ముంబయి: సామాన్యులకు సౌకర్యాలను అందించడంపై సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ ప్రధాన దృష్టి పెట్టిందని మహరాష్ట్ర బిజెపి వెల్లడించింది. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా బడ్జెట్ ను రూపొందించారంటూ ప్రస్తుత రైల్వే బడ్జెట్ ను ప్రశంసించింది.
బడ్జెట్ లో సామాన్యులకు పెద్ద పీట వేశారని అదే సమయంలో టికెట్ చార్జీల పెంపు లేకుండా చేశారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రావ్ సాహెబ్ దాన్వే ప్రశంసించారు. చర్చిగేట్-విరార్, సిఎస్టీ-పాన్వెల్ కృత్రిమ కారిడార్లతో ముంబైలో రైలు ప్రయాణీకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సామాన్యుల సౌకర్యాలపైనే రైల్వే బడ్జెట్ దృష్టి
Published Thu, Feb 25 2016 3:50 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM
Advertisement