వాషింగ్టన్: చైనాలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తమ పౌరులను హెచ్చరించింది అమెరికా. చైనాకు వెళ్లాలనుకునే అమెరికన్లు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పింది. వీలైతే పర్యటనలు వాయిదా వేసుకోవాలని సూచించింది.
చైనాలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. కరోనా బాధితులకు వైద్యం అందించడానికి ఆలస్యం అవుతోంది. అంబులెన్సులు కూడా సరిగ్గా అందుబాటులో లేవు. పలు చోట్లు ఆంక్షలు కూడా అమలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు అక్కడకు వెళ్తే ఇబ్బందులు తప్పవు. మేం కూడా వైద్యపరంగా సాయం అందించలేం. అని అమెరికా తమ పౌరులను అప్రమత్తం చేసింది.
అలాగే చైనా వెళ్లినవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని, పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ చెప్పింది. కరోనా లాక్‌డౌన్ ఉండదని ఎవరూ పొరపాటుగా అంచనా వేయవద్దని, పరిస్థితి అదపుతప్పితే చైనా ఏ క్షణంలోనైనా మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని అగ్రరాజ్యం తమ పౌరులను హెచ్చరించింది.
చదవండి: మంచు గుప్పెట్లో అమెరికా.. వణికిస్తున్న అతి శీతల గాలులు
Comments
Please login to add a commentAdd a comment