ముంబై: మహానగరం ముంబైలోని ఏడు లోకల్ స్టేషన్ల పేర్లు త్వరలో మారనున్నాయి. ముంబైలోని మెరైన్ లైన్స్ స్టేషన్‌ను ఇకముందు ముంబా దేవి స్టేషన్‌గా పిలవనున్నారు. ఈ స్టేషన్ పేరును మార్చడం వల్ల ముంబా దేవి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌలభ్యంగా ఉండనుంది.
ముంబైలోని ఏడు స్థానిక రైల్వే స్టేషన్ల పేర్లను మార్చే ప్రతిపాదనను మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించింది. దీంతో ఈ ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రైల్వే స్టేషన్ల పేర్లను మార్చనున్నారు. మెరైన్ లైన్‌ను ముంబా దేవిగా, కర్రీ రోడ్డును లాల్‌బాగ్‌గా, సాండ్‌హర్స్ట్ రోడ్డును డోంగ్రీగా, చర్ని రోడ్డును గిర్గావ్ స్టేషన్‌గా మార్చనున్నారు. అలాగే కాటన్ గ్రీన్ స్టేషన్‌కు కాలాచౌకీ అని, డాక్‌యార్డ్ రోడ్డును మజ్‌గావ్‌గా, కింగ్ సర్కిల్‌ను తీర్థంకర్ పార్శ్వనాథ్ స్టేషన్‌గా మార్చనున్నారు.
ఈ ప్రతిపాదనను రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్రకాంత్ పాటిల్ సమర్పించారు. ఇది ఏకగ్రీవంగా ఆమోదంపొందింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నాయి. దీనికి అనుమతి లభించిన వెంటనే ఈ స్టేషన్ల పేర్లను మార్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment