Santragachi
-
Secunderabad: దసరాకు ప్రత్యేక రైళ్లు.. రైళ్ల వేళల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: దసరా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్. రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్–సంత్రాగచ్చి (07645/ 07646) స్పెషల్ ట్రైన్ ఈ నెల 30న ఉదయం 8.40 గంట లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.25కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు సంత్రాగచ్చి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–షాలిమార్ (07741/07742) స్పెషల్ ట్రైన్‌అక్టోబర్ 2వ తేదీ ఉదయం 4.30 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 2.55కు షాలిమార్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రేపటి నుంచి రైళ్ల వేళల్లో మార్పులు: అక్టోబర్ 1 నుంచి కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు ప్రయాణికులు ఆయా రైళ్ల వేళల సమాచారాన్ని ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలనీ, 139 నెంబర్ నుంచి కూడా రైళ్ల వేళల్లో మార్పులను తెలుసుకోవచ్చునని సీపీఆర్వో తెలిపారు. -
7 నుంచి చెన్నై సంత్రాగచ్చి వీక్లీ స్పెషల్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంత్రాగచ్చి – చెన్నై – సంత్రాగచ్చి మధ్య స్పెషల్ రైలు నడపాలని నిర్ణయించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం జి.సునీల్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నై – సంత్రాగచ్చి (06058) వీక్లీ స్పెషల్ రైలు ప్రతీ బుధవారం చెన్నైలో మధ్యాహ్నం 3.15గంటలకు బయల్దేరి గురువారం తెల్లవారు 4.40గంటలకు దువ్వాడ చేరుకుని అక్కడి నుంచి 4.42గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 7గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. ఈ రైలు ఆగస్టు 7వ తేదీ నుంచి సెప్టెంబరు 25 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో సంత్రాగచ్చి – చెన్నై సెంట్రల్ వీక్లీ స్పెషల్ (06057) సంత్రాగచ్చిలో ప్రతీ గురువారం మధ్య రాత్రి 11.50గంటలకు బయల్దేరి శుక్రవారం మధ్యాహ్నం 3.15గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 3.17గంటలకు బయల్దేరి శనివారం ఉదయం 5.30గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు ఆగస్టు 8 నుంచి సెప్టెంబరు 26 వరకు నడుస్తుంది. ఈ వీక్లీ స్పెషల్ రైలు 1 ఏసీ టూ టైర్, 4 ఏసీ త్రీ టైర్, 12 స్లీపర్ క్లాస్, 2 సెకండ్ క్లాస్ కం లగేజీ కోచ్‌లతో నడుస్తుంది. పురూలియా – విల్లుపురం రైలు రీ షెడ్యూల్ పురూలియాలో సోమవారం ఉదయం 10.30గంటలకు బయల్దేరవలసిన పురూలియా – విల్లుపురం(22605)ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 1.30 గంటలకు బయల్దేరినట్లు, దీనికనుగుణంగా ఈ రైలు మూడు గంటలు ఆలస్యంగా ఆయా స్టేషన్లకు చేరుకోనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. -
పలు రైళ్లు రద్దు : ఈస్ట్ కోస్ట్ రైల్వే
-
పలు రైళ్లు రద్దు : ఈస్ట్ కోస్ట్ రైల్వే
పై-లీన్ తుపాన్ ప్రభావంతో ఒడిశాలోని భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపింది. చెన్నై - హౌరా ఎక్స్‌ప్రెస్, చెన్నై - హౌరా మెయిల్ రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. ముజఫర్‌నగర్- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 7 గంటల ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపింది. అలాగే హౌరా - కన్యాకుమారీ 15 గంటలు, తిరుపతి - భువనేశ్వర్, షాలిమార్ - యశ్వంత్ పూర్, పురులియా - విల్లుపురం ఎక్స్‌ప్రెస్ రైళ్లు 8 గంటలు, యశ్వంత్ పూర్ - హౌరా 12 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఈస్ట్‌కోస్ట్ పేర్కొంది. సంత్రగచ్చి- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైల్‌ను ఖరగ్‌పూర్ మీదగా మళ్లిస్తున్నట్లు తెలిపింది.