Kia Motors India Officially Changed To Kia India Private Limited - Sakshi
Sakshi News home page

Kia India: అధికారికంగా కియా పేరు మార్పు.. 

Published Tue, May 25 2021 1:28 PM | Last Updated on Tue, May 25 2021 3:40 PM

Kia India Name Change is Now Official - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా తాజాగా తమ భారత విభాగం పేరును అధికారికంగా మార్చినట్లు వెల్లడించింది. కియా మోటార్స్‌ పేరు.. కియా ఇండియాగా మారినట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న తయారీ ప్లాంటులో లోగో, పేరును ఇప్పటికే మార్చినట్లు.. దశలవారీగా డీలర్‌షిప్‌లలో కూడా ఈ మేరకు మార్పులు చేయనున్నట్లు కియా పేర్కొంది.

కొద్ది రోజుల క్రితమే కియా తమ కొత్త కార్పొరేట్‌ లోగో, అంతర్జాతీయ బ్రాండ్‌ స్లోగన్‌ను ఆవిష్కరించింది. సుమారు ఏడాదిన్నర క్రితం భారత్‌లో అమ్మకాలు ప్రారంభించిన కియా .. అత్యంత వేగంగా 2.5 లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించింది. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న నాలుగో కార్ల బ్రాండ్‌గా నిల్చింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement