Priyanka Chopra Breaks Lock-down Rules By Visiting Salon In London | వివాదంలో ప్రియాంకా చోప్రా - Sakshi
Sakshi News home page

వివాదంలో ప్రియాంకా చోప్రా

Published Fri, Jan 8 2021 5:21 PM | Last Updated on Fri, Jan 8 2021 7:33 PM

Priyanka Chopra Breaks Uk Covid 19 Lockdown Rules - Sakshi

లండన్‌: గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా జోనస్‌ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. కోవిడ్‌ నిబంధనలకుమ విరుద్దంగా ప్రియాంక లండన్‌ సెలూన్‌ను సందర్శించడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. యూకేలో కొత్త రకం కరోనా(యూకే స్టెయిన్‌) విజృంభిస్తున్న సంగతి తెలిసిదే. దీంతో లండన్‌ ప్రభుత్వం అక్కడ కఠిన నిబంధనలతో కూడిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. అయితే షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం లండన్‌లో ఉన్న ప్రియాంక గతవారం తన తల్లి మధు చోప్రాతో కలిసి సెలబ్రిటీ స్టైలిస్ట్‌ జోష్‌ వుడ్‌కు సంబంధించిన ప్రైవేటు సెలూన్‌ను సందర్శించారు. దీంతో అది చూసిన ఓ వ్యక్తి  పోలీసులకు సమచారం అందించాడు. లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ప్రియాంకతో పాటు మిగతా వారిని హెచ్చరించారు. అంతేగాక ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సెలూన్‌ను తెలిరిచిన జోష్‌ వుడ్‌ను గట్టిగా వారించారు. అయితే అతడిపై ఏవిధమైన జరిమాన విధించలేదు. అనంతరం షూటింగ్‌లో భాగంగా తన హేర్‌కు కలర్‌ వేసుకోవాల్సి ఉందని, అందుకే సెలూక్‌కు వచ్చినట్లు ప్రియాంక పోలీసులతో పేర్కొన్నారు. (చదవండి: ప్రియాంకా చోప్రా దూకుడు : బిగ్ న్యూస్)

ఈ వార్త వైరల్‌ అవ్వడంతో నెటిజన్‌లు ప్రియాంకపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ప్రియాంక తన హేర్‌కు కలర్‌ వేసుకోవడం ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరూ ‘ఇది సో కాల్డ్‌ సెలబ్రిటీలను అనుసరించడం ఆపే సమయం’ అంటూ ప్రియాంకపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా యూకే స్ట్రెయిన్‌(కొత్త రకం కరోనా) నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలను అనుసరిస్తూ టీవీ, మూవీ షూటింగ్‌లకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ప్రియాంక నటిస్తున్న ‘టెక్ట్‌ ఫర్‌ యూ’ మూవీ షూటింగ్‌ షెడ్యూల్‌ లండన్‌ జరుపుకోనున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ఇటీవల అక్కడకు చేరుకుంది. లంండన్‌ ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ‘టెక్ట్‌ ఫర్‌ యూ’ టీం అంతా కోవిడ్‌ టెస్టులు చేయించుకుని క్వారంటైన్‌కు వెళ్లింది. ఇటీవల క్వారంటైన్‌ సమయం ముగియడంతో ప్రియాంక హేర్‌ కలర్‌ కోసం ఇలా కరోనా నిబంధనలను ఉల్లంఘించి నెటిజన్‌ల ఆగ్రహనికి గురయ్యారు. (చదవండి: మిస్‌ వరల్డ్‌ గెలిచిన తర్వాత అమ్మ నాతో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement