మాధవన్, ఆమిర్ ఖాన్, షర్మాన్ జోషి
కోవిడ్ 19 (కరోనా వైరస్) కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో థియేటర్స్‌కి తాళం పడిన విషయం తెలిసిందే. ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని ఈ పరిస్థితిలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్న సినిమాలను చూస్తున్నారు. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న యుఎస్‌లో లాక్‌డౌన్ సమయంలో వ్యూయర్స్ ఎక్కువగా చూసిన భారతీయ సినిమాగా ‘3 ఇడియట్స్’ నిలిచింది.
రాజ్‌కుమార్ హిరాణీ దర్వకత్వంలో ఆమిర్ ఖాన్, మాధవన్, షర్మాన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రం 2009లో విడుదలైన సంగతి తెలిసిందే. ‘‘పదేళ్ల తర్వాత కూడా మా సినిమాకు మంచి ఆదరణ దక్కుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు హిరాణీ. ఇక ‘ది డార్క్‌నైట్’, ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘ఇన్సెప్షన్’, ‘మ్యారేజ్ స్టోరీ’ వంటి హాలీవుడ్ చిత్రాలను కూడా యూఎస్ ప్రజానీకం ఎక్కువగా వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment