
జమ్ము: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే అక్కడి పార్టీ నాయకత్వం విషయంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిని మార్చింది. జమ్ముకశ్మీర్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా సత్‌శర్మను నియమించింది. ఇప్పటివరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన రవీందర్‌రైనాను పార్టీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు.
ఈ మేరకు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్‌సింగ్ దివారం(నవంబర్ 3)ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.సత్‌శర్మను సెప్టెంబర్‌లోనే రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెండు నెలల్లోనే అధ్యకక్షుడిని చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: 10 రోజుల్లో యోగి రాజీనామా చేయకుంటే..