guidelines
-
TG: రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: రైతుభరోసా(Rythu Bharosa) మార్గదర్శకాలను తెలంగాణ సర్కార్ (Telangana Government) విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూ భారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనున్నట్లు ప్రకటించింది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు అందించనున్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ప్రభుత్వం సాయం అందించనుంది. సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కాగా ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని వచ్చేనెల 15 నుంచి 28వ తేదీలోపు అమల్లోకి తీసుకొచ్చేలా విధివిధానాలు ఖరారు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మేధావులు, ఉద్యోగులు, రైతులు, పార్టీల నాయకుల అభిప్రాయాలను సేకరించి భూభారతి చట్టం తీసుకు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వాలు ఏ చట్టం చేసినా కొన్ని నిబంధనలు ఉంటాయని, అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’లోపభూయిష్టంగా ఉందని అన్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్! ప్రజాపాలన సభల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.15 కోట్ల దరఖాస్తులు వస్తే.. అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80.60 లక్షల దరఖాస్తులు ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో అర్హులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ మినహా సుమారు 72 లక్షల దరఖాస్తులపై సర్వే చేపట్టామని, ఈ పథకానికి సంబంధించిన అర్హులను ఈనెల 26న గ్రామసభల్లో నిర్ణయిస్తామని చెప్పారు. అదేరోజు రైతుభరోసాతో పాటు తెల్లరేషన్ కార్డుల ప్రక్రియ, భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వివరించారు. ఈ పథకాలకు అర్హుల గుర్తింపునకు ఈనెల 16 నుంచి కసరత్తు చేపట్టనున్నట్లు తెలిపారు. -
ప్రైవేటు చేతికి ఇంటి ప్లాన్ అనుమతులు!
సాక్షి, అమరావతి: పట్టణ ప్రణాళిక విభాగంలో భవన నిర్మాణ అనుమతుల మంజూరు బాధ్యతలు ప్రైవేటుపరం కానున్నాయి. ఇప్పటివరకు స్థల యజమానులకు ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా భవన నిర్మాణ ప్లాన్లు ఇచ్చే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ (ఎల్టీపీలు) ఇకపై నిర్మాణ అనుమతులు కూడా మంజూరు చేయనున్నారు. ఇంటి నిర్మాణ ప్లాన్ల మంజూరు ముసుగులో ఎమ్మెల్యేలు సొమ్ములు దండుకునేందుకు వీలుగా ఈ మార్పు చేస్తున్నట్టు సమాచారం. ఇలా దండుకున్న మొత్తంలో ‘ముఖ్య నేత’కు వాటాలు దక్కేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు భోగట్టా. ఇందుకోసం పురపాలక పట్టణాభివృద్ధి శాఖలోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో మార్గదర్శకాలను మారుస్తున్నారు. ఇందుకోసం టౌన్‌ప్లానింగ్ చట్టాల్లో ప్రభుత్వం మార్పులు చేస్తోంది. 15 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు ప్లానింగ్‌తో పాటు నిర్మాణ అనుమతులనూ ఎల్టీపీలే జారీ చేసేలా అధికారం ఇవ్వనున్నారు. ఇలాంటి నిర్మాణాలపై ఫిర్యాదు అందితేనే టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ నిర్మాణాన్ని పరిశీలించి చర్యలకు సిఫారసు చేసేలా నిబంధనలు ఉండనున్నాయి. ఈ విధానంతో ప్రభుత్వ అనుమతిలేని లే–అవుట్లలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరగడంతోపాటు దురాక్రమణలకూ అస్కారం ఉంటుంది. ఇటీవల చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార లే–అవుట్లో ఓ మంత్రి చేపట్టిన భవన నిర్మాణానికి అక్కడి సిటీ ప్లానర్ అనుమతిచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన మంత్రి, నిర్మాణ అనుమతులు మంజూరు చేసే అధికారాన్ని టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి తొలగించి, ఎల్టీపీలకు అప్పగించేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఏపీ లో అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న 4 వేల మంది వార్డు ప్లానింగ్ కార్యదర్శులతో పాటు టీపీవోలు, ఏసీపీలు, సీపీల విధులు, బాధ్యతలను లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లకు అప్పగించనున్నట్టు తెలిసింది.అక్రమ నిర్మాణాలకు లైసెన్స్ ఇచ్చినట్టే..ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాలు చేపట్టాలంటే సంబంధిత టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతి తప్పనిసరి. ఇందుకోసం స్థల యజమానులు నిర్మాణ ప్లాన్‌తో పాటు నిర్ణీత రుసుం చెల్లించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేసి ఎల్టీపీ ద్వారా టౌన్ ప్లానింగ్ విభాగానికి పంపిస్తున్నారు. ఈ ప్లాన్‌ను టౌన్ ప్లానింగ్ విభాగంలోని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీవో) లేదా అసిస్టెంట్ సిటీ ప్లానర్ లేదా సిటీ ప్లానర్ పరిశీలించి అనుమతి ఇస్తారు. అంతకుముందు ఏపీడీఎంఎస్లో ఉన్న నిబంధనల మేరకు ప్లాన్ ఉందో లేదో సాఫ్ట్‌టెక్ రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలిస్తారు. సదరు ప్లాన్ నిబంధనల పరిధిలో ఉండి అన్ని ఫీజులు చెల్లించి ఉంటే ఆన్లైన్లో నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తారు. ప్లాన్ ఇచ్చేవారు, అనుమతి ఇచ్చేవారు ఒక్కరే అయితే నిబంధనలు అతిక్రమించే ప్రమాదముందన్న భావనతో గతంలో ఈ రెండు విధులు వేర్వేరుగా ఉంచారు. దీంతోపాటు ఎక్కడైనా నిబంధనలు అతిక్రమించి నిర్మాణ ప్లాన్ మంజూరైతే దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకునేలా గత ప్రభుత్వంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తప్పు చేసిన ఎల్టీపీ లైసెన్స్‌ను పూర్తిగా రద్దు చేయడంతో పాటు అనుమతి మంజూరు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులపైనా చర్యలు తీసుకునేవారు. కొత్త నిబంధనల ప్రకారం ప్లాన్ గీసేదీ, ప్రభుత్వానికి పంపేది.. వాటిని అనుమతి ఇచ్చేదీ ఎల్టీపీనే. 15 మీటర్ల ఎత్తు భవనాలకు అంటే ఐదు అంతస్తుల భవన నిర్మాణాల అనుమతులన్నీ పూర్తిగా ఎల్టీపీలకు ఇవ్వనున్నారు. ఇందులో ఎంత విస్తీర్ణం అనే చెప్పకపోవడంతో భారీగా అక్రమాలు చోటుచేసుకునే ఆస్కారముందని, అనధికార లే–అవుట్లలో ప్లాట్లకు కూడా అనుమతులు మంజూరు చేసే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా ఇలాంటి నిర్మాణాలపై ఫిర్యాదు అందితేనే టౌన్‌ప్లానింగ్ అధికారులు పరిశీలన చేయాలన్న నిబంధన కూడా విధించినట్టు తెలుస్తోంది. టౌన్ ప్లానింగ్ చట్టంలో మార్పులు చేయాలని ఆదేశించిన మంత్రి.. త్వరలో ఈ నిబంధనలు అమల్లోకి తేవాలని పట్టుదలతో ఉన్నట్టు తెలిసింది. -
‘హెచ్ఎంపీవీ’పై అప్రమత్తం!
సాక్షి, హైదరాబాద్: చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్ఎంపీవీ) వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రజలకు శనివారం పలు సూచనలు చేసింది. హెచ్ఎంపీవీ గురించి ఆందోళన చెందకుండా, శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్ఎస్) సూచించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్యాధికారులకు పలు ఆదేశాలు జారీచేసింది. ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు బయటపడితే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లోని ఫీవర్, గాంధీ, ఉస్మానియా, రాం కోఠి, పేట్ల బురుజు వంటి ప్రధాన ఆసుపత్రులతో పాటు అన్ని జిల్లాల ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. అదే సమయంలో అనారోగ్యంతో ఉన్నవారు కరోనా సమయంలో వ్యవహరించిన విధంగానే మాసు్కలు, చేతి రుమాలుతో జాగ్రత్తలు పాటించాలని ప్రజారోగ్య సంచాలకుడు బి.రవీందర్ నాయక్ సూచించారు. ప్రజలు పాటించవలసిన జాగ్రత్తలు, చేయకూడని పనులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.హెచ్ఎంపీవీ కూడా ఇతర శ్వాసకోశ వైరస్‌లలాగే శీతాకాలంలో ప్రధానంగా యువకులు, వృద్ధులలో సాధారణ జలుపు, ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో హెచ్ఎంపీవీ కేసులేవీ నమోదు కాలేదని చెప్పారు. అయితే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన ప్రస్తుత డేటాను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. హెచ్ఎంపీవీ విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు చేయాల్సిన పనులు.. » దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపర్, మాస్్కతో కప్పుకోవాలి. » చేతులను తరచుగా సబ్బు, నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో కడగాలి. » రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తుల నుంచి ఒక మూరెడు పొడవు కంటే ఎక్కువ దూరంలో ఉండాలి. » మీకు జ్వరం, దగ్గు, తుమ్ములు ఉంటే బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండండి. » పుష్కలంగా నీరు తాగాలి. పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. » అంటువ్యాధులను తగ్గించడానికి తగినంత గాలి వీచే ప్రదేశాలలో ఉండాలి. » అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఇతరులను కలవకుండా ఉండాలి. » కంటినిండా నిద్రపోవాలి.చేయకూడనివి.. » ఇతరులతో కరచాలనం చేయకండి. » ఒకటే టిష్యూ పేపర్, చేతి రుమాలును పదేపదే వాడకండి. » అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు సన్నిహితంగా మెలగొద్దు. » కళ్లు, ముక్కు, నోటిని తరచూ తాకవద్దు. » బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకండి. » వైద్యుడిని సంప్రదించకుండా ఔషధాలు వాడకూడదు. -
యూపీ ఉప ఎన్నికలు.. ఈసీ వార్నింగ్, ఏడుగురి పోలీసుల సస్పెండ్
మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వీటితోపాటు దేశ వ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నేడు జరుగుతున్నాయి.అయితే ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్‌లో పోలీసులు బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయడంపై వివాదం చేలరేగింది. దీనిపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. నిష్పక్షపాతంగా ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని భారత ఎన్నికల సంఘం బుధవారం అధికారులను కోరింది. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఈసీ సస్పెండ్ చేసింది.అర్హత ఉన్న ఓటరు ఓటు వేయకుండా అడ్డుకోరాదని తెలిపింది. ఓటింగ్ సమయంలో ఎలాంటి పక్షపాత వైఖరిని సహించబోమని స్పష్టం చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరుపుతామని, ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.కాగా ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక కొనసాగుతుండగా.. బురఖా ధరించిన ఓటర్ల గుర్తింపును సరిగ్గా తనిఖీ చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు బీజేపీ నేత అఖిలేష్ కుమార్ అవస్తీ లేఖ రాసింది. ముసుగులు ధరించిన మహిళలు చాలాసార్లు ఓటు వేయడానికి ప్రయత్నించిన కేసులు గతంలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అంతేకగాక కొంతమంది పురుషులు కూడా బురఖా ధరించి ఓటు వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అయితే వీరిని ఈసీ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. బురఖా ధరించిన మహిళల గుర్తింపును తనిఖీ చేయకపోతే, నకిలీ ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. సరైన తనిఖీ మాత్రమే న్యాయమైన, పారదర్శకమైన ఓటింగ్‌కు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బురఖా ధరించిన మహిళలను తనిఖీ చేసేందుకు తగిన సంఖ్యలో మహిళా పోలీసులను పోలింగ్ కేంద్రాల వద్ద తప్పనిసరిగా మోహరించాలని ఆయన అన్నారు. ఓటరు ఐడీ కార్డులను తనిఖీ చేస్తున్న పోలీసులపై ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ చీఫ్, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఇద్దరు పోలీసులు ఓటర్ల గుర్తింపు కార్డులు అడిగే వీడియోను షేర్ చేస్తూ.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ జోక్యాన్ని కోరారు."ఎన్నికల సంఘం యాక్టివ్‌గా ఉంటే.. పోలీసులు ఓటర్ల ఐడీలను తనిఖీ చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. రోడ్లు మూసివేయకుండా, ఐడీలను స్వాధీనం చేసుకోకుండా, ఓటర్లను బెదిరించకుండా, ఓటింగ్ వేగం మందగించకుండా, సమయం వృధా కాకుండా చూసుకోవాలని అన్నారు. అధికార పార్టీకి ప్రతినిధిగా ఉండకుండా పరిపాలనను చూసుకోవాలని తెలిపారు. అయితే అఖిలేష్ యాదవ్ పోస్టుపై కాన్పూర్ పోలీసులు సైతం స్పందించారు. ఓటర్లను తనిఖీ చేసిన సంబంధిత అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.. ఎన్నికల సమయంలో రాష్ట్ర పోలీసులు ఎన్నికల సంఘం ఆధీనంలోకి వస్తారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
పశువులు, కోళ్ల వైద్యానికి ప్రామాణిక మార్గదర్శకాలు
పశువులు, కోళ్ల వైద్యానికి సంబందించి సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రంయాంటీబయాటిక్ తదితర ఔషధాల వినియోగాన్ని తగ్గించటం, దుర్వినియోగాన్ని అరికట్టే ప్రత్యామ్నాయ చికిత్సలపై దృష్టి సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఈవీఎంల)కు పెద్దపీటఈవీఎంలపైప్రాంతీయ భాషల్లో పుస్తకాలు, వీడియోలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన ఎన్.డి.డి.బి.దేశంలో పశువులు, కోళ్లకు వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లకు అందించేప్రామాణిక చికిత్సా పద్ధతులను నిర్దేశిస్తూ కేంద్ర పశు సంవర్థక, పాడి అభివృద్ధి శాఖ సరికొత్త మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తదితర పశువులతో పాటు కోళ్ల చికిత్సకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. నిర్హేతుకంగా యాంటీబయాటిక్స్ తదితర అల్లోపతి ఔషధాల వినియోగాన్ని కట్టడి చేయటంతో పాటు.. ఆరోగ్యదాయకమైన ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్రం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా పాడి పశువుల చికిత్సలో చీటికి మాటికి యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడటం, దుర్వినియోగం చేయటం వల్ల పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితర ఆహారోత్పత్తుల్లో వాటి అవశేషాలు మోతాదుకు మించి మిగిలి΄ోతున్నాయి.పశువైద్యంలో యాంటీబయాటిక్ మందులను అతిగా వాడటం వల్ల సూక్ష్మజీవులు నిరోధకతను సంతరించుకుంటున్నాయి. ఫలితంగా యాంటీబయాటిక్ ఔషధాలు నిరర్థకంగా మారుతున్నాయి. ఇది ప్రజారోగ్యానికి పైకి కనిపించని పెను ముప్పుగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), యుఎస్ఎయిడ్ సంస్థల తోడ్పాటుతో కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ 6 నెలల పాటు సుమారు 80 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని నిపుణులతో చర్చించింది. సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలను రూపొందించి ఇటీవలే విడుదల చేసింది. అల్లోపతి ఔషధాలను ఏయే జబ్బులకు ఎంత మోతాదులో వాడాలో మార్గదర్శకాలలో పొందుపరిచారు.ఈవీఎంలకు పెద్ద పీటఅంతేకాకుండా, సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్ – ఈవీఎంల)ను, హోమియో వంటి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులకు కూడా ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పెద్ద పీట వేయటం విశేషం. సంప్రదాయ ఆయుర్వేద పద్ధతుల్లో రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడేందుకు వీలుగా ఉండే చికిత్సా పద్ధతులను కూడా పొందుపరిచారు. ఈ రంగంలో 20 ఏళ్లు కృషి చేసిన తమిళనాడుకు చెందిన ఎమిరిటస్ ప్రొఫెసర్ ఎన్. పుణ్యస్వామి 22 రకాల పశువ్యాధులకు రూపొందించిన ఈవీఎం పద్ధతులకు చోటు కల్పించారు. దేశంలో పాడిపై ఆధారపడిన చిన్న, సన్నకారు రైతులకు అతితక్కువ ఖర్చుతో సమకూరే ఈవీఎం చికిత్సా పద్ధతులు ఉపయోగపడతాయని కేంద్ర పశుసంవర్థక శాఖ కార్యదర్శి అల్క ఉపాధ్యాయ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, హోమియో గురించి ప్రస్తావించినప్పటికీ ఈ చికిత్స పద్ధతుల గురించి మార్గదర్శకాల్లో వివరించలేదు. దేశంలోని నలుమూలల్లోని పశు వైద్యులు, వైద్య సిబ్బంది, సంప్రదాయ వైద్యులు, పశు΄ోషకుల అనుభవాలు, సూచనలతో ప్రతి 2–3 ఏళ్లకోసారి ఈ మార్గదర్శకాలను పరిపుష్టం చేయనుండటం మరో విశేషం.సంప్రదాయ ఆయుర్వేద చికిత్సాపద్ధతులు తమిళనాడుకు చెందిన తంజావూరులోని వెటరినరీ యూనివర్సిటీ పరిశోధనా కేంద్రంలో ‘ఎత్నో–వెటరినరీ హెర్బల్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ యూనిట్’ అధిపతిగా పనిచేసిన ఎమిరిటస్ ప్రొఫెసర్ డా.ఎన్. పుణ్యస్వామి, టిడియు ఎమిరిటస్ప్రొఫెసర్ ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్ పశువ్యాధులకు సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్– ఈవీఎంల)పై సుదీర్ఘంగా పరిశోధన చేసి ప్రమాణీకరించారు. ముఖ్యమైన 22 రకాల జబ్బులకు (అల్లోపతి మందులు, యాంటీబయాటిక్స్ వాడవసరం లేకుండా) రైతుల ఇళ్లలో ΄ోపు డబ్బాల్లో ఉండే మసాలా దినుసులు, పెరట్లో ఉండే మొక్కలతో ఆయుర్వేద మందుల్ని రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడుకోగలిగే పద్ధతులను పొందుపరచిన ఒక చిరు పుస్తకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో పాటు అందుబాటులోకి తెచ్చింది. ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు 12 భాషల్లో ఈ చిరుపుస్తకాల పీడీఎఫ్‌లను అందుబాటులోకి తెచ్చింది. పశువులకు, ముఖ్యంగా పాడి ఆవులు, గేదెలకు వచ్చే జబ్బులకు ఆయుర్వేద మందులను రైతులు ఇంటి దగ్గరే ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడాలి? అనేది తెలుగు సహాప్రాంతీయ భాషల్లో రూపొందించిన వీడియోలను జాతీయ పాడి అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచారు. ఈ చిరు పుస్తకాల పిడిఎఫ్‌లను, ఆయుర్వేద మందుల తయారీ, వాడే పద్ధతులు తెలిపే వీడియోలను ఉచితంగానే చూడొచ్చు.. డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాంటీబయాటిక్స్, రసాయనిక ఔషధాల అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన పాలు, మాంసం ఉత్పత్తికి దోహదం చేసే మార్గం ఇది. -
జీఎస్టీ చెల్లించాలి..మీరే తవ్వించుకోవాలి
సాక్షి, అమరావతి : ఉచిత ఇసుక పథకంలో ప్రభుత్వం మరో కొత్త మెలిక పెట్టింది. వినియోగదారులే రీచ్‌లకు కార్మికులను తీసుకెళ్లి, తవ్వించుకుని లోడ్ చేయించుకోవాలని తెలిపింది. అలా తవ్వించుకోలేకపోతే అక్కడ ప్రభుత్వం నియమించిన ప్రైవేటు వారికి డబ్బు చెల్లించి తవ్వించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇలా ఉచిత ఇసుక పథకంలో పలు మార్పులు చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇసుక రీచ్‌లను ఇప్పటికే ప్రైవేటు వారికి అప్పగించిన ప్రభుత్వం.. వారు ఇసుక సరఫరా చేయాలంటే ఆపరేషనల్ ఖర్చులు, నిర్వహణ ఛార్జీలతోపాటు ఇతర రుసుములు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇలా చెల్లించిన వాటికి రశీదులు కూడా ఇస్తారని తెలిపింది. ఒకవేళ వారితో పని లేదనుకుంటే సొంతంగా రీచ్‌కు లేబర్ని తీసుకువెళ్లి ఇసుకను తవ్వించి, రవాణా వాహనాల్లోకి లోడ్ చేయించుకుని తీసుకెళ్లాలని తెలిపింది. ఇలా చేయడం ఏ వినియోగదారుడికీ సాధ్యమయ్యే పరిస్థితి ఉండదని తెలిసి కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వడం గమనార్హం. అంటే ఎవరైనా తప్పనిసరిగా ప్రైవేటు వారిపై ఆధారపడాల్సిందే. వారికి డబ్బు కట్టాల్సిందే. అందుకే ఇసుక రీచ్‌లన్నింటినీ ప్రైవేటు ఏజెన్సీలే నిర్వహిస్తాయని మార్గదర్శకాల్లో తెలిపింది. ఒకవేళ ఎవరైనా లేబర్‌ను తీసుకెళ్లి తవ్వుకోవాలని ప్రయత్నించినా, అక్కడున్న ప్రైవేటు ఏజెన్సీల నిర్వాహకులు అంగీకరించరన్నది సుస్పష్టం. ఏతావాతా ఉచితం పేరుకే కానీ, నయా పైసలతో సహా వసూలు చేయాలన్నది చంద్రబాబు సర్కారు వ్యూహంలా ఉందన్న విషయం తేటతెల్లమవుతోంది. ఇసుక తవ్వకాలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే జరుగుతాయని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. బల్క్ వినియోగదారుల కోసం ఇసుక కమిటీలు ప్రత్యేకంగా ఇసుక వనరులను రిజర్వు చేయవచ్చని తెలిపింది.తాజా మార్గదర్శకాల ప్రకారం ఇసుక ఇలా తీసుకెళ్లాలి» అనుమతించిన రీచ్‌లు, డీసిల్టేషన్ పాయింట్ల (సరఫరా ప్రదేశాలు) నుంచి మాత్రమే ఇసుక సరఫరా అవుతుంది. » ఇసుక కోసం ఆన్లైన్లో లేదా సరఫరా పాయింట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి» రిజిస్టర్ చేసుకున్నాక జారీ అయ్యే ఈ–ట్రాన్సిట్/పర్మిట్ ద్వారా వినియోగదారుడు సొంత వాహనం లేదా మైనింగ్ శాఖ రిజిస్టర్ చేసిన వాహనాన్ని ఎంపిక చేసుకోవాలి» ఆ వాహనం ఖర్చును వినియోగదారులు నేరుగా రవాణాదారులకే చెల్లించాలి» ఆ తర్వాత రవాణాదారు లేదా వినియోగదారు ఇసుక పాయింట్ వద్ద ఉన్న ఇన్‌ఛార్జి వద్దకు వెళ్లి డెలివరీ తేదీ, టైమ్ స్లాట్ తెలుసుకోవాలి»టైమ్ స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయానికి రవాణాదారు రీచ్‌కు వెళ్లి అక్కడ ఉన్న ప్రైవేటు ఏజెన్సీ ద్వారా గానీ, సొంత కార్మికుల ద్వారా గానీ ఇసుకను తవ్వించుకుని వాహనంలో లోడ్ చేయించుకోవాలి» లేబర్‌ను తీసుకెళ్లలేక అక్కడ ప్రభుత్వం నియమించిన ప్రైవేటు ఏజెన్సీ సహాయాన్ని పొందాలనుకుంటే జిల్లా ఇసుక కమిటీలు నిర్ణయించిన రేట్లు చెల్లించాలి» అలా డబ్బు కట్టి తీసుకెళ్లే వాహనానికి ‘ఉచిత ఇసుక రవాణా వాహనం’ అనే పేరుతో ఉన్న బ్యానర్‌ను తప్పనిసరిగా ఉండాలి. » స్థానికంగా ఉన్న ఇసుకను ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యక్తిగత, కమ్యూనిటీ పనుల కోసం ట్రాక్టర్లు, ఎడ్ల బళ్లలో మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అలా తీసుకెళ్లే ఇసుకను యంత్రాలతో కాకుండా మనుషులతో మాత్రమే తవ్వించుకొని తీసుకెళ్లాలి. ఈ తవ్వకాలు, తరలింపు సమాచారాన్ని ఆన్లైన్లో లేదా స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో ముందుగానే ఇవ్వాలి.» ప్రభుత్వం, మైనింగ్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం ఇసుక రీచ్‌లలో మిగిలిన ఇసుకను జిల్లా కమిటీలు ఇసుక రీచ్‌లు లేని జిల్లాల కోసం రిజర్వు చేస్తాయి. ఇందుకోసం ఇసుక రీచ్‌లు లేని జిల్లాల కమిటీలు వాటి జిల్లాల్లో ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేసి, వాటికి మినరల్ డీలర్ లైసెన్సులు (ఎండీఎల్) జారీ చేయాలి. లైసెన్సు పొందిన ఏజెన్సీలు నిర్దేశించిన రీచ్ నుంచి, నిర్దేశించిన ధరకు ఇసుకను తెచ్చి వినియోగదారులకు సరఫరా చేయాలి. ఇందులోనే రవాణా, ఆపరేషన్, నిర్వహణ ఛార్జీలు ఉంటాయి.సీనరేజికి మాత్రమే మినహాయింపు.. జీఎస్టీ చెల్లించాల్సిందే..ఇసుకకు సీనరేజితోపాటు జీఎస్టీ కూడా రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినప్పటికీ, మార్గదర్శకాల్లో మాత్రం సీనరేజిని మాత్రమే మినహాయించారు. టన్నుపై రూ.88గా వసూలు చేస్తున్న సీనరేజి ఫీజును మాత్రమే వసూలు చేయకుండా మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. జీఎస్టీ రద్దు గురించి ప్రస్తావించలేదు. అంటే ఆపరేషనల్ ఖర్చులు, నిర్వహణ ఛార్జీలతోపాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. -
ఆ మహిళల కోసం అలర్ట్ వ్యవస్థ: సుప్రీం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆచూకీ లేకుండా పోయిన మహిళల కోసం కేంద్రీకృత విధానంలో పని చేసే అలర్ట్ వ్యవస్థను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మైనర్ బాలికల అపహరణ ఉదంతంలో గతంలోనే సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను సూచించడం తెలిసిందే. వాటిలో పలు లోపాలున్నాయని పిటిషనర్ తరఫున న్యాయవాది నిత్యా రామకృష్ణన్ కోర్టుకు నివేదించారు. ‘‘బాలిక/మహిళ కనిపించకుండా పోవడంపై ఫిర్యాదులో ఆలస్యం వల్ల న్యాయం దక్కడమూ ఆలస్యమవుతోంది. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ అనే కుగ్రామంలో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్వనం. నర్సుగా చేస్తున్న ఓ 11 ఏళ్ల పాప తల్లి ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. పాప ఉదయం పక్కింటివాళ్లకు చెప్పింది. వాళ్లు పొరుగింటి వాళ్లకు చెప్పారు. కానీ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. ఎనిమిది రోజుల తర్వాత ఇంటి సమీపంలోనే మృతదేహం దొరికింది. విషయం అందరికీ తెల్సి ఆందోళనలు మొదలయ్యాక గానీ ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు. దేశవ్యాప్తంగా నెలకొన్న దుస్థితి కూడా ఇదే’’ అని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం స్పందించింది. ఈ అంశంలో నోటీసులు ఇచ్చేందుకు అంగీకరించింది. -
సుప్రీం మార్గదర్శకాల మేరకు..బీసీ రిజర్వేషన్లను నిర్ధారించండి
సాక్షి, హైదరాబాద్: వికాస్ కిషన్రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బీసీ రిజర్వేషన్లను నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనానికి రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలి.. సామాజిక, రాజకీయ అంశాలు, వెనుకబాటుతనం లాంటి అంశాలను పరిశీలించి జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు నిర్ధారించాలి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లన్నీ 50 శాతానికి మించకూడదు’ అని వికాస్ కిషన్రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పేర్కొన్న ఈ మూడు సూత్రాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. దీన్ని అమలు చేసేందుకు మూడు నెలల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి కోరారు. దీంతో తదుపరి విచారణను 3 నెలలకు వాయిదా వేస్తూ, అప్పటిలోగా నివేదిక అందజేయాలని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో బీసీల జనాభా వివరాలను సేకరించడానికి, సర్వేల నిర్వహణకు తెలంగాణ బీసీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను అధీకృత సంస్థగా ప్రభుత్వం గుర్తించడం రాజ్యాంగ వ్యతిరేకమని.. రాజ్యాంగ బద్ధమైన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లను నిర్ణయించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ధర్మేశ్ డీకే జైస్వాల్, శ్రీనివాస్ యాదవ్, కౌటూరు పవన్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్, కేంద్రం తరఫున డీఎస్జీ గాడి ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. వికాస్ కిషన్రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్లోని పేరా 13 అమలుపై వివరాలు తెలుసుకుని చెబుతామని గత విచారణ సందర్భంగా ఏజీ వెల్లడించారు. మంగళవారం విచారణ సందర్భంగా మూడు అంశాలు అమలు చేయడానికి ఎంత సమయం కావాలని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి అధ్యయనానికి 3 నెలల సమయం కావాలని కోరడంతో అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. -
సుప్రీం మార్గదర్శకాలు పాటించాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనాలు చేయొద్దంటూ సుప్రీంకోర్టు 2021లో ఇచ్చిన మార్గదర్శకాలను విధిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే నిమజ్జనం చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్లాస్టర్ ఆఫ్పారిస్ (పీవోపీ) విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే కృత్రిమ నీటికుంటల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. న్యాయవాది వేణుమాధవ్ వేసిన ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ పీవోపీ విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌పై భారీ క్రేన్లు నిలుపుతున్నారని న్యాయవాది వేణుమాధవ్ అభ్యంతరం తెలిపారు. భారీ క్రేన్ల వల్ల ట్యాంక్‌బండ్‌కు ముప్పు ఉందన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదిస్తూ ‘కోర్టు ధిక్కరణ చట్ట ప్రకారం ఒక వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయడానికి గడువు ఒక సంవత్సరం. కానీ పిటిషనర్ 2021 నాటి సు ప్రీం మార్గదర్శకాలను ప్రస్తావిస్తున్నారు క నుక పిటిషన్ అక్కడే వేయాలి. ఇక్కడ వేసిన పిటిషన్‌ను అనుమతించొద్దు’అని కోరారు. ఇన్నాళ్లూ ఏం చేశారు? న్యాయవాది వేణుమాధవ్ వాదనలపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘2021లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇస్తే రెండేళ్లుగా ధిక్కరణ పిటిషన్ ఎందుకు వేయలేదు? అధికారులు ఒకవేళ రెండేళ్లు మార్గదర్శకాలు పాటించి ఉంటే ఇప్పుడు పాటించరని ముందే ఎలా చెబుతారు? అయినా ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడో ముందే తెలిసినా ఇన్ని నెలలు పిటిషన్ వేయకుండా నిమజ్జనాల వేళ పిటిషన్ వేయడంలో మీ ఉద్దేశం ఏమిటి? పీవోపీ విగ్రహాల నిమజ్జనం చేస్తే ఫొటోలతో నివేదిక అందజేయాలని 2023లో హైకోర్టు ఆదేశించినా ఆ పని చేయలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చే నాటికి హైడ్రా మనుగడలో లేదు. అలాంటప్పుడు హైడ్రాను ప్రతివాదిగా ఎలా చేరుస్తారు? ప్రస్తుతానికి కేసు మెరిట్‌లోకి వెళ్లడం లేదు. పిటిషన్‌ను అనుమతించడంపైనే విచారణ చేస్తున్నాం. ఆలస్యంపట్ల మీరు విచారం వ్యక్తం చేసినా అనుమతించలేం. చివరి నిమిషంలో ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టు కూడా 2021లో తప్పుబట్టింది కదా. అదే ఉత్తర్వు లు అందరికీ వర్తిసాయి. పీవోపీ విగ్రహాల నిమజ్జనం, కాలుష్య ఆరోపణలను రుజువు చేసేందుకు ఆధారాలు, గణాంకాలను వెల్లడించలేదు. అయితే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విధిగా పాటించాల్సిందే’అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ధిక్కరణ పిటిషన్లో విచారణ ముగించింది. కాగా, పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం విధిస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్లో పీసీబీ తీరుపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే అవి చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలిగానీ రహదారినే తీసేస్తామన్నట్లు అధికారుల చర్యలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. -
AP: ఉద్యోగుల బదిలీల విధివిధానాలు విడుదల
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం బుధవారం(ఆగస్టు14) విడుదల చేసింది.బదిలీల జీవో గురువారం విడుదల కానుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి 31 వరకు 16 రోజుల్లో మొత్తం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
10 ఎకరాల వరకే రైతు భరోసా..
-
వ్యాయామం చేయని మహిళలు తీసుకోవాల్సిన డైట్ ఇదే!
మహిళలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అత్యంత ముఖ్యంగా. అందులోనూ వ్యాయామం చేయని మహిళలు తినే ఆహారం విషయంలో పట్ల శ్రద్ద వహించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతోంది. అలాంటి మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదే ఐసీఎంఆర్ కొన్ని మార్గదర్శకాలు కూడా అందించింది. అవేంటో చూద్దామా..!వ్యాయామం చేయని మహిళలు తినే ఫుడ్‌పై శ్రద్ధ పెట్టడం కీలకం. అతిగా తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లతో ఉండే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ నూనెతో కాల్చినవి, ఆవిరిపై ఉడికించినవి తీసుకోవాలిన చెబుతున్నారు. అలాగే వాటి తోపాటు లీన్ ప్రోటీనఖ కూడా అవసరం. స్కిన్లెస్ చికెన్, చేపలు, అప్పడప్పుడూ రెడ్ మీట్ వంటివి తీసుకోవాలని సూచించారు. అదనప్పు కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు,లేకుండా చేసుకోవాలి. కూల్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. హెర్బల్ టీలు వంటివి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు చక్కెర పానీయాలకు దూరంగా ఉండటమే బెటర్బరువు అదుపులో ఉంచుకునే యత్నం చేయాలి. ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా తృణధాన్యాలు, కాలానుగుణంగా పండ్లకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అనారోగ్యకరమైన చిరుతిండ్లకు దూరంగా ఉండటం మంచిది. భోజనాని కంటే వివిధ రకాల పచ్చి కూరగాయలు తినడానికి యత్నం చేయాలి. మిల్లెట్స్ , బ్రౌన్‌రైస్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా బీన్స్, కాయధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన గింజలను(బాదం పప్పులు, జీడిపప్పులు)కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా గానీ తీసుకునే ఆహారాన్ని మనస్పూర్తిగా ఆస్వాదిస్తూ తినాలి, సమతుల్యతకు ప్రాముఖ్యత ఇవ్వడం వంటివి చేస్తే.. మీ చేతుల్లోనే ఆరోగ్యం పదిలంగా ఐసీఎంఆర్ చెబుతోంది. వ్యాయామం చేయని మహిళలు ఈ విషయాలు గుర్తించుకుని మంచి డైట్ పాటిస్తే చాలని చెబుతోంది.(చదవండి: తొలి పోస్టల్ సర్వీస్ నుంచి .. సరికొత్త ట్యూన్ వరకు ఎన్నో ఘటనలకు సాక్షి 'మే 31'!) -
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
గుంటూరు: ఏపీ ఈఏపీసెట్(ఎంసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రరెడ్డి తెలిపారు. ‘‘రేపటి(గురువారం) నుంచి ఏపీ ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. రేపు, ఎల్లుండి బైపీసీ గ్రూపుకి ఎప్‌సెట్ పరీక్షలు జరుగుతాయి. 18వ తేదీ నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు. రోజుకి రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ఆన్లైన్ మోడ్‌లో నిర్వహిస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్. మద్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండవ సెషన్‌గా పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 140 సెంటర్లు. హైదరాబాద్‌లో రెండు సెంటర్లు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 3,61,640 మంది ఈ ఎప్‌సెట్‌కు హాజరవుతున్నారు. ఇందులో మహిళలు 1,81,536 మంది, పురుషులు 1,80,104 మంది విద్యార్ధులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఎంపీసీ విభాగంలో 34,828 మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. బైపీసీ విభాగంలో మాత్రం 13,138 మంది విద్యార్ధులు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు’’ అని తెలిపారు.ముఖ్యమైన సూచనలు..‘‘ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకూడదు. పరీక్షా కేంద్రంలో పలికి విద్యార్ధులను అరగంట ముందుగా అనుమతి ఇస్తాం. పరీక్షా కేంద్రాలకి బస్సులు నడపాలని ఆర్టిసిని విజ్ణప్తి చేశాం. పరీక్షా కేంద్రాలకి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశాం. 160 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కులు విధానం లేదు. బయోమెట్రిక్ విధానంతో హాజరు తీసుకుంటాం కాబట్టి చేతులకి మెహందీ పెట్టుకోవద్దు. చెవులకి చెవి దిద్దులు తీసేసి పరీక్షలకి హాజరు కావాలి. ప్రతీ హాల్ టికెట్ వెనుక పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ కూడా ఉంటుంది’’ అని హేమచంద్రారెడ్డి తెలిపారు.ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం..ఏపీ ఈఏపీసెట్ రీక్షలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఎప్‌సెట్ చైర్మన్, కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరాజు తెలిపారు. ‘‘ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకి ముందుగానే చేరుకోవాలి. ఇప్పటికే విద్యార్ధులకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి అందుబాటులో ఉంచాం. విద్యార్థులెవరూ ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రానికి తీసుకురావద్దు. విద్యార్ధులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి’’ అని తెలిపారు. -
అప్రమత్తతే అతి ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: ఎండాకాలం నేపథ్యంలో అగ్నిప్రమాదాలకు అవకాశాలు పెరిగాయి. అప్రమత్తతతో ఉంటేనే అగ్ని ప్రమాదాలను నియంత్రించడంతోపాటు ప్రమాదాలు జరిగినా తక్కువ నష్టంతో బయటపడొచ్చు. ఇందుకు ప్రజల్లో అవగాహన అతి ముఖ్యమని అగ్నిమాపకశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నియంత్రణలో భాగంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక సేవల వారోత్సవాలు చేయనున్నట్టు ఫైర్ డీజీ వై.నాగిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రద్దీ ఎక్కువగా ఉండే బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, నివాససముదాయాలు, మల్టీప్లెక్స్, మాల్స్‌లో వీటిని నిర్వహిస్తారు. ఎండల తీవ్రత పెరగడంతో అగ్నిప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ అగ్నిమాపకశాఖ కొన్ని మార్గదర్శకాలు వెల్లడించింది. ఈ విషయాల్లో జాగ్రత్త ► వేసవి తీవ్రత పెరగడంతో ఫ్యాన్లు, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల వాడకం పెరుగుతుంది. దీనివల్ల ఓవర్‌లోడ్‌తో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యుత్ వైరింగ్‌లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఇంట్లో మంటల వ్యాప్తికి ప్రధాన అంశాల్లో వంటింట్లో మంటలు అంటుకోవడం కూడా.. అందువల్ల వంటగదిలో మంటలు అంటుకునే వస్తువులు లేకుండా చూసుకోవాలి. వీలైనంత గాలివెలుతురు ఉండేలా చూసుకోవాలి. ► అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యునిటీలు, బహుళ అంతస్థుల భవనాల్లో ఉండే వారు తప్పకుండా ఫైర్ ఆడిటింగ్ నిర్వహించాలి. అగ్నిమాపక నియంత్రణ పరికరాలు, మంటలార్పేందుకు నీటి పైప్‌లైన్ వ్యవస్థ, ఫైర్ అలార్మ్లు పనిచేస్తున్నాయా..ఇలా అన్నింటినీ ఒకసారి సరిచూసుకోవాలి. ► కారు ప్రయాణంలోనూ అగ్ని ప్రమాదాల నుంచి రక్షణకు పోర్టబుల్ ఫైర్ ఎక్ట్సింగ్విషర్ (మంటలు ఆర్పేది) పెట్టుకోవాలి. ► ఇళ్లలో ఎలక్ట్రికల్ వస్తువులు వాడకపోతే వాటిని వెంటనే స్విచ్ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ► కార్యాలయాల్లో ఫైర్ స్ప్రింక్లర్ వ్యవస్థ, ఫైర్ అలార్మ్లు, ఎమర్జెన్సీ లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటి వరకు 2,550 ఫైర్ కాల్స్ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి మార్చి చివరి వరకు అగ్నిప్రమాదాలకు సంబంధించి అన్ని రకాల ఫిర్యాదులు కలిపి 2,550 ఫైర్ కాల్స్ వచి్చనట్టు అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు. గతేడాదిలో 8151 ఫైర్ కాల్స్ వచి్చనట్టు తెలిపారు. ఇందులో 141 తీవ్రమైన ప్రమాదాలు, 175 మధ్యతరహా అగ్నిప్రమాదాలు ఉన్నట్టు తెలిపారు. -
త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కొత్తగా కార్డులివ్వాలని నిర్ణయించింది. ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని యూనిక్ నంబర్‌తో కార్డులు ఇవ్వనుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కో సబ్ నంబర్ ఇస్తారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేస్తారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు కసరత్తు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు కొందరు పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అంతేకాకుండా అనేకమంది తెల్ల రేషన్‌కార్డును ఆధారం చేసుకొనే ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ అంశంపై ఆరోగ్యశ్రీ ట్రస్టు దృష్టిసారించింది. ఈ మేరకు లబ్దిదారుల గుర్తింపుపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందరికీ వర్తింప చేయడం వల్ల అదనంగా రూ.400 కోట్ల భారం పడే అవకాశం ఉందని, ఇది పెద్ద భారం కాదన్న భావనలో సర్కారు ఉంది. మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి, ఉద్యోగులకు, ఇతరులకు పలు పథకాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఆరోగ్య బీమాతో ఆరోగ్య సేవలు పొందుతున్న వారూ చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డులతో అందరికీ సార్వజనీన ఆరోగ్య సేవలు అందించవచ్చని సర్కారు యోచిస్తోంది. వంద శస్త్రచికిత్సలు చేర్చే అవకాశం రాష్ట్రంలో 293 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గత ఏడాది 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో 1,310 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి అర్హులుగా 77.19 లక్షల మంది పేదలు ఉన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 1,949 వ్యాధులకు వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. వీటికి సుమారు మరో వంద శస్త్రచికిత్సలను చేర్చే అవకాశం ఉంది. ఒక్కో కుటుంబానికి 10 లక్షల కవరేజీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద కవరేజీ రూ. 2 లక్షలు ఉండగా, ఆయుష్మాన్ భారత్ పథకం రావడంతో దాన్ని రూ. 5 లక్షలు చేశారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రూ.10 లక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి ఈ పథకాల కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. దీనికి ప్యాకేజీ సొమ్ము కూడా పెంచితే ఏటా రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈహెచ్ఎస్ పథకంపై తేలని నిర్ణయం ఈహెచ్ఎస్ పథకంపై ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇస్తామని పేర్కొన్న సంగతి విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ఏర్పాటు చేసి అమలు చేయాలని నిర్ణయించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా జమ చేయాలని పేర్కొన్నది. ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశాయి. ఆసుపత్రుల్లో తమకు వైద్యం అందనందున ఈ ప్రక్రియకు ఉద్యోగులు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల బకాయిల చెల్లింపునకు ఏర్పాట్లు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. బ కాయిలు పేరుకుపోవడంతో పాటు ఆరో గ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇచ్చే ప్యాకేజీ సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నా యి. దీంతో ఆరోగ్యశ్రీ లబ్దిదారులు, ఈ హెచ్ఎస్ బాధితులు డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలు పెరగడంతో చాలామంది ప్రైవేట్ ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. ఉద్యోగులైతే రీయింబర్స్మెంట్ పద్ధతిలో ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం పొందుతున్నా రు. అయితే బిల్లుల సొమ్ము మాత్రం పూ ర్తి స్థాయిలో రావడంలేదని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. పెద్దఎత్తున బిల్లులు పే రుకుపోవడం వల్లే తాము వైద్యం అందించలేకపోతున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు నెట్వర్క్ ఆసుపత్రుల లెక్క ప్రకా రం దాదాపు రూ.500 కోట్లు ఆరోగ్యశ్రీ నుంచి తమకు రావాల్సిన బిల్లుల బకా యిలు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నాయి. మరోవైపు వివిధ వ్యాధులకు 2013లో నిర్ధారించిన ప్యాకేజీ ప్రకారమే ఆసుపత్రులకు సొమ్ము అందుతోంది. అంటే తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యాధులు, చికిత్సలకు ప్యాకేజీ సవరణ జరగలేదు. ఈ రెండు కారణాల వల్ల తాము ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకాల కింద వైద్యం చేయలేకపోతున్నామని ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
BAPS అబుదాబి హిందూ మందిర్ : కఠిన నిబంధనలు, డ్రెస్ కోడ్
అబుదాబిలో ఇటీవల (ఫిబ్రవరి 14, 204) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ మందిరంలో డ్రెస్‌కోడ్ వార్తల్లో నిలిచింది. మార్చి ఒకటో తేదీనుంచి ఇక్కడ ప్రజల దర్శనాలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో నియమ నిబంధనలు, భక్తుల డ్రెస్ కోడ్‌కు సంబంధించిన నియమాలు, మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా క్యాప్స్, టీషర్ట్లు, అభ్యంతరకరమైన దుస్తులకు అనుమతి ఉండదు. డ్రెస్ కోడ్, ఇతర నిబంధనలు అబుదాబి మందిర్ ట్విటర్లో షేర్ చేసిన వివరాల ప్రకారం ప్రతి మంగళవారం - శనివారం, ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఈ మందిర్ తెరిచి ఉంటుంది. సోమవారం మాత్రం ఆలయాన్ని మూసివేస్తారు. The wait is over!#AbuDhabiMandir is now open for all visitors and worshipers. Opening hours: Tuesday to Sunday: 9am-8pm Every Monday: Closed for visitors pic.twitter.com/JnYvZoVSPk — BAPS Hindu Mandir (@AbuDhabiMandir) March 1, 2024 ముస్లిం దేశంలో అబుదాబిలో తొలి హిందూ దేవాలయంబాప్స్లో డ్రెస్ కోడ్, మార్గదర్శకాల విషయంలో కఠినంగా వహరించనున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం, మెడ, మోచేతులు, మడమల వరకూ కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. టైట్‌గా ఉన్న దుస్తులు, స్లీవ్‌లెస్, షార్ట్స్‌కు అనుమతించరు. శబ్దాలు చేసే ఉపకరణాలనూ ఆలయంలోకి అనుమతించరు. బయటి ఆహారాన్ని ఆలయంలోకి తీసుకు రాకూడదు. పెంపుడు జంతువులకు కూడా ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. అంతేకాదు దేవాలయం పరిసరాల్లో డ్రోన్స్ వినియోగంపై కూడా నిషేధం విధించారు. ఫోటోలకు అనుమతి ఉందా? వ్యక్తిగత అవసరాల కోసమే ఫోటోలు తీసుకోవచ్చు. ఎవరైనా వాణిజ్య అవసరాల నిమిత్తం వీడియోను రికార్డ్ చేయాలనుకుంటే, వారు తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆలయంలోని ఆధ్యాత్మిక, ప్రశాంత వాతావరణానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా భక్తులు నియమాలను పాటించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. కాగా 700 కోట్ల రూపాయల వ్యయంతో 27 ఎకరాల్లో బాప్స్ సంస్థ ఆధ్వర్యంలో అబూ మారేఖ్ ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరిగింది. శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయంలో ఒకేసారి 5 వేల మంది ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. -
విసిగిస్తున్న కాల్స్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ప్రమోషనల్ లేదా అవాంఛిత కాల్స్ సమస్య పరిష్కారానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఫిబ్రవరి 14న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో టెలికం శాఖ, ఆర్థిక సర్వీసుల విభాగం, గృహ .. పట్టణ వ్యవహారాల శాఖ, రిజర్వ్ బ్యాంక్, బీమా రంగ నియంత్రణ .. అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ), టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) సహా పరిశ్రమ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. మరోవైపు, అవాంఛిత కాల్స్ అనేవి యూజర్ల గోప్యతకు మాత్రమే కాకుండా వారి హక్కులకు కూడా భంగం కలిగిస్తాయని సమావేశంలో పాల్గొన్న వారు అభిప్రాయపడినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సేవల సంస్థలు.. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి ఇలాంటి కాల్స్ ఎక్కువగా ఉంటున్నాయని గుర్తించినట్లు తెలిపింది. అంతే కాకుండా కస్టమర్లను పోంజీ స్కీములు, క్రిప్టో పెట్టుబడుల వైపు ఆకర్షించేందుకు స్పామ్ కాలర్లు ఇప్పుడు వాట్సాప్ మొదలైన యాప్స్ ద్వారా ఇంటర్నెట్ కాల్స్ కూడా చేస్తున్నట్లు వివరించింది. రిజిస్టర్డ్ టెలీమార్కెటర్ల నుంచి స్పామ్ మెసేజీలు, అవాంఛిత కాల్స్ సమస్యను పరిష్కరించేందుకు టెలికం శాఖ, ట్రాయ్ ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. -
రూ. 500 గ్యాస్ సిలిండర్.. ఈ కేవైసీ అవసరం లేదు..!
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో రూ. 500లకే వంట గ్యాస్ అందజేస్తామని ప్రకటించింది. దీంతో గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ (నో యువర్ కస్టమర్) చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ కేవైసీతో సంబంధం లేదని అధికారులు, డీలర్లు చెబుతున్నా ఏజెన్సీల వద్ద మహిళలు బారులు తీరుతున్నారు. తమ పనులు వదులుకొని వినియోగదారులు ఉదయం 8 గంటల నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కడుతున్నారు. హైదరాబాద్: ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, షేక్‌పేట, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, బోరబండ, వెంగళ్రావునగర్, శ్రీనగర్ కాలనీ డివిజన్ల పరిధిలో తొమ్మిది గ్యాస్ ఏజెన్సీలు ఉండగా 3.40 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ► ఇందులో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు 83,127 మంది ఉండగా, అన్నపూర్ణ అన్నయోజన కార్డు కలిగిన వారు 3368 మంది కలిగి ఉన్నారు. ► ప్రభుత్వం రూ. 500 గ్యాస్ సిలిండర్‌పై ఇంత వరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకున్నా తెల్లరంగు రేషన్ కార్డుదారులకు వర్తిస్తుందని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో వార్తలు వైరల్ అవుతుండటంతో ఇటు తెల్లకార్డుదారులు, అటు సాధారణ గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ► ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ. 500కే వంట గ్యాస్ అందిస్తామని చెప్పింది. ఈ పథకానికి ఈ కేవైసీకి సంబంధం లేదని దీనికి నిర్దిష్టగడువు కూడా ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు రావొద్దని ఏజెన్సీల నిర్వాహకులు ఏకంగా బ్యానర్లే కడుతున్నారు. ఉజ్వల పథకానికి మాత్రమే... ► కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల పథకానికి మాత్రమే ఈ కేవైసీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద గతంలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ పథకంలోని లబి్ధదారులకు ప్రభుత్వం రాయితీపై గ్యాస్ అందజేస్తుంది. ఈ పథకంలో మృతి చెందిన వారి వివరాలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీని ప్రవేశ పెట్టింది. మహిళలు బయోమెట్రిక్ చేయించి నమోదు చేయించుకోవాలని వేలి ముద్రలు పడకపోతే ఐరిష్ విధానంలో ఈ కేవైసీని పూర్తి చేస్తారు. వాస్తవాలు తెలియని వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. రెండేళ్లకోసారి ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. లబి్ధదారుల సంఖ్య, మృతులు, ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి బదిలీ చేయించుకోవడం, కనెక్షన్ రద్దు చేసుకోవడం, తదితర కారణాలు తెలుసుకునేందుకు ఇది వీలవుతుంది. ఇందులో భాగంగానే కచి్చతమైన సంఖ్య తెలుసుకోవడానికి లబి్ధదారుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మార్గర్శకాలు వచి్చన వెంటనే వినియోగదారులకు, గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం అందిస్తామని అధికారులు పేర్కొంటున్నా వినియోగదారులు వినిపించుకోకుండా గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. ఇంటి వద్దకే డెలివరీ బాయ్స్ వస్తారు గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. మా డెలివరీ బాయ్స్ ఇంటికే వచ్చి ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారు. ఇందులో భాగంగా సెల్ఫోన్లు, ఐరిష్ విధానంలో కళ్లను స్కాన్ చేస్తారు. దీనికి అంతరాయం ఏర్పడితేనే గ్యాస్ ఏజెన్సీలకు రప్పిస్తాం. గృహ వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రూ. 500 సిలిండర్ కోసం చాలా మంది ఏజెన్సీలకు వస్తున్నారు. తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతోంది. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సదరు పథకం కింద లబ్ధి పొందాలని కాంక్షిస్తూ ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు. వదంతులు నమ్మవద్దు, ఇంకా మార్గదర్శకాలు రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఈ కేవైసీ ప్రక్రియకు రాయితీ సిలిండర్‌కు ఎలాంటి సంబంధం లేదు. వినియోగదారులు అనవసరంగా ఆందోళనకు గురికావొద్దు. – బి.శ్రీనివాస్, గ్యాస్ డీలర్, జూబ్లీహిల్స్ -
అర్ధరాత్రి 1 గంట వరకూ న్యూ ఇయర్
కర్ణాటక: కొత్త ఏడాది అంటే ఐటీ సిటీలో ఉత్సవ వాతావరణం నెలకొంటుంది. డిసెంబరు ఆఖరి రోజు సాయంత్రం నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారేవరకూ రోడ్లు, కూడళ్లలో నగరవాసులు మజా చేస్తారు. ఈ నేపథ్యంలో రాబోయే నూతన సంవత్సర సంబరాలపై బీబీఎంపీ, పోలీస్‌శాఖ మార్గదర్శకాలను విడుదల చేశాయి. ► 31వ తేదీ అర్ధరాత్రి 1 గంటలోగా న్యూ ఇయర్ వేడుకలను ముగించాలి. ► బెంగళూరు ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, ఇందిరా నగరలో న్యూ ఇయర్ సంబరాలకు అనుమతి ఉంది. ► ఆ రోజు రాత్రి 10 గంటల అనంతరం 31 తేదీ రాత్రి నగరంలోని ప్రముఖ ఫ్లై ఓవర్లు బంద్. ► ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులో 200 కు పైగా సీసీటీవీ అమర్చడంతో ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా నియంత్రణ. రాత్రి 8 గంటల నుంచి ఈ రోడ్లలో వాహన సంచారం నిషేధం ► సంబరాలకు వచ్చేవారికి ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థ. మహిళల భద్రత కోసం భారీగా మహిళా పోలీసుల మోహరింపు ► అర్ధరాత్రి 1 గంట తరువాత బార్, పబ్‌లను మూసివేయాలి ► సామూహిక న్యూ ఇయర్ విందు వినోదాలకు అనుమతి తప్పనిసరి ► లౌడ్ స్పీకర్లు, టపాసుల కాల్చడంపై ఆంక్షలు ► రాత్రి 1 గంట వరకు మెట్రో రైలు, సిటీ బస్సుల సంచారం. -
కాంట్రాక్ట్..ఇక పర్మినెంట్
-
హజ్ యాత్రకు నమోదు చేసుకోండి : ఏపీ హజ్ కమిటీ చైర్మన్
సాక్షి, విజయవాడ : కేంద్ర మైనార్టీ వ్యహహారాల శాఖ వచ్చే ఏడాది(2024) హజ్ వెళ్లే యాత్రికుల కోసం గైడ్‌లైన్స్ విడుదల చేసినట్లు ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌసల్ ఆజాం తెలిపారు. యాత్రికులు డిసెంబర్ 4 నుంచి 20 వరకు ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. జిల్లాల్లో ఉన్న హజ్ సొసైటీల్లో వాలంటీర్లు రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పారు. ‘అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 70 సంవత్సరాల వయసు వారు హజ్ యాత్రకు అర్హులు. రెండేళ్ల లోపల వయసున్న చిన్నారులకు విమాన ఛార్జీల్లో 10శాతం రాయితీ ఉంటుంది. 40 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలు కూడా హజ్‌కి వెళ్ళవచ్చు. విజయవాడలో గతేడాది నుంచి ఎంబారికేషన్ పాయింట్ ఏర్పాటు చేయిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. విజయవాడ నుంచి వెళ్తున్న హజ్ యాత్రికులకు విమాన చార్జీల భారాన్ని తగ్గించేందుకు సీఎం జగన్ గతేడాది రూ. 14 కోట్లు విడుదల చేశారు’అని గౌసల్ ఆజాం తెలిపారు. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ యాత్రికుల కోసం ఏర్పాట్లు జరిగినట్టు మక్కాలో మాట్లాడుకున్నారు. మే 9 నుంచి జూన్ 20 వరకు హజ్ యాత్ర విడతల వారిగా జరుగుతుంది. యాత్రికులు ఏప్రిల్ 24కల్లా పాస్ పోర్టులు సబ్మిట్ చేయాలి. గతేడాది కంటే మరింత బాగా హజ్ యాత్ర జరగాలని సీఎం జగన్ సూచించారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు’ అని గౌసల్ వెల్లడించారు. ఇదీచదవండి..మిచౌంగ్ తుపాను హెచ్చరిక.. అప్డేట్స్ -
పాఠాలే కాదు.. జీవితపాఠాలూ నేర్పాలి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు మొదటి సంవత్సరంలోనే ఆత్మస్థైర్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) విశ్వవిద్యాలయాలకు సూచించింది. విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం తొలగించి మానసికంగా దృఢంగాఉండేలా చూడాలని పేర్కొంది. తొలిదశలో నిర్వహించే అవగాహన కార్యక్రమం (ఇండక్షన్ ప్రోగ్రామ్) నుంచే ఇది మొదలవ్వాలని తెలిపింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ అధ్యయనాలపై ఏఐసీటీఈ దృష్టి పెట్టింది. ఇంటర్ వరకూ ఎక్కువగా బట్టీ విధానంలో చదివే విద్యార్థులు ఇంజనీరింగ్‌లోని భిన్నమైన విద్యా విధానం వల్ల సొంత అవగాహన పద్ధతులపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని ఏఐసీటీఈ భావించింది. ఈ సమస్యను అధిగమించడానికి వీలుగా ఇంజనీరింగ్ విద్యకు ముందుగా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని జాతీయ విద్యావిధానం–2020లో సూచనలు చేసింది. ఇప్పటికే ఇంజనీరింగ్ తరగతులు మొదలైనందున వచ్చే ఏడాది నుంచి విశ్వవిద్యాలయాలు దీనిపై దృష్టి పెట్టే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఇవీ సూచనలు.. కేవలం పుస్తకాలకే కాకుండా సామాజికంగా ఎదురయ్యే సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. తరగతి పాఠాలకే పరిమితం చేయకుండా సామాజిక అంశాలపై చర్చా వేదికలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. ప్రతి యూనివర్సిటీలోనూ దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరాక ఇంటర్ వరకూ ఉన్న వాతావరణం నుంచి ఇంజనీరింగ్ అనే కొత్త ప్రపంచం అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విద్యార్థి ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? అతని సామర్థ్యం ఏమిటి? అందరిలో కలుస్తున్నాడా? వంటి అంశాలను అధ్యాపకులు గమనించాలి. తరగతి గదిలో అందరి మధ్య సఖ్యత పెరిగి స్నేహపూర్వక వాతావరణం నెలకొన్న తర్వాతే బోధన చేపట్టాలి. ఇంజనీరింగ్‌లోని వివిధ బ్రాంచీలకు చెందిన విద్యార్థుల మధ్య సమన్వయం నెలకొనేందుకు కాలేజీలు ప్రయత్నించాలి. దీనికోసం సృజనాత్మకత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపకల్పనకు వర్సిటీలు కృషి చేయాలి. అకడమిక్ నాలెడ్జ్‌తోపాటు అనుభవపూర్వకంగా విద్యను నేర్చుకోవడం వల్ల విద్యార్థి మానసిక వికాసం పెరుగుతుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అభిప్రాయపడింది. దీన్ని కాలేజీలు విధిగా అనుసరించాలి -
అందరికీ అందుబాటులోకి స్వచ్ఛ ఇంధనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అందరికీ కాలుష్యం లేని స్వచ్ఛ ఇంధనం అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగానికి పెద్ద పీట వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. సౌర, పవన, జల విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించి, వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు విద్యుత్ చట్టంలో మార్పులు చేస్తూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్, ఛార్జీలు, బ్యాంకింగ్ నిబంధనలను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నియంత్రణ 2023 పేరుతో డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌ను తయారు చేసింది. ఈ నెల 21 నుంచి నూతన మార్గదర్శకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తాయి. దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తేవాలని, దాని కోసం 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామరŠాధ్యన్ని సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి కూడా ఈ మార్గదర్శకాలు దోహదపడతాయని ఏపీఈఆర్సీ వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ ద్వారా పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022లో నిబంధనలు జారీ చేసింది. వాటిని అనుసరించి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, వినియోగదారులు విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 181 (1) ప్రకారం నడుచుకోవడానికి రాష్ట్ర కమీషన్లు చట్ట ప్రకారం నిబంధనలను రూపొందించవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజా డ్రాఫ్డ్‌ను తీసుకువచ్చినట్లు ఏపీఈఆర్సీ పేర్కొంది. ఈ నియంత్రణ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్తును ఓపెన్ యాక్సెస్ చేయడానికి, ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్‌లు (సరఫరా వ్యవస్థలు), విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు వర్తిస్తుంది. కొత్త నిబంధనలివీ.. ♦ గ్రీన్ ఎనర్జీ నిబంధనల ప్రకారం.. దివాలా తీసిన సంస్థలు, డిస్కంలకు రెండు నెలల కంటే ఎక్కువ కాలం బకాయిలు ఉన్న సంస్థలు, అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తున్న సంస్థలు, విద్యుత్ దొంగతనం కేసు పెండింగ్‌లో ఉన్న సంస్థలకు ఓపెన్ యాక్సెస్‌ను పొందడానికి అర్హత లేదు.అరు్హలైన వారికి స్వల్పకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్‌ను మంజూరు చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్ (ఏపీఎస్‌ఎల్‌డీసీ) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ♦ దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ మంజూరు కోసం స్టేట్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ(ఏపీ ట్రాన్స్‌కో) నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ♦ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ దరఖాస్తులన్నీ నేరుగా సంబంధిత రాష్ట్ర నోడల్ ఏజెన్సీలకు సింగిల్ విండో ద్వారా వెళతాయి. ♦ సెంట్రల్ నోడల్ ఏజెన్సీ పోర్టల్‌లో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ సమాచారం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ♦ అన్ని కొత్త గ్రీన్ ఎనర్జీ జనరేటర్లకు కనెక్టివిటీ మంజూరు చేస్తారు ♦వినియోగదారులు, జనరేటర్ల మధ్య ప్రస్తుతం ఉన్న ఒప్పందాలు యధావిధిగా కొనసాగుతాయి. ప్రభుత్వ విధానం ప్రకారం ఓపెన్ యాక్సెస్‌ను కొనసాగించవచ్చు. వారికి సంబంధిత ఒప్పందాలలో పేర్కొన్న విధంగానే ఛార్జీలు వర్తిస్తాయి. ♦ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ట్రాన్స్మిషన్, వీలింగ్, క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీలు, స్టాండ్‌బై ఛార్జీలు, బ్యాంకింగ్ ఛార్జీలు, రియాక్టివ్ ఎనర్జీ ఛార్జీలను నిబంధనల మేరకు విధిస్తారు. అయితే ఇవన్నీ అందరికీ వర్తించవు. ఉదాహరణకు 2032 డిసెంబర్‌లోగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి, ఓపెన్ యాక్సెస్‌లో వినియోగదారులకు సరఫరా చేసే ఆఫ్‌షోర్ విండ్ ప్రాజెక్ట్‌ల నుంచి జరిగే విద్యుత్ ఉత్పత్తికి అదనపు సర్‌ఛార్జి వర్తించదు. దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ. 1 లక్ష కాగా, స్వల్పకాలానికి రూ.25 వేలు కడితే సరిపోతుంది. ♦ రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ వినియోగదారులకు వార్షిక ప్రాతిపదికన గ్రీన్ సర్టిఫికేట్ అందించాలి. ఓపెన్ యాక్సెస్ అంటే.. విద్యుత్తు వినియోగదారులు ఎవరైనా వారికి నచ్చిన పునరుత్పాదక ఉత్పత్తి సంస్థ నుంచి నేరుగా కరెంటును పొందే వెసులుబాటు. ఇందుకు ఈ వినియోగదారులు నోడల్ ఏజెన్సీ అనుమతి పొంది తగిన చార్జీలు చెల్లించి ఈ విద్యుత్తును పొందవచ్చు. -
బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు కొత్త మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా నదీ జలాల పంపిణీ, కేటాయింపులకు సంబంధించి జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ)–2కు కొత్త విధి విధానాల(టరŠమ్స్ ఆఫ్ రెఫరెన్సస్)ను కేంద్రం జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–1(బచావత్ ట్రిబ్యునల్) కేటాయించిన 811 టీఎంసీలతోపాటు.. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణాకు మళ్లించే గోదావరి జలాలకుగాను గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాల(45 టీఎంసీలు)ను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసి, వాటాలు తేల్చి.. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని నిర్దేశించింది. తద్వారా విభజన చట్టంలో సెక్షన్–89లో ‘ఏ’, ‘బీ’ నిబంధలనకు సరి కొత్త నిర్వచనం చెప్పింది. ప్రాజెక్టులంటే.. ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలో ఉన్నవని స్పష్టీకరించింది. ఈ విధి విధానాల మేరకు నీటి కేటాయింపులపై విచారణ చేసి 2024 మార్చి 31లోగా అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల(ఐఎస్ఆర్డబ్ల్యూడీ) చట్టం–1956లో సెక్షన్–5(3) ప్రకారం నివేదిక ఇవ్వాలని కేడబ్ల్యూడీటీ–2కు నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్‌మోహన్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు (గెజిట్ నెంబర్ 4204) జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2014 జూలై 14న సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయాలని చేసిన ఫిర్యాదు ఆధారంగా కేడబ్ల్యూడీటీ–2కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం పేర్కొన్న మార్గదర్శకాల మేరకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ చేస్తోంది. కేంద్రం ఇప్పుడు జారీ చేసిన విధి విధానాలతో కృష్ణా జలాల పంపిణీ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. బచావత్ ట్రిబ్యునల్ సమీక్ష చట్ట విరుద్ధం ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–6(2) ప్రకారం ఒక ట్రిబ్యునల్ పరిష్కరించిన జల వివాదాన్ని మళ్లీ పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. పరిష్కారమైన జల వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. అందుకే బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల జోలికి వెళ్లకుండా.. వాటిని యథాతథంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కొనసాగించింది. కానీ.. ఇప్పుడు కేంద్ర జల్ శక్తి శాఖ వాటిని పంపిణీ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నిర్దేశించడం గమనార్హం. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల్లో నాగార్జునసాగర్‌కు ఎగువన 45 టీఎంసీలను కృష్ణాలో అదనంగా వాడుకునే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. అదే ట్రిబ్యునల్.. గోదావరి జలాలను ఏ బేసిన్‌కు మళ్లించినా.. ఆ నది జలాల్లో అదనపు వాటాను దాని పరిధిలోని రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్దేశించింది. కాళేశ్వరంతోపాటు వివిధ ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ 240 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోంది. వాటిని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు జారీ చేసిన విధి విధానాల్లో చేర్చకపోవడం గమనార్హం. పదేళ్ల తర్వాత మరిన్ని విధి విధానాలా! కృష్ణా జలాల పంపిణీకి 2004 ఏప్రిల్ 2న సెక్షన్–4 ద్వారా ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్.. సెక్షన్–5(2) కింద 2010 డిసెంబర్ 30న నివేదికను.. 2013 నవంబర్ 29న తదుపరి నివేదికను కేంద్రానికి సమర్పించింది. ట్రిబ్యునల్‌కు నిర్దేశించిన లక్ష్య సాధనపై కేంద్రం సంతృప్తి చెందితే సెక్షన్–12 కింద ఆ ట్రిబ్యునల్‌ను రద్దు చేయొచ్చు. లక్ష్య సాధనపై సంతృప్తి చెందకపోతే తదుపరి నివేదిక ఇచ్చిన మూడు నెలల్లోగా అదనపు విధి విధానాలను నిర్దేశించి, మళ్లీ విచారణ చేయాలని కోరే అధికారం కేంద్రానికి ఉంటుంది. కానీ.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తదుపరి నివేదిక ఇచ్చి దాదాపు పదేళ్లు పూర్తవడం గమనార్హం. -
విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేలా..మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు!
ఇటీవల కాలంలో చదువుకునే విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. ఎగ్జామ్స్‌లో అనుకున్నన్ని మార్కులు రాకపోయినా లేదా తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కన్నవాళ్లకు తీరని వ్యధను మిగులుస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టేలా పాఠశాల స్థాయి నుంచే మార్పులు తీసుకువచ్చేలా విద్యామంత్రిత్వ శాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. అందుకోసం ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. సున్నిత మనస్తత్వం గల విద్యార్థులను గుర్తించి స్వీయ హాని తలపెట్టుకోకుండా మద్దతు ఇచ్చేలా పాఠశాలల్లో సమగ్రమైన టీమ్ విధానాన్ని అవలంభించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు విద్యార్థులు స్వీయ హానిని చేసుకోకుండా నిరోధించేలా ప్రేరేపించడం, నిర్వహించడం, సానుభూతి, సాధికారత, అభివృద్ధి తదితద మద్దతు అందించేలా మార్గదర్శకాలను విడుదల చేసింది మంత్రిత్వ శాఖ. అందుకు అనుగుణంగా స్కూల్ వెల్నెస్ టీమ్‌ని ఏర్పాటు చేయడం. స్వీయ హాని ప్రమాదంలో ఉన్న విద్యార్థులను ఆ టీమ్ గుర్తించి స్పందించడం, మద్దతు ఇవ్వడం వంటి చర్యలు ఈ ముసాయిదా మార్గదర్శకాల్లో ఉన్నాయి. విద్యార్థులు వ్యక్తిగత సామాజిక సమస్యలు, ఆందోళనలను సమర్ధవంతంగా నిర్వహించలేనప్పుడూ నిరంత దుఃఖం, అసంతృప్తి, నిరాశ, మానసిక కల్లోలం, నిస్సహాయ భావన వంటి తీవ్ర పరిణామాలకి దారితీస్తుంది. చాలామటుకు ఇలాంటి కేసులు చివరకు స్వీయ హానికి దారితీస్తున్నాయని ముసాయిదా మార్గదర్శకాలు పేర్కొన్నాయి. అందువల్ల ముందుగా ఆత్మహత్యల నివారణ దిశగా ఈ స్కూల్ టీమ్‌లు ప్రయత్నాలు చేయాలని విద్యామంత్రిత్వ శాఖ పేర్కొంది. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న వనరులను బట్టి స్కూల్ వెల్నెస్ టీమ్ క్రమం తప్పకుండా విద్యార్థుల తీరు తెన్నులను గమనిస్తూ ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేలా మద్దతు ఇచ్చి వారిని గైడ్ చేయాలని పేర్కొంది. పాఠశాలలోని ఈ స్కూల్ వెల్నెస్ టీమ్‌లు పనితీరును వార్షిక ప్రాతిపదికన సమీక్షించాలి. అలాగే ఆత్మహత్యలను సమర్ధవంతంగా నిరోధించేలా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి కుటుంబాలు సమిష్టిగా భాగస్వామ్యం అయ్యి పనిచేయాలని ముసాయిదా సిఫార్సు చేసింది. (చదవండి: గురక ఇబ్బంది పెడుతోందా!..వెంటనే తగ్గిపోవాలంటే..)