‘భారత్‌ మండపం’ పరిస్థితి ఏమిటి? ఎవరైనా బుక్‌ చేసుకోవచ్చా? | Bharat Mandapam Can Book for Corporate and Govt Events | Sakshi
Sakshi News home page

‘భారత్‌ మండపం’ పరిస్థితి ఏమిటి? ఎవరైనా బుక్‌ చేసుకోవచ్చా?

Published Tue, Sep 12 2023 1:39 PM | Last Updated on Tue, Sep 12 2023 1:58 PM

Bharat Mandapam Can Book for Corporate and Govt Events - Sakshi

ఇటీవలే రాజధాని ఢిల్లీలో జీ-20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ నేపధ్యంలో ఢిల్లీని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ జీ-20 శిఖరాగ్ర సదస్సు  ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. దీనికి ‘భారత్ మండపం’ అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ భారత్ మండపాన్ని భవిష్యత్‌లో ఎందుకు వినియోగించనున్నారు?

గత కొన్నేళ్లుగా వాణిజ్య ఉత్సవాలను ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తున్నారు. ఇలీవలి కాలంలో ప్రగతి మైదాన్‌ రూపాన్ని మార్చారు. జీ-20 సదస్సు కోసం ఇక్కడ అనేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడి కన్వెన్షన్ సెంటర్‌కు గ్రాండ్‌ లుక్‌ను అందించడంతోపాటు పలు నూతన భవనాలు నిర్మించారు. ప్రస్తుతం ‘భారత్ మండపం’ ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది.

జీ-20 సదస్సు తర్వాత ‘భారత్ మండపం’ అనేక ప్రపంచ స్థాయి ఈవెంట్‌లకు వేదికగా మారనుంది. గతంలో దీనిని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ అని పిలిచేవారు. ఇదే ఇప్పుడు ‘భారత్ మండపం’గా మారింది. ఇకపై ఇక్కడ  పెద్ద కార్పొరేట్ కంపెనీల ఈవెంట్లు, పుస్తక ప్రదర్శనలు జరగనున్నాయి. ఇంతే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించనున్నారు. అయితే ప్రయివేటు సంస్థల మాదిరిగానే ప్రభుత్వం కూడా తగిన రుసుము చెల్లించి ‘భారత్ మండపం’ బుక్ చేసుకోవచ్చు.

‘భారత్ మండపం’ను ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ పర్యవేక్షించనుంది. ఈ సంస్థను సంప్రదించి ఈ కన్వెన్షన్ సెంటర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ అనేక ఆలయాలు కూడా నిర్మితమయ్యాయి. వేలాది మంది కూర్చొనేందుకు అనువైన ఏర్పాట్ల ఉన్నాయి. 5 వేలకు పైగా వాహనాలు పార్క్ చేసేందుకు అవకాశముంది. మీడియాకు తెలిసిన సమాచారం ప్రకారం ‘భారత్ మండపం’ రాబోయే మూడు నెలల వరకూ ప్రభుత్వ కార్యక్రమాల కోసం బుక్ చేశారు. 
ఇది కూడా చదవండి: ఆయన వాదిస్తే మరణశిక్ష కూడా యావజ్జీవం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement