changed
-
బీజేపీ కీలక నిర్ణయం.. పార్టీ జమ్ముకశ్మీర్ చీఫ్ మార్పు
జమ్ము: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే అక్కడి పార్టీ నాయకత్వం విషయంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిని మార్చింది. జమ్ముకశ్మీర్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా సత్‌శర్మను నియమించింది. ఇప్పటివరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన రవీందర్‌రైనాను పార్టీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు.ఈ మేరకు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్‌సింగ్ దివారం(నవంబర్ 3)ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.సత్‌శర్మను సెప్టెంబర్‌లోనే రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెండు నెలల్లోనే అధ్యకక్షుడిని చేయడం గమనార్హం. ఇదీ చదవండి: 10 రోజుల్లో యోగి రాజీనామా చేయకుంటే.. -
ఏడు రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు
ముంబై: మహానగరం ముంబైలోని ఏడు లోకల్ స్టేషన్ల పేర్లు త్వరలో మారనున్నాయి. ముంబైలోని మెరైన్ లైన్స్ స్టేషన్‌ను ఇకముందు ముంబా దేవి స్టేషన్‌గా పిలవనున్నారు. ఈ స్టేషన్ పేరును మార్చడం వల్ల ముంబా దేవి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌలభ్యంగా ఉండనుంది.ముంబైలోని ఏడు స్థానిక రైల్వే స్టేషన్ల పేర్లను మార్చే ప్రతిపాదనను మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆమోదించింది. దీంతో ఈ ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రైల్వే స్టేషన్ల పేర్లను మార్చనున్నారు. మెరైన్ లైన్‌ను ముంబా దేవిగా, కర్రీ రోడ్డును లాల్‌బాగ్‌గా, సాండ్హర్స్ట్ రోడ్డును డోంగ్రీగా, చర్ని రోడ్డును గిర్గావ్ స్టేషన్‌గా మార్చనున్నారు. అలాగే కాటన్ గ్రీన్ స్టేషన్‌కు కాలాచౌకీ అని, డాక్‌యార్డ్ రోడ్డును మజ్‌గావ్‌గా, కింగ్ సర్కిల్‌ను తీర్థంకర్ పార్శ్వనాథ్ స్టేషన్‌గా మార్చనున్నారు.ఈ ప్రతిపాదనను రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్రకాంత్ పాటిల్ సమర్పించారు. ఇది ఏకగ్రీవంగా ఆమోదంపొందింది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నాయి. దీనికి అనుమతి లభించిన వెంటనే ఈ స్టేషన్ల పేర్లను మార్చనున్నారు. -
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా.. మారిన రూల్స్ తెలుసా?
ఐటీఆర్ రిటర్న్స్ ఫైలింగ్‌కు ఇంక కొన్ని రోజులే ఉంది. 2024 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఏటా ఐటీఆర్ దాఖలు చేస్తున్నవారైనా, ఈసారి కొత్తగా ఫైలింగ్ చేస్తున్నవారైనా పన్నుకు సంబంధించిన మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి.గత కొన్నేళ్లలో సీబీడీటీ అనేక పన్ను సంబంధిత నిబంధనలను మార్చింది. ఐటీఆర్ ఫైలింగ్‌కు సంబంధించి మారిన నిబంధనల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ విషయాల పట్ల జాగ్రత్త వహించకపోతే ట్యాక్స్ రీఫండ్ ఆగిపోయే అవకాశం ఉంది.కొత్త పన్ను విధానం2024 సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. దీని కింద రూ .7 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్నూ ఉండదు. అయితే మీరు కొత్త, పాత పన్ను విధానం ఏదోఒక దాని కింద ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్ గా ఉంటుంది. పాత పన్ను విధానం ఐచ్ఛికం. ఎలాంటి మినహాయింపు, డిడక్షన్ లేకుండా క్లెయిమ్ సమర్పిస్తే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలి. ఒక వేళ పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే దాని కింద వివిధ పన్ను మినహాయింపులు, డిడక్షన్లను క్లెయిమ్ చేయవచ్చు.స్టాండర్డ్ డిడక్షన్వేతన జీవులకు రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను ఇటీవల ప్రవేశపెట్టారు. ఈ స్టాండర్డ్ డిడక్షన్ పెన్షనర్లకు మాత్రమే. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకునేందకు స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50,000 తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. దీంతో పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.సెక్షన్ 80సీసెక్షన్ 80సీ పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచారు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, ఎల్ఐసీ, ఎన్ఎస్సీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఇన్వెస్ట్ చేస్తే 80సీ కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. ఇది కాకుండా, 80డీ కింద మీరు మీ కుటుంబం, సీనియర్ సిటిజన్లైన తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య బీమాపై పన్ను మినహాయింపు పొందవచ్చు. రెండింటి గరిష్ట ప్రీమియం రూ.75,000. 80సీలో హోమ్ లోన్, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజుల అసలు మొత్తాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.హోమ్ లోన్మీరు ఇల్లు కొనుగోలు చేసి, దాని కోసం హోమ్ లోన్ తీసుకున్నట్లయితే 80ఈఈఏ కింద దాని వడ్డీపై మినహాయింపు పొందుతారు. గృహ రుణ వడ్డీపై రూ .2 లక్షల వరకు అదనపు తగ్గింపును ప్రోత్సహించడమే దీని లక్ష్యం. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, అఫోర్డబుల్ హౌసింగ్‌ను ప్రోత్సహించడం ఈ మినహాయింపు ఉద్దేశం.అదనపు వివరాలుఐటీఆర్ ఫారాన్ని సవరించి అదనపు వివరాలను పొందుపరిచారు. ముఖ్యంగా విదేశీ ఆస్తులు, ఆదాయం, భారీ లావాదేవీలు వెల్లడించేలా నిబంధనలు మార్చారు. విదేశీ పెట్టుబడులు లేదా గణనీయమైన ఆర్థిక కార్యకలాపాలు ఉన్న పన్ను చెల్లింపుదారులు జరిమానాను నివారించడానికి వివరణాత్మక సమాచారాన్ని అందించాలి. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు పెన్షన్, వడ్డీ ద్వారా మాత్రమే ఆదాయం ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయాల్సిన బాధ్యత నుంచి వారికి మినహాయింపు ఉంది. అయితే దీని కోసం పెన్షన్, వడ్డీ డబ్బుల నుంచి బ్యాంకులు టీడీఎస్‌ను మినహాయించడం మాత్రం తప్పనిసరి. -
ఆ స్థానానికి ఓటింగ్ తేదీలో మార్పు.. ఆరో దశలో ఎన్నికలు!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ స్థానానికి ఓటింగ్ తేదీ మారింది. అలాగే మూడో దశలో కాకుండా ఆరో దశలో (మే 25) ఓటింగ్ జరగనుంది. గతంలో ఇక్కడ మే 7న ఓటింగ్ నిర్వహించాలనుకున్నారు.అనంతనాగ్-రాజౌరీ స్థానానికి ఓటింగ్ తేదీని వాయిదా వేయాలని బీజేపీ, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ), జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీలు ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాయి. ఇటీవల కురిసిన మంచు, కొండచరియలు విరిగిపడటమే దీనికి కారణమని సమాచారం. మంచు కురియడానికి తోడు, కొండచరియలు విరిగిపడటం వలన అనంతనాగ్- రాజౌరిలను కలిపే మొఘల్ రహదారిని బ్లాక్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం కొనసాగడం లేదని, దీనికితోడు ఓట్ల శాతం కూడా తగ్గే అవకాశం ఉందని పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి.ఈ నేపధ్యంలోనే అందిన వినతి మేరకు ఎన్నికల సంఘం ఓటింగ్ తేదీలో మార్పులు చేసింది. ఈ స్థానంలో ఇప్పటికే నామినేషన్ల దాఖలు సహా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. కాగా జమ్ముకశ్మీర్‌లోని రాంబన్, బనిహాల్‌లో భారీ వర్షాలు కురవడానికి తోడు కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందారు. మరొకరు కాలువలో కొట్టుకుపోయారు. వర్షాల కారణంగా 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్, బనిహాల్ మధ్య అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రహదానికి అధికారులు మూసివేశారు. -
ప్రతీ రెండు నెలలకు అయోధ్య భద్రతా సిబ్బంది మార్పు!
అయోధ్యలోని రామాలయ భద్రత కోసం మోహరించిన పీఏసీ సిబ్బందిని ప్రతి రెండు నెలలకోసారి మార్చనున్నారు. రామ మందిర భద్రత బాధ్యతను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం (యూపీఎస్ఎస్ఎఫ్)నిర్వహిస్తోంది. ఈ దళం ఏర్పాటైనప్పటి నుంచి ఎటువంటి నియామకాలు జరగలేదు. దీంతో పీఏసీ సిబ్బంది సాయాన్ని తీసుకుంటున్నారు. పీఏసీ సిబ్బందిని ఒకేచోట నియమిస్తే వారిలో పని సామర్థ్యం దెబ్బతింటుందని, వారిలో నైతికత పడిపోతుందని భావించిన ఉన్నతాధికారులు పీఏసీ ఫోర్స్‌ను ప్రతీ రెండు నెలలకు మార్చాలని నిర్ణయించారు. అయోధ్యలోని రామ మందిర భద్రత కోసం ఎనిమిది కంపెనీల పీఏసీని యూపీ ఎస్ఎస్ఎఫ్కు అప్పగించారు. అయోధ్యలో మోహరించిన ఈ ఎనిమిది కంపెనీలను ప్రతి రెండు నెలలకు మార్చడానికి డీజీపీ ఆమోదం తెలిపారు. ఈ సిబ్బందికి సెక్యూరిటీ బ్రాంచ్ రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. -
ప్రగతి మైదానం ఇకపై ‘భారత్ మండపం’
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ను ఇకపై ‘భారత్ మండపం’గా పిలువనున్నారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) ఈ కాంప్లెక్స్‌కు ‘భారత్ మండపం’ అనే పేరు పెట్టింది. ‘భారత్ మండపం’ పేరుతో జీ-20 శిఖరాగ్ర సమావేశం గతంలో ఇక్కడ జరిగింది. దీనిని అంతర్జాతీయ ప్రదర్శనలు, సమావేశాలకు కేంద్రంగా వ్యవహరిస్తున్నారు. ప్రగతి మైదాన్‌ను ‘భారత్ మండపం’ అని పేర్కొంటూ ఐటీపీఓ తన వెబ్సైట్లోనే కాకుండా ప్రవేశ ద్వారాల వద్ద కూడా ఈ రాయించింది. 1972లో స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రదేశానికి ప్రగతి మైదాన్ అని నామకరణం చేశారు. అదే సంవత్సరం ఇందిరా గాంధీ ప్రారంభించిన ఆసియా- 72 ప్రదర్శన ఇక్కడ జరిగింది. అప్పటి నుండి ప్రగతి మైదాన్ జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా మారింది. ఐటీపీఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రగతి మైదాన్ క్యాంపస్‌కు భారత్ మండపం అని నామకరణం చేశామన్నారు. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్. మరొకటి వివిధ ఎగ్జిబిషన్ హాల్స్. ఈ పేరు మార్పు 38వ అంతర్జాతీయ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ ఆహార్-2024తో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలు, ఆహ్వాన పత్రికలు, టిక్కెట్లు, పాస్‌లు ఇలా ప్రతిదానిలో ప్రగతి మైదాన్ అని కాకుండా భారత్ మండపం అని ముద్రించారు. -
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ రూల్స్ మారాయ్.. ఇక అది అవసరం లేదు!
IMPS Rules change: ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంకుకు చేసే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ నిబంధనలు మారాయి. వినియోగదారులు ఫిబ్రవరి 1 నుంచి రిసీవర్ మొబైల్ నంబర్, పేరుతోనే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చని, ఐఎఫ్ఎస్సీ కోడ్ జోడించాల్సిన అవసరం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. 2024 జనవరి 31 నాటికి అన్ని ఐఎంపీఎస్ ఛానెల్‌లలో మొబైల్ నంబర్ + బ్యాంక్ పేరు ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ను అనుమతించాలని బ్యాంకులను అభ్యర్థిస్తున్నట్లు ఎన్పీసీఐ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. అలాగే డిఫాల్ట్ ఎంఎంఐడీ (మొబైల్ మనీ ఐడెంటిఫైయర్- MMID)తో సభ్యుల బ్యాంక్ పేర్లను మ్యాపింగ్ చేయాలని రిమిటర్ బ్యాంకులకు సూచించింది. ఐఎంపీఎస్ అంటే.. ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, బ్యాంక్ శాఖలు, ఏటీఎంలు, ఎస్ఎంఎస్, ఐబీఆర్ఎస్ వంటి వివిధ ఛానెల్‌ల ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్‌కు అత్యంత సాధారణంగా ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి. ఈ ఐఎంపీఎస్ ప్రస్తుతానికి P2A (అకౌంట్ + ఐఎఫ్ఎస్సీ) లేదా P2P (మొబైల్ నంబర్ + ఎంఎంఐడీ) ట్రాన్స్ఫర్ విధానాల్లో లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. ఒక వేళ ఒకే మొబైల్ నంబర్‌తో ఎక్కువ అకౌంట్లను లింక్ చేసిన సందర్భంలో కస్టమర్ సమ్మతి ఆధారంగా ప్రాథమిక/డిఫాల్ట్ అకౌంట్‌కు బెనెఫీషియరీ బ్యాంక్ డబ్బును జమ చేస్తుంది. ఒక వేళ కస్టమర్ సమ్మతి లేని పక్షంలో బ్యాంకు ఆ లావాదేవీని తిరస్కరించాలి. -
పేరు మార్చుకున్న ఈ టాప్ కంపెనీల గురించి తెలుసా?
-
ప్రపంచాన్ని మార్చిన టాప్ 10 గాడ్జెట్స్
-
బీఆర్ఎస్ బలం పెరుగుతుందా? తగ్గుతుందా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమవుతున్నారు. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ తనకు ప్రధాన ప్రత్యర్ధి అవుతుందేమోనన్న అంచనా కానివ్వండి.. బీజేపీ పెరిగితే తనకే ఎక్కువ రాజకీయ ప్రయోజనం అన్న భావన కానివ్వండి.. లేదా జాతీయ రాజకీయాలలో తన ప్రభావం చూపడానికి ఒక అవకాశం అన్న ఉద్దేశం కానివ్వండి.. ఇంతకాలం ఆయన బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీపై కూడా విమర్శలు కురిపించేవారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని అనేవారు. ఇప్పటికీ ఆయన తన వైఖరి మార్చుకోకపోయినా, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలను ఆయన గమనించి తన రూట్ మార్చారు. ఇప్పుడు బీజేపీపై కన్నా కాంగ్రెస్‌పై దాడి చేస్తున్నారు. తెలంగాణలో తాను చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివిధ సభలలో వివరిస్తున్నారు. పలు జిల్లాలలో నిర్మించిన కలెక్టరేట్ భవనాలను ఆయన ప్రారంభిస్తున్నారు. ఆ సందర్భంగా జరిగే సభలలో ఎన్నికల ప్రచారానికి తగిన విధంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రతిపక్షాల వైపు చూడకుండా ఉండడానికి ఎన్ని యత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ అంశాన్ని పెద్ద సమస్యగా మార్చుతోంది. పేదల భూములు కొట్టేయడానికే ధరణి పోర్టల్ తెచ్చారని, తాము అధికారంలోకి వస్తే ఆ పోర్టల్‌ను బంగళాఖాతంలో కలుపుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని ధరణి పోర్టల్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, అవినీతి అరికడుతుందని, దీనిని అడ్డుకునేవారిని బంగళాఖాతంలో కలపాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. మొత్తం ధరణి అంశం ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బందిపెడుతున్నట్లుగానే ఉంది. వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, రాష్ట్రంలో కరెంటు సరఫరా, తాగునీటి సరఫరా మొదలైన అభివృద్ది అంశాలను పదే,పదే ప్రస్తావిస్తూ మరోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన కోరుతున్నారు. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన బాగా యాక్టివ్ అయినట్లు కనిపిస్తుంది. మరో వైపు కేటీఆర్ తనదైన శైలిలో ప్రచారం చేస్తుంటే, కేసీఆర్ జరుగుతున్న రాజకీయాలకు అనుగుణంగా ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణలో హైదరాబాద్ కాకుండా మిగిలిన జిల్లాలలో బీఆర్ఎస్పై కాస్త నెగిటివ్ ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. దానిని తగ్గించడానికి ఆయన ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. కారణం ఏమైనా సెటిలర్లలో ఎక్కువమంది బీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉంటే, తెలంగాణలో పుట్టి పెరిగినవారిలో ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న కథనాలు, ఇంటర్వ్యూలు తరచుగా మీడియాలో వస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ లో వంతెనలు నిర్మిస్తే సరిపోతుందా.. జిల్లాల సంగతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెబుతుంటే, దానినే ఆయనకు మైనస్ చేయడానికి ఆయా రాజకీయ పక్షాలు ,తెలంగాణవాదులు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పుంజుకుంటే బీఆర్ఎస్కు అది చేటు తెస్తుందని గమనించి కేసీఆర్ కాంగ్రెస్‌పై దాడి పెంచారు. అంతేకాక బీజేపీలో మొదట ఉన్న జోష్ ఇప్పుడు లేదన్న భావన ప్రబలింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ వాదనను కొట్టిపారేస్తున్నా, కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీ ఊపు తగ్గిందన్నది వాస్తవం. దీనివల్ల బీజేపీ కన్నా బిఆర్ఎస్ కు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు సమానంగా ఓట్లు తెచ్చుకుంటే బీఆర్ఎస్ గెలుపు సులువు అవుతుంది. అలాకాకుండా ఏదో ఒక పార్టీనే ప్రత్యర్ధిగా మారితే అది టైట్ ఫైట్‌గా మారవచ్చు. కర్నాటకలో మాదిరి ముస్లిం ఓట్లు తెలంగాణలో కూడా కాంగ్రెస్ వైపు మెగ్గు చూపితే మాత్రం అది బీఆర్ఎస్కు బాగా నష్టం చేసే అవకాశం ఉంటుంది. చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో! మామూలుగా అయితే ఇక్కడ ముస్లిం ఓట్లు హైదరాబాద్ పాతబస్తీ మినహా మిగిలినచోట్ల టీఆర్ఎస్ వైపే ఉంటారు. కాని బీజేపీని అడ్డుకోవడానికి వారు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారితే అది బీఆర్ఎస్కు కూడా చికాకు కలిగించవచ్చు. వీటన్నిటిని అంచనా వేసుకున్న కేసీఆర్ జిల్లాల పర్యటనల వేగం పెంచి, బీఆర్ఎస్ చెక్కు చెదరకుండా చూడడానికి అన్ని యత్నాలు చేస్తున్నారు. మరో వైపు కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత తెలంగాణలో ఆ పార్టీకి కాస్త జోష్ వచ్చింది. సంస్థాగతంగా కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ , టీఆర్ఎస్కు ప్రధాన పోటీదారు కాంగ్రెస్సే అన్న భావన కొంతమేర తేగలిగారు. దానికి తగ్గట్లుగానే ఆయా నేతలు బీజేపీలో కన్నా కాంగ్రెస్‌లో చేరడానికే సుముఖత చూపుతున్నారు. అదే పెద్ద ఇండికేషన్ అని చెప్పాలి. ఖమ్మం జిల్లాలో స్ట్రాంగ్ మాన్ గా పేరొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాని, మాజీ మంత్రి , నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు వంటివారు కాని కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. వారిని ఆకర్షించడానికి బీజేపీ యత్నించినప్పటికీ, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారు ఆ పార్టీలో చేరలేదు. సొంతంగా పార్టీ పెట్టడం కన్నా బీఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్‌లో చేరితే బెటర్ అన్న అభిప్రాయానికి దాదాపుగా వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.దామోదరరెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరవచ్చని చెబుతున్నారు. చదవండి: చంద్రబాబు కొత్త ట్రిక్కు.. ఆ భయంతోనేనా? అది జరిగితే నాగర్ కర్నాల్ ప్రాంతంలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాలలో కాంగ్రెస్ పుంజుకుంటే అది బీఆర్ఎస్ కు గట్టిపోటీనే ఇస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీతో పోల్చితే నియోజకవర్గాలలో బలమైన క్యాడర్, నాయకత్వం కాంగ్రెస్‌కే ఉంది. పార్టీ విజయం సాదించే అవకాశం ఉందన్న నమ్మకం కుదిరితే వారంతా తీవ్రంగా కృషి చేస్తారు. బీజేపీ కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలు ఏర్పాటు చేస్తోంది. బీజేపీ అధికారంలోకి తేవడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాదన్న భావన నెలకొంటే, హంగ్ వచ్చేంత బలాన్ని అయినా పొందడానికి యత్నిస్తారు. అదికాకపోతే కాంగ్రెస్ నైతే అధికారంలోకి రావాలని వారు కోరుకోరని, అది జరిగితే దేశ వ్యాప్తంగా కొంత ప్రభావం పడుతుందని వారు భావించవచ్చని చెబుతున్నారు. అప్పుడు బీఆర్ఎస్కే వారు ఎంతో కొంత సాయపడవచ్చన్న ప్రచారం కూడా ఉంది. మామూలుగా అయితే కేసీఆర్‌కు నల్లేరు మీద బండిలా గెలుపు రావాలి. కాని ఆయన వ్యవహార శైలి, వివిధ కారణాల వల్ల పోటీని ఎదుర్కునే పరిస్థితి తెచ్చుకున్నారనిపిస్తుంది. ఏది ఏమైనా రాజకీయం ఎప్పుడూ ఒకరి సొంతం కాదు కదా! -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
విద్యా దీవెనతో మారిన బతుకుచక్రం..!
-
వీడియో: వెనిస్ మిస్టరీ.. రాత్రికి రాత్రే రంగు మారిపోయింది!
-
టీటీడీ కీలక నిర్ణయాలు.. బ్రేక్ దర్శన సమయంలో మార్పు
-
రెండు దశాబ్దాల్లోనే మారిన దశ.. నాడు కల్లోలం.. నేడు ప్రశాంతం
సిరిసిల్ల: గోధూళి వేళ.. వ్యవసాయ పనులు ముగించుకుని అందరూ ఇళ్లకు చేరుతున్నారు.. సూర్యుడు అస్తమించాడు.. చీకటి కమ్ముకుంటుంది.. అంతలోనే కంజీరమోతలు.. ఎర్రెర్రని పాటలు.. ఆవేశపూరిత ప్రసంగాలు.. దోపిడీలేని సమాజం కోసం విప్లవించాలనే నినాదాలు.. ప్రజాకోర్టు.. ఊరిలోని అంశాలపై బహిరంగ చర్చలు.. లాల్ సలామ్ అంటూ.. వీడ్కోలు..! మరసటి రోజు తెల్లవారుజామున 5 గంటలు.. బూట్ల చప్పుళ్లతో ఊరు తెల్లవారింది.. ఆ పల్లెలోని వారిని ఊరు విడిచి వెళ్లకుండా కట్టడి. గ్రామ చావడి వద్దకు అందరిని చేర్చి ప్రజాదర్భార్. మేమున్నదే మీకోసం అంటూ అడవుల్లో తిరిగే వాళ్లకు మీరు అన్నం పెట్టొద్దు.. మొన్న వాళ్లకు అన్నం పెట్టిన వారు ఎవరో మాకు తెలుసు.. వాళ్ల సంగతి మేం చూసుకుంటాం.. మీరు మాత్రం వాళ్లకు సహకరించొద్దు. చట్టం ఉందే మీకోసం.. అంటూ.. ఖాకీ డ్రెస్సుల పిలుపు..! ఇది రెండు దశాబ్దాల కిందట రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పల్లెల్లో పరిస్థితి. అడకత్తెరలో పోకచెక్కల్లా ప్ర జలు బిక్కుబిక్కుమంటూ గడిపేవారు. ఊరు మారింది ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితులు, ఇప్పటి స్థితిని అంచనా వేస్తే పల్లెలు ఎంతో మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మారుమూల కోనరావుపేట మండలం బావుసాయిపేటను పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఆ పల్లెకు వాహనయోగం వ చ్చింది. అప్పట్లో ఊరు మొత్తంలో మూడు, నాలు గు వాహనాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇంటికో బైక్, ఊరి నిండా ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు ఇలా ఎంతో మార్పు వచ్చింది. జిల్లాలోనే అత్యధి క కోళ్ల పరిశ్రమ ఆ గ్రామంలో విస్తరించింది. 20 కోళ్ల ఫారాలతో పౌల్ట్రీ రంగంలో అగ్రస్థానంలో ఉంది. ఆ ఊరిలో పట్టణాల తరహాలో సూపర్మార్కెట్లు నడుస్తున్నాయి. ఒకప్పటి కల్లోల పల్లె ఇప్పుడు ప్రశాంతంగా ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. బావుసాయిపేట ఊరి జనాభా నాలుగు వేలు. ఓటర్ల సంఖ్య 2,740, వార్డులు పది. నివాసాల సంఖ్య 876. చిన్న ఊరే అయినా అభివృద్ధిలో అగ్రపథాన నిలుస్తుంది. తీరొక్కటి దొరికే... సంత బావుసాయిపేటలో ప్రతీ బుధవారం జరిగే వారసంతలో తీరొక్క వస్తువులు దొరకుతాయి. చేపలు, రొయ్యలు మొదలు కొని బట్టలు, నిత్యసవరమైన వస్తువులు అన్నీ లభి స్తాయి. దీంతో కొండాపూర్, వెంకట్రావుపేట, బండపల్లి, గోవిందరా వుపల్లె గ్రామాల వాసులు వారసంతకు వచ్చి సరుకులు కొనుగోలు చేస్తారు. ఊరు శివారులో మూలవాగు, మరో రెండు చెరువులు ఉండడంతో భూగర్భజలాలకు కొదువ లేదు. వరి, పత్తి, మొక్కజొన్న, నువ్వులు వంటి పంటలను సాగుచేస్తారు. భూములు కొనుగోలు, విక్రయాలతో ఊరి ఆర్థికస్థితి మెరుగుపడింది. వ్యవసాయంలో బావుసాయిపేటలో అగ్రగామిగా నిలుస్తుంది. దీంతో గ్రామీణ ఆర్థికస్థితి ఎంతో బాగుపడింది. ఊరిలో రోడ్డుకు ఇరువైపులా ఉండే చెట్లు పల్లె అందాన్ని పెంచాయి. ఎంతో మార్పు వచ్చింది ఒకప్పటితో పోల్చితే ఊరిలో ఎంతో మార్పు వచ్చింది. రోడ్లు బాగుపడ్డాయి. రవాణా వసతి పెరిగింది. కమ్యూనికేషన్ పెరిగింది. ప్రజల జీవనంలోనూ మార్పు వచ్చింది. పట్టణాల్లో దొరికేవి అన్ని పల్లెల్లో అన్నీ లభిస్తున్నాయి. – బైరగోని నందుగౌడ్, చైతన్య యూత్, అధ్యక్షుడు వేగంగా అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పల్లెల్లో అభివృద్ధి వేగంగా సాగుతుంది. అన్ని రంగాల్లో మార్పు వేగంగా జరిగింది. ఇంటింటా సెల్‌ఫోన్ యుగమైంది. గతంలో పోల్చితే.. పల్లె ముఖచిత్రం ఎంతో మారింది. కల్లోల పల్లెల్లో వ్యవసాయ విస్తరణతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది. – కెంద గంగాధర్, గ్రామ సర్పంచ్ -
ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా?
Producer Is Change To Prabhas Maruthi Raja Deluxe Movie: 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్. అప్పటి నుంచి ప్రభాస్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ప్రభాస్ డేట్లు దొరికితే చాలు అని అనుకుంటున్నారు నిర్మాతలు. అలాంటి ప్రభాస్‌తో సినిమా అంటే వద్దనుకుంటున్నాడట ఓ నిర్మాత. కొన్నేళ్ల క్రితం ఓ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత ప్రస్తుతం ఆ డబ్బు ఇస్తే చాలు, సినిమా అవసరం లేదని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ప్రభాస్, మారుతి కాంబినేషన్లో 'రాజా డీలక్స్' అనే సినిమా రానున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలసిందే. ఈ సినిమా గురించి ఎక్కడా కన్ఫర్మ్గా చెప్పలేదు కానీ, కథ, హీరోయిన్లు, చిత్రం కోసం సెట్ వంటి తదితర పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు నిర్మాత మారే అవకాశం ఉందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను నిర్మిద్దామనుకున్న నిర్మాత డీవీవీ దానయ్య రెమ్యునరేషన్ కింద ప్రభాస్‌కు రూ. 50 కోట్లు ఇచ్చారని ఆ మధ్య టాక్ నడిచింది. అందుకు తగినట్లుగానే మారుతి బృందం పని చేసినట్లు సమాచారం. చదవండి: Hyderabad AMB థియేటర్లో దళపతి విజయ్.. ఏ సినిమా చూశారంటే? నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ అయితే ఆ మూవీ ఎప్పటికీ సెట్స్‌పైకి వెళ్లకపోయేసరికి, మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న క్లారిటీ లేకపోవడంతో డీవీవీ దానయ్య వెనక్కి తగ్గుతున్నారని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఎవరైనా నిర్మాత ముందుకొస్తే ఆ రెమ్యునరేషన్ డబ్బు తీసుకుని ప్రభాస్ డేట్స్‌ను ఇచ్చేందుకు ఫిక్స్ అయ్యారను భోగట్టా. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది క్లారిటీ లేదు. కాగా ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం. చదవండి: రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్ ! సిల్క్ స్మితగా విద్యా బాలన్ డౌటే ? -
తారుమారైన తేదీలు.. ఆలస్యంగా రానున్న సినిమాలు
కరోనా వల్ల సినిమాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. 2020లో ముందుగానే విడుదల తేదీ ప్రకటించిన ఏ సినిమా కూడా చెప్పిన తేదీకి దాదాపు రాలేదు. దానికి కారణం లాక్డౌన్. కరోనా కాస్త సద్దుమణిగి, సినిమాల విడుదల జోరు పెరిగినా కానీ రెండేళ్ల కరోనా ప్రభావం సినిమా విడుదలపై ఇంకా ఉంది. ఇప్పటికీ సినిమాల విడుదల తేదీలు తారుమారవుతున్నాయి. దానికి ఒక కారణం కరోనా తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే సంఖ్య తగ్గడమే అని కొందరు పరిశ్రమ ప్రముఖులు అంటున్నారు. ఏది ఏమైనా సినిమాకి పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం కూడా వెలిబుచ్చారు. ఇక విడుదల తేదీలు తారుమారైన చిత్రాల గురించి తెలుసుకుందాం. కాగా సీక్రెట్ ఏజెంట్‌గా అఖిల్ చేపట్టిన ఆపరేషన్ ఏంటి? అనేది తెలియాలంటే ‘ఏజెంట్’ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఏజెంట్’. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కావాల్సి ఉంది. ఇటీవల ‘ఏజెంట్’ ట్రైలర్‌ని కూడా అభిమానుల మధ్య గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే.. ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. కొత్త రిలీజ్ తేదీని చిత్రబృందం ప్రకటించలేదు. ఇంకోవైపు సమంత లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘యశోద’ ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడింది. హరి–హరీశ్ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఓ పాట చిత్రీకరించాల్సి ఉండగా మరోవైపు గ్రాఫిక్స్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసినట్లు చిత్రయూనిట్ ఆ మధ్య పేర్కొంది. కొత్త విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు. ఇక సముద్రంలోని ద్వారకా నగరంపై నిఖిల్ చేసిన అన్వేషణ కూడా తెరపైకి కాస్త లేట్‌గా రానుంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘కార్తికేయ 2’. ఇందులోనే నిఖిల్ ద్వారకా నగర అన్వేషణ చేశారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 22న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రయూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత ఆగస్టు 12న రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. ఫైనల్‌గా ఒక రోజు ఆలస్యంగా ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. కాగా నిఖిల్ హీరోగా నటించిన మరో చిత్రం ‘18 పేజెస్’ విడుదల తేదీలోనూ మార్పు జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఈ చిత్రం విడుదల కావాల్సింది. అయితే సెప్టెంబరు 10న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అదే విధంగా వైష్ణవ్ తేజ్ వైభవాన్ని చూడాలంటే సెప్టెంబర్ 2 వరకూ వేచి చూడాలి. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘రంగరంగ వైభవంగా’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విడుదల రెండు సార్లు వాయిదా పడి ఫైనల్‌గా మూడోసారి ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని తొలుత మే 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినా కాలేదు. ఆ తర్వాత జూలై 1న విడుదల అంటూ అనౌన్స్ చేసినా వాయిదా పడింది. ఫైనల్‌గా సెప్టెంబరు 2న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పోలీస్ ఆఫీసర్ కృష్ణదేవ్ (అడివి శేష్ పాత్ర పేరు) ఓ కేసు విచారణపై శ్రద్ధ పెట్టారు. ఈ విచారణ విశేషాలు తెలియాలంటే ‘హిట్ 2’ రిలీజ్ వరకు వేచి చూడాలి. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిట్: ది సెకండ్ కేస్’. ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. ‘హిట్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘హిట్ 2’ జూలై 29న రిలీజ్ కావాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ కూడా వాయిదా జాబితాలో ఉంది. నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్, తమన్నా జంటగా నాగశేఖర్, భావనా రవి నిర్మించిన ఈ చిత్రం జూలై 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ విడుదల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేది ఇంకా చిత్రయూనిట్ ప్రకటించలేదు. మరోవైపు బెల్లంకొండ సురేశ్ చిన్న కుమారుడు గణేశ్ హీరోగా పరిచయ మవుతున్న చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కావాల్సి ఉండగా, వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఇంకా విడుదల తేదీ వాయిదాపడిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. ఒక తేదీకి అనుకున్న సినిమా మరో తేదీకి వాయిదా పడటం అనేది సాధారణ విషయమే. అయితే ఒకేసారి ఇన్ని చిత్రాలు వాయిదా పడటం అంటే విషయమే. -
Cambodia: పుట్టిన తేదీని మార్చుకున్న ప్రధాని.. కారణం ఏంటో తెలుసా?
పరిస్థితులు అనుకూలించడం లేదనో, ఏ పని చేసిన కలిసి రావడం లేదనో కొంతమంది పేరు మార్చుకోవడం, పేరులో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం చూసి ఉంటాం. అయితే ఇక్కడ ఓ దేశానికి ప్రధాని కేవలం అదృష్టాన్నే నమ్ముకున్నట్లు అనిపిస్తుంది. అందుకోసం కోసం.. ఏకంగా పుట్టినతేదీనే మార్చుకున్నాడు. పైగా అంత అత్యున్నతి పదవిలో ఉండి ఆ పని చేయడమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు!. కంబోడియా ప్రధాన మంత్రి హన్ సెన్.. పుట్టిన తేది ఏప్రిల్ 4, 1951. కానీ ఆయన ఆ తేదీని ఆగస్టు 5, 1952కి చట్టబద్ధంగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఇందుకు ఓ బలమైన కారణం ఉందన్నది ఆయన వాదన. హన్సెన్ సోదరుడు.. సింగపూర్‌లో వైద్యం చేయించుకుని కంబోడియాకు తిరిగి వచ్చిన పదిరోజులకే చనిపోయాడు. దీంతో హన్ సెన్.. అత్యవసరంగా తన డేట్ ఆఫ్ బర్త్ను మార్చేసుకోవాలనుకున్నాడు. ఈ అనుహ్యమైన నిర్ణయం వెనుక.. తన సోదరుడి రెండు పుట్టిన రోజుల దోషం కూడా ఉందన్నది ఆయన వాదన. వాస్తవానికి కంబోడియా 1975 నుంచి 1979 వరకు ఖైమర్ రూజ్ పాలన కాలంలో ఉండేది. ఆ సమయంలో చాలామంది అధికారిక రికార్డుల కోల్పోయినందున వల్ల 50 ఏళ్లు పైబడ్డ కంబోడియన్లందరికీ రెండేసి పుట్టిన రోజులు ఉండిపోయాయి. అలా తన సోదరుడికి రెండు పుట్టినరోజులు ఉండడం, రాశిచక్రం దోషం వల్ల చనిపోయి ఉంటాడని హన్ సెన్ నమ్ముతున్నాడు. తన వరకు అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు.. ఒకే పుట్టినరోజు ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. అందుకే చట్టబద్ధంగా.. తన పుట్టిన తేదీని మార్చుకునే అంశంపై.. న్యాయ శాఖ మంత్రి కోయుట్ రిత్తో చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన తన కొత్త పుట్టిన తేదీని చట్టబద్ధంగా రిజిస్ట్రర్ చేసుకుని.. ప్రకటించే అవకాశం ఉంది. (చదవండి: మాతృభాషకు అసలైన గౌరవం... ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా..ఎల్లప్పుడూ కన్నడిగే!) -
మరో రైల్వే స్టేషన్ పేరు మార్చేసిన యోగి ప్రభుత్వం.. ఇక నుంచి
లక్నో: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలోని ఝాన్సీ రైల్వే స్టేషన్‌ను.. వీరాంగణ లక్ష్మీబాయ్ రైల్వేస్టేషన్‌గా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరికొద్ది రోజుల్లో అధికారికంగా ఉత్వర్వులు వెలువడనున్నాయని ఝాన్సీ పీఆర్వో మనోజ్ సింగ్ తెలిపారు. దీనిపై ఇప్పటికే కేంద్రం నుంచి ఆమోదం కూడా లభించిందని తెలిపారు. ఈ మేరకు యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం, నిన్న(బుధవారం) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రైల్వేస్టేషన్ పేరు మార్పు ప్రతిపాదనలను యోగి ప్రభుత్వం మూడు నెలల క్రితం.. కేంద్ర హోంమంత్రిత్వశాఖకు పంపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా చట్టపరమైన అనుమతులు పూర్తయ్యాక.. అధికారికంగా రైల్వేస్టేషన్ కోడ్ మారుస్తామని ఝాన్సీ డీఆర్ఎం పీఆర్వో మనోజ్ సింగ్ తెలిపారు. ఇప్పటికే యోగి ప్రభుత్వం.. అలహాబాద్‌ను ప్రయాగ్ రాజ్‌గా, మొఘల్సరై రైల్వే స్టేషన్‌ను పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌గా, ఫైజాబాద్ రైల్వేస్టేషన్‌ను అయోధ్యకాంట్‌గా పేరు మారుస్తు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. उत्तर प्रदेश का 'झाँसी रेलवे स्टेशन' अब 'वीरांगना लक्ष्मीबाई रेलवे स्टेशन' के नाम से जाना जाएगा। — Yogi Adityanath (@myogiadityanath) December 29, 2021 చదవండి: కరెంట్ షాక్‌తో నలుగురు కాలేజీ ఉద్యోగుల దుర్మరణం -
Kia India: అధికారికంగా కియా పేరు మార్పు..
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా తాజాగా తమ భారత విభాగం పేరును అధికారికంగా మార్చినట్లు వెల్లడించింది. కియా మోటార్స్ పేరు.. కియా ఇండియాగా మారినట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న తయారీ ప్లాంటులో లోగో, పేరును ఇప్పటికే మార్చినట్లు.. దశలవారీగా డీలర్‌షిప్‌లలో కూడా ఈ మేరకు మార్పులు చేయనున్నట్లు కియా పేర్కొంది. కొద్ది రోజుల క్రితమే కియా తమ కొత్త కార్పొరేట్ లోగో, అంతర్జాతీయ బ్రాండ్ స్లోగన్‌ను ఆవిష్కరించింది. సుమారు ఏడాదిన్నర క్రితం భారత్‌లో అమ్మకాలు ప్రారంభించిన కియా .. అత్యంత వేగంగా 2.5 లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించింది. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న నాలుగో కార్ల బ్రాండ్‌గా నిల్చింది. -
దయచేసి వినండి.. ప్రత్యేక రైళ్ల వేళల్లో మార్పులు
సాక్షి, విజయవాడ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ నడుపుతున్న కొన్ని ప్రత్యేక రైళ్లలో తేదీలు, బయలుదేరే సమయం, చేరుకునే సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆయా రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను కొనసాగించుకోవాలని పేర్కొన్నారు. చదవండి: విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు ► భువనేశ్వర్–తిరుపతి ప్రత్యేక వారాంతపు రైలు (08479) ఈ నెల 12 నుంచి 26 వరకూ ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బదులు 12.10కి బయలుదేరుతుంది. తిరుపతికి ఉదయం 8.45కి బదులు 8.10కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08480) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12.15కి బదులు 10.25కి తిరుపతిలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు ఉదయం 9.30కి బదులుగా 5.55కే చేరుకుంటుంది. ► భువనేశ్వర్–చెన్నై సెంట్రల్ ప్రత్యేక వారాంతపు రైలు (02839) ఈ నెల 17 నుంచి 31 వరకూ ప్రతి గురువారం ఉదయం 12 గంటలకు బదులుగా 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు ఉదయం 8.55కి బదులు 7.40కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02840) ఈ నెల 18 నుంచి జనవరి 1 వరకూ ప్రతి శుక్రవారం రాత్రి 9.10కి బదులు 10 గంటలకు చెన్నై సెంట్రల్లో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు సాయంత్రం 5.25కి బదులు ఉదయం 5.55కి చేరుకుంటుంది. ► భువనేశ్వర్–బెంగళూరు ప్రత్యేక వారాంతపు రైలు (02845) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం ఉదయం 7.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. బెంగళూరుకు ఉదయం 10.50కి బదులు 9.50కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02846) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం ఉదయం 8.25కి బదులు సాయంత్రం 4.45కి బెంగళూరులో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు ఉదయం 11.15కి బదులుగా సాయంత్రం 6.15కి చేరుకుంటుంది. ► భువనేశ్వర్–పుదుచ్చేరి ప్రత్యేక వారాంతపు రైలు (02898) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం ఉదయం 12 గంటలకు బదులు 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. పుదుచ్చేరికి మధ్యాహ్నం 12.40కి బదులుగా 12.10కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02897) ఈ నెల 16 నుంచి 30 వరకూ ప్రతి బుధవారం సాయంత్రం 4.45కి పుదుచ్చేరిలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కి సాయంత్రం 6.55కి బదులు 6.10కే చేరుకుంటుంది. ► భువనేశ్వర్–రామేశ్వరం ప్రత్యేక వారంతపు రైలు (08496) ఈ నెల 11 నుంచి 25 వరకూ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బదులు 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. రామేశ్వరానికి రాత్రి 11 గంటలకు బదులు 10.35కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08495) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం ఉదయం 8.40కి బదులుగా 8.50కి రామేశ్వరంలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు సాయంత్రం 6.55కి బదులు 6.10కే చేరుకుంటుంది. ► పూరి–చెన్నై సెంట్రల్ ప్రత్యేక వారాంతపు రైలు (02859) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం సాయంత్రం 5.30కి పూరిలో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు మధ్యాహ్నం 2.55కి బదులు 1.50కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02860) ఈ నెల 14 నుంచి 28 వరకూ ప్రతి సోమవారం సాయంత్రం 4.25కి చెన్నై సెంట్రల్లో బయలుదేరుతుంది. పూరీకి మధ్యాహ్నం 3.15కి బదులుగా 1.45కే చేరుకుంటుంది. ► విశాఖపట్నం–హజ్రత్ నిజాముద్దీన్ ప్రత్యేక రైలు (02851) ఈ నెల 11 నుంచి 28 వరకూ ప్రతి సోమ, శుక్రవారం ఉదయం 8.20కి విశాఖపట్నంలో బయలుదేరుతుంది. హజ్రత్ నిజాముద్దీన్‌కు సాయంత్రం 5.10కి బదులు 5 గంటలకే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02852) హజ్రత్ నిజాముద్దీన్‌లో ఉదయం 5.50కి బదులు 5.10కి బయలుదేరుతుంది. విశాఖపట్నానికి సాయంత్రం 5.30కి బదులుగా 2.15కే చేరుకుంటుంది. ► విశాఖపట్నం–చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైలు (02869) ఈ నెల 14 నుంచి 28 వరకూ ప్రతి సోమవారం రాత్రి 7.05కి విశాఖపట్నంలో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు ఉదయం 8.55కి బదులుగా 7.40కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02870) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం రాత్రి 9.10కి బదులుగా ఉదయం 10 గంటలకు చెన్నై సెంట్రల్లో బయలుదేరుతుంది. విశాఖపట్నానికి ఉదయం 10.30కి బదులుగా రాత్రి 10.30కి చేరుకుంటుంది. ► విశాఖపట్నం–కడప ప్రత్యేక రైలు (07488) ఈ నెల 12 నుంచి 31 వరకూ ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. కడపకు ఉదయం 7.25కి బదులు 7 గంటలకే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07487) ఈ నెల 13 నుంచి జనవరి 1 వరకూ ప్రతి రోజూ సాయంత్రం 5.05కి బదులు 5.45కి కడపలో బయలుదేరుతుంది. విశాఖపట్నానికి ఉదయం 11.30కి చేరుకుంటుంది. -
ఇక వైఎస్సార్ సెంట్రల్ పార్క్
సాక్షి, విశాఖపట్నం: నిరీక్షణ ఫలించింది. సుదీర్ఘ పోరాటం అనంతరం విశాఖ నగర సిగలో ఉన్న సిటీ సెంట్రల్ పార్కుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టేందుకు మార్గం సుగమమైంది. మంత్రులు, పార్టీ ముఖ్య నేతల చేతుల మీదుగా సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ పార్కు నామకరణం జరగనుంది దీంతోపాటు పార్కులో వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుకూ మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక ఉన్న పాత జైలును పడగొట్టి ఆరిలోవలో కొత్త జైలును ఏర్పాటు చేశారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణం ఉన్న స్థలంలో ఏం నిర్మించాలన్నదానిపై ఎన్నో ఆలోచనలొచ్చాయి. షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ లేదా పరిశ్రమలకు ఇవ్వాలని వచ్చిన ప్రపోజల్స్ ప్రభుత్వం ముందుంచారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రం.. విశాఖ నగరం నడిబొడ్డులో అంతటి విశాల స్థలం దొరకడం గగనమనీ.. ఆ ప్రాంతంలో నగర వాసులకు ఆహ్లాదాన్ని పంచేలా సుందరమైన పార్కు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన మరణించారు. 2011లో అప్పటి అర్బన్ డెవలప్మెంట్ బాడీ వైస్ ఛైర్మన్ కోన శశిధర్ ఆ పార్కుకి వైఎస్సార్ పార్క్‌గా నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పార్కులో రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రకటించారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ రెండు నిర్ణయాలను తొక్కిపెట్టేసింది. రాజ కీయ కుట్రలతో వైఎస్సార్ పేరు పెట్టకుండా 2016లో వైజాగ్ సిటీ సెంట్రల్ పార్క్‌గా నామకరణం చేస్తూ ప్రారంభించారు. ప్రైవేట్ పార్కు దిశగా... మరోవైపు పార్కు ప్రారంభమైన కొద్ది నెలల్లోనే విశేష ఆదరణ లభించింది. దీంతో సెంట్రల్ పార్కును ప్రైవేట్ పరం చెయ్యాలని టీడీపీ మంత్రులు కుట్రలు పన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వామపక్షాలు పోరాటం చెయ్యడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఫలించనున్న అవంతి కృషి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అవంతి శ్రీనివాస్ గత నెలలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. వైజాగ్ సెంట్రల్ పార్కు పేరును.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సెంట్రల్ పార్కుగా నామకరణం చెయ్యాలని ఈ సమావేశంలో తీర్మానించారు. పేరు మార్పునకు సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చెయ్యాలని అధికారులను మంత్రి అవంతి ఆదేశించారు. దీనికి సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఆయన ఆదేశాలు, కృషి ఫలితంగా సోమవారం నుంచి పార్కు పేరు మారనుంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చేతుల మీదుగా సాయంత్రం 4.30 గంటలకు ఈ పార్కు నామకరణం జరగనుంది. దీంతో పాటు పార్కులో 11 అడుగుల వైఎస్సార్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. -
పరీక్ష కేంద్రం మార్పుతో గందరగోళం
అనంతపురం ఎడ్యుకేషన్ : ముందస్తు సమాచారం లేకుండా గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశాలకు ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం మార్పు చేయడం గందరగోళానికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే... గురుకుల పాఠశాలల్లో 2018–19 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాలకు ఆదివారం పరీక్షలు నిర్వహించారు. అనంతపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, కదిరి తదితర ప్రాంతాలకు చెందిన 200 మంది విద్యార్థులను గుడిబండ బీసీ గురుకుల బాలికల పాఠశాల కేంద్రంలో పరీక్ష రాసేందుకు హాల్‌టికెట్లను జారీ చేశారు. దీంతో విద్యార్థులు ఆదివారం ఉదయం గుడిబండకు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అక్కడ గురుకుల పాఠశాల లేదనే విషయం తెలుసుకున్న వారంతా గందరగోళానికి గురయ్యారు. గత ఏడాది ఇక్కడి గురుకుల పాఠశాలను మడకశిరకు మార్చినా.. అధికారులు పాత చిరునామాతోనే హాల్‌టికెట్లు జారీచేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పిల్లలతో మడకశిరకు చేరుకున్నారు. అప్పటికే 11.15 గంటలుకాగా, పరీక్ష రాసేందుకు సిబ్బంది నిరాకరించారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహంతో తిరగబడ్డారు. దీంతో ఆలస్యంగా విద్యార్థులను పరీక్షలకు అనుమతించారు. -
ధవళేశ్వరం టు అమలాపురం..
ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయం మార్పు ఉద్యోగులకు మాట మాత్రంగానైనా చెప్పని వైనం జిల్లాకు చెందిన ఓ మంత్రే కారణం? ఆందోళనకు సిద్ధమవుతున్న ఇరిగేషన్ ఉద్యోగులు అడిగే వాడికి చెప్పే అవసరం లేదన్నట్టుగా మొండిగా వ్యవహరించే ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటుందనడానికి ఇదో ఉదాహరణ. ఉమ్మడి రాజధానిపై పదేళ్లు ఉండే అవకాశం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు హడావుడిగా అమరావతిలో తాత్కాలికంగా నిర్మించిన కొత్త రాజధానికి ఉద్యోగులను బలవంతంగా తీసుకువచ్చారు. హడావుడి తరలింపుపై ఎంతమంది వారించినా ప్రభుత్వం ససేమిరా అంది. ఇది అసరాగా తీసుకుని...ఇప్పుడు ధవళేశ్వరంలోని ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయానికి అమలాపురానికి ఉన్నఫళంగా మార్పుకు శ్రీకారం చుట్టింది. ఆ కార్యాలయ ఉద్యోగులకు ఈ మార్పు విషయాన్ని మాట మాత్రంగా చెప్పకపోవడం.. ప్రభుత్వ మొండి వైఖరి నిదర్శనం. ఇప్పుడు ఉద్యోగులు ఉద్యమ బాట పడతానంటున్నారు. ఇదీ ఆ కథా కమామిషు.. ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్) : జిల్లాకు చెందిన ఓ మంత్రి మెప్పు కోసం వందేళ్ల పైబడి చరిత్ర కలిగిన ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మార్చేశారు. కార్యాలయ సిబ్బందికి కూడా చెప్పకుండానే గురువారం కార్యాలయ ప్రారంభ తంతును ముగించారు. మంత్రి మెప్పు కోసమే ఇరిగేషన్ ఉన్నతాధికారి కాటన్ దొర ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని ఇరిగేషన్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం మార్పుపై మైనర్ ఇరిగేషన్ రైతాంగంలోనూ ఆందోళన నెలకొంది. సెంట్రల్ డెల్టాతో పాటు మైనర్ ఇరిగేషన్ విభాగం కూడా సెంట్రల్ డివిజన్ కార్యాలయం పరిధిలోనే ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బందే ధవళేశ్వరంలోని సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మారిస్తే మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బందులు తప్పవు. రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా ధవళేశ్వరం వచ్చేవారు. ఈ కార్యాలయాన్ని అమలాపురం మారిస్తే వంద కిలోమీటర్లు వెళ్లాల్సిందే. సెంట్రల్ డివిజన్ పరిధిలో చాగల్నాడు ఎత్తిపోతల పథకం ,తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్, వెంకటనగరం పంపింగ్ స్కీమ్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్,పిఆర్ ట్యాంక్స్ ఉన్నాయి. కాటన్ దొర ఆశయానికి తూట్లు ఉభయగోదావరి జిల్లాలను ధాన్యాగారంగా మార్చిన అపర భగీరథుడు కాటన్ దొర ఆశయానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారు. వందేళ్ళ క్రితం ధవళేశ్వరంలో సెంట్రల్ డివిజన్, ఈస్ట్రన్ డివిజన్, హెడ్‌వర్క్స్ డివిజన్లను అప్పట్లో ఏర్పాటు చేశారు. ధవళేశ్వరం సెంట్రల్ డివిజన్ కార్యాలయానికి సంబంధించి అమలాపురం, పి.గన్నవరం, రాజమహేంద్రవరంలోని సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ డివిజన్ కార్యాలయంతో పాటు మరికొన్ని కార్యాలయాల మార్పుకు 1988లో అప్పటి ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయితో న్యాయపోరాటంతో అప్పట్లో అందుకు బ్రేక్ పడింది. మంత్రి మెప్పు కోసమే! జిల్లాకు చెందిన మంత్రి మెప్పు కోసమే హడావుడిగా ధవళేశ్వరంలోని సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మారుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ఇరిగేషన్ ఉన్నతాధికారి భారీ స్కెచ్‌తో అమలాపురానికి కార్యాలయాన్ని మారుస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు కార్యాలయ మార్పుపై ఎటువంటి సమాచారం తెలీయకుండా జాగ్రత్త పడ్డారు. డివిజన్ కార్యాలయానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించేది ఒక్క ఈఈ మాత్రమేనని, అమలాపురం, పి.గన్నవరంలో సబ్‌డివిజన్ కార్యాలయ అధికారులే క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారని, ఇప్పుడు ఏకంగా డివిజన్ కార్యాలయాన్నే అక్కడికు మార్చడంలో మర్మం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగులు కనీసం ముందుగా తెలియజేయకుండా హడావుడిగా సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురం తరలించడానికి గురువారం ప్రారంభోత్సవం చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇరిగేషన్ ఉన్నతాధికారి వైఖరిపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విషయాన్ని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర స్థాయి నాయకుల సూచనల మేరకు అన్ని సంఘాలను కలుపుకొని ప్రత్యక్ష పోరాటానికి దిగేందుకు ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. సొంతం వద్దు.. అద్దె ముద్దు.. ధవళేశ్వరంలో సొంత భవనంలో ఉన్న సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురంలో అద్దె భవనంలోకి మార్చేందుకు అధికారులు మక్కువ చూపడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కనీసం అక్కడ పూర్తి స్థాయి సొంత భవనం కూడా లేకపోయినప్పటికీ హడావుడిగా వారం రోజుల్లో కార్యాలయం అమలాపురానికి వెళ్లిపోవాలని సూచిస్తున్న ఇరిగేషన్ ఉన్నతాధికారి అత్యుత్సాహంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆందోళన చేపడతాం.. మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బంది చేకూర్చే విధంగా డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి తరలిస్తే సహించేది లేదని వైఎస్సార్ సీసీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ అన్నారు. అమలాపురంలో సబ్ డివిజన్ కార్యాలయం ఉన్నప్పటికీ ఏకపక్షంగా ఈ కార్యాలయాన్ని తరలించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే కార్యాలయ తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అటు సెంట్రల్ డెల్టా రైతాంగానికి ఇటు మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి అందుబాటులో ఉండే ధవళేశ్వరంలోనే కార్యాలయాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులనే అమలు చేశా.. సెంట్రల్ డివిజన్ కార్యాలయం తరలింపు వ్యవహరంలో ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేశామని ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఇ రాంబాబు స్పష్టంచేశారు. ఈ ప్రతిపాదన గతంలో ఉన్నదేనని ఇందులో ఎవరి ఒత్తిడి లేదన్నారు. -
కొవ్వూరు డీఎస్పీపై వేటు?
సాక్షి ప్రతినిధి, ఏలూరు, కొవ్వూరు : కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావుపై వేటు పడింది. ఆయనను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని మౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయనకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో బదిలీ అవకాశం లేకపోవడంతో డీఎస్పీని డీజీపి కార్యాలయానికి రిపోర్టు చేయాలని సూచనలు అందినట్టుగా చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో డీఎస్పీని మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేతో ఉన్న విభేదాలు, డీఎస్పీ ఉంటే తమ అరాచకాలు సాగవని భావించిన ఇసుక మాఫియా కలిసి డీఎస్పీని సాగనంపినట్టు ప్రచారం జరుగుతోంది. గత ఏడాది టీడీపీ కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ హత్యకు గురైన సమయంలో స్థానిక ఎమ్మెల్యే కేఎస్ జవహర్ డీఎస్పీపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. పోలీసు వైఫల్యం కారణం గానే కౌన్సిలర్ హత్యకు గురైనట్టు వ్యాఖ్యానించారు. ప్రాణహాని ఉందని చెప్పినా కౌన్సిలర్‌కు రక్షణ కల్పించలేకపోయారని ఎమ్మెల్యే అప్పట్లో ఆరోపించారు. దీనిపై డీఎస్పీ సమాధానం ఇస్తూ కౌన్సిలర్ ప్రాణహాని ఉందని తనను ఎప్పుడు కలవలేదని, కనీసం ఫిర్యాదు చేయలేదని, అలా తప్పుగా మాట్లాడవద్దని డీఎస్పీ గట్టిగానే బదులిచ్చారు. అవసరమైతే తన కార్యాలయంలో సీసీ పుటేజ్‌లు చూపిస్తానని ఎమ్మెల్యేకు బదులిచ్చారు. ఈ విషయాన్ని అప్పట్లో తెలుగుదేశం నాయకులు రాద్ధాంతం చేయడంతో పాటు డీఎస్పీ వాహనానికి అడ్డువెళ్లి ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలో టీడీపీ పేకాట క్లబ్‌కు అనుమతి ఇవ్వాలని కోరితే డీఎస్పీ నిరాకరించినట్టు చెబుతున్నారు. దీంతో అప్పటి నుంచి డీఎస్పీపై గురిపెట్టారు. మునిసిపల్ స్ధలంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయం విషయంలో కూడా డీఎస్పీని టార్గెట్ చేసినట్టు సమాచారం. ఏడాది కాలం నుంచి దాతల సహాకారంతో ఈ భవన నిర్మాణం పూర్తి చేశారు. ఏడాది కాలం నుంచి పురపాలక సంఘం నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారన్న వాదనను తెరపైకి తెచ్చినట్టు సమాచారం. ఇసుక మాఫియాకు సహకరించనందుకే..! ఇసుక మాఫియాకు సహకరించడంలేదన్న అక్కసుతో కొందరు టీడీపీ నేతలు డీఎస్పీపై కక్ష పెంచుకున్నారు. ఎమ్మెల్యేలపై స్థానిక నాయకుల వత్తిళ్లు పెరగడంతో డీఎస్పీని టార్గెట్ చేశారు. కొందరు ఎమ్మెల్యేలకు ఇసుక మాఫియా వ్యవహారం ఆదాయవనరుగా మారడంతో డీఎస్పీ బదిలీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగానే గతంలో నదీతీరంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు డీఎస్పీని బదిలీ చేయించాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రిని, పోలీసు ఉన్నతాధికారులను కోరినట్టు సమాచారం. ఇటీవలకాలంలో మళ్లీ గోదావరి డైరెక్ట్ ర్యాంపుల ఏర్పాటు రంగం చేసుకుంటున్నారు. ర్యాంపుల ఏర్పాటుకు నాయకులు వత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఇసుక మాఫియా అగడాలకు అడ్డుగా ఉన్న డీఎస్పీ బదిలీకి చినబాబుపై తెచ్చిన వత్తిడితో ఈ ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు నోరుమెదపడం లేదు. -
'బడ్జెట్' తేదీలను మార్చడం అవసరమా?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సాధారణ బడ్జెట్‌ను వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల విజ్ఞప్తులను త్రోసిపుచ్చి ముందుగా నిర్ణయించినట్లు ఫిబ్రవరి ఒకటవ తేదీనే బడ్జెట్ ప్రవేశపెడతామని కేంద్రం ప్రకటించింది. అసలు ఏప్రిల్-మార్చి ఆర్థిక సంవత్సరాన్ని క్యాలెండర్ ఇయర్ కింద జనవరి-డిసెంబర్ సంవత్సరానికి ఎందుకు మార్చాల్సి వచ్చింది. మార్చిలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టాలని కేంద్రం ఎందుకు భావిస్తోంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటీ? న్యూఢిల్లీ: బ్రిటీష్ పరిపాలనా కాలం నుంచి, అంటే 1867 నుంచి భారత ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్-మార్చిగానే పరిగణిస్తూ వస్తున్నారు. అంతకుముందు మే-ఏప్రిల్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించేవారు. భారత ఆర్థిక సంవత్సరాన్ని మార్చే అంశాన్ని పరిశీలించి అవసరమైన సిఫార్సులు చేయడం కోసం కేంద్ర ఆర్థిక శాఖ గత జూలై నెలలో మాజీ ఆర్థిక సలహాదారు శంకర్ ఆచార్య చైర్మన్‌గా ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకే భారత ఆర్థిక సంవత్సరాన్ని జనవరి-డిసెంబర్‌కు మారుస్తూ ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. 150 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న ఏప్రిల్-మార్చి ఆర్థిక సంవత్సరాన్ని మార్చేందుకు ప్రయత్నం జరగడం ఇదేమి మొదటిసారి కాదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎల్కే లోధా చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ 1984లో మొదటిసారిగా ఆర్థిక సంవత్సరాన్ని మార్చి దానికి అనుగుణంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 1979-–80, 1982-83 సంవత్సరాల్లో దేశంలో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో మున్ముందు కరవు పరిస్థితులను పటిష్టంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరపాలన్న ప్రతిపాదన వచ్చింది. దేశంలో 2014, 2015 సంవత్సరాల్లో వరుసగా వర్షపాతం తక్కువగా నమోదైన నేపథ్యంలో నేటి ప్రభుత్వం కూడా ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరపాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చింది. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశమవడం వల్ల భారత్‌లో రుతుపవనాలను, పంటల ఉత్పత్తులను బడ్జెట్ రూపకల్పనలో ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఖరీఫ్ పంట కింద వరి, పప్పు దినుసులు పండిస్తారు. అదే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలపై ఆధారపడి గోధుమ లాంటి రబీ పంటలను పండిస్తారు. నైరుతి రుతుపవనాల కింద ప్రతి ఏటా అంతో ఇంతో వర్షాలు కురుస్తాయి. ఈశాన్య రుతుపవనాల కింద ఆ గ్యారెంటీ లేదు. అందుకని రబీ పరిస్థితులను ముందుగా అంచనావేసి అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులను జరిపేందుకు వీలుగా ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరపాలని నాటి లోధా కమిటీ సూచించింది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాల ప్రకారం భారత ఆర్థిక గణాంకాలను జనవరి-డిసెంబర్ సంవత్సరానికే సమర్పించాల్సి వస్తోందని, అందుకోసం బడ్జెట్ ప్రతిపాదనలపై పునర్ కసరత్తు చేయాల్సి వస్తోందని కూడా నాడు లోధా కమిటీ పేర్కొంది. అందుకోసమైనా సరే ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరపాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పింది. ప్రయోజనాలు తక్కువ, అవాంతరాలు ఎక్కువ ఉన్నాయని, పైగా ఆర్థిక సంవత్సరాన్ని మార్చేందుకు పలు చట్ట సవరణలు తీసుకరావాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో నాటి కేంద్ర ప్రభుత్వం లోధా సిఫార్సులను పక్కన పడేసింది. ప్రపంచవ్యాప్తంగా స్వతంత్య్ర ఆర్థిక వ్యవస్థలు కలిగిన 227 దేశాల్లో 156 దేశాలు జనవరి-డిసెంబర్ క్యాలెండర్ ఇయర్‌నే ఆర్థిక సంవత్సరంగా పాటిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కూడా క్యాలెండర్ ఇయరే మంచిదంటున్న ఆర్థిక నిపుణులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలనుకుంటుందో, ఐదు రాష్ట్రాల ఎన్నికల రూపంలో కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుందో, బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తేగానీ తెలియదు.