ఓడీఎల్‌ అడ్మిషన్లు కఠినతరం | ODL admissions are tough | Sakshi
Sakshi News home page

ఓడీఎల్‌ అడ్మిషన్లు కఠినతరం

Published Fri, Sep 22 2023 4:15 AM | Last Updated on Fri, Sep 22 2023 11:50 AM

ODL admissions are tough - Sakshi

సాక్షి, అమరావతి: ఆన్‌లైన్, ఆన్‌లైన్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ (ఓడీఎల్‌) కోర్సులకు సంబంధించి యూని­వర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఓడీఎల్‌ ప్రోగ్రాముల పేరిట అనేక ఆన్‌లైన్‌ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఇష్టానుసారంగా కోర్సులను అందిస్తామంటూ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు యూజీసీ పటిష్ట విధివిధానాలను ప్రకటించింది.

ఆండర్‌ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌లలో ఓపెన్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్, ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రోగ్రాంలకు సంబంధించి తాజా నియంత్రణ నిబంధనలను విడుదల చేసింది. అలాగే, 2020లోనూ యూజీసీ కొన్ని మార్గదర్శకాలను వెల్లడించింది. యూజీ, పీజీ డిగ్రీలకు సంబంధించి ఆయా సంస్థల నిర్దేశిత ప్రమాణాలను పాటించేలా 2021లో మరికొన్ని సవరణలను ప్రతిపాదించింది. ఈ ప్రోగ్రాముల్లో  కనీస బోధనా ప్రమాణాలుండేలా తాజాగా మరిన్ని నిబంధనలను రూపొందించింది. 

ఈ అంశాల్లో ఓడీఎల్, ఆన్‌లైన్‌ ప్రోగ్రాంలకు నో..
ఓడీఎల్, ఆన్‌లైన్‌ ప్రోగ్రాంలలో కొన్ని అంశాలను మాత్రమే యూజీసీ అనుమతులిస్తోంది. ప్రాక్టికల్స్, ఇతర క్షేత్రస్థాయి ప్రయోగాలతో సంబంధమున్న అంశాల్లో ఓడీఎల్, ఆన్‌లైన్‌ ప్రోగ్రాంలను నిషేధించింది. అవి.. 

ఇంజనీరింగ్, మెడికల్, ఫిజియోథెరపీ, ఆక్యుపేషన్‌ థెరపీ, పారామెడికల్, ఫార్మసీ, నర్శింగ్, డెంటల్, ఆర్కిటెక్చర్, లా, అగ్రికల్చర్, హారి్ట­­కల్చర్, హోటల్‌ మేనేజ్‌మెంట్, కేటరింగ్‌ టెక్నా­లజీ, కలినరీ సైన్సెస్, ఎయిర్‌క్రాఫ్ట్‌ మె­యింటెనెన్స్, విజువల్‌ ఆర్ట్స్, స్పోర్ట్స్, ఏవియేషన్‌. 

 ఇవేకాక.. అధికారిక నియంత్రణ సంస్థలు అను­మ­తించని ప్రోగ్రాములు వేటినీ ఓడీఎల్, ఆన్‌లైన్‌ కోర్సుల కింద ఆయా సంస్థలు అందించడానికి వీల్లేదు. యోగా, టూరిజమ్‌ అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాల్లో యూజీ, పీజీ ప్రోగ్రాంలు అందించడానికీ వీల్లేదు. అలాగే, ఆయా సబ్జెక్టులలో ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రోగ్రాంలను ఓడీఎల్, ఆన్‌లైన్‌ కోర్సులుగా అందించకూడదు. ఓడీఎల్, ఆన్‌లైన్‌ ప్రోగ్రాంలు అందించే ఉన్నత విద్యాసంస్థలు ఆయా కోర్సులకు సంబంధించి నియంత్రణ సంస్థల అనుమతుల పత్రాలు, అఫిడ­విట్లు, ఇతర సమాచారాన్ని పూర్తిగా తమ వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. 

అడ్మిషన్లు తీసుకునే ముందే పరిశీలించాలి.. 
ఇక విద్యార్థులు ఆయా సంస్థలు అందించే ఓడీఎల్, ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరే ముందు అవి అధికారిక నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తీసుకు­న్నాయో లేదో ముందు­గా పరిశీలించుకోవాలని.. అలాగే, ఆయా ఉన్న­త విద్యాసంస్థల వెబ్‌సైట్లలో ఓడీఎల్, ఆన్‌లైన్‌ కోర్సు­లకు సంబంధించిన వివరాలను తనిఖీ చేసుకోవాలని యూజీసీ సూచించింది. అక­డ­మిక్‌ సెషన్ల వారీగా అనుమతుల స్థితిని యూ­జీసీ వెబ్‌సైట్‌ ‘హెచ్‌టీటీపీఎస్‌://డీఈబీ.­యూ­జీసీ.ఏసీ.ఐఎన్‌’లో యూజీసీ అందు­బాటు­లో ఉంచింది. అడ్మిషన్లు తీసుకునే ముందు యూ­జీసీ వెబ్‌సైట్‌లోని నోటీసులు, ఇతర ప్రజా­సంబంధిత హెచ్చరికలను పరిశీలించాలని కోరింది. 

యూజీసీ వెబ్‌సైట్లో ఆయా సంస్థల సమాచారం..
ఓడీఎల్‌ కోర్సులందించేందుకు అనుమతులున్న సంస్థల వివరాలను కూడా తమ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు యూజీసీ పేర్కొంది. ఆయా డిగ్రీ ప్రోగాంల పేర్లు, వాటి కాలపరిమితి, ఆయా సబ్జెక్టుల అంశాలు యూజీసీ సవరణ నిబంధనలు–2024 ప్రకారం ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి. నిషేధిత జాబితాల్లోని ప్రోగ్రాములుంటే కనుక వాటిలో చేరకుండా జాగ్రత్తపడాలి.

ఇదిలా ఉంటే.. ఈ కోర్సులను అందించడానికి సంబంధించి కొన్ని విద్యాసంస్థలను డిబార్‌ చేసినట్లు యూజీసీ ప్రకటించింది. అందులో నర్సీ ముంజీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (మహారాష్ట్ర), శ్రీ వేంక­టేశ్వర వర్సిటీ (ఆంధ్రప్రదేశ్‌) పెరియార్‌ యూని­వర్సిటీ (తమిళనాడు) ఉన్నాయి. ఈ సంస్థలు 2023 జూలై–ఆగస్టు, 2024 జనవరి–ఫిబ్ర­వరి సెషన్లకు సంబంధించి ఓడీఎల్, ఆన్‌లైన్‌ కోర్సు­లు అందించకుండా డిబార్‌ చేసినట్లు వివరించింది. 

ఫ్రాంఛైజీలపై నిషేధం.. 
సెంట్రల్‌ వర్సిటీలు, రాష్ట్ర వర్సిటీలు, ప్రైవేటు వర్సిటీలు, డీమ్డ్‌ వర్సిటీలు ఏవైనా సరే తమ కేంద్ర కార్యాలయాల ద్వారా మాత్రమే అందించాలి. ఫ్రాంచైజీల రూపంలో ఓడీఎల్‌ ప్రోగ్రాములు అందించడానికి వీల్లేదు. అలాగే, లెర్నర్‌ సపోర్టు కేంద్రాలను నేరుగా ఆయా ఉన్నత విద్యాసంస్థలే నిర్వహించాలి. ఫ్రాంఛైజీల ద్వారానో, ఔట్‌ సోర్సింగ్‌ ద్వారానో నిర్వహించేందుకు వీల్లేదు.

ఈ ఓడీఎల్‌ ప్రోగ్రాంలు, ఆన్‌లైన్‌ కోర్సులకు సంబంధించి పూర్తిగా ఆయా ఉన్నత విద్యాసంస్థలే బాధ్యులుగా ఉండాలి. ఫ్రాంఛైజీల ద్వారా అందించేందుకు యూజీసీ అనుమతించదు. ఆయా విద్యాసంస్థలు అందించే ప్రోగ్రాంలు యూజీసీ నియమ నిబంధనలకు లోబడి ఉంటేనే వాటికి అండర్‌ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలతో సమానత వర్తిస్తుంది. ఓడీఎల్, ఆన్‌లైన్‌ ప్రోగ్రాంలకు అడ్మిషన్లను కూడా నిర్ణీత గుర్తింపు ఉన్న కాలానికి మాత్రమే చేపట్టాలి.

టెరిటోరియల్‌ పరిధిలోనే కోర్సులు..
మరోవైపు.. ఓడీఎల్, ఆన్‌లైన్‌ ప్రోగ్రాంలను అందించే సంస్థల టెరిటోరియల్‌ పరిధిని కూడా యూజీసీ నిర్దేశించింది. ఆయా సంస్థలు తమ కోర్సులను అనుమతులున్న కాలంలో ఎక్కడి వారికైనా అందించవచ్చు. అయితే, వాటి కార్యకలాపాలు కేవలం తమ సంస్థకు నిర్దేశించిన పరిధిలోనే చేపట్టాలని యూజీసీ పేర్కొంది.  

సెంట్రల్‌ వర్సిటీలు వాటి చట్టంలో నిర్దేశించిన టెరిటోరియల్‌ నిబంధనల ప్రకారం ఈ ఓడీఎల్‌ ప్రోగ్రాంలను అమలుచేయవచ్చు. 
స్టేట్‌ వర్సిటీలు వాటి చట్టంలో పేర్కొన్న పరిధికి లోబడి.. లేదా తమ రాష్ట్ర పరిధిలో మాత్ర­మే ఈ ఓడీఎల్‌ కోర్సులను అమలుచేయాలి. 
ప్రైవేటు వర్సిటీలు కూడా తమ చట్టంలో నిర్దేశించుకున్న రాష్ట్ర పరిధికి మించి ప్రోగ్రాములను అందించరాదు. హెడ్‌ క్వార్టర్‌ పరిధిలో మాత్రమే ప్రోగ్రాంలను అందించవచ్చు. గుర్తింపు ఉన్న ఆఫ్‌ క్యాంపస్‌ల ద్వారా కూడా అమలుచేయవచ్చు. 
 ప్రోగ్రాములను లెర్నర్‌ సపోర్టు కేంద్రాల ద్వారా అమలుచేయడానికి వీల్లేదు. డీమ్డ్‌ వర్సిటీ­లు తమ హెడ్‌ క్వార్టర్‌ పరిధిలో, కేంద్ర ప్రభు­త్వ అనుమతి ఉన్న ఆఫ్‌ క్యాంపస్‌ల ద్వా­రా ఈ ప్రోగ్రాములను అమలుచెయ్యొ­చ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement