేసుకుంటాడాయన. అంతేకాదు శ్రీనగర్ బడిలో నడిపిన రోజుల్ని.. చీకటి రోజులుగా అభివర్ణించుకుంటాడు. టీచర్లు, తోటి విద్యార్థులు చూసే అవమానమైన చూపులకు, కామెంట్లకు భరించలేక ఒకదశకొచ్చేసరికి ఢిల్లీకి పారిపోయాడు. పాకెట్‌మనీ లేకున్నా.. ఒంటరిగా ఢిల్లీకి చేరిన వాంగ్‌చుక్.. విశేష్కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ను కలిసి తన పరిస్థితిని వివరించాడు. తన స్కూల్ చదువులు పూర్తయ్యేదాకా ఆచూకీ పేరెంట్స్‌కు చెప్పొద్దంటూ బతిమాలుకున్నాడు వాంగ్‌చుక్. అది అర్థం చేసుకుని, మాటిచ్చి వాంగ్చుక్కు తమ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చాడు ఆ ప్రిన్స్‌పాల్. చదువులో రాటుదేలాక విషయాన్ని పేరెంట్స్‌కి తెలియజేసి.. తిరిగి వాళ్ల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆపై శ్రీనగర్ ఎన్ఐటీలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసి మరోసారి కుటుంబానికి దూరం అయ్యాడు. వాంగ్‌చుక్ ఆర్థిక నిపుణుడు కావాలన్నది ఆ తండ్రి కోరిక. అది నెరవేరకపోవడంతో కొడుకును అసహ్యించుకుని తిరిగి దగ్గరకు తీసుకోలేదు. పేరెంట్స్‌కు దూరమైన వాంగ్‌చుక్.. తన స్కాలర్‌షిప్‌తోనే హాస్టల్ చదువులు కొనసాగించాడు. ఆపై ఓ ప్రొఫెసర్ సాయంతో ఫ్రాన్స్‌లో ఎర్తెన్ ఆర్చిటెక్చర్ కోర్సు పూర్తి చేశాడు. తర్వాత ఇండియాకు వచ్చిన ఆయన జీవితం.. లడఖ్ పరిస్థితుల కారణంగా కొత్త మలుపు తిరిగింది. కామన్సెన్స్ ఉపయోగించి ప్రజల అవసరాలను తీర్చే ఆవిష్కరణలకు బీజం పడింది ఇక్కడి నుంచే.. ►లడఖ్‌లో అడుగుపెట్టేనాటికి.. అక్కడి విద్యార్థుల పాస్ పర్సంటేజ్ 5 శాతంగా తేలింది. దీంతో విద్యా సంస్కరణలకు బీజం వేశాడు. నిపుణులైన గ్రామస్తులకు-తల్లిదండ్రులకు శిక్షణ ఇప్పించాడు. వాళ్ల ద్వారా పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పించాడు. అలా ఐదు శాతం నుంచి 75 శాతానికి పాస్ పర్సంటేజ్‌ను మూడేళ్లలోనే సాధించి చూపించాడాయన. ► స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్‌ను కొందరు విద్యార్థులతో 1988లో స్థాపించాడు. పూర్తి సోలార్ ఎనర్జీతో నడిచే విద్యాలయం ఇది. ► స్వచ్ఛమైన నీటిని గ్రామ ప్రజలకు అందించేందుకు ప్రవాహాలను దారి మళ్లించే ప్లాన్లు అమలు చేశాడాయన. ఐస్ స్థూపాలను కోన్ ఆకారంలో నెలకొల్పి కృత్రిమ హిమానీనదాలతో నీటి కరువును తీర్చే ప్రయత్నం చేశాడు. 2013లో ‘ఐస్ స్తూప’ ప్రాజెక్టు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. ► సోషల్ ఇంజినీర్‌గా ఎన్నో విచిత్రమైన ఆవిష్కరణలు చేశాడు వాంగ్‌చుక్. సోలార్ ప్రాజెక్టులతో లడఖ్ గ్రామీణ ముఖచిత్రం మార్చేశాడు. ఆ ఆవిష్కరణలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు కూడా. ► ప్రభుత్వ, కార్పొరేట్ వైఫల్య చదువుల్ని ఏలియన్ చదవులుగా వర్ణిస్తాడాయన. సంప్రదాయేతర బడి.. విద్యా సంస్కరణలకు బీజం వేయడంతో పాటు కొన్నాళ్లపాటు ప్రభుత్వ ఎడ్యుకేషన్ అడ్వైజరీగా వ్యవహరించాడు కూడా. ► నానో కారు వైఫల్యానికి కారణాల్లో ఒకటి.. పేదల కారుగా ప్రచారం చేయడమే అంటాడు సోనమ్ వాంగ్‌చుక్. పేదవాళ్లే ఆ కారును కొంటారనే ‘సొసైటీ యాక్సెప్టెన్సీ’ వల్ల దానిని జనాలు తిప్పికొట్టారని చెప్పాడు. ► రాజకీయాలపై ఆసక్తి ఉన్న వాంగ్‌చుక్.. వ్యవస్థ లోపాల వల్లే మంచి విద్య అందట్లేదని అభిప్రాయపడుతుంటాడు. ప్రజల ప్రాధాన్యం మారినప్పుడే.. ప్రభుత్వాల ఆలోచనా విధానం మారుతుందని చెప్తాడాయన. - సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్ -
నటుడు మాధవన్‌కు కరోనా.. ఫన్నీగా ట్వీట్
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖ నటీనటులకు సైతం కరోనా సోకతుంది. తాజాగా నటుడు మాధవన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా మాధవన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే కరోనా సోకిందనే విషయాన్ని కాస్త ఫన్నీగా షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‌తో 'త్రీ ఇడియట్స్' చిత్రంలో కలిసి నటించిన మాధవన్..అందులోని ఓ ఫోటోను షేర్ చేస్తూ..రాంచో(3 ఇడియట్స్ లో అమీర్ పాత్ర పేరు)ను ఫర్హాన్( మాధవన్ పేరు) ఫాలో అవుతుంటే.. వైరస్(బొమన్ ఇరానీ) మా ఇద్దరి వెంట పడేవాడు. అయితే ఈసారి వాడికి(కరోనా వైరస్‌కు) మేము చిక్కాము. ఆల్ ఈజ్ వెల్. త్వరలోనే కరోనా వైరస్‌కి కూడా త్వరలో చెక్ పడుతుంది. మాతో పాటు రాజు రాకూడదని అనుకుంటున్నాము. అందరికీ థ్యాంక్స్. నా ఆరోగ్యం బావుంది అని మాధవన్ పేర్కొన్నారు. అయితే కరోనా విషయంలోనూ మాధవన్ చూపించిన సెన్సాఫ్ హ్యూమర్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. కాగా బుధవారం నటుడు అమీర్ ఖాన్..తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నట్లు, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని అతని మేనేజర్ తెలిపారు. Farhan HAS to follow Rancho and Virus has always been after us BUT this time he bloody caught up. 😡😡😄😄BUT-ALL IS WELL and the Covid🦠 will be in the Well soon. Though this is one place we don’t want Raju in😆😆. Thank you for all the love ❤️❤️I am recuperating well.🙏🙏🙏 pic.twitter.com/xRWAeiPxP4 — Ranganathan Madhavan (@ActorMadhavan) March 25, 2021 చదవండి : ప్రపోజ్ డే: హీరోకు వెరైటీ లవ్ ప్రపోజల్ వామ్మో! షారుక్‌కు అంత రెమ్యునరేషన్ కావాలంట -
కర్నాటకలో ‘త్రీ ఇడియట్స్ కాన్పు’
భారతదేశంలో అన్ని సక్రమంగా ఉంటేనే కాన్పులు చిత్ర విచిత్ర పరిస్థితుల్లో జరుగుతుంటాయి. కరోనా సమయంలో అయితే కొన్ని కాన్పులు మరీ బాధ పెట్టేలా కొన్ని మరీ సంతోషపెట్టేలా జరుగుతున్నాయి. ఈ కాన్పు అయితే మనల్ని సంతోషపెట్టేదే. ‘త్రీ ఇడియెట్స్’ సినిమా క్లయిమాక్స్‌లో ఐఐటి స్టూడెంట్ అయిన ఆమిర్ ఖాన్ తన డీన్ కుమార్తె కాన్పును వీడియో కాల్లో డాక్టర్ అయిన కరీనా కపూర్ సలహా ప్రకారం చేస్తాడు. హటాత్తుగా నొప్పులు మొదలై భోరువానలో ఆమె హాస్పిటల్‌కు వెళ్లే పరిస్థితి ఉండనందున ఈ కాన్పు చూసే ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తూ జరుగుతుంది. జూలై 26 ఆదివారం కర్నాటకలో కూడా ఇలాంటి కాన్పే జరిగింది. హుబ్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే హనగల్ అనే ఊళ్లో వాసవి అనే మహిళకు డ్యూ డేట్ కన్నా ముందే హటాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. సహాయం కోసం తక్షణం ఇరుగుపొరుగు స్త్రీలు చేరే సమయానికి ఇంచుమించు ప్రసవం జరిగిపోయే పరిస్థితి ఉంది. భర్త అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే కరోనా హడావిడి వల్ల రావడానికి 45 నిమిషాలు పడుతుందన్నారు. ఆగే సమయం లేదని సహాయానికి వచ్చిన మహిళలకు అర్థమైంది. వారిలోని ఒకామె తనకు తెలిసిన ప్రియాంక అనే డాక్టరుకు వాట్సప్ కాల్ చేసింది. ప్రియాంకది ఆ ఊరే. హుబ్లీ కిమ్స్‌లో గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. కాన్పు అర్జెన్సీని గ్రహించిన ప్రియాంక ‘నేను వీడియో కాల్ ద్వారా మిమ్మల్ని గైడ్ చేస్తాను. మీరు కాన్పు చేసేయండి’ అని చెప్పింది. మహిళలు ఆమె ఉన్నదన్న ధైర్యంతో రంగంలోకి దిగారు. కొత్త బ్లేడ్ తెచ్చి కాన్పుకు సిద్ధమయ్యారు. ‘నేను వారికి చెప్పిందల్లా బొడ్డుతాడు ఎలా జాగ్రత్తగా కట్ చేయాలన్నదే’ అని చెప్పింది డాక్టర్ ప్రియాంక. మహిళలు ప్రియాంక సూచనల ప్రకారం కాన్పు చేయడం, బిడ్డను శుభ్రం చేసి పొడిబట్టలో చుట్టడం, పాలకు తల్లి ఎద దగ్గర పరుండబెట్టడం చేసే సమయానికి అంబులెన్స్ వచ్చి తల్లి బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లింది. ‘తల్లిబిడ్డ క్షేమంగా ఉండటం మాకెంతో సంతోషంగా ఉంది’ అని కాన్పులో పాల్గొన్న స్త్రీలు చెప్పారు. ప్రస్తుతం ఆ స్త్రీలు, డాక్టరమ్మ ప్రశంసలలో తడిచి ముద్దవుతున్నారు. -
టాప్‌లో 3 ఇడియట్స్!
కోవిడ్ 19 (కరోనా వైరస్) కారణంగా ఏర్పడిన లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో థియేటర్స్‌కి తాళం పడిన విషయం తెలిసిందే. ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని ఈ పరిస్థితిలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్న సినిమాలను చూస్తున్నారు. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న యుఎస్‌లో లాక్డౌన్ సమయంలో వ్యూయర్స్ ఎక్కువగా చూసిన భారతీయ సినిమాగా ‘3 ఇడియట్స్’ నిలిచింది. రాజ్‌కుమార్ హిరాణీ దర్వకత్వంలో ఆమిర్ ఖాన్, మాధవన్, షర్మాన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రం 2009లో విడుదలైన సంగతి తెలిసిందే. ‘‘పదేళ్ల తర్వాత కూడా మా సినిమాకు మంచి ఆదరణ దక్కుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు హిరాణీ. ఇక ‘ది డార్క్‌నైట్’, ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘ఇన్సెప్షన్’, ‘మ్యారేజ్ స్టోరీ’ వంటి హాలీవుడ్ చిత్రాలను కూడా యూఎస్ ప్రజానీకం ఎక్కువగా వీక్షించారు. -
నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు : నటుడు
బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ వినూత్నమైన నటనతో ప్రేక్షకులను తనదైన శైలిలో మెప్పిస్తానడంలో సందేహం లేదు. ఎటువంటి పాత్రలైనా సరే తన దగ్గరికి వస్తే పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి కసరత్తు చేయడం ఆయనకు అలవాటు. తాజాగా... రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో 2009 లో బ్లాక్బాస్టర్ మూవీ త్రీ ఇడియట్స్ వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బొమన్ ఇరానీ తాను పోషించిన పాత్ర గురించి, ఆ పాత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. త్రీ ఇడియట్స్ చిత్రంలో బొమన్ ఇరానీ ఐఐఎమ్ బెంగుళూరు కాలేజీ డైరెక్టర్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అందులో ఆయన పాత్ర పేరు డాక్టర్ విరు సహస్త్రాబుద్ధా వైరస్. ఈ పాత్ర కోసం తాను ఎలా సిద్ధమాయ్యరో బొమన్ ఇరానీ మీడియాకు వివరించారు. 'త్రీ ఇడియట్స్ సినిమా సమయంలో ప్రతిరోజు ఉదయం షూటింగ్ ఉన్నా లేకపోయినా పాత్రకు సంబంధించిన వెల్క్రో షర్ట్, హుక్ టైని ధరించి క్యాంపస్ మొత్తం కలియతిరిగేవాడిని. అయితే నన్ను చూసిన కొందరు విద్యార్థులు గుర్తుపట్టకపోగా ఒక ఫ్రొఫెసర్‌గా భావించి విష్ చేసేవారు. ఒక్కోసారి వారిపై అరుస్తూ నా కోపాన్ని ప్రదర్శించడంతో వారంతా ఆశ్చర్యపోయేవారు. క్లాస్‌రూంలో పాఠాలు బోధిస్తున్న సమయంలో అక్కడికి వెళ్లి క్లాస్‌రూం మొత్తం పరిశీలించి మీ పని చేసుకొండి అని చెప్పి వెళ్లిపోయేవాడిని. ఆ సమయంలో అక్కడే ఉన్న లెక్చరర్స్ నేను కాలేజ్‌లో కొత్తగా చేరిన ఫ్రొపెసర్‌గా భావించేవారు. కాకపోతే అక్కడి వాతావరణం, పరిస్థితులను అధ్యయనం చేయడం కోసమే ఇదంతా చేశాను. దీంతో షూటింగ్ సమయంలో ఒక 20-30 సంవత్సరాల పాటు నాకు ఆ క్యాంపస్‌తో పరిచయంలాగా అనిపించేదని' బొమన్ ఇరానీ పేర్కొన్నారు. కాగా 2009లో విడుదలైన త్రీ ఇడియట్స్ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్గానూ పెద్ద విజయం సాధించింది. భారతీయ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఈ చిత్రంలో చూపించారు. కాగా ఇదే చిత్రం తమిళంలో శంకర్ ‘నన్బన్’గా రీమేక్ చేశాడు. బొమన్ ఇరానీ పాత్రను ఇక్కడ సత్యరాజ్ పోషించగా, తెలుగులో స్నేహితుడు పేరుతో విడుదలైంది. -
కొత్త ఇడియట్!
తెలుగులో ‘ఇడియట్’ అనగానే... హీరో రవితేజ నటించిన చిత్రం గుర్తొస్తుంది. అదే త్రీ ఇడియట్స్ అంటే ఆమిర్‌ఖాన్, ఆర్. మాధవన్, శర్మాన్ జోషి నటించిన చిత్రం గుర్తొస్తుంది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ ముగ్గురూ ముఖ్య పాత్రలు చేసిన చిత్రం ‘త్రీ ఇడియట్స్’. రీసెంట్గా ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజ్‌కుమార్ హిరానీ హింట్ ఇచ్చారు. ఇప్పుడీ విషయాన్ని బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కన్ఫార్మ్ చేశారని బీటౌన్ టాక్. ‘‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్ ప్లాన్‌లో ఉన్నప్పుడు రాజ్సర్ నన్ను కలిశారు. గొప్ప ఫిల్మ్‌మేకర్. ఆయన దర్శకత్వంలో నటించడానికి రెడీ’’ అని పేర్కొన్నారు రణబీర్ కపూర్. అంటే ‘త్రీ ఇడియట్స్’ సినిమా సీక్వెల్ కోసం సిల్వర్ స్క్రీన్‌పై ఓ కొత్త ఇడియట్ దొరికాడన్నమాట. మరోవైపు రణబీర్‌కపూర్ హీరోగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలోనే రూపొందిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
‘కాంగ్రెస్ త్రీ ఇడియట్స్’ వివాదం
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఈ మధ్య మార్ఫింగ్ వీడియోలు బాగా ప్రచారం అవుతున్నాయి. ఇవి సినీ ప్రముఖులు, మరేవరివో సంబంధించినవి కావు. రాజకీయ నాయకులకు సంబంధించినవి. రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను రామాయణంలోని అంగదునిగా చూపిస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులను రావణాసురునితో పోలుస్తూ మార్ఫింగ్ చేసిన వీడియోను ఒక దాన్ని పోస్టు చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం ఇంకా సద్దుమణగకముందే ఇదే తరహా మార్ఫింగ్ వీడియో మరొకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాధ్, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలను హిందీ సినిమా ‘త్రీ ఇడియట్స్’ పాత్రలుగా మార్ఫింగ్ చేశారు. వీరు ముగ్గురు ‘త్రీ ఇడియట్స్’ సినిమాలోని ‘ఆల్ ఇజ్ వెల్’ పాటకు కాలు కదుపుతున్నట్లు ఉన్న వీడియోను పోస్టు చేశారు. ఈ పేరడి వీడియోపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేయగా, బీజేపీ ఎప్పట్లానే ఈ వివాదానికి దూరంగా ఉంది. ఈ వీడియో గురించి బీజేపీ నేత రాజినీష్ అగర్వాల్ ‘ఈ పేరడీ వీడియోలతో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ చర్యకు పాల్పడినవారి మీద కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. మాకు ఎటువంటి అభ్యంతరం లేద’ని తెలిపారు. దీని గురించి కాంగ్రెస్ నేత మానక్ అగర్వాల్ ‘మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వానికి బీటలు వారుతున్నాయి అందుకే వారు ఇలాంటి వికారమైన పనులు చేస్తున్నార’ని అన్నారు. ఇదిలావుండగా నిన్ననే బీజేపీ ఐటీ సెల్ ముఖ్య అధికారి అయిన శివరాజ్ సింగ్ దబి తన ట్విటర్లో శివరాజ్ సింగ్ చౌహన్‌ను అంగదునిగా చూపిస్తూ రూపొందించిన రామాయణం మార్ఫింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ పేరడీ వీడియోల గురించి కాంగ్రెస్ నాయకులు మధ్యప్రదేశ్ సైబర్ సెల్లో ఫిర్యాదు చేశారు. -
ఇంకా ప్రెషర్ కుక్కర్లోనే ఉన్నాం.. వైరల్!
సాక్షి, ముంబై: కొన్నేళ్ల కిందట వచ్చిన '3 ఇడియట్స్' మూవీ చూసి కాలేజీలు, స్కూళ్లల్లో ఎంతో మార్పు వచ్చిందని భావిస్తున్నారు కదా. కానీ అలాంటివేం జరడగం లేదని ముంబైకి చెందిన ఓ విద్యార్థిని తన ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఓ సందేశం ఫేస్బుక్లో వైరల్ అవుతోంది. తల్లిదండ్రులు, టీచర్లు, లెక్చరర్లు ఆ విద్యార్థి పోస్ట్ చేసిన పోస్టును ఒక్కసారైన చదవాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన '3 ఇడియట్స్' మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ఆపై దక్షిణాదిలో దర్శకుడు శంకర్ స్నేహితుడు పేరుతో తీయగా విద్యార్థులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాల ప్రభావం అనంతరం విద్యావ్యవస్థలో ఎంతో మార్పు వచ్చిందని భావిస్తున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. చదివే చదువు వేరు, చేయాలనుకున్న ఉద్యోగం, స్థిరపడాలనుకున్న రంగం వేరుగా ఉంటున్నాయని హ్యుమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీలో ఓ విద్యార్థి పోస్ట్ చేశాడు. ఒకవేళ నేను సింగర్, నటుడు, డ్యాన్సర్, లేక డైరెక్టర్ అవ్వాలనుకుంటే చదువుకున్న పైథాగారస్ సిద్ధాంతం ఏ విధంగా ఉపయోగపడతాయని ప్రశ్నించాడు. ప్రస్తుతం ముంబై నెటిజన్లకు అది ఓ హాట్ టాపిక్‌గా మారింది. నవ్వుకునేందుకు కామిక్ పుస్తకాలు చదువుతుంటాం. అయితే కామిక్ పుస్తకాలు చదివిన వారికి పరీక్షలు పెడతామని చెప్పండి. ఒక్కరూ కూడా కామిక్ బుక్స్ వైపు కన్నెతి చూడరు. బాగా వేడిగా ఉన్న ప్రెషర్ కుక్కర్ లో పడ్డట్లు విద్యార్థుల పరిస్థితి తయారవుతుంది. అమ్మానాన్నలు మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేయండి. మీరు అనుకున్న దాని కంటే గొప్పగా ఎదిగి మీరు గర్వపడేలా చేస్తామంటూ సందేశం ఇచ్చాడు. మరో గంటలో నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉందని, వెళ్తున్నానంటూ విద్యార్థి తన పోస్ట్‌ను ముగించాడు. -
అనగనగా ఒక కొత్త బడి!
విభిన్నం అర్ఘ్యా బెనర్జీని...సన్నిహితులు సరదాగా ‘ఫున్షుక్ వాంగ్డూ’అని పిలుస్తారు. వాంగ్డూ? అది ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో అమీర్‌ఖాన్ పేరు కదా! ఆ సినిమాలో చేసినట్లే, ప్రయోగాత్మకమైన,స్వేచ్ఛాయుతమైన బడికి బెనర్జీ రూపకల్పన చేశారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లాంటి పెద్ద చదువు చదివి, ‘క్రిసిల్’లాంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్న బెనర్జీ ఉన్నట్టుండి ‘లెవల్ఫీల్డ్’ పేరుతో స్కూల్ ఎందుకు మొదలు పెట్టారు? కాస్త వెనక్కి వెళదాం. కూతురిని మంచి స్కూల్లో చేర్పించడానికి భార్య ఆసిమాతో కలిసి చిన్నా పెద్దా స్కూళ్లన్నీ తిరిగారు అర్ఘ్యా బెనర్జీ. ఏ స్కూల్లో చూసినా ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈకాలపు స్కూళ్లలో అన్నీ ఉన్నాయి... కానీ పిల్లలకు అవసరమైనది ఏదీ లేదు! అనుకున్నారు బెనర్జీ. ఐఐయం, అహ్మదాబాద్‌లోని టీచింగ్ మెథడాలజీస్ అంటే బెనర్జీకి ఇష్టం. అక్కడ కథలను, సినిమాలను, నిజజీవిత సంఘటనలను కాన్సెప్ట్‌లుగా బోధిస్తారు. ఉదాహరణకు ‘నాయకత్వం’ అనే అంశం మీద బోధించాల్సి వచ్చిప్పుడు ‘లగాన్’ సినిమాను ఎంచుకొని అందులోని వివిధ సందర్భాలను విశ్లేషణాత్మకంగా చెబుతుంటారు. నిర్వచనాలు, పాఠాలుగా చెప్పడం కూడా ఇలా దృశ్య ఆధారంగా చెప్పడం వల్ల ఎక్కువ ప్రభావం ఉంటుంది. తొందరగా మెదడుకు ఎక్కుతుంది. ఇది ఆశాజనకమైన ఊహ కాదు... శాస్త్రీయంగా నిరూపణ అయిన వాస్తవం. ఇలాంటి విధానం స్కూళ్లలో ఉంటే బాగుండేది అనుకున్నారుబెనర్జీ. ఎవరో వచ్చి ఏదో చేయాలని ఎదురుచూడడం ఎందుకు? తానే ఒక స్కూలు స్థాపిస్తే? అలా మొదలైంది ‘లెవెల్ఫీల్డ్ స్కూల్’ పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని సూరి అనే చిన్నపట్టణంలో ‘లెవెల్ఫీల్డ్’ను ప్రారంభించారు బెనర్జీ. ఐఐయం-అహ్మదాబాద్‌లో చదువు పూర్తయిన తరువాత ఒక కార్పొరేట్ సంస్థలో చేరి కో-హెడ్ స్థాయికి ఎదిగారు బెనర్జీ. ఆ సమయంలో సిఏ, యంబిఏ చదివిన వాళ్లలో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, తార్కిక ఆలోచనలాంటి సాధారణమైన నైపుణ్యాలు లేకపోవడాన్ని దగ్గరి నుంచి గమనించారు. ‘విద్యార్థిదశలోనే పిల్లలకు ఇలాంటివి ఎందుకు నేర్పకూడదు?’ అని ఆలోచించారు బెనర్జీ. కొత్తగా ఆలోచించడం, విశ్లేషణ, రచన..మొదలైనవి విద్యార్థులకు నేర్పడం అత్యవసరం అనుకున్నారు. తాను అనుకున్నవి తానే అమలు చేసే అవకాశం ‘లెవెల్ఫీల్డ్’ ద్వారా ఆయనకు వచ్చింది. ఆయన తన ఆలోచనల గురించి పేరెంట్స్‌కు మొదట చెప్పినప్పుడు, అందరూ బెనర్జీని గ్రహాంతరవాసిని చూసినంత ఆశ్చర్యంగా చూశారు. పిల్లలను కాదు.. మొదట తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాలనుకొని ఆ ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు బెనర్జీ. ప్రయత్నాలు ఫలించాయి. ‘ఎంత ఎక్కువ సేపు చదివితే...అంత ఎక్కువ చదువు వస్తుంది’ అనే అభిప్రాయం నుంచి బయటికి రావాల్సిందిగా చెప్పారు కూడా. ప్రస్తుతం ‘లెవెల్ఫీల్డ్’లో 300 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్లకు మార్కులతో పనిలేదు. ఆడుతూ పాడుతూ చదువుకుంటారు. ఆడుతూ పాడుతూనే అందమైన కలలు కంటారు. ఏ కష్టం, ఒత్తిడి లేకుండానే వాటిని నిజం చేసుకుంటారు. ఆధునిక స్కూళ్లతో పోల్చితే ‘లెవెల్ఫీల్డ్’ ఆలోచనలు చాదస్తంగా అనిపించవచ్చు. ఇలాంటి సందర్భంలో ఒక మాటను గుర్తు తెచ్చుకుంటే సమాధానంతో పాటు సాంత్వన కూడా దొరుకుతుంది. ‘మొదట నిన్ను ఎవరూ పట్టించుకోరు. పట్టించుకున్న తరువాత విమర్శిస్తారు. ఆ తరువాత నిన్ను అనుసరిస్తారు.’ ఒక్కసారి నా బాల్యంలోకి వెళితే... ఫలానా రాజు ఎప్పుడు పదవీచ్యుతుడు అయ్యాడు? ఫలానా రాజు ఎన్ని యుద్ధాలలో పాల్గొన్నాడు... ఇలాంటి ప్రశ్నలతో కాలమంతా వృథా అయ్యింది అనిపిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు, జవాబులతో మనకు ఎంత ఉపయోగం ఉంది? - బెనర్జీ పంచరత్నాలు... పిల్లలలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించడం మీద దృష్టి పెడతారు. ఉదా: పఠన నైపుణ్యం. పిల్లలతో ఇష్టమైన కథలను చదివిస్తారు. పాఠ్య పుస్తకాలు అంటూ ప్రత్యేకంగా కనిపించవు. ఆణిముత్యాల లాంటి పాత రచనలను పునఃకథనం చేస్తారు. తేలికైన భాషలో పిల్లలకు వాటిని చెబుతారు. ప్రాథమిక స్థాయి పిల్లలు కూడా ఈ ఓల్డ్ క్లాసిక్స్ గురించి చెప్పగలిగేలా బోధిస్తారు. చర్చలు, వాదోపవాదాలు... ఇతర రకాల ప్రక్రియల ద్వారా అవతలి వారితో మాటామంతీ జరిపే నైపుణ్యాలను పెంచుతారు. గణితం అంటే పిల్లలకు ఉండే సహజమైన భయాన్ని పోగొట్టి, ఆటపాటల ద్వారా ఇష్టాన్ని పెంచుతారు. రోజూ కొన్ని సమస్యలను ఇచ్చి వాటిని పరిష్కరించమని చెబుతారు. దాన్ని ఒక అలవాటుగా మారుస్తారు. ఉదా: పిల్లలను ఆకట్టుకునే జపాన్ పజిల్స్... సుడోకు, షికాకు, కెన్కెన్... మొదలైనవి.