Mandapam
-
మండపాలు వేదికగా నిరసనలు
నవరాత్రి ఉత్సవాలు అంటే.. బెంగాల్. బెంగాల్ అంటే నవరాత్రి ఉత్సవాలు. అలాంటిది ఈ సారి పండుగ దృశ్యం పూర్తిగా మారిపోయింది. కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తరువాత.. దుర్గామాత మండపాలు సైతం నిరసనలను ప్రతిబింబిస్తున్నాయి. సాధారణంగా బెంగాల్‌లోని దుర్గా పూజ మండపాల్లో దేవత నిలబడి ఉంటుంది. ఇరువైపులా వినాయకుడు, కార్తికేయుడు, దేవతలు లక్ష్మీ, సరస్వతులు ఉంటాయి. ఆమె పాదాల దగ్గర రాక్షసుడు ఉంటాడు. ఇంకొందరైతే మరికొంత విశాలంగా ఆలోచించి.. బుర్జ్ ఖలీఫా ప్రతీకనో, సుందర్బన్ అడవులనో ప్రతిబింబిస్తారు. ఇంకొందరు నీటి సంరక్షణ, ప్రపంచశాంతి వంటి సామాజిక సందేశాలను ప్రదర్శిస్తారు. కానీ ఈసారి ఇవేవీ జనాన్ని ఆకర్షించడం లేదు. చాలా మండపాలు నిరసన ప్రదర్శనలుగా మారాయి. వాటిని చూడటానికి కూడా జనం ఆసక్తి చూపుతున్నారు. కోల్‌కతాలోని కంకుర్గచ్చిలో పూజ ఇతివృత్తంగా లజ్జ(õÙమ్)ను ఎంచుకున్నారు. దుర్గాదేవి కళ్లు మూసుకుని ఉండగా.. తెల్లని షీటుతో చుట్టిన ఒక మహిళ శరీరంపై ఓ సింహం నిఘా పెట్టింది. పక్కనే బాధిత కుటుంబాన్ని ప్రదర్శించారు. మంచంపై కూర్చున్న తల్లి, కుట్టు మిషన్ దగ్గర కూర్చున్న తండ్రి, గోడపై కుమార్తె ఫొటో ఉన్నాయి. మహిళల ఆధ్వర్యంలో నడిచే ఓ మండపం థీమ్ వివక్ష. ఈ సంవత్సరం వారు దుర్గా పూజను పండుగ అని కాకుండా ప్రతిజ్ఞ అని పిలుస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని, అందులోని అధికరణలను నేపథ్యంగా తీసుకున్నారు. ఒక మహిళ న్యాయం చేయాలనే రెండు చేతులు పైకెత్తి శూన్యంలోకి సహాయం కోసం అరి్ధస్తోంది. ‘రాజ్యాంగం చెప్తున్నదేమిటి? వాస్తవానికి జరుగుతున్నదేమిటి?’అంటూ స్థానిక నటులు వీధి నాటకం ప్రదర్శిస్తున్నారు. మరోచోట దేవత శక్తిని.. నిరసనల్లోని కొవ్వొత్తిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేశారు. దక్షిణ కోల్‌కతాలోని బాఘా జతిన్ మండపం... దుర్గా మాతను మరింత భయానకంగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది వేడుకలు జరుపుకొనే ఉత్సాహం లేదని.. అందుకే డ్యాన్సులను రద్దు చేసుకున్నామని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రగతి మైదానం ఇకపై ‘భారత్ మండపం’
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ను ఇకపై ‘భారత్ మండపం’గా పిలువనున్నారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) ఈ కాంప్లెక్స్‌కు ‘భారత్ మండపం’ అనే పేరు పెట్టింది. ‘భారత్ మండపం’ పేరుతో జీ-20 శిఖరాగ్ర సమావేశం గతంలో ఇక్కడ జరిగింది. దీనిని అంతర్జాతీయ ప్రదర్శనలు, సమావేశాలకు కేంద్రంగా వ్యవహరిస్తున్నారు. ప్రగతి మైదాన్‌ను ‘భారత్ మండపం’ అని పేర్కొంటూ ఐటీపీఓ తన వెబ్సైట్లోనే కాకుండా ప్రవేశ ద్వారాల వద్ద కూడా ఈ రాయించింది. 1972లో స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రదేశానికి ప్రగతి మైదాన్ అని నామకరణం చేశారు. అదే సంవత్సరం ఇందిరా గాంధీ ప్రారంభించిన ఆసియా- 72 ప్రదర్శన ఇక్కడ జరిగింది. అప్పటి నుండి ప్రగతి మైదాన్ జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా మారింది. ఐటీపీఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రగతి మైదాన్ క్యాంపస్‌కు భారత్ మండపం అని నామకరణం చేశామన్నారు. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్. మరొకటి వివిధ ఎగ్జిబిషన్ హాల్స్. ఈ పేరు మార్పు 38వ అంతర్జాతీయ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ ఆహార్-2024తో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలు, ఆహ్వాన పత్రికలు, టిక్కెట్లు, పాస్‌లు ఇలా ప్రతిదానిలో ప్రగతి మైదాన్ అని కాకుండా భారత్ మండపం అని ముద్రించారు. -
అందుకే ఆర్కియాలజీ సంస్థకు లేఖ రాశాం: టీటీడీ ఈవో
సాక్షి, తిరుమల: అలిపిరి మండపాల పునఃనిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాదాల మండపం ఆర్కియాలజీ పరిధిలో లేదన్నారు. ఎప్పుడైనా కూలే పరిస్థితి ఉందని.. అందుకే ఆర్కియాలజీ సంస్థకు లేఖ రాశామని ఈవో పేర్కొన్నారు. అనేకమార్లు ఆర్కియాలజీ సంప్రదింపు చేసిన స్పందించలేదు. అలిపిరి పాదాల మండపం కూడా శిథిలావస్థలో ఉన్నా.. వాటిపై రాజకీయాలు చేస్తూ, భక్తులు ప్రాణాలతో ఆడుకుంటున్నారు. టీటీడీ వద్ద శిల్పకళా, ఆలయాల నిర్మాణం సంబంధించిన అన్ని వింగ్స్ ఉన్నాయని ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1 తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని ఈవో అన్నారు. 6,47,452 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 10 రోజుల్లో 40.20 కోట్ల ఆదాయం కానుకలుగా సమర్పించారు. గత ఏడాది రూ. 39.40 కోట్లు, 2022లో రూ.26.61 కోట్ల ఆదాయం వచ్చింది. 10 రోజుల్లో 35.60 లక్షల లడ్డూలు భక్తులకు అందించామని ఈవో వెల్లడించారు. -
క్యూఆర్ కోడ్ బందోబస్త్
సాక్షి, సిటీబ్యూరో: వినాయక నిమజ్జనానికి రాచకొండ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలోని చెరువులు, రూట్ మ్యాప్‌లను సిద్ధం చేసిన పోలీసులు.. సాంకేతిక వినియోగంపై దృష్టిసారించారు. ఈసారి గణేష్ బందోబస్తు ప్రక్రియను క్యూఆర్ కోడ్ ద్వారా పరిశీలించనున్నారు. దీని కోసం కమిషనరేట్ పరిధిలో దాదాపు 10 వేల వినాయక మండపాలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ఇచ్చారు. ఇందులో విగ్రహ ప్రతిష్టాపన తేదీ, నిమజ్జనం తేదీ, రూట్ మ్యాప్ వంటి వివరాన్నీ ఈ కోడ్‌లో భధ్రపరిచారు. నిమజ్జనానికి సిద్ధం చేసిన చెరువుల వద్ద ఏర్పాటు చేసిన 500 సీసీటీవీ కెమెరాల లొకేషన్స్‌ను జియో ట్యాగింగ్ చేశారు. వీటిని ఈ క్యూఆర్ కోడ్‌కు జత చేశారు. విశేషంగా ఈ క్యూఆర్ కోడ్‌లో ఏ వినాయక మండపం వద్ద ఏ తరహా వినాయకుడిని నిలబెట్టారు? ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇంకాఎన్ని ఉన్నాయనేవి రియల్ టైంలో తెలిసిపోతాయి. ఆకతాయిలపై షీ టీమ్స్ నిఘా.. సాధారణ ప్రయాణికులు, భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిమజ్జన ఏర్పాట్లు సాగేలా గట్టి చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకించి నిమజ్జనానికి వచ్చే మహిళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు. అలాగే ఆకతాయిలపై నిఘా పెట్టేందుకు 10 షీ టీమ్స్ బృందాలు మఫ్టీలో తిరుగుతుంటాయి. వీటితో పాటు రాచకొండలో ఉన్న 1.83 లక్షల సీసీటీవీ కెమెరాలతో శాంతి భద్రతల పరిస్థితులను పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణతో పాటు విశ్లేషిస్తున్నారు. కమిషనర్ డీఎస్ చౌహాన్ నిమజ్జన బందోబస్తుతో పాటు నిరంతరం మండపాల వద్ద తనిఖీలను చేస్తూ పరిస్థితులను తెలుసుకుంటున్నారు. -
‘భారత్ మండపం’ పరిస్థితి ఏమిటి? ఎవరైనా బుక్ చేసుకోవచ్చా?
ఇటీవలే రాజధాని ఢిల్లీలో జీ-20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ నేపధ్యంలో ఢిల్లీని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ జీ-20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. దీనికి ‘భారత్ మండపం’ అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ భారత్ మండపాన్ని భవిష్యత్‌లో ఎందుకు వినియోగించనున్నారు? గత కొన్నేళ్లుగా వాణిజ్య ఉత్సవాలను ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తున్నారు. ఇలీవలి కాలంలో ప్రగతి మైదాన్ రూపాన్ని మార్చారు. జీ-20 సదస్సు కోసం ఇక్కడ అనేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడి కన్వెన్షన్ సెంటర్‌కు గ్రాండ్ లుక్‌ను అందించడంతోపాటు పలు నూతన భవనాలు నిర్మించారు. ప్రస్తుతం ‘భారత్ మండపం’ ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. జీ-20 సదస్సు తర్వాత ‘భారత్ మండపం’ అనేక ప్రపంచ స్థాయి ఈవెంట్లకు వేదికగా మారనుంది. గతంలో దీనిని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ అని పిలిచేవారు. ఇదే ఇప్పుడు ‘భారత్ మండపం’గా మారింది. ఇకపై ఇక్కడ పెద్ద కార్పొరేట్ కంపెనీల ఈవెంట్లు, పుస్తక ప్రదర్శనలు జరగనున్నాయి. ఇంతే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించనున్నారు. అయితే ప్రయివేటు సంస్థల మాదిరిగానే ప్రభుత్వం కూడా తగిన రుసుము చెల్లించి ‘భారత్ మండపం’ బుక్ చేసుకోవచ్చు. ‘భారత్ మండపం’ను ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ పర్యవేక్షించనుంది. ఈ సంస్థను సంప్రదించి ఈ కన్వెన్షన్ సెంటర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ అనేక ఆలయాలు కూడా నిర్మితమయ్యాయి. వేలాది మంది కూర్చొనేందుకు అనువైన ఏర్పాట్ల ఉన్నాయి. 5 వేలకు పైగా వాహనాలు పార్క్ చేసేందుకు అవకాశముంది. మీడియాకు తెలిసిన సమాచారం ప్రకారం ‘భారత్ మండపం’ రాబోయే మూడు నెలల వరకూ ప్రభుత్వ కార్యక్రమాల కోసం బుక్ చేశారు. ఇది కూడా చదవండి: ఆయన వాదిస్తే మరణశిక్ష కూడా యావజ్జీవం! -
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను– సంతోష్ శోభన్
‘‘వందేళ్ల ఇండియన్ సినిమాల్లో ఎన్నో పాత్రలు, ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకూ చెప్పని కథ, ఎవరూ చేయని పాత్రను ఎలివేట్ చేయటం అనేది ఓ ఆర్టిస్ట్‌కి కొత్తగా ఉంటుంది. అలా పెళ్లి మండపంపై మిగిలిపోయేవాడి కథే ‘ప్రేమ్ కుమార్’’ అని హీరో సంతోష్ శోభన్ అన్నారు. సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచితా సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’.అభిషేక్ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘అభిషేక్ కొన్ని సినిమాల్లో నటుడిగా చేశాడు. దర్శకుడు కావాలనుకున్నప్పుడు ‘ప్రేమ్ కుమార్’ కథ రాసుకుని, చక్కగా తీశాడు. వరుసగా వరుడు, పెళ్లి వంటి సినిమాలు చేస్తున్నాను. అయితే నిజ జీవితంలో నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను (నవ్వుతూ). నేనిప్పటి వరకు మంచి డైరెక్టర్స్‌తో సినిమాలు చేశాను. అయితే నేను చేసిన సినిమాలన్నీ కరెక్ట్‌గానే ఎంచుకున్నానా? అంటే లేదనే అంటాను. ‘ప్రేమ్ కుమార్’ నాకు సరైన హిట్ ఇస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. -
గోవిందనామ స్మరణలతో మారుమోగిన పాదాల మండపం (ఫొటోలు)
-
యాదగిరీశుడికి మహాప్రాకార మండపం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణం తాలూకు ప్రత్యేకతల పరంపరకు మరో ఆకర్షణ తోడవనుంది. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో కీలకమైన ప్రధాన ప్రాకార మండపం కొత్త రికార్డు నెలకొల్పనుంది. ఇటీవలి కాలంలో ఏ కొత్త నిర్మాణంలోనూ లేని తరహాలో ఈ మండపం ఏకంగా 36 అడుగుల ఎత్తుతో నిర్మితమవుతోంది. దీని పైకప్పును గురువారం నిర్మించనున్నారు. ఉదయం నుంచి రాత్రి కల్లా కాంక్రీట్‌తో ఈ నిర్మాణం జరగనుంది. అంతెత్తుతో ఉండే ప్రాకార మండపం వైశాల్యం కూడా 25 వేల చదరపు అడుగుల్లో భారీగా ఉండనుంది. భక్తులు భారీగా పోటెత్తినా ఇబ్బంది లేని రీతిలో నిర్మాణం ఉంటుంది. పెద్ద పెద్ద పురాతన మందిరాల్లో ప్రాకార మండపం రాతితో చాలా ఎత్తుతో కనిపిస్తుంటుంది. వీటి స్తంభాల తాలూకు శిల్ప శోభ కూడా ఆకట్టుకుంటుంది. కొత్త దేవాలయాల్లో కాంక్రీట్‌తో నిర్మిస్తున్న ప్రాకార మండపాలు మామూలు ఎత్తులోనే ఉంటున్నాయి. యాదాద్రిలో గత మండపం కూడా సాధారణంగానే ఉంది. ఇప్పుడు మొత్తం దేవాలయ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నందున మండపాన్ని పురాతన పెద్ద దేవాలయాల తరహాలో భారీగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 36 అడుగుల ఎత్తుండే సెంట్రింగ్ రాడ్లు దొరక్కపోవడంతో వాటిని ప్రత్యేకంగా తయారు చేయటం విశేషం! స్తంభాలూ ప్రత్యేకమే విశాలంగా ఉండే మండపంలో స్తంభాలు కూడా అంతే ప్రత్యేకంగా సిద్ధమయ్యాయి. 12 మంది ఆళ్వార్ల రూపంలో వీటిని సిద్ధం చేశారు. వీటి ఎత్తు 12 అడుగులుంటుంది. వీటిపై కాకతీయ స్తంభాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రత్యేకంగా ఆధార పీఠాలూ రూపొందించారు. పురాతన దేవాలయాల్లో కప్పు కూడా రాతితో నిర్మించడం ఆనవాయితీ ఇక్కడ మాత్రం కాంక్రీట్‌తోనే నిర్మిస్తున్నారు. చుట్టు గోడలు మాత్రం రాతితో నిర్మిస్తారు. ఆలయానికి నాలుగు వైపులా నిర్మించే మాడ వీధులు దీనికి అనుసంధానమై ఉంటాయి. ప్రధాన మూల విరాట్టు కొలువుదీరే గర్భాలయ నిర్మాణం దాదాపు పూర్తయింది. దాని కప్పు గతంలోనే నిర్మించారు. దానిపై గోపుర నిర్మాణానికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరా నాటికి మిగతా పనులు కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దసరా తర్వాత బాలాలయంలోని ఉత్సవ మూర్తులను ప్రధానాలయంలో ప్రతిష్టించనున్నారు. -
ఏకశిల వినాయక మండపం
ఆళ్లగడ్డ: పట్టణంలో శిల్పకళాకారులు తయారు చేసిన ఏకశిల వినాయక మండపం ఆకట్టుకుంటోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు..వినాయక చవితికి ప్రతిష్టించుకునేలా ఒకే రాతి మండపం..అందులో వినాయక విగ్రహం తయారుచేసి ఇవ్వాలని శిల్పకళా సమితి సభ్యులను సంప్రదించారు. దీంతో శిల్పి జాఫర్ సుమారుగా ఏడాది పాటు కష్టపడి ఈ మండపాన్ని తయారు చేశారు. మండపం 11. 6 అడుగల ఎత్తు, 8 టన్నుల బరువు ఉందని జాఫర్ తెలిపారు. వినయక చవితి రోజు ప్రతిష్టించుకునేందుకు శనివారం ప్రత్యేక వాహనంలో దీనిని తెలంగాణ ప్రాంతానికి తీసుకెళ్లారు. -
వ్రతభ్రమణం
‘నీ మొక్కు ఏది అంటే తల చుట్టూ తిప్పి చూపించి నట్టు’గా ఉంది అన్నవరం దేవస్థానం అధికారుల నిర్వాకం. పశ్చిమ రాజగోపురం వద్ద ఉన్న వ్రతాల కౌంటర్లో టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు, వ్రత మండపాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వ్రతాల కౌంటర్ ఎదురుగా పెద్ద గేటు ఉంది. భక్తుల రద్దీ తీవ్రంగా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు ఆ గేటు తీయకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. – అన్నవరం సత్తెన్న వ్రతాల భక్తులకు తప్పని ప్రదక్షిణలు పశ్చిమ రాజగోపురం వద్ద మూసి ఉంటున్న వ్రత మండపం గేటు రద్దీ రోజుల్లో అయినా తెరిపించాలనే డిమాండ్ దేవస్థానానికి వాహనాల్లో వచ్చే భక్తులతో పాటు సత్రాల్లో బస చేసే వారు పశ్చిమ రాజగోపురం వద్ద ఆగుతారు. పశ్చిమ రాజగోపురం లోపల వ్రతాలు, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక దర్శనానికి రూ.వంద టిక్కెట్లు కూడా ఆ కౌంటర్లో విక్రయిస్తున్నారు. రూ.150, రూ.300 వ్రతాల టిక్కెట్లు కొనుగోలు చేసేవారు కౌంటర్ పక్కనున్న ఆయా వ్రతమండపాల్లో వ్రతాలాచరిస్తున్నారు. రూ.700, రూ. 1,500, రూ.2,000 వ్రతాల టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఎండైనా, వానైనా ఆలయం చుట్టూ తిరిగి తూర్పు రాజగోపురం ముందుకు వచ్చి, క్యూలో నిలబడి వ్రత మండపాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వ్రతాల కౌంటర్‌కు ఎదురుగా పెద్ద గేటు ద్వారా ఆయా వ్రతాల టిక్కెట్లు తీసుకున్న వారు వారి మండపాల్లోకి సులభంగా చేరుకోవచ్చు. కానీ ఆ గేటు నిత్యం మూసే ఉంటోంది. గతంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గేటు ద్వారానేవ్రతమండపాల్లోకి అనుమతించేవారు. స్వామి దర్శనం చేయిస్తామని ప్రైవేట్ గైడ్లు ఈ గేటు ద్వారా భక్తులను తీసుకొచ్చి, మోసం చేస్తున్నారన్న ఆరోపణలతో ఇందులో ఎవరినీ అనుమతించడం లేదని అధికారులు అంటున్నారు. మధ్యాహ్నం 12 దాటితే.. కాగా, మధ్యాహ్నం వచ్చే భక్తులకు మరో ఇబ్బంది కూడా ఉంది. 12 దాటితే కౌంటర్లో వ్రతాల టిక్కెట్లు అమ్మడం లేదు. సాయంత్రం వరకూ మాత్రం రూ.వంద ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విక్రయిస్తున్నారు. పర్వదినాల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నపుడైనా ఈ గేటు తీస్తే భక్తులకు సౌలభ్యంగా ఉంటోంది. ఈ మార్గంలో గైడ్లను అనుమతించవద్దని సెక్యూరిటీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. -
శ్రీశైలంలో బయటపడ్డ పురాతన మండపం
శ్రీశైలం: ఆంధ్ర, తెలంగాణా ప్రజల తాగునీటి అవసరాల కోసం రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలం జలాశయం జలాశయంలో మునిగి ఉన్న మండపం పూర్తిస్థాయిలో బయటపడింది. ఈ మండపాన్ని క్రీ.శ. 1393-96 మధ్య కాలంలో విఠలాంబ నిర్మించినట్లు చారిత్రక అధారాలు ఉన్నాయి. ఒకప్పుడు పాతాళగంగలో భక్తులు స్నానాలాచరించడానికి వీలుగా మెట్ల మార్గాన్ని విఠలాంబా నిర్మించిందని, అలాగే పాతమెట్ల మార్గాన్ని రెడ్డిరాజులు నిర్మించారని... ఎంతో లోతైన ప్రదేశం కావడం వల్ల మార్గమధ్యంలో విశ్రమించడానికి వీలుగా ఈ మండపాలను నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. సుమారు 20 ఏళ్ల తరువాత మండపం పూర్తిస్థాయిలో బయటపడింది. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 780 అడుగులకు చేరుకుంది. -
వినాయక మండపం వద్ద ఘర్షణ
హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. బోజగుట్టలోని వివేకానందనగర్ లో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద శనివారం రాత్రి అన్నదాన కార్యక్రమం జరిగింది. అర్ధరాత్రి దాటాక ఈ ప్రాంతంలోని ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. రెండు వర్గాలకు చెందిన వారు ఆసిఫ్‌నగర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి వెనక శుక్రవారం సాయంత్రం మండపం ముందు నుంచి వెళ్తున్న ఇద్దరు యువతులను దూషించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. -
శ్రీకాళహస్తిలో భయం.. భయం..
శ్రీకాళహస్తిలోని అష్టోత్తర లింగ మండపంలో మండపం స్తంభం శుక్రవారం రాత్రి ఒకవైపు ఒరిగిపోయింది. దాంతో భక్తులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. మండపం ఏ క్షణమైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. రాళ్లు కూడా కింద పడటంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ మండపానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఈ మండపం కిందనుంచే క్యూలైన్ల ద్వారా భక్తులు ప్రధాన ఆలయానికి వెళ్తుంటారు. దీనికి మరమ్మతులు చేస్తున్నామని, ఎలాంటి ప్రమాదం ఉండబోదని అధికారులు అంటున్నారు. అయితే, ప్రముఖ వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో ఇంతకుముందు గాలిగోపురం కూలిపోయింది. దానికి ముందు కూడా అధికారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే చెప్పారు. కానీ అది కాస్తా కూలిపోయింది. అప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి కూడా చాలా సమయం పట్టింది. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కట్టించిన గాలిగోపురం అప్పట్లో కూలిపోయింది. ఇప్పుడు అష్టోత్తర లింగ మండపం కూడా కూలిపోయే స్థితిలోనే ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. -
కూలిపోవడానికి సిద్ధంగా కాళహస్తి మండపం
-
కొలువు మండపం కూల్చివేతకు శ్రీకారం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయానికి ఆగ్నేయ దిశలో ఉన్న పురాతన కొలువు మండపం కూల్చివేసే పనులు బుధవారం ప్రారంభించారు. ఈ మండపానికి వంద మీటర్ల దూరంలో కొత్తగా ఇదే మండపాన్ని పునర్నిర్మించే పనులు యథావిధిగా సాగుతున్నాయి. ఆలయం వద్ద ఉన్న కొలువు మండపంలో రోజూ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి కొన్ని దశాబ్దాలుగా సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహిస్తున్నారు. 2003లో మాస్టర్‌ప్లాన్ కింద వేయికాళ్ల మండపంతోపాటు దీనిని తొలగించాలని నిర్ణయించినా అప్పట్లో వీలు కాలేదు. దక్షిణమాడ వీధి విస్తరణలో భాగంగా దీనిని తప్పకుండా తొలగించాలని ఇటీవల టీటీడీ అధికారులు భావిం చారు. ఆమేరకు మండపంలోని వస్తువులు, పరికరాలను ఇప్పటికే తొలగించారు. మండపం కూల్చివేత పనులు బుధవారం పూర్తిస్థాయిలో చేపట్టారు. ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం వేళలో నిర్వహించే సహస్రదీపాలంకరణ సేవను వాహన మండపం పక్కనున్న వైభవోత్సవ మండపంలోకి మార్పు చేశారు.