అండమాన్ సముద్రం నుంచి దూసుకొస్తున్న దానా తుపాను ముప్పు నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈస్ట్‌కోస్ట్ పరిధిలోని భువనేశ్వర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌కు సేవలందించే 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నెల 23 నుంచి ఒడిశాలోని తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వర్షాలూ కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం సోమవారం ఉదయం అల్పపీడనంగా.. 22న వాయుగుండంగా బలం పుంజుకుని బుధవారం (23న) ఇది దానా తుపానుగా మారనుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తీర్పు తీర ప్రాంతాల దానా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ తరుణంలో తీర్పుతీర ప్రాంతాలకు రైల్వే సేవలందించే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి చెందిన 34రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే నోట్‌ను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment