శ్రీశైలంలో బయటపడ్డ పురాతన మండపం | due to the low water levels old mandapa construction appeared in patala ganga srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో బయటపడ్డ పురాతన మండపం

Published Thu, May 12 2016 10:10 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

శ్రీశైలంలో బయటపడ్డ పురాతన మండపం - Sakshi

శ్రీశైలంలో బయటపడ్డ పురాతన మండపం

శ్రీశైలం: ఆంధ్ర, తెలంగాణా ప్రజల తాగునీటి అవసరాల కోసం రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలం జలాశయం జలాశయంలో మునిగి ఉన్న మండపం పూర్తిస్థాయిలో బయటపడింది. ఈ మండపాన్ని క్రీ.శ. 1393-96 మధ్య కాలంలో విఠలాంబ నిర్మించినట్లు చారిత్రక అధారాలు ఉన్నాయి.

ఒకప్పుడు పాతాళగంగలో భక్తులు స్నానాలాచరించడానికి వీలుగా మెట్ల మార్గాన్ని విఠలాంబా నిర్మించిందని, అలాగే పాతమెట్ల మార్గాన్ని రెడ్డిరాజులు నిర్మించారని... ఎంతో లోతైన ప్రదేశం కావడం వల్ల మార్గమధ్యంలో విశ్రమించడానికి వీలుగా ఈ మండపాలను నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. సుమారు 20 ఏళ్ల తరువాత మండపం పూర్తిస్థాయిలో బయటపడింది. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 780 అడుగులకు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement