పలు రైళ్లు రద్దు : ఈస్ట్ కోస్ట్ రైల్వే | Trains cancellation due to phailin cyclone, says east coast railway | Sakshi
Sakshi News home page

పలు రైళ్లు రద్దు : ఈస్ట్ కోస్ట్ రైల్వే

Published Tue, Oct 15 2013 10:08 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM

Trains cancellation due to phailin cyclone, says east coast railway

పై-లీన్ తుపాన్ ప్రభావంతో ఒడిశాలోని భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపింది.

 

చెన్నై - హౌరా ఎక్స్ప్రెస్, చెన్నై - హౌరా మెయిల్ రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. ముజఫర్నగర్- యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ 7 గంటల ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపింది. అలాగే హౌరా - కన్యాకుమారీ 15 గంటలు, తిరుపతి - భువనేశ్వర్, షాలిమార్ - యశ్వంత్ పూర్, పురులియా - విల్లుపురం ఎక్స్ప్రెస్ రైళ్లు 8 గంటలు, యశ్వంత్ పూర్ - హౌరా 12 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఈస్ట్కోస్ట్ పేర్కొంది. సంత్రగచ్చి- ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైల్ను ఖరగ్పూర్ మీదగా మళ్లిస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement