7 నుంచి చెన్నై సంత్రాగచ్చి వీక్లీ స్పెషల్‌ | Santragachi to Chennai Weekly Special Train Service | Sakshi
Sakshi News home page

7 నుంచి చెన్నై సంత్రాగచ్చి వీక్లీ స్పెషల్‌

Published Tue, Jul 16 2019 12:39 PM | Last Updated on Tue, Jul 23 2019 1:22 PM

Santragachi to Chennai Weekly Special Train Service - Sakshi

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంత్రాగచ్చి – చెన్నై – సంత్రాగచ్చి మధ్య స్పెషల్‌ రైలు నడపాలని నిర్ణయించినట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం జి.సునీల్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నై – సంత్రాగచ్చి (06058) వీక్లీ స్పెషల్‌ రైలు ప్రతీ బుధవారం చెన్నైలో మధ్యాహ్నం 3.15గంటలకు బయల్దేరి గురువారం తెల్లవారు 4.40గంటలకు దువ్వాడ చేరుకుని అక్కడి నుంచి 4.42గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 7గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. ఈ రైలు ఆగస్టు 7వ తేదీ నుంచి సెప్టెంబరు 25 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో సంత్రాగచ్చి – చెన్నై సెంట్రల్‌ వీక్లీ స్పెషల్‌ (06057) సంత్రాగచ్చిలో ప్రతీ గురువారం మధ్య రాత్రి 11.50గంటలకు బయల్దేరి శుక్రవారం మధ్యాహ్నం 3.15గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 3.17గంటలకు బయల్దేరి శనివారం ఉదయం 5.30గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు ఆగస్టు 8 నుంచి సెప్టెంబరు 26 వరకు నడుస్తుంది. ఈ వీక్లీ స్పెషల్‌ రైలు 1 ఏసీ టూ టైర్, 4 ఏసీ త్రీ టైర్, 12 స్లీపర్‌ క్లాస్, 2 సెకండ్‌ క్లాస్‌ కం లగేజీ కోచ్‌లతో నడుస్తుంది.

పురూలియా – విల్లుపురం రైలు రీ షెడ్యూల్‌
పురూలియాలో సోమవారం ఉదయం 10.30గంటలకు బయల్దేరవలసిన పురూలియా – విల్లుపురం(22605)ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 1.30 గంటలకు బయల్దేరినట్లు, దీనికనుగుణంగా ఈ రైలు మూడు గంటలు ఆలస్యంగా ఆయా స్టేషన్‌లకు చేరుకోనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement