commuters
-
ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన దేవెగౌడ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దేవెగౌడ ఢిల్లీ వాసులను ఆశ్చర్యపరిచారు. ఆదివారం ఢిల్లీ మెట్రో రైలులో దేవెగౌడ ప్రయాణించారు. ప్రయాణం సందర్భంగా దేవెగౌడ మెట్రో ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించిన వీడియోను దేవెగౌడ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. VIDEO | Former Prime Minister of India HD Devegowda (@H_D_Devegowda) travels in Delhi metro.(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/Oa6WJSYcQT— Press Trust of India (@PTI_News) August 4, 2024 91 ఏళ్ల వయసున్న దేవెగౌడ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈయన 1996 నుంచి 1997 దాకా దేశ ప్రధానిగా పనిచేశారు. దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఢిల్లీ మెట్రోరైలు ప్రాజెక్టుకు బీజం పడింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను అప్పుడే రూపొందించారు. దేవెగౌడ కుమారుడు జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీ చీఫ్ కుమారస్వామి ప్రస్తుతం కేంద్రమంత్రివర్గంలో ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. -
ప్రయాణికులు అలాంటి దుస్తుల్లో రావద్దు.. ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన..
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ఓ యువతి టు పీస్ బికినీ టైప్ దుస్తులు ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ కీలక ప్రకటన చేసింది. రైలులో ప్రయాణించేవారు ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంపై మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణికులు మెట్రోలో ఇతరులకు అసౌకర్యంగా, ఇబ్బందికరంగా అన్పించే దుస్తులు ధరించవద్దని యాజమాన్యం సూచించింది. తోటి ప్రయాణీకుల సున్నితత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించవద్దని స్పష్టం చేసింది. సమాజానికి ఆమోదయోగ్యమైన వేషధారణలో ప్రయాణించాలని తెలిపింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే సెక్షన్ 59 ప్రకారం శిక్షార్హులని హెచ్చరించింది. 'మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తున్నప్పుడు వేషధారణ మంచిగా ఉండాలని ప్రయాణికులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దుస్తుల ఎంపిక వ్యక్తిగత విషయమే అయినప్పటికీ.. ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించి స్వీయ నియంత్రణలో ఉండాలని విజ్ఞప్తి చేసింది. బ్రా.. మిని స్కర్ట్.. పీలికల్లాంటి దుస్తుల్లో మెట్రో రైలులో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను బిత్తరపోయేలా చేసిన యువతి పేరు రిథమ్ చననా. సోషల్ మీడియాలో ఈ యువతిపై మామూలు తిట్లు పడడం లేదు. సొసైటీని పాడు చేయడానికే అలాంటి బట్టలు వేసుకుంటున్నావా? అంటూ మండిపడుతున్నారంతా. తొలుత ఆమె ఫొటోలు, వీడియోలు చూసి అంతా ఉర్ఫీ జావెద్ అనుకుని పొరపడ్డారంతా. చివరికి.. ఆమె అసలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఐడెంటింటీ రివీల్ అయ్యింది. తనది ఎంతో పద్ధతిగల కుటుంబమని చెప్పిన ఆమె.. మొదట్లో తాను అంతే పద్దతిగా ఉండేదానినని చెప్పింది. అయితే.. సడన్‌గా తన ఆలోచనలు మారాయని, ఆ ఆలోచనలకు ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో దూరంగా ఉంటూ వస్తున్నానని తెలిపింది. చదవండి: దారుణం.. ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు.. 400 కిలోమీటర్లు తీసుకెళ్లి బీచ్‌లో.. -
Hyderabad: తెలంగాణ భవన్ ముందు ట్రాఫిక్ నరకం
బంజారాహిల్స్ రోడ్ నెం. 14 బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నుంచి రోడ్ నెం.12 వైపు వెళ్లే రోడ్డులో తెలంగాణ భవన్ ముందు పల్లంగా ఉండటంతో ఎత్తుపైకి ఎక్కలేక వాహనాలు ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తరచు ట్రాఫిక్ స్తంభించిపోతోంది. అంతేకాకుండా వంపుగా ఉన్న తెలంగాణ భవన్ వద్ద రోడ్డు నుంచి రోడ్ నెం. 12 వైపు వాహనాలు ఎక్కే క్రమంలో రెడీమిక్స్ వాహనాల నుంచి సిమెంటు, కంకర కిందపడుతూ గుట్టలుగా పేరుకుపోతోంది. ఇదొక సమస్యగా మారిపోయింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్ వద్ద ఆర్టీసీ బస్సులు, లారీలు ఇక్కడి నుంచే ఎక్కే క్రమంలో మొరాయిస్తుండటంతో వెనుక ట్రాఫిక్ కిలోమీటర్ల మేర ఆగిపోతోంది. సీఎం తెలంగాణ భవన్‌కు వచ్చినప్పుడు వీవీఐపీలు మెయిన్ రోడ్డు మీదనే కారు ఆపి దిగే క్రమంలో కూడా వెనుక ఉన్న వాహనాలు పెద్ద ఎత్తున నిలిపోతున్నాయి. ► తెలంగాణ భవన్ ముందు ఈ ట్రాఫిక్ సమస్య గత దశాబ్ధ కాలంగా విపరీతంగా పెరిగిపోతున్నది. దీనికి పరిష్కారంగా బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ వైపు మళ్లే ప్రాంతం నుంచి అగ్రసేన్ చౌరస్తా వరకు రోడ్డును సమాంతరం చేయడం ద్వారా సమస్య కొలిక్కి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ► కేబీఆర్ పార్కు నుంచి వరద నీరు తెలంగాణ భవన్ పక్కన నిర్మించిన కాల్వలోకి చేరే క్రమంలోనే ఈ రోడ్డు వంపుగా మారింది. ఇక్కడ వరద నీటి పైప్‌లైన్ వేసి రోడ్డంతా సమాంతరం చేస్తే ట్రాఫిక్ సజావుగా ముందుకు సాగుతుందని ట్రాఫిక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇరుకుగా అగ్రసేన్ చౌరస్తా.. బంజారాహిల్స్ రోడ్ నెం. 14 నుంచి తెలంగాణ భవన్ మీదుగా వాహనాలు ముందుకు సాగడం గగనంగా మారింది. లేచిన దగ్గరి నుంచి అర్ధరాత్రి దాకా ఈ రోడ్డులో వాహనాలు మెళ్లగా ముందుకు కదులుతున్నాయి. ► ఒక వైపు తెలంగాణ భవన్ వైపు రోడ్డు లోతుగా ఉండటం, జగన్నాథ టెంపుల్ గేటు కూడా రోడ్డు వైపే ఉండటం ట్రాఫిక్‌ను మరింత జఠిలం చేస్తున్నది. దీనికి తోడు అగ్రసేన్ చౌరస్తాలో తెలంగాణ భవన్ నుంచి రోడ్ నెం. 12 వైపు మలుపు మరింత ప్రమాదకరంగా మారింది. ఇక్కడే ట్రాన్స్ఫార్మర్, కరెంటు స్తంభాలు, హైటెన్షన్ వైర్ల స్తంభాలు టర్నింగ్పై ఉన్నాయి. వీటిని తొలగిస్తే ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ వైపు తేలికగా ముందుకు కదులుతుంది. ► అగ్రసేన్ ఐల్యాండ్‌ను కూడా పెద్దగా ఉండటం, చౌరస్తా మొత్తం ఇరుకుగా ఉండటం వాహనాలు మళ్లే పరిస్థితులు జఠిలమవుతున్నాయి. ఈ చౌరస్తాను తగ్గించాల్సిన అవసరం ఉందని, సెంట్రల్ మీడియన్లను కూడా కట్ చేయాల్సిన పరిస్థితి ఉందని ట్రాఫిక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు కూడా అగ్రసేన్ ఐల్యాండ్‌ను, సెంట్రల్ మీడియన్‌ను తగ్గించాలని జీహెచ్ఎంసీకి లేఖ కూడా రాశారు. జీహెచ్ఎంసీ మొద్దు నిద్ర.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్నది. ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకొని వాహనదారులు విలవిల్లాడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పలుమార్పులు, చేర్పులు చేస్తూ ఉన్నదాంట్లోనే సిబ్బందిని వినియోగించుకుంటూ ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతూ వాహనదారులను ముందుకు వెళ్లే దిశలో చర్యలు తీసుకుంటున్నారు. ► ట్రాఫిక్ పోలీసులకు జీహెచ్ఎంసీ అధికారులు ఏ మాత్రం సహకరించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. పలుచోట్ల సెంట్రల్ మీడియన్లు తగ్గించాలని ఐల్యాండ్లను కట్ చేయాలని, అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలని, ఫుట్‌పాత్‌లపై విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల షిఫ్టింగ్‌కు తోడ్పాటు నందించాలని, అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలు, టెలిఫోన్ స్తంభాలను అనువైన చోటుకు మార్చాలని ట్రాఫిక్ పోలీసులు లేఖలు రాస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. జీహెచ్ఎంసీతో ట్రాఫిక్ పోలీసులు సమన్వయం పూర్తిగా కొరవడింది. (క్లిక్ చేయండి: రసాభాసగా జీహెచ్ఎంసీ మీటింగ్.. చర్చ లేకుండానే బడ్జెట్‌కు ఆమోదం) -
మెట్రోస్టేషన్లో కాల్పుల కలకలం.. వీడియో వైరల్
టెహ్రాన్: ఇరాన్లో మహ్సా అమినీ లాకప్ డెత్ కారణంగా హిజాబ్ వ్యతిరేక అందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అదీగాక మరోవైపు ఇదే నవంబర్‌లో 2019లో పెట్రోల్ ధరల పెంపు విషయమై బ్లడీ అబాన్ (బ్లడీ నవంబర్) పేరిట పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఆ నిరసనల అణచి వేత వార్షికోత్సవం సందర్భంగా అప్పటి నిరసనలో చనిపోయిన సుమారు వంద మందిని స్మరించుకుంటూ నిరసనకారులు ఇరాన్ వీధుల్లో మూడు రోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చారు. ఇప్పుడూ ఈ నిరసనలు హిజాబ్ వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు తోడవ్వడంతో వాటిని అణిచివేసే భాగంలో ఇరాన్ భద్రతా బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అందులో భాగంగానే టెహ్రాన్‌లోని ఓ మెట్రోస్టేషన్‌లోని ప్రయాణికులపై భద్రతా బలగాలు కాల్పలు జరిపాయి. కాల్పులతో బెదిరిపోయిన ప్రయాణికులు.. అక్కడి నుంచి పారిపోయేయత్నం చేయడం, కింద పడిపోవడం చూడొచ్చు. ఇక మరో వీడియోలో అండర్ గ్రౌండ్ రైలులో.. హిజాబ్ ధరించని మహిళలను సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు చెదరగొట్టే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మా పోరాటం కొనసాగుతుంది. ఇరాన్‌కు మళ్లీ మంచిరోజులు వస్తాయి అంటూ నినాదాలు చేయడం వీడియోలో గమనించొచ్చు. Security officials cause a stampede in a Tehran metro station when they open fire on protestors. pic.twitter.com/e55HAfKcpS — Mike (@Doranimated) November 15, 2022 హిజాబ్ ధరించనందుకే మహ్‌సాను అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసుల కస్టడీలోనే సెప్టెంబర్ 16వ తేదీన మృతి చెందింది. దీంతో ఇరాన్ అంతటా పెద్ద ఎత్తున హిజాబ్ వ్యతిరేక నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అదీగాక అమిన్ మరణ తదనంతరం గత మూడు నెలలుగా జరుగుతున్న నిరసనల్లో ఒక పోలీసు, సెక్యూరిటీ అధికారి, ట్రాఫిక్ పోలీసుని నిరసకారులు హతమార్చడంతో కోర్టు వారికి మరణశిక్షలు విధించమని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాయుధ బలగాలు బహిరంగంగా కాల్పులకు తెగబడ్డాయి. అతేగాక పశ్చిమ నగరంలోని సనందాజ్‌లోని కుర్దిస్తాన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులపై కూడా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ మేరకు ఇరాన్ మానవ హక్కుల సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు అమినో మరణంతో చెలరేగిన హింసాకాండలో భద్రతా దళాలు 43 మంది పిల్లలు, 26 మంది మహిళలతో సహా సుమారు 342 మందిని చంపినట్లు పేర్కొంది. అంతేగాక కనీసం 1500 మంది నిరసకారులను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఐతే ఇరాన్ అధికారులు ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ మానవ హక్కుల డైరెక్టర్ మహమూద్ అమిరీ మొగద్దమ్ ఇరాన్ ఈ మరణశిక్షలను ఖండించడమే గాక వారిని నేరాలను అంగీకరించేలా చేసేందుకు ఈ హింసకు పాల్పడిందని అన్నారు. ఇరాన్ చెరలో ఉన్నవారందరికీ సాముహిక మరణ శిక్షలు విధించే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం టెహ్రాన్ మెట్రోస్టేషన్లో ప్రయాణికులపై బలగాలు జరిపిన కాల్పులకు సంబంధించిన వీడియో నెట్లింట వైరల్ అవుతోంది. Security officials cause a stampede in a Tehran metro station when they open fire on protestors. pic.twitter.com/e55HAfKcpS — Mike (@Doranimated) November 15, 2022 (చదవండి: చెట్లకు సెలైన్‌లో విషం పెట్టి.. లక్షకు కిలో లెక్కన అమ్మి.. ) -
Mumbai Monorail: ఆర్థిక నష్టాల్లో మోనో రైలు.. గట్టేక్కేదెలా?
దాదర్: భారతదేశంలో మొదటిసారి ముంబైలో ప్రవేశ పెట్టిన మోనో రైలు ప్రారంభించిన నాటి నుంచి తీవ్ర ఆర్థిక నష్టాల్లో నడుస్తోంది. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయాణికులను అనుకున్నంత మేర ఆకట్టుకోలేకపోయింది. దీంతో పీకల లోతు నష్టాల్లో కూరుకుపోయిన మోనోను గట్టెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ట్రాన్స్‌పోర్టు రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా మోనో రైలులో ప్రతీ ప్రయాణికుడికి సగటున రూ.200 ఖర్చవుతోంది. కానీ టికెట్టు రూపంలో కనీస చార్జీలు రూ. 20 వసూలు చేయగా గరిష్ట చార్జీలు రూ.50–60 వరకు వసూలు చేస్తున్నారు. దీన్ని బట్టి మోనోకు ఏ స్ధాయిలో నష్టాలు వస్తున్నాయో ఇట్టే తెలుస్తోంది. దేశంలోనే ప్రథమంగా... ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించిన మోనో రైలు దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎనిమిదేళ్ల కిందట ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) రూ.343 కోట్లు ఖర్చు చేసింది. కానీ గడచిన ఎనిమిదేళ్లలో ఈ రైళ్ల ద్వారా ఎమ్మెమ్మార్డీయేకు కేవలం రూ.29.73 కోట్ల ఆదాయం వచ్చింది. నష్టం మాత్రం రెట్టింపు కంటే ఎక్కువే ఉంది. ప్రారంభంలో చెంబూర్– వడాల మధ్య (9.8 కి.మీ.) తిరిగిన ఈ రైళ్లు విస్తరించడంతో ఇప్పుడు సాత్‌రాస్తా వరకు (20 కి .మీ.దూరం) వెళుతున్నాయి. ఈ మార్గంలో మొత్తం 18 స్టేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రైళ్లు జనవాసాల మధ్యలోంచి వెళుతున్నాయి. అయినప్పటికీ ప్రయాణికుల నుంచి స్పందన అనుకున్నంత రావడం లేదు. ప్రతీరోజూ 123 మోనో రైలు ట్రిప్పులు తిరగ్గా అందులో సరాసరి 10 వేల మంది ప్రయాణిస్తున్నారు. అంటే నెలకు సరాసరి మూడు లక్షల చొప్పున ఎనిమిదేళ్లలో 24 లక్షల వరకు రాకపోకలు సాగించినట్లు అమ్ముడుపోయిన టికెట్లను బట్టి తెలుస్తోంది. అదే ఎనిమిదేళ్ల కిందట ప్రారంభించిన వర్సోవా–అంధేరీ–ఘాట్కోపర్ మెట్రో–1 ప్రాజెక్టుకు ప్రయాణికుల నుంచి ఊహించని విధంగా స్పందన వస్తోంది. గడచిన ఎనిమిదేళ్లలో అందులో ఏకంగా 72 కోట్లకు పైనే మంది ప్రయాణించారు. దీన్ని బట్టి మోనో, మెట్రో మధ్య ఆదాయపరంగా చాలా వ్యత్యాసముందని స్పష్టమవుతోంది. మెట్రో మార్గంలో రెండు రైళ్ల మధ్య 4–5 నిమిషాల వ్యత్యాసముండగా, అదే మోనోలో 18–20 నిమిషాల వ్యత్యాసముంది. అంటే ఒక రైలు వెళ్లిపోయిందంటే ప్రయాణికులు మరో రైలు కోసం సుమారు 20 నిమిషాలు ప్లాట్‌ఫారంపై పడిగాపులు కాయాల్సిందే. అదేవిధంగా మోనో రైలు దిగిన ప్రయాణికులకు అనేక స్టేషన్ల బయట ట్యాక్సీ, ఆటోలు, బెస్ట్ బస్సులు తదితర రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్ధులు, సామాన్య ప్రజలు మోనోలో ప్రయాణించడానికి ముఖం చాటేస్తున్నారు. మోనో నష్టాల్లో నడవడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయి. ట్రిప్పుల సంఖ్య పెంచడం, రైలు దిగిన ప్రయాణికులకు స్టేషన్ నుంచి బయటకురాగానే మెరుగైన రవాణా సౌకర్యాలుంటే తప్ప మోనో రైలు ఆర్ధిక పరిస్ధితి గాడిన పడదని రవాణారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్ చేయండి: జేఈఈ టాపర్స్ దృష్టి... ఐఐటీ బాంబే వైపే) -
అధ్యక్షుడికీ తప్పని.. ఓట్లపాట్లు
జొహాన్నెస్‌బర్గ్: ఓట్ల పండగొస్తే అది అనకాపల్లైనా ఆఫ్రికా అయినా గుళ్లో ఉండే దేవుడి కంటే గల్లీలో ఉండే ఓటరు దర్శనానికే నాయకులు క్యూ కడతారు. ఓటరు మహాశయుడిని కలిసి వారి సుఖదుఃఖాలు తెలుసుకుంటారు. మేమున్నామంటూ మాటిచ్చి ఓట్లు వేయించుకుంటారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజధానిలో ఉండే నేతలు కూడా వాడవాడకూ, ఇంటింటికీ తిరగాల్సిందే. ప్రజలను కలసి హామీల మాయా మూటలు అప్పజెప్పాల్సిందే. లేదంటే ఓటరు మనసు మారిపోదూ!.. అలా అయిన పక్షంలో ప్రాణం కంటే ఖరీదైన ఓటు జారిపోదూ..! అసలు వివయంలోకి వస్తే మన దేశంలోలాగే భగభగ ‘మండే’లా దక్షిణాఫ్రికాలోనూ ఎన్నికలు రెండు నెలల్లో జరగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత సౌతాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫొసా ఇప్పట్నుంచే తన ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా రాజధానికి దగ్గరలోని మబోపనే టౌన్‌షిప్‌ను సందర్శించారు. ప్రచార అనంతరం మబోపనే నుంచి రాజధాని ప్రిటోరియాకు సాధారణ ప్రయాణికులతో కలసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ రైలు రాక కోసం రామఫొసా గంటసేపు ఎదురు చూడవలసి వచ్చింది. ఆలస్యంగా వచ్చిన రైలు 45 నిమిషాల వ్యవధిలో చేరుకునే ప్రిటోరియా స్టేషన్‌కు వెళ్లడానికి 3 గంటల సమయం పట్టింది. ప్రయాణ సమయంలో మార్గమధ్యంలో అనుకోకుండా చాలాసేపు ఆగిపోయింది. ఆ టైమ్‌లో ఆయనతో ఉన్న విలేకరులు ప్రయాణికులతో రామఫొసా ముచ్చటిస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. దక్షిణాఫ్రికాలో రైళ్లు ఆలస్యంగా రావడమనేది సర్వసాధారణమైన విషయం. ప్రయాణికులతో అధ్యక్షుడు రామఫొసా ఉన్న ఫొటోలపై అక్కడి సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శల దాడికి దిగారు. రామఫొసా ఆధ్వర్యంలో నడుస్తున్న ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) ప్రభుత్వానికి సిగ్గులేదని, ఘోరంగా ఉన్న రైల్వే వ్యవస్థ ప్రాసా (ప్యాసింజర్ రైల్ ఏజెన్సీ ఆఫ్ సౌతాఫ్రికా) సర్వీసుల గురించి ప్రజలు గగ్గోలు పెడుతున్నా సిరిల్ సర్కార్ పట్టించుకోవపోవడం పాపమని ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ప్రయాణానంతరం ప్రిటోరియాకు చేరుకున్న అధ్యక్షుడు రామఫొసా అక్కడి రైల్వే అధికారులను కలసి ఇది జాతీయ సమస్యగా మారిందని దీన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్యరించాలని ఆదేశించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రామఫొసా ’’రైళ్లో 50 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి మాకు దాదాపు 3 గంటల సమయం పట్టింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్యరించేలా ప్రాసాతో చర్చలు జరుపుతున్నామ’’ని అన్నారు. 400 సీట్లున్న సౌతాఫ్రికా పార్లమెంట్లో సమారు 60 శాతం ఓట్లను గెలుచుకునే దిశగా రామఫొసో పార్టీ వ్యూహాలు రచిస్తోంది. -
మెట్రోకు ధరల షాక్.. రోజుకు 3లక్షల మంది ప్రయాణికులు ఔట్!
న్యూఢిల్లీ: గత అక్టోబర్‌లో ధరలు ఒక్కసారిగా పెంచడంతో దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రైలుకు గట్టి షాకే తగిలింది. ధరల బాదుడు భరించలేక రోజుకు మూడు లక్షలమంది చొప్పున గత నెలలో ప్రయాణికులు తగ్గిపోయారు. సెప్టెంబర్ నెలలో ఢిల్లీ మెట్రోలో రోజుకు సగటున 27.4 లక్షల మంది ప్రయాణించగా.. అక్టోబర్ నెలకు వచ్చేసరికి రోజు ప్రయాణికుల సంఖ్య 24.2 లక్షలకు తగ్గిపోయింది. ధరల పెరుగుదల కారణంగా 11శాతం మంది ప్రయాణికులు తగ్గిపోయారు. ఒక ఆర్టీఐ దరఖాస్తుకు ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ ఈ మేరకు వివరాలు వెల్లడించింది. ఢిల్లీ, రాజధాని ప్రాంతం కలుపుకొని మొత్తం 218 కిలోమీటర్ల మెట్రోనెట్‌వర్క్ ఉంది. ద్వారాక నుంచి నొయిడా వరకు మెట్రో రైల్లో ప్రయాణించవచ్చు. ఢిల్లీలో సాధారణంగా ప్రయాణికులు మెట్రోరైల్లో ప్రయాణించడానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఇటీవలికాలంలో మెట్రోరైల్ ప్రయాణికులు గణనీయంగా తగ్గారు. గత సంవత్సరాల్లో లేనివిధంగా ఈసారి మెట్రోలో ప్రయాణించేవారు తగ్గుతున్న ట్రెండ్ కనిపిస్తోంది. -
అక్షత్.. మరో అద్భుతం...!
న్యూఢిల్లీః ఆడ్ ఈవెన్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అక్షత్ మిట్టల్ గుర్తున్నాడా? దేశ రాజధాని నగరంలో కాలుష్య నివారణకోసం కేజ్రీవాల్ సర్కారు ప్రవేశ పెట్టిన సరి బేసి వాహన విధానంతో 13 ఏళ్ళ వయసులోనే తన ప్రతిభతో వెలుగులోకి వచ్చిన అక్షత్.. అందర్నీ ఆకట్టుకున్నాడు. ఢిల్లీ నగరంలో సరి బేసితో ఇబ్బందులు పడుతున్న పౌరులను కష్టాలనుంచీ గట్టెక్కించేందుకు 'ఆడ్ ఈవెన్ డాట్ కామ్' పేరుతో ఓ వైబ్ సైట్ ను రూపొందించి అనూహ్యంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు కార్ పూలింగ్ యాప్ ఓరాహీతో కలసి... ఆ బాల మేధావి.. మరో కొత్త యాప్ ను సృష్టించాడు. అక్షత్.. 13 ఏళ్ళ వయసులోనే తన సృజనాత్మకతతో అందరికీ చేరువయ్యాడు. వాహనదారులు తన వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకుంటే.. సరి బేసి సమయాల్లో దగ్గరలోని వాహనదారులతో మాట్లాడి, వారి కార్లలో కార్యాలయాలకు సులభంగా చేరుకునే మార్గాన్ని ఆడ్ ఈవెన్ డాట్ కామ్ ద్వారా అందుబాటులోకి తెచ్చాడు. అయితే ఢిల్లీ ప్రభుత్వం కార్ పూలింగ్ విధానానికి బ్రేక్ వేయడం, అనంతరం తన వెబ్ సైట్ ను ఇతర సంస్థకు అమ్మేసిన అక్షత్.. ఇప్పుడు మరో యాప్ తో ప్రజల ముందుకొచ్చాడు. 15 ఏళ్ళ వయసున్న అక్షత్ మిట్టల్.. ప్రజల రోజువారీ సమస్యలను పరిష్కరించేందకు 'ఛేంజ్ మై ఇండియా డాట్ ఆర్గ్' పేరున కొత్త వెంచర్ ను బుధవారం ఆవిష్కరించాడు. ఆడ్ ఈవెన్ డాట్ కామ్ ను స్వాధీన పరచుకున్న గుర్గావ్ ఆధారిత సాంకేతిక, డొమైన్ నిపుణులు.. కార్ పూలింగ్ యాప్ 'ఓరాహీ' సలహా బోర్డు తో కలసి కొత్త యాప్ ను ప్రవేశ పెట్టాడు. దైనందిన జీవితంలో భారత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించేందుకు అక్షత్ కొత్త యాప్.. ఛేంజ్ మై ఇండియా డాట్ ఆర్గ్.. పని చేయనుంది. భారత్ లో సామాజిక మార్పుకోసం, ప్రజలకు సహాయం అందించే దిశగా తాను ఆలోచిస్తున్న సమయంలోనే తనను... ఆడ్ ఈవెన్ డాట్ కామ్... అశోకా యూత్ ఛేంజ్ మేకర్ గా ఎంపిక చేసిందని అక్షత్ తెలిపాడు. సమాజంలో మార్పును కోరుకునేవారు, అందుకు సహాయం అందించే ఆసక్తి ఉన్నవారితో కలసి, దాదాపు పదిలక్షలమంది సమస్యలను పరిష్కరించే దిశగా ఈ ప్రస్తుత మిషన్ పనిచేస్తుందని అక్షత్ పేర్కొన్నాడు. ఇందులో భాగంగానే ప్రజలకు సహాయం అందించేందుకు ఛేంజ్ మై ఇండియా ప్రారంభించినట్లు అక్షత్ మిట్టల్ తెలిపాడు. -
సామాన్యుల సౌకర్యాలపైనే రైల్వే బడ్జెట్ దృష్టి
ముంబయి: సామాన్యులకు సౌకర్యాలను అందించడంపై సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ ప్రధాన దృష్టి పెట్టిందని మహరాష్ట్ర బిజెపి వెల్లడించింది. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా బడ్జెట్ ను రూపొందించారంటూ ప్రస్తుత రైల్వే బడ్జెట్ ను ప్రశంసించింది. బడ్జెట్ లో సామాన్యులకు పెద్ద పీట వేశారని అదే సమయంలో టికెట్ చార్జీల పెంపు లేకుండా చేశారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రావ్ సాహెబ్ దాన్వే ప్రశంసించారు. చర్చిగేట్-విరార్, సిఎస్టీ-పాన్వెల్ కృత్రిమ కారిడార్లతో ముంబైలో రైలు ప్రయాణీకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.