న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ఓ యువతి టు పీస్ బికినీ టైప్ దుస్తులు ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ కీలక ప్రకటన చేసింది. రైలులో ప్రయాణించేవారు ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంపై మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రయాణికులు మెట్రోలో ఇతరులకు అసౌకర్యంగా, ఇబ్బందికరంగా అన్పించే దుస్తులు ధరించవద్దని యాజమాన్యం సూచించింది. తోటి ప్రయాణీకుల సున్నితత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించవద్దని స్పష్టం చేసింది. సమాజానికి ఆమోదయోగ్యమైన వేషధారణలో ప్రయాణించాలని తెలిపింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే సెక్షన్ 59 ప్రకారం శిక్షార్హులని హెచ్చరించింది.
'మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తున్నప్పుడు వేషధారణ మంచిగా ఉండాలని ప్రయాణికులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దుస్తుల ఎంపిక వ్యక్తిగత విషయమే అయినప్పటికీ.. ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించి స్వీయ నియంత్రణలో ఉండాలని విజ్ఞప్తి చేసింది.
బ్రా.. మిని స్కర్ట్.. పీలికల్లాంటి దుస్తుల్లో మెట్రో రైలులో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను బిత్తరపోయేలా చేసిన యువతి పేరు రిథమ్ చననా. సోషల్ మీడియాలో ఈ యువతిపై మామూలు తిట్లు పడడం లేదు. సొసైటీని పాడు చేయడానికే అలాంటి బట్టలు వేసుకుంటున్నావా? అంటూ మండిపడుతున్నారంతా. తొలుత ఆమె ఫొటోలు, వీడియోలు చూసి అంతా ఉర్ఫీ జావెద్ అనుకుని పొరపడ్డారంతా. చివరికి.. ఆమె అసలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఐడెంటింటీ రివీల్ అయ్యింది.
తనది ఎంతో పద్ధతిగల కుటుంబమని చెప్పిన ఆమె.. మొదట్లో తాను అంతే పద్దతిగా ఉండేదానినని చెప్పింది. అయితే.. సడన్‌గా తన ఆలోచనలు మారాయని, ఆ ఆలోచనలకు ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో దూరంగా ఉంటూ వస్తున్నానని తెలిపింది.
చదవండి: దారుణం.. ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు.. 400 కిలోమీటర్లు తీసుకెళ్లి బీచ్‌లో..
Comments
Please login to add a commentAdd a comment