ప్రగతి మైదాన్‌కు సీఐఎస్‌ఎఫ్ భద్రత | Pragati Maidan gets armed CISF security cover | Sakshi
Sakshi News home page

ప్రగతి మైదాన్‌కు సీఐఎస్‌ఎఫ్ భద్రత

Published Sat, Sep 27 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:00 PM

ప్రగతి మైదాన్‌కు సీఐఎస్‌ఎఫ్ భద్రత

ప్రగతి మైదాన్‌కు సీఐఎస్‌ఎఫ్ భద్రత

న్యూఢిల్లీ: ఎగ్జిబిషన్ల వేదికగా చెప్పుకునే ప్రగతి మైదాన్‌ను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు(సీఐఎస్‌ఎఫ్) కంటికి రెప్పలా కాపాడనున్నాయి. దేశ, విదేశాలకు చెందిన ఏ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనుకున్నా అందుకు ప్రగతి మైదా న్ చిరునామాగా మారుతోంది. ఈ ఎగ్జిబిషన్లను తిలకించేందుకు లక్షల సంఖ్యలో జనం ఇక్కడికి వస్తుంటారు. అంతేకాక కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఇక్కడ ప్రదర్శిస్తుంటారు. దీంతో మాఫి యా, ఉగ్రవాదుల కన్ను ప్రగతి మైదాన్‌పై పడిం దని నిఘావర్గాలు హెచ్చరించడంతో ఇకపై సీఐఎస్‌ఎఫ్ జవాన్లు భద్రత కల్పించనున్నారు.
 
మైదాన్‌లోకి వెళ్లే, బయటకు వచ్చే ద్వారా వద్ద మాత్రమే కాకుండా లోపల ఏర్పాటు చేసిన ప్రదర్శనల వద్ద కూడా సీఐఎస్‌ఎఫ్ బలగాలను మోహరిం చనున్నారు. ఇందుకోసం 100 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఎప్పుడూ ఇక్కడ అందుబాటులో ఉండే లా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
క్విక్ రియాక్షన్ టీమ్‌గా పిలిచే ఈ జవాన్‌లు మైదాన్‌లో వాహనాలపై తిరుగుతూ భద్రతా విధు లు నిర్వర్తిస్తారని సంబంధిత అధికారి ఒకరు తెలి పారు. అవసరమైతే మరింతమంది జవాన్లను కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ‘జాతీయ, అంతర్జాతీయ ఫెయిర్‌లకు ప్రగతి మైదా న్ వేదికగా మారింది. ట్రేడ్ ఫెయిర్, బుక్ ఫెయిర్, ఆటో ఎక్స్‌పో, సెక్యూరిటీ ఎక్స్‌పో, డిఫెన్స్ ఎక్స్‌పో వంటి భారీ ప్రదర్శనలు తరచూ ఇక్కడ జరుగుతున్నాయి. దీంతో ప్రదర్శనలను తిలకించేందుకు వచ్చేవారికి మాత్రమే కాకుండా ప్రదర్శనను ఏర్పాటు చేసిన దేశ, విదేశీ సంస్థలకు కూడా భద్రత కల్పించాల్సిన అవసరముంది.

ఇప్పటిదాకా ప్రైవే టు సెక్యూరిటీ గార్డులతో భద్రత కల్పిస్తున్నాం. అయితే ఈ సెక్యూరిటీ ఉగ్రదాడులను, మాఫియా దాడులను ఎదుర్కొనే స్థాయిలో లేదన్న నివేదికలు అందాయి. పైగా ఉగ్రవాదుల కన్ను కూడా ప్రగతి మైదాన్‌పై పడిందని తరచూ నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఐఎస్‌ఎఫ్‌కు సెక్యూరిటీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించాం. ఇం దుకు సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించి, కేంద్ర హోంశాఖకు పంపించాం.

గతంలో ఐటీపీఓ భద్రత కోసం కూడా ప్రతిపాదనలు పంపాం. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే తాజా గా సీఐఎస్‌ఎఫ్ భద్రత కోసం రూపొందించిన ప్రతి పాదనలపై కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేద’ని సంబంధిత అధికారి ఒకరు తెలి పారు. 124 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మైదాన్‌లో 61,290 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్ భవనాన్ని నిర్మించారు. ఇందులో 16 హాల్స్‌లో ప్రదర్శన లు ఏర్పాటు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. మైదాన్‌తోపాటు భవనాన్ని, భవనంలోని హాళ్లను సీఐఎస్‌ఎఫ్ జవాన్లు రేయింబవళ్లు కాపలా కాయా ల్సి ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement