దయచేసి వినండి.. ప్రత్యేక రైళ్ల వేళల్లో మార్పులు | Some Special Trains Timings Have Been Changed Says Railway officials | Sakshi
Sakshi News home page

దయచేసి వినండి.. ప్రత్యేక రైళ్ల వేళల్లో మార్పులు

Published Thu, Dec 10 2020 10:41 AM | Last Updated on Thu, Dec 10 2020 11:11 AM

Some Special Trains Timings Have Been Changed Says Railway officials - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ నడుపుతున్న కొన్ని ప్రత్యేక రైళ్లలో తేదీలు, బయలుదేరే సమయం, చేరుకునే సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆయా రైళ్లలో రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు ఈ మార్పులను గమనించి  తమ ప్రయాణాలను కొనసాగించుకోవాలని పేర్కొన్నారు. చదవండి: విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

► భువనేశ్వర్‌–తిరుపతి ప్రత్యేక వారాంతపు రైలు (08479) ఈ నెల 12 నుంచి 26 వరకూ ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బదులు 12.10కి బయలుదేరుతుంది. తిరుపతికి ఉదయం 8.45కి బదులు 8.10కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08480) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12.15కి బదులు 10.25కి తిరుపతిలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు ఉదయం 9.30కి బదులుగా 5.55కే చేరుకుంటుంది. 

► భువనేశ్వర్‌–చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక వారాంతపు రైలు (02839) ఈ నెల 17 నుంచి 31 వరకూ ప్రతి గురువారం ఉదయం 12 గంటలకు బదులుగా 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు ఉదయం 8.55కి బదులు 7.40కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02840) ఈ నెల 18 నుంచి జనవరి 1 వరకూ ప్రతి శుక్రవారం రాత్రి 9.10కి బదులు 10 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు సాయంత్రం 5.25కి బదులు ఉదయం 5.55కి చేరుకుంటుంది. 

► భువనేశ్వర్‌–బెంగళూరు ప్రత్యేక వారాంతపు రైలు (02845) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం ఉదయం 7.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. బెంగళూరుకు ఉదయం 10.50కి బదులు 9.50కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02846) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం ఉదయం 8.25కి బదులు సాయంత్రం 4.45కి బెంగళూరులో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు ఉదయం 11.15కి బదులుగా సాయంత్రం 6.15కి చేరుకుంటుంది. 

► భువనేశ్వర్‌–పుదుచ్చేరి ప్రత్యేక వారాంతపు రైలు (02898) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం ఉదయం 12 గంటలకు బదులు 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. పుదుచ్చేరికి మధ్యాహ్నం 12.40కి బదులుగా 12.10కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02897) ఈ నెల 16 నుంచి 30 వరకూ ప్రతి బుధవారం సాయంత్రం 4.45కి పుదుచ్చేరిలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కి సాయంత్రం 6.55కి బదులు 6.10కే చేరుకుంటుంది. 

► భువనేశ్వర్‌–రామేశ్వరం ప్రత్యేక వారంతపు రైలు (08496) ఈ నెల 11 నుంచి 25 వరకూ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బదులు 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. రామేశ్వరానికి రాత్రి 11 గంటలకు బదులు 10.35కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08495) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం ఉదయం 8.40కి బదులుగా 8.50కి రామేశ్వరంలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు సాయంత్రం 6.55కి బదులు 6.10కే చేరుకుంటుంది. 

► పూరి–చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక వారాంతపు రైలు (02859) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం సాయంత్రం 5.30కి పూరిలో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు మధ్యాహ్నం 2.55కి బదులు 1.50కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02860) ఈ నెల 14 నుంచి 28 వరకూ ప్రతి సోమవారం సాయంత్రం 4.25కి చెన్నై సెంట్రల్‌లో బయలుదేరుతుంది. పూరీకి మధ్యాహ్నం 3.15కి బదులుగా 1.45కే చేరుకుంటుంది. 

► విశాఖపట్నం–హజ్రత్‌ నిజాముద్దీన్‌ ప్రత్యేక రైలు (02851) ఈ నెల 11 నుంచి 28 వరకూ ప్రతి సోమ, శుక్రవారం ఉదయం 8.20కి విశాఖపట్నంలో బయలుదేరుతుంది. హజ్రత్‌ నిజాముద్దీన్‌కు సాయంత్రం 5.10కి బదులు 5 గంటలకే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02852) హజ్రత్‌ నిజాముద్దీన్‌లో ఉదయం 5.50కి బదులు 5.10కి బయలుదేరుతుంది. విశాఖపట్నానికి సాయంత్రం 5.30కి బదులుగా 2.15కే చేరుకుంటుంది. 

► విశాఖపట్నం–చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు (02869) ఈ నెల 14 నుంచి 28 వరకూ ప్రతి సోమవారం రాత్రి 7.05కి విశాఖపట్నంలో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు ఉదయం 8.55కి బదులుగా 7.40కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02870) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం రాత్రి  9.10కి బదులుగా ఉదయం 10 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరుతుంది. విశాఖపట్నానికి ఉదయం 10.30కి బదులుగా రాత్రి 10.30కి చేరుకుంటుంది. 

► విశాఖపట్నం–కడప ప్రత్యేక రైలు (07488) ఈ నెల 12 నుంచి 31 వరకూ ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. కడపకు ఉదయం 7.25కి బదులు 7 గంటలకే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07487) ఈ నెల 13 నుంచి జనవరి 1 వరకూ ప్రతి రోజూ సాయంత్రం 5.05కి బదులు 5.45కి కడపలో బయలుదేరుతుంది. విశాఖపట్నానికి ఉదయం 11.30కి చేరుకుంటుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement