Secunderabad: దసరాకు ప్రత్యేక రైళ్లు.. రైళ్ల వేళల్లో మార్పులు | Special Trains From Secunderabad For Dussehra, Train Timings Changed | Sakshi
Sakshi News home page

Secunderabad: దసరాకు ప్రత్యేక రైళ్లు.. రైళ్ల వేళల్లో మార్పులు

Published Fri, Sep 30 2022 8:15 AM | Last Updated on Fri, Sep 30 2022 8:28 AM

Special Trains From Secunderabad For Dussehra, Train Timings Changed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దసరా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌. రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌–సంత్రాగచ్చి (07645/ 07646) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 30న ఉదయం 8.40 గంట లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.25కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్‌ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు సంత్రాగచ్చి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌–షాలిమార్‌ (07741/07742) స్పెషల్‌ ట్రైన్‌అక్టోబర్‌ 2వ తేదీ ఉదయం 4.30 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్‌ 3వ తేదీ మధ్యాహ్నం 2.55కు షాలిమార్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.  

రేపటి నుంచి రైళ్ల వేళల్లో మార్పులు: అక్టోబర్‌ 1 నుంచి కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు ప్రయాణికులు ఆయా రైళ్ల వేళల సమాచారాన్ని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవాలనీ, 139 నెంబర్‌ నుంచి కూడా రైళ్ల వేళల్లో మార్పులను తెలుసుకోవచ్చునని సీపీఆర్వో తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement