pragati maidan
-
దేశంలో వరుస ఘటనలు.. ప్రకృతి పరంగా కొన్ని.. ప్రమాదాలు మరికొన్ని
ఇటీవల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు వంటి ఊహించని ప్రమాదాలు కొన్ని అయితే, మానవ తప్పిదాలతో జరిగే ఘటనలు మరికొన్ని.. మధ్యకాలంలో గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అత్యంత తీవ్రతతో ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిలో ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినవి కూడా ఉన్నాయి. వరుస ఘటనలతో ఎటునుంచి ఏ ప్రమాదం పొంచి వస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఢిల్లీ ప్రగతి మైదానం సొరంగంలో పగుళ్లుసెంట్రల్ ఢిల్లీని నగర తూర్పు ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ.. రూ. 777 కోట్లతో ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్‌ను కేంద్రం చేపట్టింది.. ఇందులో భాగంగా 1.3 కి.మీ. పొడవైన సొరంగం, ఐదు అండర్‌పాస్‌లు నిర్మించారు. 2022 జూన్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ టన్నెల్లో నీళ్లు నిలిచిపోవడం, పగుళ్లు రావడం వంటి అనేక లోపాలు వెలుగుచూశాయి. పనుల్లో జాప్యం, నిర్వహణ లేమీ కారణంగా సమస్యలు తలెత్తాయి. అనంతం మళ్లీ కోట్ల రూపాయలతతో డిజైన్‌ను సరిదిద్ది, మరమ్మతులు చేశారు.జలమయంగా మారిన అయోధ్యఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో వర్ష బీభత్సం కారణంగా రోడ్లపై మోకాళ్ల వరకు నీరు నిలిచిపోయింది. రామమందీర్ సమీపంలోని ఇళ్లలోకి మురుగునీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామమందిరం చుట్టూ హడావిడిగా నిర్మాణ పనులు చేపట్టడంతోనే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని స్థానికులు అంటున్నారు.మరోవైపు ధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకొని సరిగ్గా ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే.. ప్రధాన గర్భాలయంలో నీరు లీకవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. చిన్నపాటి వర్షానికే ఆలయం నుంచి నీరు కారుతోందని ఆలయ ప్రధాన ఆర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. రామ్‌లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం, వీఐపీ దర్శనం కోసం భక్తులు వచ్చే ప్రదేశం వరకూ పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోందన్నారు.ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయం పైకప్పు లీక్ అవడం ఆశ్చర్యంగా ఉందని, ఇలా ఎందుకు జరిగిందని విస్మయం వ్యక్త ంచేశారు. ఇంత పెద్ద ఇంజనీర్ల సమక్షంలోనే ఇలాంటి ఘటన జరగడం చాలా పొరపాటుగా పేర్కొన్నారు.అయితే గర్భగుడి నుంచి వర్షపు నీరు లీకవుతోందన్న వార్తలపై రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆరోపణలను తోసిపుచ్చారు. పైకప్పు లీక్ కాలేదని, విద్యుత్ తీగల కోసం అమర్చిన పైపుల ద్వారా నీరు కిందకు వచ్చిందని వివరించారు. జబల్పూర్ ఎయిర్ పోర్టు ప్రమాదంమధ్యప్రదేశ్లోని జబల్పూర్ దుమ్నా ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలు కారణంగా టెర్మినల్ రూఫ్‌టాప్ పడిపోయింది. పార్కు చేసిన కారు మీద పడడంతో నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి కొద్ది సేపటి క్రితమే కారులోంచి ఆదాయపు పన్ను అధికారి, డ్రైవర్ కిందకి దిగారు. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.ఇక ఈ విమానాశ్రాయాన్ని కొన్ని నెలల క్రితమే రూ.450 కోట్ల వ్యయంతో పునరుద్ధరించారు. కానీ గురువారం కురిసిన వర్షానికి అతలాకుతలం అయింది. దీంతో నాణ్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో కూలిన రూఫ్ఈ ఘటన జరిగిన ఒక్క రోజుకే ఢిల్లీలోని విమానాశ్రయంలోని టెర్మినల్-1లో పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ఘటనాస్థలానికి చేరుకున్న పొలిసు బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి. టెర్మినల్ 1లో ప్రమాదం జరగడంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అయితే ఎయిర్ పోర్టును నిర్మించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. నాసిరకం మెటీరియల్‌తో ఎయిర్ పోర్టును నిర్మించిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్రగతి మైదానం ఇకపై ‘భారత్ మండపం’
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ను ఇకపై ‘భారత్ మండపం’గా పిలువనున్నారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) ఈ కాంప్లెక్స్‌కు ‘భారత్ మండపం’ అనే పేరు పెట్టింది. ‘భారత్ మండపం’ పేరుతో జీ-20 శిఖరాగ్ర సమావేశం గతంలో ఇక్కడ జరిగింది. దీనిని అంతర్జాతీయ ప్రదర్శనలు, సమావేశాలకు కేంద్రంగా వ్యవహరిస్తున్నారు. ప్రగతి మైదాన్‌ను ‘భారత్ మండపం’ అని పేర్కొంటూ ఐటీపీఓ తన వెబ్సైట్లోనే కాకుండా ప్రవేశ ద్వారాల వద్ద కూడా ఈ రాయించింది. 1972లో స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రదేశానికి ప్రగతి మైదాన్ అని నామకరణం చేశారు. అదే సంవత్సరం ఇందిరా గాంధీ ప్రారంభించిన ఆసియా- 72 ప్రదర్శన ఇక్కడ జరిగింది. అప్పటి నుండి ప్రగతి మైదాన్ జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా మారింది. ఐటీపీఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రగతి మైదాన్ క్యాంపస్‌కు భారత్ మండపం అని నామకరణం చేశామన్నారు. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్. మరొకటి వివిధ ఎగ్జిబిషన్ హాల్స్. ఈ పేరు మార్పు 38వ అంతర్జాతీయ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ ఆహార్-2024తో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలు, ఆహ్వాన పత్రికలు, టిక్కెట్లు, పాస్‌లు ఇలా ప్రతిదానిలో ప్రగతి మైదాన్ అని కాకుండా భారత్ మండపం అని ముద్రించారు. -
జీ20 ప్రాంగణంలోకి వర్షం నీరు
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఆదివారం కురిసిన భారీ వర్షం ప్రభావం జీ20 సదస్సుపైనా పడింది. సదస్సు జరుగుతున్న ప్రగతిమైదాన్‌లోని భారత మండపంలోకి నీరు చేరింది. సిబ్బంది నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేపట్టారు. ఆయా దేశాల ప్రతినిధులు నీళ్లలోనే అటూఇటూ నడుస్తున్న వీడియోను కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’లో షేర్ చేసింది. ‘జీ20 ఏర్పాట్ల కోసం రూ.2,700 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఇప్పుడు ఒక్క వర్షానికే భారత మండపం నీటితో నిండిపోయింది. పంపులతో సిబ్బంది నీటిని బయటకు పంపుతున్నారు. అభివృద్ధిలో డొల్లతనం బయటపడింది..’ అంటూ కాంగ్రెస్ ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పేర్కొంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘దేశ వ్యతిరేక అంతర్జాతీయ కుట్రలో వానలు కూడా భాగమే’అంటూ ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ వ్యాఖ్యానించారు. ‘జీ20 సదస్సు సాగుతుండగానే భారత్ మండపంలోని వరదనీరు చేరిందన్న విషయాన్ని మీడియా ప్రస్తావించనేలేదు. మోదీజీ, దేశాన్ని ఎలా పాలించాలో మా నుంచి మీరు నేర్చుకోలేదు. కానీ, మీడియాను ఎలా మేనేజ్ చేయాలో మిమ్మల్ని చూసి మేం నేర్చుకోవాలి’అంటూ ఆ పార్టీ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. జనవరి 21న అయోధ్య రామాలయం ప్రారంభం అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామమందిర ప్రారం¿ోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి మూడు రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ ఆదివారం చెప్పారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా మత ప్రముఖులను ఆహా్వనించనున్నట్లు తెలిపారు. అయోధ్యలో రామ మందిర ప్రారం¿ోత్సవానికి సన్నాహకంగా ఈ ఏడాది సెపె్టంబర్ 30 నుంచి అక్టోబర్ 15 దాకా లక్షలాది గ్రామాల్లో ‘శౌర్యయాత్ర’లు నిర్వహించేందుకు బజరంగ్ దళ్ ఏర్పాట్లు చేస్తోంది. -
అధికారిక కార్లు వాడొద్దు
న్యూఢిల్లీ: జి–20 సమావేశాల్లో విందు వేదికను చేరుకోవడానికి అధికారిక కార్లను వాడొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. బుధవారం జరిగిన భేటీలో మంత్రులకు విధినిõÙధాలను వివరించారు. భారత్‌కు వస్తున్న వివిధ దేశాల బృందాలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మసలుకోవాలని సూచించారు. ప్రధాన వేదిక భారత మండపం, ఇతర వేదికలను చేరుకోవడానికి షటిల్ సరీ్వసును ఉపయోగించుకోవాలని చెప్పారు. తాము బాధ్యత వహిస్తున్న విదేశీ బృందాలకు సంబంధించి ఆచారవ్యవహారాలను తెలుసుకోవాలని మంత్రులను కోరారు. వారి సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకొని.. అందుకు అనుగుణంగా అతిథ్యమివ్వాలని చెప్పారు. జీ–20 సమావేశాలకు సంబంధించి అధీకృత వ్యక్తులు తప్పితే మరెవరూ మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. ఈనెల తొమ్మిదో తేదీన జరిగే రాత్రి విందుకు ఆహా్వనించిన ముఖ్యమంత్రులందరూ సొంత కార్లలో రావాలని, వేదిక వద్ద షటిల్ సరీ్వసును ఉపయోగించుకొని విందు జరిగే ప్రదేశానికి చేరుకోవాలని ఇదివరకే సూచనలు వెళ్లాయి. కేంద్ర మంత్రులందరూ జీ–20 యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని, ఇందులో జీ–20 దేశాల భాషలతో పాటు భారతీయ భాషలన్నింటిలోనూ అనువాద సదుపాయం ఉందని ప్రధాని వివరించారు. వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 40 మంది ప్రపంచ నాయకులు సెప్టెంబరు 9, 10వ తేదీల్లో జరిగే జీ–20 సదస్సుకు హాజరవుతారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌మోహన్ క్వాత్రా మంత్రులకు తెలిపారు. పాటించాల్సిన ప్రొటోకాల్ నిబంధనల గురించి వివరించారు. భారత్, ఇండియా వివాదంపై అ«దీకృత వ్యక్తులు మాత్రమే మాట్లాడాలని ప్రధాని మోదీ మంత్రివర్గ సహచరులకు సూచించారు. చరిత్రలోకి వెళ్లకుండా రాజ్యాంగానికి లోబడి వాస్తవాలను మాట్లాడాలని కోరారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోలి్చన డీఎంకే నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు తగురీతిలో సమాధానమివ్వాలని ప్రధాని ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. ఉదయనిధి వ్యాఖ్యలపై పలు రాజకీయ పారీ్టలు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఉదయనిధి స్టాలిన్, ఆయన వ్యాఖ్యలకు మద్దతు పలికి ప్రియాంక్ ఖర్గేలపై మతవిశ్వాసాలను దెబ్బతీశారనే అభియోగాలపై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. -
G20 Summit 2023: ఒకే వసుధ ఒకే కుటుంబం ఒక సదస్సు
అంతర్జాతీయ స్థాయిలో జరిగే అత్యంత కీలకమైన జీ20 సదస్సుకు నభూతో అనే స్థాయిలో ఘనంగా ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. అమెరికా మొదలుకుని 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల అధినేతలు ఒకే వేదిక మీదికి రానున్నారు. ఆర్థిక అసమానతలు మొదలుకుని వాతావరణ మార్పుల దాకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పలు ప్రధాన సమస్యలపై సెపె్టంబర్ 9 నుంచి రెండు రోజుల పాటు లోతుగా చర్చించనున్నారు. ఐక్యత, సమష్టి కార్యాచరణే ఆయుధాలుగా పరిష్కార మార్గాలు అన్వేషించనున్నారు. అంతర్జాతీయంగా భారత్ పలుకుబడి, పేరు ప్రతిష్టలు కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి. దేశాల మధ్య అతి జటిలమైన సమస్యల పరిష్కారానికైనా, వివాదాల్లో మధ్యవర్తిత్వానికైనా అన్ని దేశాలూ భారత్ వైపే చూసే పరిస్థితి! ఇప్పుడు జీ20 శిఖరాగ్రానికి భారత్ వేదికగా నిలుస్తుండటాన్ని అందుకు కొనసాగింపుగానే భావిస్తున్నారు. మన దేశ వ్యవహార దక్షతను నిరూపించుకోవడానికి మాత్రమే గాక అంతర్జాతీయ స్థాయిలో సంలీన వృద్ధి, సుస్థిర అభివృద్ధి సాధన యత్నాలకు అజెండా నిర్దేశించేందుకు కూడా ఇది చక్కని అవకాశంగా నిలవనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెరపైకి తెచి్చన వసుధైవ కుటుంబకం (ఒక వసుధ, ఒకే కుటుంబం, ఒకటే భవిత) నినాదమే సదస్సుకు మూలమంత్రంగా నిలవనుంది. రెండు రోజులు.. మూడు సెషన్లు ► దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రక ప్రగతి మైదాన్‌లో సదస్సు జరగనుంది. ► వేదికకు భారత్ మండపం అని నామకరణం చేశారు. ► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 7వ తేదీనే భారత్‌కు రానున్నారు. 8న మిగతా దేశాధినేతలు వస్తారు. దాంతో వారితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలకు కావాల్సినంత సమయం చిక్కనుంది. ► 8న బైడెన్‌తో మోదీ భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీ ఎజెండా ఏమిటన్నది ఇప్పటికైతే సస్పెన్సే. తొలి రోజు ఇలా... ► సదస్సు 9న మొదలవుతుంది. ► ప్రతి దేశాధినేతకూ భారత్‌మండపం వద్ద మన సంప్రదాయ రీతుల మధ్య ఘన స్వాగతం లభించనుంది. ► రెండు రోజుల సదస్సులో మొత్తం మూడు సెషన్లు జరుగుతాయి. ► ఒకే వసుధ (వన్ ఎర్త్) పేరుతో తొలి సెషన్ శనివారం ఉదయం 9కి మొదలవుతుంది. ► దానికి కొనసాగింపుగా దేశాధినేతల మధ్య అధికార, అనధికార భేటీలుంటాయి. ► అనంతరం ఒకే కుటుంబం (వన్ ఫ్యామిలీ) పేరుతో రెండో సెషన్ మొదలవుతుంది. రెండో రోజు ఇలా... ► సదస్సు రెండో రోజు ఆదివారం కార్యక్రమాలు త్వరగా మొదలవుతాయి. ► దేశాధినేతలంతా ముందు రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. గాం«దీజీ సమాధి వద్ద నివాళులరి్పస్తారు. ► అనంతరం భారత్ మండపం వేదిక వద్ద మొక్కలు నాటుతారు. పర్యావరణ పరిరక్షణకు పునరంకితం అవుతామని ప్రతినబూనుతారు. ► ఒకే భవిత (వన్ ఫ్యూచర్) పేరిట జరిగే మూడో సెషన్‌తో సదస్సు ముగుస్తుంది. ► జీ20 అధ్యక్ష బాధ్యతలను వచ్చే ఏడాది శిఖరాగ్రానికి ఆతిథ్యం ఇస్తున్న బ్రెజిల్‌కు అప్పగించడంతో సదస్సు లాంఛనంగా ముగుస్తుంది. ప్రథమ మహిళల సందడి ► జీ20 సదస్సులో ఆయా దేశాధినేతల సతీమణులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ► పలు ప్రత్యేక కార్యక్రమాలతో సందడి చేయనున్నారు. ► శనివారం తొలి రోజు వాళ్లు పూసా లోని వ్యవసాయ పరిశోధన సంస్థ, నేషనల్ మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ సందర్శిస్తారు. ► తృణ ధాన్యాల పరిరక్షణ, వృద్ధిలో భారత్ చేస్తున్న కృషిని స్వయంగా గమనిస్తారు. ► చివరగా పలు రకాల షాపింగులతో సేదదీరుతారు. ► రెండో రోజు ఆదివారం దేశాధినేతల అనంతరం వాళ్లు కూడా రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. మరెన్నో విశేషాలు... ► ప్రతినిధుల షాపింగ్ కోసం క్రాఫ్ట్స్ బజార్ పేరిట వేదిక వద్ద జీ20 జాబ్ ఫెయిర్ ఏర్పాటు చేస్తారు. ► ప్రజాస్వామ్యాలకు తల్లి భారత్ థీమ్‌తో çహాల్ నంబర్ 14లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. షడ్రసోపేత విందు ► శనివారం తొలి రోజు సదస్సు అనంతరం రాత్రి ఆహూతులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా విందు ఇవ్వనున్నారు. ► ఇందులో దేశాధినేతలు మొదలుకుని రాయబారులు దాకా 400 మంది దాకా పాల్గొంటారు. ► విందు కూడా అధినేతల చర్చలకు వేదిక కానుంది. కాన్ఫరెన్స్ గదుల రొటీన్‌కు దూరంగా ఆరుబయట వారంతా మనసు విప్పి మాట్లాడుకుంటారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
ITPO complex: ‘భారత మండపం’ రెడీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ–20 సదస్సుకి వేదిక సిద్ధమైంది. సెపె్టంబర్లో జరగనున్న ఈ సదస్సుకి అమెరికా, బ్రిటన్, చైనా సహా 20 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సుని నిర్వహించడానికి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ)కు కొత్తగా హంగులు చేకూర్చారు. మరమ్మతులు నిర్వహించి ఆధునీకరించారు. ఈ సెంటర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించి దానికి కొత్తగా భారత మండపం అని పేరు పెట్టారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్, ఇతర మంత్రుల సమక్షంలో డ్రోన్ ద్వారా ఈ సెంటర్‌ని ప్రారంభించారు. ఐఈసీసీ కాంప్లెక్స్‌ని జాతీయ ప్రాజెక్టు కింద రూ.2,700 కోట్లతో అభివృద్ధి చేశారు. ప్రగతి మైదాన్‌లో ఇండియా ట్రేడ్ ప్రొమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఒ) కాంప్లెక్స్‌లో ఇది భాగంగా ఉంది. అంతకు ముందు ప్రధాని మోదీ ఐటీపీఒలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కాంప్లెక్స్ మరమ్మతు పనుల్లో పాల్గొన్న కార్మికుల్ని ప్రధాని సత్కరించారు. ప్రగతి మైదాన్ దాదాపుగా 123 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. భారత్‌లో అంతర్జాతీయ సదస్సులు , పారిశ్రామిక సమావేశాలు నిర్వహించే కాంప్లెక్స్‌లో అతి పెద్దది. ఎన్నో అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఐఈసీసీ ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన టాప్ –10 వేదికల్లో ఒకటి. మూడో అంతస్తులు ఏడువేల మంది పట్టే ఒక కాన్ఫరెన్స్ హాలు ఉంది. జీ–20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించడానికి భారతీయత ఉట్టిపడేలా దీనిని నిర్మించడంతో భారత మండపం అని పేరు పెట్టారు. -
రీ డెవలప్ చేసిన ఐఈసీసీ ఆవిష్కారం: అద్బుతమైన ఫోటోలు
-
పొలానికో డ్రోన్: మోదీ
న్యూఢిల్లీ: పరిపాలనా వ్యవహారాల్లో సాంకేతికతను వినియోగించుకోవడంపై గతంలో చూపిన అలక్ష్యం కారణంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ ఇబ్బందులకు గురయ్యారని ప్రధాని మోదీ చెప్పారు. ‘ఎనిమిదేళ్లుగా మా ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు కూడా సేవలందించేందుకు డ్రోన్లు సహా అన్ని రకాల సాంకేతికతను వినియోగించుకుంటోంది. సులభతర జీవనం, సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యం ఇస్తోంది. సుపరిపాలనకు కొత్త విధానాలను అమలు చేస్తోంది. రోజువారీ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని కనీస స్థాయికి తీసుకువచ్చింది’అని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ఎగ్జిబిషన్ భారత్ డ్రోన్ మహోత్సవ్–2022ను ఆయన శుక్రవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్రారంభించారు. డ్రోన్ సాంకేతికతను ఉపయోగించుకుని సుపరిపాలన, సులభతర జీవనం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం ఆశించిన గ్రామస్వరాజ్ సాధనకు డ్రోన్లు ఉపకరిస్తాయని చెప్పారు. గత ప్రభుత్వాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక సమస్యగా, పేదల వ్యతిరేక వ్యవహారంగా చిత్రీకరించాయన్నారు. ‘దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ ప్రతి భారతీయుడి చేతిలో ఒక స్మార్ట్‌ఫోన్, ప్రతి పొలంలో ఒక డ్రోన్, ప్రతి ఇల్లూ సౌభాగ్యంతో ఉండాలన్నదే తన కల అని ప్రధాని తెలిపారు. ప్రజల జీవితాల్లో డ్రోన్ కూడా ఒక భాగంగా మారనుందని చెప్పారు. డ్రోన్ పరిజ్ఞానం వినియోగంతో వ్యవసాయం రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డ్రోన్ సాంకేతికతను వ్యవసాయం, క్రీడలు, మీడియా, రక్షణ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో వినియోగించుకోవడం ద్వారా ఈ రంగంలో ఎందరికో ఉద్యోగావకాశాలున్నాయని తెలిపారు. డ్రోన్ సాంకేతికతపై అందరికీ అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఎన్నో అనేక అవరోధాలను తొలగించిందని చెప్పా రు. ‘మారుమూల ప్రాంతాల్లోని వారికి డ్రోన్ల సా యంతో అత్యవసరమైన ఔషధాలు వంటి వాటిని సులభంగా చేరవేయవచ్చు. పోలీసులు కూడా వీటి సేవలను వినియోగించుకోవచ్చు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి, అత్యాధునిక డ్రోన్ సాంకేతికతను భారత్‌తోపాటు ప్రపంచానికి అందించాలని పెట్టుబడిదారులను కోరుతున్నా’అని ప్రధాని పిలుపునిచ్చారు. ఉత్పాదకత అనుసంధాన పథకం(పీఎల్ఐ) వంటి విధానాల ద్వారా దేశంలో పటిష్టమైన డ్రోన్ ఉత్పత్తి విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ ఒక డ్రోన్‌ను ఆపరేట్ చేశారు. డ్రోన్‌ను పరీక్షిస్తున్న ప్రధాన మంత్రి మోదీ -
వెదురులో విరిసిన బతుకులు
సుచిత్ర సిన్హా విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఆమె ఉద్యోగ జీవితం ఆదివాసీల కుటుంబాల జీవనస్థాయిని మెరుగుపరచడం, సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడంలోనే మునిగిపోయింది. ‘గడచిన యాభై ఏళ్లుగా ఏ ప్రభుత్వ అధికారి కానీ మంత్రి కానీ ఇక్కడ అడుగుపెట్టిన దాఖలా లేదు’ అంటున్నారు బురుడీహ్ గ్రామస్థులు. బురిడీహ్ గ్రామం జార్ఖండ్ రాష్ట్రంలో రాజధాని జమ్షెడ్పూర్ నగరానికి అరవై కిలోమీటర్ల దూరాన ఉంది. బురుడీహ్తోపాటు చుట్టుపక్కల పాతిక గ్రామాల్లో ఆదివాసీ జాతులు... అవి కూడా అంతరించిపోవడానికి దగ్గరగా జాతులు నివసిస్తున్నాయి. అందులో శబర కూడా ఒకటి. భూమి ఉంది కానీ! అడవి మధ్యలో ఊరు. ఊరి చుట్టూ భూమి ఉంది. కానీ సాగు చేసుకోవడానికి అది సొంత భూమి కాదు. తలదాచుకోవడానికి పక్కా ఇల్లు లేదు. అడవి మీద ఆధారపడి బతుకు సాగించే జీవితాలవి. కాలదోషం పట్టిన మన అటవీచట్టాలు అడవిబిడ్డల జీవితాల మీద కొరడా ఝళిపిస్తున్నాయి. ఇల్లు కట్టుకోవాలంటే వాళ్లకు ఏకైక ఆధారం అడవే. అటవీ చట్టాల ప్రకారం ఆకలి తీర్చుకోవడానికి పండ్లు, కాయలనే కాదు... ఓ పూరిల్లు వేసుకోవడానికి అడవిలో చెట్టు నుంచి కలప కూడా సేకరించరాదు. అటవీ ఉద్యోగుల కళ్లు కప్పి కొమ్మలను నరికి పూరి పాక వేసుకోవడమే వాళ్లకు మిగిలిన మార్గం. అలాగే ఇల్లు కట్టుకుంటారు. దాంతో అటవీసంపదను దొంగలించిన నేరానికి అందరి మీద కేసులు నమోదై ఉంటాయి. అలాంటి జీవితాలను సుచిత్ర సిన్హా సమూలంగా మార్చేసింది. దశాబ్దాలు గడిచాయి కానీ! సుచిత్రా సిన్హా 1988లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పూర్తి చేసింది. ఆమె ఇదే ప్రాంతానికి చెందిన మహిళ కావడంతో చిన్నప్పటి నుంచి ఆదివాసీల జీవితాలను దగ్గరగా చూసిన అనుభవం ఆమెది. తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతుంటాయనే అభిప్రాయంతో కూడిన ప్రాణభయంతో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు చూసేవాళ్లు కాదు. ఆ నేపథ్యం నుంచి బయటకు వచ్చిన సుచిత్ర 1996లో జమ్షెడ్పూర్కి డిప్యూటీ కలెక్టర్‌గా వచ్చింది. ఆ రావడం ఆమె జీవన గమనాన్ని మార్చేసిందనే చెప్పాలి. ‘‘నేను చిన్నప్పుడు చూసిన పరిస్థితికి ఇక్కడికి అధికారిగా వచ్చిన నాటికి మధ్య రెండు దశాబ్దాలకు పైగా కాలం గడిచింది. కానీ ఏ మాత్రం మార్పు లేదు. పిల్లలు సరైన దుస్తులు లేకుండా, పోషకాహారం లోపంతో, పూరిళ్లలో బతుకీడుస్తున్నారు. ఆధునిక ప్రపంచంతో సంబంధం లేనట్లు వాళ్ల లోకంలో వాళ్లు జీవిస్తున్నారు. ప్రభుత్వంలో ట్రై బల్ స్కీమ్‌లున్నాయి, నిధులు సమృద్ధిగా ఉన్నాయి. వాటిని వాళ్ల దగ్గరకు చేర్చే ప్రయత్నం ఎవరూ చేయకపోవడంతోనే వాళ్ల జీవితాలు అలాగే ఉండిపోయాయి. అందుకే వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపించింది. కొత్తగా ఏం నేర్పిద్దామన్నా, వాళ్లు ఒంటపట్టించుకునేటట్లు కనిపించలేదు. వాళ్లకు వచ్చిన పనినే మరింత మెరుగ్గా చేయడం నేర్పించడం, వాళ్లు తయారు చేసిన వస్తువులకు మార్కెట్ కల్పించడం మీద దృష్టి పెట్టాను. వెదురు వంద రకాలుగా ఆదివాసీలకు వెదురును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెదురు బుట్టలు అల్లడం అందరికీ వచ్చి ఉంటుంది. వాళ్లకు మామూలు బుట్టలతోపాటు ల్యాంప్షేడ్లు, పెన్ హోల్డర్లు, బాస్కెట్లు చేయడం నేర్పించాం. ఢిల్లీ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రతినిధులను ఆదివాసీల గ్రామాల్లో పర్యటించమని కోరాను. వాళ్లు వచ్చి శబరులు తయారు చేస్తున్న వెదురు వస్తువులను కళాత్మకంగా చేయడంలో శిక్షణనిచ్చారు. మొత్తం కుటుంబాలు మూడు వందలకు పైగానే. ఒక్కో బృందంలో పదిమంది చొప్పున అందరినీ గ్రూప్‌లు చేశాం. ఒక్కొక్కరికి ఒక్కో కళాకృతుల తయారీలో శిక్షణ ఇచ్చాం. మొదటి నెల ఒకరి భాష మరొకరు అర్థం చేసుకోవడంలోనే గడిచిపోయింది. కానీ నేర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత చాలా త్వరగా నేర్చుకున్నారు. ఇప్పుడు శబర ఆదివాసీల చేతుల్లో నూటనాలుగు రకాల హస్తకళాకృతులు తయారవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే... మోడరన్ హౌస్‌లో కొలువుదీరుతున్న అనేక కళాకృతులు ఆదివాసీల చేతుల్లో రూపుదిద్దుకున్నవే. వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఢిల్లీలోని హస్తకళల ప్రదర్శన విక్రయకేంద్రం ‘ప్రగతి మైదాన్ ఢిల్లీ హట్’లో స్టాల్ ఏర్పాటు చేయించగలిగాను. ప్రతి ఒక్కరూ నెలకు ఏడెనిమిది వేలు సంపాదించుకుంటున్నారు. ఆదివాసీల కోసం 2002లో స్థాపించిన అంబాలిక ఎన్జీవో సేవలను మరింత విస్తరించి అంతర్జాతీయ వేదికల మీద కూడా ప్రదర్శించాం. బ్రిక్స్ సమావేశాలకు అవసరమైన ఫైల్ ఫోల్డర్లను తయారు చేసింది ఈ ఆదివాసీలేనంటే నమ్ముతారా? అప్పటి వరకు ముందుండి వాళ్లను నడిపించాను. ఇప్పుడు అన్నీ వాళ్లే నిర్వహించుకోగలుగుతున్నారు. నేను వెనక ఉండి వాళ్లు నడుస్తున్న తీరును చూస్తూ సంతోషిస్తున్నాను. సర్వీస్‌లో ఉండగా నాటిన మొక్క ఇది. నేను నాటిన మొక్క శాఖోపశాఖలుగా విస్తరించింది. నేను 2019లో రిటైర్ అయ్యాను. అడవిలో చెట్ల నీడన హాయిగా సాగాల్సిన వారి జీవితాలను చట్టాలు భయం నీడలోకి నెట్టేశాయి. పోలీసుకు ఫారెస్ట్ ఉద్యోగికి తేడా తెలియని అమాయకత్వంలో ఖాకీ డ్రస్ కనిపిస్తే వణికిపోతుండేవాళ్లు. చట్టాల కోరల్లో భయం నీడలో బతుకీడుస్తున్న వాళ్లు ఇప్పుడు ధైర్యంగా జీవిస్తున్నారు. నాగరక ప్రపంచం అంటేనే భయపడే స్థితి నుంచి నాగరికులకు తమ ఉత్పత్తులను వివరించి చెప్పగలుగుతున్నారు. వారిలో ఇనుమడించిన ఆత్మవిశ్వాసాన్ని కళ్లారా చూస్తున్నారు. చాలా సంతృప్తిగా ఉంది’’ అన్నారు విశ్రాంత ఐఏఎస్ అధికారి సుచిత్ర సిన్హా. -
Sub-Inspector Priyanka Sharma: గన్ లేడీ
ఎన్కౌంటర్ టీమ్‌లో గ్యాంగ్‌స్టర్‌తో తలపడిన తొలి మహిళా పోలీస్‌గా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రియాంక శర్మను యావత్భారత పోలీసు శాఖ అభినందిస్తోంది. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌లో ‘ట్రాకింగ్’ టీమ్ అని ఒకటి ఉంటుంది. పెద్ద పెద్ద క్రిమినల్స్‌ని వలపన్ని, చుట్టుముట్టి, వారి చేతుల్ని తల వెనుక పెట్టించి, అదుపులోకి తీసుకునే ఎన్కౌంటర్ స్పెషలిస్టులు ఆ టీమ్‌లోని వాళ్లంతా! ఎస్సై ప్రియాంకా శర్మ పదమూడేళ్లుగా వాళ్లలో ఒకరిగా పని చేస్తున్నారు. మొన్న గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆమె పాల్గొన్నారు. ఒక బులెట్ వచ్చి ఆమె జాకెట్‌కు తగిలింది. గ్యాంగ్‌స్టర్, అతడి అనుచరుడు పట్టుబడ్డారు. ‘‘ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎన్కౌంటర్లో పాల్పంచుకున్న మొట్టమొదటి మహిళా పోలీస్ ప్రియాంక’’ అని ఢిల్లీ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షిబేష్ సింగ్ అభినందించారు. ఆయనతో పాటు డిపార్ట్మెంట్ కూడా ప్రియాంకకు పూలగుచ్ఛాలు అందిస్తోంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎంతో కాలంగా వెతుకుతున్న గ్యాంగ్‌స్టర్ ఒకరు సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్నట్లు గురువారం తెల్లవారుజామున డిపార్ట్మెంట్కి సమాచారం అందింది. హుటాహుటిన టీమ్ అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో టీమ్‌తో ప్రియాంక కూడా ఉన్నారు. పట్టుకోబోతున్నది గ్యాంగ్‌స్టర్‌ని కనుక ప్రియాంక కూడా బులెట్ ప్రూమ్ జాకెట్ ధరించి ముఖాముఖి గన్ ఫైట్‌కు రెడీ అయి ఉన్నారు. గ్యాగ్‌స్టర్‌ని ఒక మూలకు రప్పించడం, పెడరెక్కలు విరిచి పోలీస్ వ్యాన్ ఎక్కించడం అంత తేలికేమీ కాదు. ముందసలు అతడు లొంగిపోయే మానసిక స్థితిలో ఉండడు. చంపడమో, చావడమో రెండే ఆప్షన్స్ తీసుకుంటాడు. ప్రగతి మైదాన్‌లోకి పోలీస్‌లు వచ్చారని తెలియగానే గ్యాగ్‌స్టర్ అలెర్ట్ అయ్యాడు. అతడితో ఒక అనుచరుడు ఉన్నాడు. ఇద్దరి దగ్గరా గన్స్ ఉన్నాయి. పోలీసులు దగ్గరకు రాగానే గ్యాంగ్‌స్టర్ కాల్పులు మొదలుపెట్టాడు. ప్రియాంక తన గన్‌తో అతడికి ఎదురుగా వెళ్లారు. ఆమెకు అతడిని కాల్చే ఉద్దేశం లేదు. లొంగిపొమ్మని హెచ్చరించడానికే తన గన్ తీశారు. వెంటనే గ్యాంగ్‌స్టర్ ఆమెపై కాల్పులు జరిపాడు. ఒక బులెట్ ఆమె జాకెట్కి తగిలింది. అదే సమయంలో తక్కిన పోలీసులు అతడి కాళ్లపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అతడి అనుచరుడిపైన కూడా. ఇద్దర్నీ పట్టుకున్నారు. ప్రియాంకకు బులెట్ తగిలిన చోట పెద్ద గాయం ఏమీ అవలేదు. గ్యాంగ్‌స్టర్ పేరు రోహిత్ చౌదరి. అతడి అనుచరుడు ప్రవీణ్. రోహిత్‌పై రెండు కేసులు ఉన్నాయి. ఢిల్లీ, సాకేత్ కోర్టు బయట ఒకరిని హత్య చేయబోయిన కేసు, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక హత్య ఘటనలో అతడి హస్తం ఉందన్న కేసు. రెండేళ్లుగా అతడు అరెస్ట్ కాకుండా పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు. తల మీద నాలుగు లక్షల రూపాయల రివార్డు ఉంది. ఎం.సి.ఓ.సి.ఎ. (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్) కింద కూడా రోహిత్, ప్రవీణ్‌లపై అనేక మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున 4.45 నిముషాలకు వాళ్లిద్దరూ కారులో భైరాన్ మార్గ్ గుండా వస్తూ పోలీసు పెట్రోలింగ్ ఆగమన్నా ఆగకుండా పోలీసులపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. పోలీసులూ వాళ్లపై కాల్పులు జరిపారు. ఆ సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ టీమ్ గ్యాంగ్‌స్టర్‌తో ఎన్‌కౌంటర్‌కు బయల్దేరింది. మొత్తానికి పోలీస్ కథ సుఖాంతం. ఈ కథలో నాయిక మాత్రం ప్రియాంకేనని ఢిల్లీ క్రైమ్ డిపార్ట్మెంట్ అంటోంది. ‘‘నేనేమీ భయపడలేదు. నా డ్యూటీలో అదొక భాగంగా మాత్రమే అనిపించింది’’ అని చిరునవ్వులు చిందిస్తూ అంటున్నారు ప్రియాంక. ఆ నవ్వులు సహజంగానే రోహిత్‌కు, ప్రవీణ్‌కు నచ్చకపోవచ్చు. ∙ -
9న ఢిల్లీలో ప్రపంచ పుస్తక మేళా ప్రారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈనెల 9న ‘ప్రపంచ పుస్తక మేళా’ ప్రారంభంకానుంది. 17వ తేదీ వరకు కొనసాగే ఈ మేళాను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించనున్నారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీవో) సౌజన్యంతో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ఈ మేళాను నిర్వహిస్తోంది. -
నేటి నుంచి అంతర్జాతీయ వాణిజ్య మేళా
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రారంభం * ఈ నెల 14 నుంచి 18 వరకు వాణిజ్య సందర్శకులకు మాత్రమే అనుమతి * సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు ఉచిత ప్రవేశం సాక్షి, న్యూఢిల్లీ: 34వ అంతర్జాతీయ వాణిజ్య మేళాకు నగరం ముస్తాబైంది. శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి ఈ మేళాను ప్రగతిమైదానంలో ప్రారంభిస్తారు. ఈ నెల 27 వరకు మేళా కొనసాగుతోంది. ఈ నెల 14 నుంచి 18 వరకు వాణిజ్య సందర్శకులను మాత్రమే అనుమతిస్తారు. 18 నుంచి 27 వరకు సామాన్యులకు ప్రవేశం ఉంటుంది. ఉదయం 9 .30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మేళా తెరచి ఉంటుంది. ఐదున్నర వరకూ మేళాలో ప్రవేశ సదుపాయం ఉంటుంది. టికెట్ల విక్రయం మాత్రం సాయంత్రం నాలుగు గంటలకు నిలిపివేస్తారు. సెలవు రోజులు, వారాంతపు రోజుల్లో మధ్యాహ్నం రెండు గంటలకే టికెట్ల విక్రయం నిలిపివేస్తారు. ప్రవేశ టికెట్లు ఇలా..: మేళాలో ప్రవేశం కోసం గేట్ నంబర్ 1, 2 వద్ద టికెట్లు లభిస్తాయి. అన్ని మెట్రో స్టేషన్లలో మేళా టికెట్లు లభిస్తాయి. ప్రవేశ టికెట్ వెలను వివిధ కేటగిరీలు నిర్ణయించారు. వ్యాపారులకు రోజుకు రూ.400, కాగా సీజనల్ టికెట్ ధర రూ.15,00, సామాన్యుల విషయానికి వస్తే పెద్దలకు రూ.50, పిల్లలకు రూ 30 ఉంది. సెలవు రోజుల్లో శని,ఆదివారాల్లో మేళాను సందర్శించేందుకు పెద్దలు రూ. 80, పిల్లలు రూ.50 టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు గుర్తింపుపత్రంపై ఉచిత ప్రవేశ సదుపాయం ఉంది. మెట్రో ప్రయాణికుల కోసం ప్రగతిమైదాన్‌లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లలో కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడం కోసం మెట్రో టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. 6000 ఎగ్జిబిట్లు: మహిళా ఎంటర్ ప్రెన్యుయర్లు ఇతివృత్తంగా జరిగే ఈ మేళాలో 6,000 ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం మేళాలో దక్షిణాఫ్రికా భాగస్వామ్య దేశం హోదాలో, థాయ్‌లాండ్ ఫోకస్ కంట్రీ హోదాలో పాల్గొంటున్నాయి. ఢిల్లీ ఫోకస్ రాష్ట్రం హోదాలో మేళాలో పాల్గొంటోంది. -
14 నుంచి అంతర్జాతీయ వాణిజ్య మేళా
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 14 నుంచి రాజధానిలో రెండువారాల పాటు జరిగే అంతర్జాతీయ వాణిజ్య మేళా కోసం ప్రగతిమైదాన్‌లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఇతివృత్తంగా జరిగే ఈ మేళాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నవంబర్ 14న ప్రారంభిస్తారు. 34వ వాణిజ్య మేళాలో దక్షిణాఫ్రికా భాగస్వామ్యదేశంగా, థాయ్‌లాండ ఫోకస్ దేశంగా, ఢిల్లీ ఫోకస్ రాష్ట్రంగా పాల్గోనున్నాయి. మేళాలో మొదటి ఐదు రోజులను అంటే 14 నుంచి 18 తేదీవరకు వాణిజ్య సందర్శకుల కోసం కేటాయించారు. నవంబర్ 19 నుంచి సామాన్య ప్రజల కోసం మేళా తలుపులు తెరచుకుంటాయి. వాణిజ్య సందర్శకులను మాత్రమే అనుమతించే రోజులలో టికెట్ వెల 400 రూపాయలు ఉండనుంది. నవంబర్ 19 నుంచి మాత్రం రూ.50 టికెట్ కింద వసూలు చేస్తారు. వారాంత పు సెలవు దినాలు, ప్రభుత్వ సెలవు రోజులలో టికెట్ వెల రూ.80గా ఉండనుంది. మేళాలో పాకిస్థాన్ సందడి: దాదాపు 25 దేశాలు ఈ మేళాలో పాల్గోనున్నాయి. ఇటీవలి కాలంలో భారత్ - పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ పాకిస్థాన్ వ్యాపారులు మాత్రం రాజధానిలో జరిగే వాణిజ్య మేళాలో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారు. పాకిస్థాన్‌కు చెందిన 115 కంపెనీలు మేళాలో పాల్గొంటున్నాయి. గత సంవత్సరం 85 కంపెనీలు మేళాలో పాల్గొన్నాయి. ఈ సంవత్సరం పాకిస్థాన్‌కు రెండుహాళ్లలో స్థలం కేటాయించనున్నారు. హాల్ నంబర్ 6, హాల్ నంబర్ 20లలో పాకిస్థాన్ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేసుకోనున్నాయి. పాకిస్థాన్ ఉత్పత్తులలో ఓనిక్స్ స్టోన్, సిల్క్, ఉత్పత్తులు, దుస్తులు, మసాలాలకు అధిక డిమాండ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం వాణిజ్య మేళాలో భారీ స్థాయిలో స్టాల్స్ ఏర్పాటుచేసే చైనా ఈసారి మేళా పట్ల అంత ఉత్సాహం చూపడం లేదు. మేళాలో పాల్గొనే కంపెనీల సంఖ్యను బట్టి చూస్తే పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, కొరియా, అఫ్గానిస్తాన్ తరువాతి స్థానాలలో ఉన్నాయి. అంటే చైనా మొదటి ఐదు దేశాలలో కూడా లేదు. చైనా ఈసారి ఏడవ స్థానంలో ఉందని మేళా నిర్వహించే ఐఐటీఎఫ్ అధికారులు చెబుతున్నారు. -
ప్రగతి మైదాన్‌కు సీఐఎస్ఎఫ్ భద్రత
న్యూఢిల్లీ: ఎగ్జిబిషన్ల వేదికగా చెప్పుకునే ప్రగతి మైదాన్‌ను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు(సీఐఎస్ఎఫ్) కంటికి రెప్పలా కాపాడనున్నాయి. దేశ, విదేశాలకు చెందిన ఏ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనుకున్నా అందుకు ప్రగతి మైదా న్ చిరునామాగా మారుతోంది. ఈ ఎగ్జిబిషన్లను తిలకించేందుకు లక్షల సంఖ్యలో జనం ఇక్కడికి వస్తుంటారు. అంతేకాక కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఇక్కడ ప్రదర్శిస్తుంటారు. దీంతో మాఫి యా, ఉగ్రవాదుల కన్ను ప్రగతి మైదాన్‌పై పడిం దని నిఘావర్గాలు హెచ్చరించడంతో ఇకపై సీఐఎస్ఎఫ్ జవాన్లు భద్రత కల్పించనున్నారు. మైదాన్‌లోకి వెళ్లే, బయటకు వచ్చే ద్వారా వద్ద మాత్రమే కాకుండా లోపల ఏర్పాటు చేసిన ప్రదర్శనల వద్ద కూడా సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరిం చనున్నారు. ఇందుకోసం 100 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎప్పుడూ ఇక్కడ అందుబాటులో ఉండే లా ఏర్పాట్లు చేస్తున్నారు. క్విక్ రియాక్షన్ టీమ్‌గా పిలిచే ఈ జవాన్లు మైదాన్‌లో వాహనాలపై తిరుగుతూ భద్రతా విధు లు నిర్వర్తిస్తారని సంబంధిత అధికారి ఒకరు తెలి పారు. అవసరమైతే మరింతమంది జవాన్లను కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ‘జాతీయ, అంతర్జాతీయ ఫెయిర్లకు ప్రగతి మైదా న్ వేదికగా మారింది. ట్రేడ్ ఫెయిర్, బుక్ ఫెయిర్, ఆటో ఎక్స్పో, సెక్యూరిటీ ఎక్స్పో, డిఫెన్స్ ఎక్స్పో వంటి భారీ ప్రదర్శనలు తరచూ ఇక్కడ జరుగుతున్నాయి. దీంతో ప్రదర్శనలను తిలకించేందుకు వచ్చేవారికి మాత్రమే కాకుండా ప్రదర్శనను ఏర్పాటు చేసిన దేశ, విదేశీ సంస్థలకు కూడా భద్రత కల్పించాల్సిన అవసరముంది. ఇప్పటిదాకా ప్రైవే టు సెక్యూరిటీ గార్డులతో భద్రత కల్పిస్తున్నాం. అయితే ఈ సెక్యూరిటీ ఉగ్రదాడులను, మాఫియా దాడులను ఎదుర్కొనే స్థాయిలో లేదన్న నివేదికలు అందాయి. పైగా ఉగ్రవాదుల కన్ను కూడా ప్రగతి మైదాన్‌పై పడిందని తరచూ నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఐఎస్ఎఫ్కు సెక్యూరిటీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించాం. ఇం దుకు సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించి, కేంద్ర హోంశాఖకు పంపించాం. గతంలో ఐటీపీఓ భద్రత కోసం కూడా ప్రతిపాదనలు పంపాం. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే తాజా గా సీఐఎస్ఎఫ్ భద్రత కోసం రూపొందించిన ప్రతి పాదనలపై కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేద’ని సంబంధిత అధికారి ఒకరు తెలి పారు. 124 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మైదాన్‌లో 61,290 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్ భవనాన్ని నిర్మించారు. ఇందులో 16 హాల్స్‌లో ప్రదర్శన లు ఏర్పాటు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. మైదాన్‌తోపాటు భవనాన్ని, భవనంలోని హాళ్లను సీఐఎస్ఎఫ్ జవాన్లు రేయింబవళ్లు కాపలా కాయా ల్సి ఉంటుంది. -
ఖుదాబక్ష్ లైబ్రరీ పేరెత్తని బుక్‌ఫేయిర్
న్యూఢిల్లీ: ఖుదాబక్ష్ గ్రంథాలయం పేరు దేశదేశాల విద్యాపారంగంధులకు, మేధావులకు చిరపరిచితం. ఖుదాబక్ష్ గ్రంథాలయం విజ్ఞాన నిధిగా, గనిగా ప్రపంచవ్యాప్తంగా వాసికెక్కినా ఢిల్లీ పుస్తక ప్రదర్శన నిర్వహకుల కంటికి ఆనలేదు. ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 19వ వార్షిక ఢిల్లీ పుస్తక ప్రదర్శనకు దేశ విదేశాలకు చెందిన ప్రచురణకర్తలను, దేశంలోని చిన్నా పెద్ద గ్రంథాలయాలను ఆహ్వానించి స్టాల్స్ పెట్టించిన నిర్వహకులు ఖుదాబక్ష్ గ్రంథాలయాన్ని మాత్రం విస్మరించారు. ‘‘గ్రంథాలయాలు-పాఠకులు’ నేపథ్యంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో గ్రంథాలయాల్లో మేటిగా పేరున్న ఈ గ్రంథాలయాన్ని విస్మరించడం పట్ల పలువురు మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనేక అరుదైన రాత ప్రతులను సంరక్షించి వర్తమాన, భావితరాల అధ్యయన, పరిశోధనలకు దోహదపడుతున్న ఖుదాబక్ష్ గ్రంథాలయం నిర్వాహకులకు గుర్తు రాకపోవడం క్షంతవ్యం కాదన్నారు. ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న ప్రదర్శనలో కొల్‌కటా జాతీయగ్రంథాలయం, ఉత్తరప్రదేశ్ రాంపూర్ రజా గ్రంథాలయం, చివరకు భువనేశ్వర్, హైదరాబాద్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలకు స్థానం కల్పించిన నిర్వాకులు ప్రదర్శన జరుగుతున్న నగరంలోనే ఉన్న లోకప్రసిద్ధ గ్రంథాలయాన్ని విస్మరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ‘‘ఖుదాబక్ష్ గ్రంథాలయాన్ని విస్మరించడం గ్రహపాటో,పొరపాటో, కాదు ఇది దిద్దుకోలేని పెద్ద తప్పదం’’ అని ప్రదర్శనలో పాల్గొంటున్న విపిన్ జట్లీ అన్నారు. ‘‘ప్రదర్శన నిర్వహకులు వివిధ ప్రసిద్ధ గ్రంథాలయాలను గూర్చి పేర్కొంటూ తయారు చేయించిన సూచికల్లోనూ ఈ నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఖుదాబక్ష్ గ్రంథాలయాన్ని మౌల్వీ ఖుదాబక్ష్ తన తండ్రి వారసత్వంగా అందిన విజ్ఞాన సంపదను 1891లో బీహార్‌లోని పాట్నాలో గ్రంథాలయంగా ఏర్పాటు చేశారు. దీనికి ఖుదా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ ల్రైబ్రరీగా పేరుపెట్టారు. భారత ప్రభుత్వం 1961లో ఈ గ్రంథాలయాన్ని జాతీయ ప్రాధాన్యత గలిగిన సంస్థగా ప్రకటించింది. వేలాది ప్రాచీన లిఖిత ప్రతులు, అత్యంత అరుదైన గ్రంథాలకు నిలవైన ఈ లైబ్రరీ కేంద్రంగా దేశదేశాలకు చెందిన పండితులు, విద్యావేత్తలు తమ పరిశోధనలను సాగించారు. ఇంత ఘన చరిత్ర కలిగిన జ్ఞాన బండాగారానికి సంబంధించిన చరిత్ర కూడా నిర్వహ కులకు గుర్తుండక పోవడం ఇంకా గర్హించదగిన విషయం. ఖుదాబక్ష్ గ్రంథాలయాన్ని 1969లో ఏర్పాటు చేసినట్లుగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన సూచికల్లో ప్రస్తావించారు. జాతీయ గ్రంథాలయ సంస్థకు ఈ విషయం ఎందుకు తలుపుకు రాలేదనేది అర్థం కాని విషయం. అంతేకాదు అమెరికన్ లైబ్రరీని అమిరికన్ లైబ్రరీగానూ, రాజా రాంమోహన్ రాయ్ గ్రంథాలయాన్ని ఆంగ్లభాషలో అసమాపక అక్షరాలతో రాశారు. ప్రచురణకు వెళ్లే ముందు పరిశీలించుకోవాల్సిన అంశాన్ని కూడా నిర్వహకులు పట్టించుకోలేదు’’ అని జేట్లీ వివరించారు. ఈ విషయంపై నిర్వహకులను ప్రశ్నించగా ‘‘కొన్ని పొరపాట్లు జరిగాయి. సమయాభావం కూడా ఇందుకు కారణమయింది. ఏమైనా ఇది జరగాల్సింది కాదు. చేసిన తప్పుకు క్షమాపణ తెలుపుతున్నాము’’ అన్నారు. గ్రంథాలయాలు, పుస్తకాలను గురించి మాట్లాడాల్సినప్పుడు తప్పనిసరిగా అక్షర దోషాలను పరిహరించాల్సిన అవసరం ఉంది. ఖుదాబక్ష్ మన సాంస్కృతిక వారసత్వ సంపద. జాతీయ జ్ఞాన సంపదకు చిహ్నాం. ఇది మా వైపు నుంచి జరిగిన పెద్ద పొరపాటే’’ అని భారత ప్రచురణకర్తల సమాఖ్య అధ్యక్షులు సుధీర్ మల్హోత్రా అన్నారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) భారత ప్రచురణకర్తల సమాఖ్య సంయుక్తంగా నిర్వహించారు. నిర్వహకులు మాట్లాడుతూ‘‘మేము దేశంలోని అన్ని ప్రముఖ, ప్రసిద్ధ గ్రంధాలయాలను సంప్రదించాము. ఖుదాబక్ష్ గ్రంథాలయాన్ని కూడా సంప్రదించి వారి వద్దనున్న లిఖిత ప్రతులను ప్రదర్శించాలని కోరాము. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రతిబంధకాల వలన ఇది కార్యరూపం దాల్చలేదు. అయితే గ్రంథాలయాల సూచికల్లో దీని ఫొటోలను ఎందుకు ప్రచురించలేదో కారణం తెలియరాలేదు’’ అని వివరణ ఇచ్చారు. ఢిల్లీ పుస్తక ప్రదర్శన సంర్భంగా ముంబై లైబ్రరీ ఆఫ్ ఆసియాటిక్ సొసైటీ, కొల్‌కటా నేషనల్ లైబ్రరీ, కొల్‌కటా పబ్లిక్ లైబ్రరీ, కొల్‌కటా ఇంపీరియల్ లైబ్రరీ, రాంపూర్ రజా లైబ్రరీ, బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ, అమెరికన్ లైబ్రరీ, జేఆర్డీ టాటా మెమోరియల్ లైబ్రరీ(బెంగళూరు), హైదరాబాద్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇనిస్టిట్యూట్స్, భువనేశ్వర్ హరేకృష్ణ మహతాబ్ స్టేట్ లైబ్రరీ పేర్లను ప్రదర్శించారు. ‘‘ప్రదర్శన ప్రవేశ ద్వారం వద్దనే ఇన్ని గ్రంథాలయాల పేర్లను ప్రదర్శించిన నిర్వహకులు ఖుదాబక్ష్ గ్రంథాలయం పేరును ఏలా మర్చిపోతారు. ఇది ఖచ్చితంగా సమయం, స్థలానికి సంబంధించిన సమస్య కాదు కేవలం చిత్తశుద్ధికి సంబంధించిన విషయం. విస్మరించాం, పొరపాటైంది అనే మాట చాలా చిన్నది. ఇది పెద్ద తప్పు’’ అని విమర్శించాడు ప్రదర్శనను సందర్శించిన ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి నిషాంత్. ఖుదాబక్ష్ న్యూఢిల్లీ: ఖుదాబక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ జగత్ప్రసిద్ధమైన గ్రంథాలయం. ఈ గ్రంథాలయాన్ని బ్రిటిష్ ఏలుబడి కాలంలో ఆరుగురు వైస్రాయ్‌లు, ఇద్దరు ప్రిన్స్ ఆఫ్ వేల్స్లు సందర్శించారు. భారత రాజకీయ ధురందరులు జాతీపిత మహాత్మా గాంధీ, జవహార్‌లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, నలుగురు భారత రాష్ట్రపతులు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. వీరందరూ ఈ గ్రంథాలయాన్ని బోడ్లియన్ ఆఫ్ ఇండియాగా కీర్తించారు. ఈ గ్రంథాలయంలో 21,000 లిఖిత గ్రంథాల ప్రతులున్నాయి. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంనాటి తారీఖ్-ఈ-కాందాన్-ఈ-తుమరియా కూడా లిఖిత ప్రతిగా ఇక్కడ అందుబాటులో ఉంది. షెహన్షా నామా ఆఫ్ హుస్సేనీలు ఉన్నాయి. 17వ శతాబ్దిలో గ్రంధస్థమైన షాహజహాన్ చక్రవర్తికి చెందిన పాద్షా నామా ఖ్వాజ్వీని వంటి అపురూప గ్రంథాలు కొలువుతీరాయి. అతి ప్రాచీనమైన సంస్కృతంలో రాసి ఉన్న 40 తాళపత్ర గ్రంథాలు కూడా ఇందులో ఉన్నాయి. కొన్ని మిథిలాక్షర రాత పత్రులు ఇక్కడ బధ్రపర్చారు. ఇంకెక్కడా అందుబాటులో లేని ఇంత అపురూపమైన జ్ఞాన సంపదకు నెలవైన ఖుదాబక్ష్ గ్రంథాలయం వెల కట్టలేని జాతీ సాంస్కృతిక వారసత్వ సంపదకు నిలయం -
ప్రగతి మైదాన్‌కు భారీ భద్రత
న్యూఢిల్లీ: అనునిత్యం ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాలతో రద్దీగా కనిపించే ప్రగతి మైదాన్ భద్రత కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) ప్రత్యేక చర్యలు మొదలుపెట్టింది. ఇక్కడ పటిష్ట భద్రత కోసం 125 మంది జవాన్ల బృందాన్ని నియమించనుంది. ప్రగతి మైదాన్‌లో నిర్వహించే కార్యక్రమాలకు భద్రతాపరమైన ముప్పు ఉందనే హెచ్చరికలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ భద్రత కల్పన కోసం కేంద్ర హోంశాఖ విధివిధానాలను రూపొందిస్తున్నప్పటికీ.. వేదికల వద్ద విధుల నిర్వహణ కోసం ఢిల్లీ పోలీసులతో సమన్వయం నెరుపుతామని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ప్రగతి మైదాన్‌కు సాయుధ భద్రత కల్పించడం ఇదే తొలిసారి. వచ్చే నెల వరకు 125 మంది సీఐఎస్ఎఫ్ జవాన్ల బృందాన్ని పంపిస్తామని ఈ శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల అధీనంలో పనిచేసే భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ సూచన మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మనదేశ వాణిజ్య సంస్థల సత్తాను అంతర్జాతీయంగా చాటిచెప్పడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. 124 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రగతి మైదాన్‌లో 61,290 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 16 హాళ్లు ఉన్నాయి. మరో 10 వేల చదరపు మీటర్ల సువిశాల ప్రదర్శనప్రాంతం కూడా ఉంది. దీనికి సీఐఎస్ఎఫ్ 24 గంటల భద్రత కల్పిస్తోంది. ఏవైనా సంక్షోభ పరిస్థితులు తలెత్తితే దీనికి కూడా ఇబ్బందులు ఏర్పడుతాయి కాబట్టి గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ సీఎండీ రీటా మీనన్ గతంలోనే ప్రభుత్వాన్ని కోరారు. ‘వ్యాపారులు, విక్రేతలు, సందర్శకుల భద్రతకు మాకు అత్యంత కీలకం. విపత్కర పరిస్థితుల నుంచి కాపాడగల పూర్తిస్థాయి భద్రత వ్యవస్థ మాకు అవసరం’ అని ఆమె అన్నారు. ఆటో, పుస్తకాలు, వాణిజ్య ప్రదర్శనల సమయంలో ఇక్కడికి వేల సంఖ్యలో సందర్శకులు వస్తుండడం తెలిసిందే. ప్రతినిత్యం ఇక్కడ ఏదో ఓ కార్యక్రమం జరుగుతుండడంతో భద్రత కల్పన కీలకంగా మారింది. ఉగ్రవాదుల నుంచి ఏదైనా ముప్పు ఎదురైతే సమర్థంగా ఎదుర్కోవడానికి వీలుగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది బృందానికి అత్యాధునిక ఆయుధాలతో కూడిన వాహనాన్ని కూడా అందజేస్తారు. మరో బృందం నిరంతరం ఇక్కడి భద్రతా పరిస్థితిని పరిశీలిస్తుంది. ఎక్స్‌రే బ్యాగేజ్ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు అమర్చాల్సిన ప్రాంతాలు, సిబ్బంది బ్యారక్‌లు నిర్మించాల్సిన స్థలాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. -
ప్రగతి మైదాన్‌కు భారీ భద్రత
న్యూఢిల్లీ: అనునిత్యం ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాలతో రద్దీగా కనిపించే ప్రగతి మైదాన్ భద్రత కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) ప్రత్యేక చర్యలు మొదలుపెట్టింది. ఇక్కడ పటిష్ట భద్రత కోసం 125 మంది జవాన్ల బృందాన్ని నియమించనుంది. ప్రగతి మైదాన్‌లో నిర్వహించే కార్యక్రమాలకు భద్రతాపరమైన ముప్పు ఉందనే హెచ్చరికలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ భద్రత కల్పన కోసం కేంద్ర హోంశాఖ విధివిధానాలను రూపొందిస్తున్నప్పటికీ.. వేదికల వద్ద విధుల నిర్వహణ కోసం ఢిల్లీ పోలీసులతో సమన్వయం నెరుపుతామని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ప్రగతి మైదాన్‌కు సాయుధ భద్రత కల్పించడం ఇదే తొలిసారి. వచ్చే నెల వరకు 125 మంది సీఐఎస్ఎఫ్ జవాన్ల బృందాన్ని పంపిస్తామని ఈ శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల అధీనంలో పనిచేసే భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ సూచన మేరకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మనదేశ వాణిజ్య సంస్థల సత్తాను అంతర్జాతీయంగా చాటిచెప్పడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. 124 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రగతి మైదాన్‌లో 61,290 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 16 హాళ్లు ఉన్నాయి. మరో 10 వేల చదరపు మీటర్ల సువిశాల ప్రదర్శనప్రాంతం కూడా ఉంది. దీనికి సీఐఎస్ఎఫ్ 24 గంటల భద్రత కల్పిస్తోంది. ఏవైనా సంక్షోభ పరిస్థితులు తలెత్తితే దీనికి కూడా ఇబ్బందులు ఏర్పడుతాయి కాబట్టి గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ సీఎండీ రీటా మీనన్ గతంలోనే ప్రభుత్వాన్ని కోరారు.