train timings
-
‘వందేభారత్’ వేళలు మార్చండి
సాక్షి, హైదరాబాద్: ‘సికింద్రాబాద్ – విశాఖ’ వందేభారత్ రైలు టైమింగ్ మార్చాలనే డిమాండ్ రైల్వే ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 5:05 గంటలకే బయలుదేరుతుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరానికి నలువైపులా ఉన్నవారు తెల్లవారుజామునే స్టేషన్‌కు చేరుకోవాలి. అయితే ఆ సమాయానికి క్యాబ్‌లు, ఆటోలు బుక్ కావడం లేదు. ఒకవేళ బుక్ అయినా ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నారు. దీంతో ఆ రైలు టైమింగ్ మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. సికింద్రాబాద్–విశాఖ మధ్య ఈ నెల 12న రెండో వందేభారత్ రైలుకు ప్రారంభించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ రైలు ఉదయం 6 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి బయలు దేరాల్సి ఉంది. కానీ, ఆ సమయంలో ఇతర రైళ్లు నడుస్తుండటంతో ఈ రైలును నడపలేని దుస్థితి నెలకొంది. మరో గంట తర్వాత కాస్త నిడివి ఉంది. కానీ, ఉదయం ఏడున్నరకు లింగంపల్లి–విశాఖ మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.10కి సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. అది కూడా వందేభారత్ తరహాలో చైర్‌కార్ ఎక్స్‌ప్రెస్ రైలు. దీంతో విశాఖపట్నానికి రెండు చైర్‌కార్ ఎక్స్‌ప్రెస్‌లు ఒకేసారి బయలుదేరాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో వందేభారత్ రైలును ఉదయం 5.05 సమయాన్ని ఖరారు చేశారు. అయితే ఆ సమయం ప్రయాణికులకు అసౌకర్యంగా మారింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఉదయం ఐదింటిలోపు చేరుకోవాలంటే, దూరప్రాంతాల నుంచి వచ్చే వారు ఉదయం నాలుగింటికల్లా ఇళ్లలో బయలుదేరాలి. ఆ సమయాల్లో ఆటోలు, క్యాబ్‌లు తక్కువగా ఉండటంతో వాటి బుకింగ్ ఇబ్బందిగా మారింది. మూడోలైన్ పూర్తయితేనే... విశాఖకు నడుస్తున్న రెండు వందేభారత్ రైళ్లు వరంగల్ మీదుగా తిరుగుతున్నాయి. ఆ మార్గంలో మూడో లైన్ అందుబాటులో లేదు. ఉన్న రెండు లైన్లమీదుగా వందల సంఖ్యలో రైళ్లు పరుగుపెడుతున్నాయి. ప్రయాణికుల రైళ్లు, సరుకు రవాణా రైళ్లు ఆ రెండు లైన్లమీదుగానే నడపాల్సి వస్తోంది. ఈమార్గంలో మూడోలైన్ పనులు 2017 నుంచి న డుస్తున్నా..తీవ్ర జాప్యం జరుగుతోంది. మూడోలైన్ పూర్తయి తే, మరిన్ని రైళ్లు నడిపేందుకు వీలవుతుంది. ప్రయాణికుల కు అనువైన వేళల్లో నడిపేందుకూ అవకాశం కలుగుతుంది. ఆ రూట్లో నడపలేక.. విశాఖపట్నం మొదటి వందేభారత్ రైలును వరంగల్ రూట్లో నడుపుతున్నందున, రెండో వందేభారత్‌ను నల్లగొండ–నడికుడి– గుంటూరు మార్గంలో తిప్పాలని తొలుత భావించారు. కానీ, ఆ మార్గం ప్రస్తుతం సింగిల్ లైన్‌తో ఉంది. ఎదురుగా ఓ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వస్తే, మిగతా వాటిని ఆయా ప్రాంతాల్లోని స్టేషన్లలో నిలపాలి. ఈ మార్గంలో తిరుపతి వందేభారత్ రైలు నడుస్తోంది. ఆ సింగిల్లైన్ను దాటే సమయంలో చాలా రైళ్లు క్రాసింగ్ సమయంలో నిలిచిపోవాల్సి వస్తోంది. దీంతో ఆ రూట్లో ఇబ్బందులు ఉన్నాయని, వరంగల్రూట్కు మార్చారు. అయినా వెయిటింగ్ జాబితానే.. విశాఖకు నడిచే మొదటి వందేభారత్ రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. దానికి దాదాపు 114 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. కనీసం ఐదారు రోజుల వెయిటింగ్ లిస్టు ఉంటోంది. దీనికి ఆదరణ బాగుందనే రెండో వందేభారత్ రైలు ప్రారంభించారు. ఇది కూడా వందశాతం ఆక్యుపెన్సీ రేషియో దాటి నడుస్తోంది. నాలుగు రోజుల వెయిటింగ్ లిస్టు ఉంటోంది. -
Secunderabad: దసరాకు ప్రత్యేక రైళ్లు.. రైళ్ల వేళల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: దసరా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్. రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్–సంత్రాగచ్చి (07645/ 07646) స్పెషల్ ట్రైన్ ఈ నెల 30న ఉదయం 8.40 గంట లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.25కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు సంత్రాగచ్చి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–షాలిమార్ (07741/07742) స్పెషల్ ట్రైన్‌అక్టోబర్ 2వ తేదీ ఉదయం 4.30 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 2.55కు షాలిమార్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రేపటి నుంచి రైళ్ల వేళల్లో మార్పులు: అక్టోబర్ 1 నుంచి కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు ప్రయాణికులు ఆయా రైళ్ల వేళల సమాచారాన్ని ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలనీ, 139 నెంబర్ నుంచి కూడా రైళ్ల వేళల్లో మార్పులను తెలుసుకోవచ్చునని సీపీఆర్వో తెలిపారు. -
రైళ్ల వేళల్లో మార్పులు.. కొత్త టైంటేబుల్ విడుదల..
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల వేళలను సవరించారు. కొంత కాలంగా రైళ్ల వేగాన్ని పెంచుతూ వస్తున్న అధికారులు ఇటీవల ముఖ్యమైన రైళ్లను గరిష్ట వేగంతో నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వాటి ప్రయాణ సమయం తగ్గింది. మరోపక్క కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ వస్తుండటంతో ఎక్కువ రైళ్లను నడుపుతున్నారు. ఈ రెండు కారణాలతో తాజాగా వాటి వేళలను సవరించారు. సాధారణంగా అవసరాన్ని బట్టి ప్రతి సంవత్సరం సెప్టెంబర్/అక్టోబర్‌లో సమయాలను సవరించటం పరిపాటి. ఇప్పుడు రెండు ప్రత్యేక కారణాలతో వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త సమయాలను అందుబాటులోకి తేనున్నారు. జోన్ పరిధిలో ప్రస్తుతానికి 71 రైళ్ల వేళలను సవరిస్తూ కొత్త టైంటేబుల్‌ను విడుదల చేశారు. 10 నిమిషాల నుంచి గరిష్టంగా 30 నిమిషాల మేర వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అన్ని స్టేషన్లలో కూడా రైళ్ల వేళల మార్పులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త వేళలు అమలులోకి వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌరసంబంధాల అధికారి రాకేశ్ విజ్ఞప్తి చేశారు. చదవండి: Sankranthi: రైళ్లు, బస్సులు ఫుల్.. -
లాక్డౌన్ సడలింపు.. ప్రతి పది నిమిషాలకో మెట్రో!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ముంబైలో కొన్ని లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో రాకపోకలు సాగించే వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, కూలీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో మెట్రో రైళ్ల ట్రిప్పుల సంఖ్య పెంచాలని ఎమ్మెమ్మార్డీయే నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సుమారు 30 శాతం ట్రిప్పులు పెరగనున్నాయి. ఇదివరకు రెండు రైళ్ల మధ్య 15 నిమిషాల వ్యత్యాసముండేది. కానీ సోమవారం నుంచి ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ప్రతి 10 నిమిషాలకు ఒక మెట్రో రైలును నడపాలని ఎమ్మెమ్మార్డీయే నిర్ణయం తీసుకుంది. దీంతో రోజు 130 ట్రిప్పులు మెట్రో రైళ్లు తిరగనున్నాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని.. మొదటి దశలో ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు, రెండో దశలో ఈ నెల ఒకటో తేదీ నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు మాత్రమే అనుమతి ఉండేది. శని, ఆదివాలు బంద్ పాటించాల్సి వచ్చేది. కానీ తాజా సడలింపుల నేపథ్యంలో ఉదయం ఏడు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు షాపులు, ఇతర వ్యాపార సంస్థలు పనిచేసుకునేలా వెసులుబాటు లభించింది. దీంతో శివారు, ఉప నగరాల నుంచి విధులకు వచ్చే ఉద్యోగులు, సిబ్బంది, కార్మికుల సంఖ్య పెరగనుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్ల ట్రిప్పులు పెంచాలని ఎమ్మెమ్మార్డీయే నిర్ణయం తీసుకుంది. రద్దీ తక్కువ ఉండే సమయంలో 15 నిమిషాలకు ఒక రైలు, ఉదయం, సాయంత్రం రద్దీ ఉండే సమయంలో ప్రతీ 10 నిమిషాలకు ఒక రైలు నడపుతున్నట్లు ప్రకటించింది. సిబ్బందికి మొదటి డోసు పూర్తి మెట్రో–1 ప్రాజెక్టులో వర్సోవా–అంధేరీ– ఘాట్కోపర్ మధ్య మెట్రో రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా విడుదల చేసిన టైం టేబుల్ ప్రకారం ప్రతీరోజు ఉదయం 6.50 గంటలకు మొదటి రైలు వర్సోవా స్టేషన్ నుంచి బయలు దేరుతుంది. చివరి రైలు ఘాట్కోపర్ స్టేషన్ నుంచి రాత్రి 10.15 గంటలకు బయలు దేరనుంది. ఉదయం మొదటి రైలు బయలు దేరడానికి 15 నిమిషాల ముందు ప్రయాణికులను స్టేషన్లోకి అనుమతిస్తారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు 18–44 ఏళ్ల మధ్య వయసున్న 400పైగా మెట్రో సిబ్బందికి మొదటి కరోనా డోసు వేసినట్లు మెట్రో–1 తెలిపింది. అలాగే 45 ఏళ్ల పైబడిన సిబ్బందికి మొదటి డోసు ఏప్రిల్‌లోనే వేసినట్లు తెలిపింది. దీంతో కరోనా వైరస్‌పై ప్రయాణికులెవరూ ఆందోళన చెందవద్దని మెట్రో–1 స్పష్టం చేసింది. చదవండి: వామ్మో.. ఆ రాష్ట్రంలో లక్ష దాటిన కరోనా మరణాలు Mumbai: తెలుగువారి కోసం కరోనా టీకా -
దయచేసి వినండి.. ప్రత్యేక రైళ్ల వేళల్లో మార్పులు
సాక్షి, విజయవాడ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ నడుపుతున్న కొన్ని ప్రత్యేక రైళ్లలో తేదీలు, బయలుదేరే సమయం, చేరుకునే సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆయా రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను కొనసాగించుకోవాలని పేర్కొన్నారు. చదవండి: విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు ► భువనేశ్వర్–తిరుపతి ప్రత్యేక వారాంతపు రైలు (08479) ఈ నెల 12 నుంచి 26 వరకూ ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బదులు 12.10కి బయలుదేరుతుంది. తిరుపతికి ఉదయం 8.45కి బదులు 8.10కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08480) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12.15కి బదులు 10.25కి తిరుపతిలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు ఉదయం 9.30కి బదులుగా 5.55కే చేరుకుంటుంది. ► భువనేశ్వర్–చెన్నై సెంట్రల్ ప్రత్యేక వారాంతపు రైలు (02839) ఈ నెల 17 నుంచి 31 వరకూ ప్రతి గురువారం ఉదయం 12 గంటలకు బదులుగా 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు ఉదయం 8.55కి బదులు 7.40కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02840) ఈ నెల 18 నుంచి జనవరి 1 వరకూ ప్రతి శుక్రవారం రాత్రి 9.10కి బదులు 10 గంటలకు చెన్నై సెంట్రల్లో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు సాయంత్రం 5.25కి బదులు ఉదయం 5.55కి చేరుకుంటుంది. ► భువనేశ్వర్–బెంగళూరు ప్రత్యేక వారాంతపు రైలు (02845) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం ఉదయం 7.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. బెంగళూరుకు ఉదయం 10.50కి బదులు 9.50కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02846) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం ఉదయం 8.25కి బదులు సాయంత్రం 4.45కి బెంగళూరులో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు ఉదయం 11.15కి బదులుగా సాయంత్రం 6.15కి చేరుకుంటుంది. ► భువనేశ్వర్–పుదుచ్చేరి ప్రత్యేక వారాంతపు రైలు (02898) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం ఉదయం 12 గంటలకు బదులు 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. పుదుచ్చేరికి మధ్యాహ్నం 12.40కి బదులుగా 12.10కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02897) ఈ నెల 16 నుంచి 30 వరకూ ప్రతి బుధవారం సాయంత్రం 4.45కి పుదుచ్చేరిలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కి సాయంత్రం 6.55కి బదులు 6.10కే చేరుకుంటుంది. ► భువనేశ్వర్–రామేశ్వరం ప్రత్యేక వారంతపు రైలు (08496) ఈ నెల 11 నుంచి 25 వరకూ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు బదులు 12.10కి భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. రామేశ్వరానికి రాత్రి 11 గంటలకు బదులు 10.35కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08495) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం ఉదయం 8.40కి బదులుగా 8.50కి రామేశ్వరంలో బయలుదేరుతుంది. భువనేశ్వర్‌కు సాయంత్రం 6.55కి బదులు 6.10కే చేరుకుంటుంది. ► పూరి–చెన్నై సెంట్రల్ ప్రత్యేక వారాంతపు రైలు (02859) ఈ నెల 13 నుంచి 27 వరకూ ప్రతి ఆదివారం సాయంత్రం 5.30కి పూరిలో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు మధ్యాహ్నం 2.55కి బదులు 1.50కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02860) ఈ నెల 14 నుంచి 28 వరకూ ప్రతి సోమవారం సాయంత్రం 4.25కి చెన్నై సెంట్రల్లో బయలుదేరుతుంది. పూరీకి మధ్యాహ్నం 3.15కి బదులుగా 1.45కే చేరుకుంటుంది. ► విశాఖపట్నం–హజ్రత్ నిజాముద్దీన్ ప్రత్యేక రైలు (02851) ఈ నెల 11 నుంచి 28 వరకూ ప్రతి సోమ, శుక్రవారం ఉదయం 8.20కి విశాఖపట్నంలో బయలుదేరుతుంది. హజ్రత్ నిజాముద్దీన్‌కు సాయంత్రం 5.10కి బదులు 5 గంటలకే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02852) హజ్రత్ నిజాముద్దీన్‌లో ఉదయం 5.50కి బదులు 5.10కి బయలుదేరుతుంది. విశాఖపట్నానికి సాయంత్రం 5.30కి బదులుగా 2.15కే చేరుకుంటుంది. ► విశాఖపట్నం–చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైలు (02869) ఈ నెల 14 నుంచి 28 వరకూ ప్రతి సోమవారం రాత్రి 7.05కి విశాఖపట్నంలో బయలుదేరుతుంది. చెన్నై సెంట్రల్‌కు ఉదయం 8.55కి బదులుగా 7.40కే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02870) ఈ నెల 15 నుంచి 29 వరకూ ప్రతి మంగళవారం రాత్రి 9.10కి బదులుగా ఉదయం 10 గంటలకు చెన్నై సెంట్రల్లో బయలుదేరుతుంది. విశాఖపట్నానికి ఉదయం 10.30కి బదులుగా రాత్రి 10.30కి చేరుకుంటుంది. ► విశాఖపట్నం–కడప ప్రత్యేక రైలు (07488) ఈ నెల 12 నుంచి 31 వరకూ ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. కడపకు ఉదయం 7.25కి బదులు 7 గంటలకే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07487) ఈ నెల 13 నుంచి జనవరి 1 వరకూ ప్రతి రోజూ సాయంత్రం 5.05కి బదులు 5.45కి కడపలో బయలుదేరుతుంది. విశాఖపట్నానికి ఉదయం 11.30కి చేరుకుంటుంది. -
మారనున్న రైళ్ల వేళలు!
హైదరాబాద్: రామగుండం-పెద్దంపేట మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా కొన్ని రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో మంగళవారం తెలిపారు. ఈనెల 4 నుంచి 6 వరకు ఈమేరకు మార్పులు అమలవుతాయని పేర్కొన్నారు. ఈనెల 4న రద్దయిన రైలు: సిర్పూర్- కాజీపేట మధ్య నడిచే నంబర్ 57122 రామగిరి ప్యాసింజర్. 4న పాక్షికంగా రద్దయిన రైలు: భద్రాచలం- సిర్పూర్ మధ్య నంబర్ 57123 సింగరేణి ప్యాసింజర్ వరంగల్ వరకే నడుస్తుంది. హైదరాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్ నంబర్ 17011 ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రామగుండం వరకే నడుపుతారు. అలాగే, నంబర్ 17012 రైలు ఉదయం 11.45 గంటలకు రామగుండం నుంచి సికింద్రాబాద్ వైపు బయలుదేరుతుంది. నంబర్ 17035 సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కాజీపేట్ వరకు నడుస్తుంది. నంబర్ 17036 రైలు కాజీపేట్ నుంచి సాయంత్రం 5.35 గంటలకు సికింద్రాబాద్‌కు బయలుదేరుతుంది. కరీంనగర్-సిర్పూర్ ప్యాసింజర్ పెద్దపల్లి వరకే నడుస్తుంది. నంబర్ 77256 రైలు సాయంత్రం 1.40 గంటలకు పెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు బయలుదేరుతుంది. సికింద్రాబాద్ నుంచి పాట్నా వెళ్తే 12791 నంబర్ రైలు ఉదయం 10 గంటలకు బదులు 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. బల్లార్షా- భద్రాచలం రోడ్ సింగరేణి ఎక్స్‌ప్రెస్ కూడా 30 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. 5వ తేదీన వేళలు మారిన రైళ్లు: జమ్మూతావి-చెన్నై అండమాన్ ఎక్స్‌ప్రెస్, పాట్నా-సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ- చెన్నై గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్ కొద్ది ఆలస్యంతో నడుస్తాయి. 6వ తేదీన రద్దయిన రైలు: సిర్పూర్- కాజీపేట్ రామగిరి ప్యాసింజర్ రైలు పాక్షికంగా రద్దయిన రైళ్లు: భద్రాచలం- సిర్పూర్ టౌన్ సింగరేణి ఎక్స్‌ప్రెస్ వరంగల్ వరకే నడుస్తుంది. సిర్పూర్-సికింద్రాబాద్ నంబర్ 17035 తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను రామగుండం వరకే నడుపుతారు. నంబర్ 17036 రామగుండం నుంచి 6వ తేదీ సాయంత్రం 3.40 గంటలకు సికింద్రాబాద్ బయలుదేరుతుంది. అలాగే, కరీంనగర్- సిర్పూర్ టౌన్ డెమూ పెద్దపల్లి వరకే నడుస్తుంది. నంబర్ 77256 రైలు పెద్దపల్లి నుంచి సాయంత్రం 1.40 గంటలకు కరీంనగర్‌కు బయలుదేరుతుంది. సిర్పూర్- సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11 గంటలకు బదులు 11.45 గంటలకు బయలుదేరుతుంది. -
ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు సమయం మార్పు
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్ల వలసిన ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ రోజు మధ్యాహ్నం 3.25 గం.కు బయలుదేరుతుందని దక్షిణమధ్య రైల్వే ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అసలు అయితే ఉదయం 6.25 గం.కు ఏపీ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరవలసి ఉంది. కానీ దట్టమైన పొగమంచు ఆవరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.