దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ను ఇకపై ‘భారత్ మండపం’గా పిలువనున్నారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) ఈ కాంప్లెక్స్‌కు ‘భారత్ మండపం’ అనే పేరు పెట్టింది. ‘భారత్ మండపం’ పేరుతో జీ-20 శిఖరాగ్ర సమావేశం గతంలో ఇక్కడ జరిగింది. దీనిని అంతర్జాతీయ ప్రదర్శనలు, సమావేశాలకు కేంద్రంగా వ్యవహరిస్తున్నారు.
ప్రగతి మైదాన్‌ను ‘భారత్ మండపం’ అని పేర్కొంటూ ఐటీపీఓ తన వెబ్‌సైట్‌లోనే కాకుండా ప్రవేశ ద్వారాల వద్ద కూడా ఈ రాయించింది. 1972లో స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రదేశానికి ప్రగతి మైదాన్ అని నామకరణం చేశారు. అదే సంవత్సరం ఇందిరా గాంధీ ప్రారంభించిన ఆసియా- 72 ప్రదర్శన ఇక్కడ జరిగింది. అప్పటి నుండి ప్రగతి మైదాన్ జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా మారింది.
ఐటీపీఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రగతి మైదాన్ క్యాంపస్‌కు భారత్ మండపం అని నామకరణం చేశామన్నారు. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్. మరొకటి వివిధ ఎగ్జిబిషన్ హాల్స్. ఈ పేరు మార్పు 38వ అంతర్జాతీయ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ ఆహార్-2024తో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలు, ఆహ్వాన పత్రికలు, టిక్కెట్లు, పాస్‌లు ఇలా ప్రతిదానిలో ప్రగతి మైదాన్ అని కాకుండా భారత్ మండపం అని ముద్రించారు.
Comments
Please login to add a commentAdd a comment