Producer Is Change To Prabhas Maruthi Raja Deluxe Movie - Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్‌ సినిమాకు నిర్మాత మారనున్నాడా?

Published Tue, Aug 16 2022 7:56 PM | Last Updated on Tue, Aug 16 2022 8:53 PM

Producer Is Change To Prabhas Maruthi Raja Deluxe Movie - Sakshi

Producer Is Change To Prabhas Maruthi Raja Deluxe Movie: 'బాహుబలి'తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్‌. అప్పటి నుంచి ప్రభాస్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ప్రభాస్‌ డేట్లు దొరికితే చాలు అని అనుకుంటున్నారు నిర్మాతలు. అలాంటి ప్రభాస్‌తో సినిమా అంటే వద్దనుకుంటున్నాడట ఓ నిర్మాత. కొన్నేళ్ల క్రితం ఓ సినిమా కోసం ‍అడ్వాన్స్‌ ఇచ్చిన నిర్మాత ప్రస్తుతం ఆ డబ్బు ఇస్తే చాలు, సినిమా అవసరం లేదని భావిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. 

అయితే ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో 'రాజా డీలక్స్‌' అనే సినిమా రానున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలసిందే. ఈ సినిమా గురించి ఎక్కడా కన్ఫర్మ్‌గా చెప్పలేదు కానీ, కథ, హీరోయిన్లు, చిత్రం కోసం సెట్‌ వంటి తదితర పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు నిర్మాత మారే అవకాశం ఉందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను నిర్మిద్దామనుకున్న నిర్మాత డీవీవీ దానయ్య రెమ్యునరేషన్‌ కింద ప్రభాస్‌కు రూ. 50 కోట్లు ఇచ్చారని ఆ మధ్య టాక్‌ నడిచింది. అందుకు తగినట్లుగానే మారుతి బృందం పని చేసినట్లు సమాచారం. 

చదవండి: Hyderabad AMB థియేటర్‌లో దళపతి విజయ్‌.. ఏ సినిమా చూశారంటే?
నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ

అయితే ఆ మూవీ ఎప్పటికీ సెట్స్‌పైకి వెళ్లకపోయేసరికి, మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న క్లారిటీ లేకపోవడంతో డీవీవీ దానయ్య వెనక్కి తగ్గుతున్నారని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఎవరైనా నిర్మాత ముందుకొస్తే ఆ రెమ్యునరేషన్‌ డబ్బు తీసుకుని ప్రభాస్ డేట్స్‌ను ఇచ్చేందుకు ఫిక్స్‌ అయ్యారను భోగట్టా. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది క్లారిటీ లేదు. కాగా  ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం. 

చదవండి: రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్‌ ! సిల్క్‌ స్మితగా విద్యా బాలన్ డౌటే ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement