
న్యూఢిల్లీ: డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలకు నామినీలను పేర్కొనే విషయంలో నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సవరించింది. ఆస్తుల బదిలీ, నామినీ సులభతర ఎంపికకు వీలుగా మార్గదర్శకాలను సవరిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. వెరసి సెక్యూరిటీల మార్కెట్లలో నామినేషన్ సౌకర్యంపై అవసరమైన స్పష్టతను కల్పించింది.
ఒక వ్యక్తి లేదా సంయుక్త ఖాతాదారులలో ఒకరు మరణిస్తే ఆస్తుల బదిలీని అదనపు కేవైసీ అవసరంలేకుండా రెండవ వ్యక్తికి బదిలీ చేసేందుకు దారి ఏర్పాటు చేసింది. ముందస్తుగానే కేవైసీ ఇచ్చి ఉంటే వీటి అవసరం ఉండదు. ఖాతాదారులలో జీవించి ఉన్న వ్యక్తి ఏ సమయంలోనైనా కాంటాక్టు వివరాలు, నామినీ మార్పు వంటివి చేపట్టవచ్చు.
ఈ బాటలో ఫిజికల్‌గా ఖాతా నిర్వహించేలేని వ్యక్తులు, ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించి సైతం మార్పులు ప్రవేపెట్టింది. తాజా సవరణలు 2025 మార్చి1 నుంచి మూడు దశలలో అమలుకానున్నాయి. సవరించిన మరికొన్ని నిబంధనలు జూన్1 నుంచి, పూర్తి నిబంధనలు సెపె్టంబర్ 1నుంచి వర్తించనున్నాయి.