trains canceled
-
దానా ఎఫెక్ట్..రద్దయిన 34 రైళ్లు ఇవే
అండమాన్ సముద్రం నుంచి దూసుకొస్తున్న దానా తుపాను ముప్పు నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈస్ట్‌కోస్ట్ పరిధిలోని భువనేశ్వర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌కు సేవలందించే 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 23 నుంచి ఒడిశాలోని తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వర్షాలూ కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం సోమవారం ఉదయం అల్పపీడనంగా.. 22న వాయుగుండంగా బలం పుంజుకుని బుధవారం (23న) ఇది దానా తుపానుగా మారనుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తీర్పు తీర ప్రాంతాల దానా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ తరుణంలో తీర్పుతీర ప్రాంతాలకు రైల్వే సేవలందించే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి చెందిన 34రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే నోట్‌ను విడుదల చేసింది. -
గోదావరి ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు రద్దు: సౌత్ సెంట్రల్ రైల్వే
సాక్షి,హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో రైళ్లు భారీగా రద్దవుతున్నాయి. తాజాగా గోదావరి ఎక్స్‌ప్రెస్ సహా 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదివారం సేవలందించాల్సిన హైదరాబాద్- విశాఖ- హైదరాబాద్ (12728/12727) గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు మొత్తం 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తాజా బులిటెన్ విడుదల చేసింది. భారీ వర్షాలకు పట్టాలపై వరదనీరు చేరడంతో మరో 15 రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్-భువనేశ్వర్ మధ్య సర్వీసులందించే విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016) రైలును ఈ సాయంత్రం 4.50 గంటలకు బదులుగా సాయంత్రం 6.50గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది. మరోవైపు, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తాజా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. రైలు సర్వీసుల పునరుద్ధరణ, భద్రతాపరమైన చర్యలపై ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ వద్ద అధికారులతో చర్చించారు. -
AP: పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్లోని అనకాపల్లి–తాడి సెక్షన్ల మధ్య జరుగుతున్న ట్రాఫిక్ బ్లాక్ పనుల కారణంగా ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు పలు రైళ్లను పూర్తిగా, మరి కొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రద్దయిన రైళ్లు: మచిలీపట్నం–విశాఖపట్నం (17219) రైలు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు, విశాఖపట్నం–మచిలీపట్నం (17220) రైలు ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 4 వరకు, విజయవాడ–విశాఖపట్నం (22702/22701) రైళ్లు సెప్టెంబర్ 2, 4 తేదీల్లో, రాజమండ్రి–విశాఖపట్నం (07466/07467), గుంటూరు–విశాఖపట్నం (17239), కాకినాడ పోర్టు–విశాఖపట్నం (17267/17268) రైళ్లు సెప్టెంబర్ 4న, విశాఖపట్నం–గుంటూరు (17240) రైలు సెప్టెంబర్ 5న రద్దు చేశారు. పాక్షికంగా రద్దు: తిరుపతి–విశాఖపట్నం (22708) రైలు సెప్టెంబర్ 1, 3 తేదీల్లో, విశాఖపట్నం–తిరుపతి (22707) సామర్లకోట–విశాఖపట్నం మధ్య సెప్టెంబర్ 3, 5 తేదీల్లో, విజయవాడ–విశాఖపట్నం (12718/12717) రైళ్లు విశాఖపట్నం–అనకాపల్లి మధ్య ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశారు. చదవండి: AP: కార్ల అమ్మకాలు రయ్ రయ్ -
Trains Cancelled: కరోనా ఎఫెక్ట్.. 55 రైళ్లు రద్దు..
సాక్షి, హైదరాబాద్/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్ల రాకపోకలపై మళ్లీ కోవిడ్ ప్రభావం పడింది. రద్దీ నియంత్రణకుగాను మళ్లీ రైళ్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజులుగా కోవిడ్ కేసులు తీవ్రమవుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే 55 అన్రిజర్వ్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల (అప్ అండ్ డౌన్ జతలు)ను ఈ నెల 24 వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అన్రిజర్వ్డ్ మూలాన సీట్ల సంఖ్యకు మించి టికెట్లు జారీ చేస్తుండటంతో ఈ రైళ్లలో కొంత రద్దీ ఉంటోందని, ఇది కోవిడ్ కేసులు మరింత పెరిగేందుకు కారణమవుతుందని అధికారులు భావిస్తున్నారు. చదవండి: కోవిడ్ పాజిటివా! ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో తగు నిర్ణయం తీసుకోవాలని ఇటీవల రైల్వే బోర్డు ఆదేశించడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ రద్దు నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో పరిస్థితిని అంచనా వేసి వీటిని తిరిగి ప్రారంభించాలా, మరిన్ని రైళ్లను రద్దు చేయాలా అన్న విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దయిన వాటిలో విజయవాడ–నర్సాపూర్, మచిలీపట్నం–విజయవాడ, మచిలీపట్నం–గుడివాడ, నర్సాపూర్–నిడదవోలు, బిట్రగుంట–చెన్నై సెంట్రల్, తెనాలి–రేపల్లె, కర్నూలు సిగా–గుంతకల్లు, డోన్–గుత్తి, తిరుపతి–కాట్పాడ్, సికింద్రాబాద్–ఉమ్ధానగర్, మేడ్చల్–సికింద్రాబాద్, కాచిగూడ–నడికుడి, కర్నూలు–కాచిగూడ తదితర రైళ్లు ఉన్నాయి. -
తుపాను దృష్ట్యా పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): జవాద్ తుపాను తీవ్రత దృష్ట్యా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా విజయవాడ మీదుగా నడుస్తోన్న పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దు చేసిన రైళ్లు ఇవే... ఈ నెల 4 న యశ్వంతపూర్–పూరి (22884), రాయగడ–గుంటూరు (17244), భువనేశ్వర్–తిరుపతి (22879), హౌరా–సికింద్రాబాద్ (12703), హౌరా–యశ్వంతపూర్ (12245), భువనేశ్వర్–ముంబై సిఎస్టి (11020), హౌరా–తిరుపతి (20889), చెన్నై సెంట్రల్–హౌరా (12842), హైదరాబాద్–హౌరా (18046), డిబ్రుగర్–కన్యాకుమారి (15906), యశ్వంతపూర్–కామాఖ్య (12551), యశ్వంతపూర్–హౌరా (12864), యశ్వంతపూర్–భాగల్పూర్ (12253), కన్యాకుమారి–హౌరా (12666).. ఈ నెల 5న చెన్నై సెంట్రల్–సత్రగచ్చి (22808), షాలీమార్–త్రివేండ్రం సెంట్రల్ (22642), హౌరా–తిరుచురాపల్లి (12663), తిరుపతి–భువనేశ్వర్ (22880), తిరుపతి–హౌరా (20890), యశ్వంతపూర్–టాటా (12890), భువనేశ్వర్–బెంగళూరు (18463/12845), భువనేశ్వర్–సికింద్రాబాద్ (17015), పూరి–ఓఖా(20871), భువనేశ్వర్–తిరుపతి (22871), రాయగడ–గుంటూరు (17244), పూరి–తిరుపతి (17479), పూరి–చెన్నై సెంట్రల్ (22859), భువనేశ్వర్–ముంబై సీఎస్టీ (11020), తిరుపతి–భువనేశ్వర్ (22880), చెన్నై సెంట్రల్–హౌరా (12842) రైళ్లు రద్దు. ఈ నెల 5, 6 తేదీల్లో మైసూర్–హౌరా (22818) 6, 7 తేదీల్లో గౌహతి–బెంగళూరు (12510), 7న బెంగళూరు–హతియా (18638), ఆగర్తల–బెంగళూరు (02984) రైళ్లు రద్దు. -
Cyclone Jawad: బలపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాఖాళాతంలో జవాద్ తుపానుగా మారుతుందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది తరువాత వాయవ్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించి శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో 2రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45–65 కిలోమీటర్లు, శనివారం 70–90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. తుపాను కారణంగా 95 రైళ్లు రద్దు గురు, శుక్ర, శనివారాల్లో 95 రైళ్లను నిలిపివేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖుర్ధా డివిజన్ కార్యాలయం స్పష్టం చేసింది. ఇందులో విజయవాడ మీదుగా ప్రయాణించే 41 ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి తుపాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కలెక్టర్లను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గురువారం ఉదయం ఆయన వైఎస్సార్ జిల్లా పర్యటనకు వెళ్లే ముందు ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, సీఎంవో కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాన్ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. ఉత్తరాంధ్రలో తుపాను సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్.అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాకు శ్యామలరావును నియమించారు. వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాను సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. -
రైళ్లకు గులాబ్ ఎఫెక్ట్
విజయనగరం టౌన్/ తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): గులాబ్ తుపాను నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దయినట్లు, మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు. 27వ తేదీ రద్దయిన రైళ్లు రూర్కెలా–జగదల్పూర్ స్పెషల్ (08107), భువనేశ్వర్–జగదల్పూర్ స్పెషల్ (08445), విశాఖ–రాయగడ స్పెషల్ (08508), విశాఖ–కిరండూల్ (08516), కోర్బా–విశాఖ స్పెషల్ (08517), విశాఖ–కోర్బా స్పెషల్ (08518), భువనేశ్వర్–జునాఘర్ రోడ్ స్పెషల్ (02097). 28వ తేదీ రద్దయిన రైళ్లు రాయగడ–విశాఖ స్పెషల్ (08507), జగదల్పూర్–రూర్కెలా స్పెషల్ (08108), జగదల్పూర్–భువనేశ్వర్ స్పెషల్ (08446), జునాఘర్ రోడ్డు–భువనేశ్వర్ స్పెషల్ (02098). 27న రీషెడ్యూల్ చేసిన రైళ్లు ► విశాఖ–గుంటూరు (07240) రైలు 3 గంటలు ఆలస్యంగా ఉదయం 10.10 గంటలకు విశాఖ నుంచి బయల్దేరింది. ► విశాఖ– హజరత్ నిజాముద్దీన్ (02851) రైలు 3 గంటలు ఆలస్యంగా ఉదయం 11.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరింది. ► చెన్నైలో 27వ తేదీ ఉదయం 7 గంటలకు బయల్దేరాల్సిన చెన్నై సెంట్రల్–హౌరా స్పెషల్ (02544) రైలు 15 గంటలు ఆలస్యంగా రాత్రి 10.30 గంటలకు బయల్దేరింది. ► చెన్నైలో 27వ తేదీ రాత్రి 7.15 గంటలకు బయల్దేరాల్సిన చెన్నై సెంట్రల్–హౌరా స్పెషల్ (02822) రైలు 28వ తేదీ ఉదయం 9.30 గంటలకు బయల్దేరుతుంది. హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు రైళ్ల రాకపోకల వివరాలను 08922–221202, 221206/ 089128–83331, 83332, 83333, 833334 నంబర్లకు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు. జారిపడ్డ మట్టిదిబ్బలు, కొండచరియలు అనంతగిరి/తాడేపల్లి రూరల్: భారీ వర్షాలకు విశాఖ ఏజెన్సీ కొత్తవలస–కిరండూల్ మార్గం (కేకే లైన్)లో బొర్రా–చిమిడిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య, శివలింగపురం 47వ కిలోమీటర్ వద్ద రెండు చోట్ల మట్టిదిబ్బలు జారి రైల్వేట్రాక్‌పై పడ్డాయి. దీంతో ఈ మార్గంలో ఉదయం నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) పరిధిలో సీతానగరం పుష్కర్ ఘాట్‌కు వెళ్లే దారిలో కొండచరియలు జారిపడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కోవిడ్ కారణంగా ప్రయాణికులు లేక పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రద్దు చేసిన ప్రత్యేక రైళ్లు ఇవే.. ► చెన్నై సెంట్రల్–హైదరాబాద్ (02603/02604), నర్సాపూర్–నిడదవోలు (07241/07242), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (07237/07238) రైళ్లను ఈ నెల 16 వతేదీ నుంచి జూలై 15 వరకు.. ► చెన్నై సెంట్రల్–నాందేడ్ మధ్య నడిచే ప్రత్యేక రైలు ఈ నెల 18 నుంచి జూలై 17 వరకు .. ► తిరుపతి–చెన్నై సెంట్రల్ (06204/06203) ఈ నెల 16వ తేదీ నుంచి రద్దు చేశారు. -
‘యాస్’ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ‘యాస్’ తుపాను కారణంగా విజయవాడ మీదుగా నడిచే 21 ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. 23న మైసూర్–హౌరా (08118), 24న యశ్వంత్‌పూర్–భువనేశ్వర్ (02846), చెన్నై సెంట్రల్–పూరీ (02860),ఎర్నాకులం–హౌరా (02878), గౌహతి–యశ్వంత్‌పూర్ (06578) రైళ్లు రద్దయ్యాయి. 25న హౌరా–వాస్కోడిగామా (08047/08048), హౌరా–యశ్వంత్‌పూర్ (06598), అగర్తలా–బెంగళూరు (02516/02516)రైళ్లు, 26న గౌహతి–సికింద్రాబాద్ (07029),విల్లుపురం–పురులియా (06170), యశ్వంత్‌పూర్–ముజఫర్‌పూర్ (05227) రైళ్లు రద్దయినట్లు పేర్కొన్నారు. 28న న్యూటిన్‌సూకియా–బెంగళూరు (02250), 29న యశ్వంత్‌పూర్–బాగల్పూర్ (02253), యశ్వంత్‌పూర్–కామాఖ్య (02551) రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు. హౌరా–హైదరాబాద్ ప్రత్యేక రైలు (08645/08646) ఈ నెల 24 నుంచి 27 వరకు, ఈ నెల 26, 27న బయలుదేరాల్సిన విల్లుపురం–కాగజ్‌నగర్ (06178/06177), 27, 28న బయలుదేరాల్సిన బెంగళూరు–గౌహతి (02509)లను రద్దు చేసినట్లు వివరించారు. -
Cyclone Yaas: యాస్ తుపాను.. పలు రైళ్ల రద్దు
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): యాస్ తుపాను కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏ.కే.త్రిపాఠీ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో ముంబయి–భువనేశ్వర్(01019)కోణా ర్క్ స్పెషల్, 25,26 తేదీల్లో భువనేశ్వర్–ముంబై(01020) కోణార్క్, 24, 25 తేదీల్లో యశ్వంత్‌పూర్–హౌరా (02246) స్పెషల్, 25, 26 తేదీల్లో హౌరా–యశ్వంత్‌పూర్(02245) స్పెషల్, 24, 25 తేదీల్లో గౌహతి–బెంగళూరు (02510) స్పెషల్, 23న నాగర్‌కోయల్–షాలిమార్ (02659), 26న షాలిమార్–నాగర్‌కోయల్ (02660) స్పెషల్, 24న హౌరా–కన్యాకుమారి (02665), 25, 26, 27న హౌరా–సికింద్రాబాద్ (02703)స్పెషల్, 24, 25, 26న సికింద్రాబాద్–హౌరా (02704), 24, 25, 26న హౌరా–చెన్నై సెంట్రల్ (02821) స్పెషల్, 24, 25, 26న చెన్నై సెంట్రల్–హౌరా (02822) స్పెషల్, 23, 24న అహ్మదాబాద్–పూరి (02844), 25, 27న పూరి – అహ్మదాబాద్ (028 43) స్పెషల్, 24, 25, 26న హౌరా – యశ్వంత్‌పూర్(02873), 24, 25, 26న యశ్వంత్‌పూర్–హౌరా (02874) స్పెషల్, 24న ముజఫర్‌పూర్–యశ్వంత్‌పూర్ (05228) స్పెషల్, 24, 25, 26న సికింద్రాబాద్–çభువనేశ్వర్ (07016) స్పెషల్, 26, 27, 28న భువనేశ్వర్–సికింద్రాబా ద్ (070 15) స్పెషల్, 24, 25, 26న తిరుపతి–పూరి (07479)స్పెషల్, 26, 27, 28న పూరి–తిరుపతి (07480) స్పెషల్, 25, 26 తేదీల్లో బెంగళూరు–భువనేశ్వర్ (08464)స్పెషల్, 26, 27 తేదీల్లో భువనేశ్వర్–బెంగళూరు (08463) స్పెష ల్, 25న బెంగళూరు–న్యూటిన్సుకియా (022 49) స్పెషల్, 25న షాలిమార్–త్రివేండ్రం (026 42) స్పెషల్, 24, 25 తేదీల్లో ఎర్నాకుళం–పాట్నా (02643) స్పెషల్, 25న తిరుచ్చిరాపల్లి–హౌరా (02664) స్పెషల్, 25న సికింద్రాబాద్–షాలిమా ర్(02774) స్పెషల్, 26న షాలిమార్–సికింద్రాబాద్ (02773) స్పెషల్, 25న సంత్రాగచ్చి–చెన్నై (02807) స్పెషల్, 24న న్యూటిన్సుకియా – తాంబరం (05930) స్పెషల్, 26న భాగల్పూర్–యశ్వంత్‌పూర్ (02254) స్పెషల్, 26న జసిద్ది – తాంబరం (02376), 25న త్రివేండ్రం–సిల్చార్(02507), 26న కామాఖ్య–యశ్వంత్‌పూర్ (02 552) స్పెషల్, చెన్నై సెంట్రల్–న్యూజల్పయ్‌గురి, 27న భువనేశ్వర్–చెన్నై (02839) స్పెషల్, 26న యశ్వంత్‌పూర్–హౌరా (02864) స్పెషల్, పుదుచ్చేరి–హౌరా (02868) రైళ్లను రద్దు చేశారు. చదవండి: ఆనందయ్య కరోనా మందుకు వారం పాటు బ్రేక్ గుంత తవ్వేందుకు ప్రయత్నం.. వెలుగులోకి షాకింగ్ నిజం -
కరోనా: ప్రయాణికులు లేకపోవడంతో 10 రైళ్లు రద్దు
సాక్షి, విజయవాడ: ప్రయాణికుల సంఖ్య తగినంతగా లేకపోవడంతో 10 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి మే 31 వరకు ఐదు రైళ్లను రద్దు చేసింది. నర్సాపూర్–నిడదవోలు(07241), నిడదవోలు–నర్సాపుర్ (07242), సికింద్రాబాద్–బీదర్(07010), బీదర్–హైదరాబాద్ (07009), సికింద్రాబాద్–కర్నూలు సిటీ (07027)లు రద్దయ్యాయి. కర్నూలు సిటీ–సికింద్రాబాద్(07028)ఈ నెల 29 నుంచి జూన్ 1 వరకు రద్దు చేశారు. మైసూర్–రేణిగుంట(01065)రైలును ఈ నెల 30 నుంచి వచ్చే నెల 28వరకు రద్దు చేశారు. రేణిగుంట–మైసూర్(01066) రైలును మే 1 నుంచి 29 వరకు రద్దు చేయగా, సికింద్రాబాద్–ముంబాయి ఎల్టీటీ(02235) రైలును ఈ నెల 30 నుంచి వచ్చే నెల 28 వరకు, ముంబాయి ఎల్టీటీ–సికింద్రాబాద్(02236) రైలును మే 1 నుంచి మే 29 వరకు రద్దు చేశారు. చదవండి: ఏపీ: వాహన విక్రయాల్లో జోష్ విదేశీ ఎగుమతుల్లో ఏపీ రికార్డు -
నిరసనల నేపథ్యంలో పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: ఖరగ్‌పూర్ డివిజన్లో నిరసనల నేపథ్యంలో రైల్వే శాఖ పలురైళ్లను రద్దు చేసింది. హౌరా–సికింద్రాబాద్, హౌరా–కన్యాకుమారి, సంత్రాగచ్చి–పాండిచ్చేరి, అగర్తల–బెంగళూరు, గువాహటి–బెంగళూరు, గువాహటి–సికింద్రాబాద్, యశ్వంత్‌పూర్–హౌరా, మైసూరు–హౌరా, పూరి–చెన్నై రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్యరైల్వేకు జాతీయ ఇంధన పొదుపు అవార్డులు ఇంధన పొదుపు విషయంలో దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. సౌర విద్యుత్ వినియోగం, ఆక్యుపెన్సీ, సెన్సార్ల వినియోగం, ఎల్ఈడీ బల్బుల వినియోగం, ఇంధన సామర్థ్యాన్ని పెంచే పంపుల వినియోగం వంటి అంశాల్లో చేపట్టిన చర్యలకు గాను ఈ అవార్డులు లభించాయి. ఈ నెల 14న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎ.ఎ.ఫడ్కే, హైదరాబాద్ డివిజన్ ఇంజనీర్ డీఆర్ఎం ఎస్ఎస్ఆర్ ప్రసాద్‌లు అందుకున్నారు. -
ఫోని తుపాను: 74 రైళ్లు రద్దు
-
పలు రైళ్ల రద్దు..
తాటిచెట్లపాలెం(విశాఖపట్నం)/విజయనగరం గంటస్తంభం: తిత్లీ తుపాను బీభత్సానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు గురువారం రద్దయ్యాయి. రైల్వే ట్రాక్‌లపై చెట్లు పడిపోవడం, సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతినడంతో ముందు జాగ్రత్తగా పలు రైళ్లను నిలిపివేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సంత్రగచ్చి–చెన్నై స్పెషల్, హౌరా–చెన్నై(కోరమండల్ ఎక్స్‌ప్రెస్), హౌరా–యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు–భువనేశ్వర్(ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), యశ్వంత్‌పూర్–భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్, హౌరా–హైదరాబాద్(ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్), ఖరగ్‌పూర్–విల్లుపురం ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–హౌరా(ఈస్ట్‌కోస్ట్) రైళ్లను గురువారం రద్దు చేశారు. అవసరం మేరకు రైళ్ల రద్దు, సమయవేళల్లో మార్పులు ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులకు అవస్థలు.. రైళ్ల రద్దుతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విశాఖ, విజయనగరం రైల్వే స్టేషన్లలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. పిల్లాపాపలు, లగేజీలతో ప్లాట్‌ఫాంల మీద పడిగాపులు కాస్తున్నారు. హెల్ప్‌లైన్ కింద ఏడు ఫోన్లు ఏర్పాటు చేసినప్పటికీ.. ఇద్దరు సిబ్బందినే కేటాయించడంతో ప్రయాణికులకు సరైన సమాచారం అందలేదు. కొద్దిసేపటికి వీరు కూడా ఫోన్లు తీసి పక్కన పెట్టేయడంతో సమాచారం చెప్పే దిక్కులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైళ్ల సమాచారం కోసం ఎంక్వైరీ కౌంటర్ల వద్ద బారులుదీరారు. కాగా, భీకర గాలుల ధాటికి పలాస రైల్వే స్టేషన్ తీవ్రంగా దెబ్బతిందని ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. పలుచోట్ల సిగ్నలింగ్ వ్యవస్థ పాడైందని వివరించారు. బరంపురం–కోటబొమ్మాళి మధ్య విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిందని పేర్కొన్నారు. ఆయా ప్రదేశాల్లో మరమ్మతు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. (విజయనగరం జిల్లాలో బస్సుపై కూలిన చెట్టు) -
35 రైళ్లు రద్దు
వరదల కారణంగా తమిళనాడు, చెన్నై మీదుగా నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్లే తెలిపింది. దీంతో చెన్నై - గూడూరు మధ్య పలు రైళ్లు రద్దయ్యాయి. శనివారం నుంచి ఈనెల 8 వరకూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు.ఇప్పటి వరకూ 35 రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మరో వైపు శని, ఆదివారాల్లో కాకినాడ, చెన్నై ఎగ్మోర్, కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఇక చెన్నై - విజయవాడ ఎక్స్ ప్రెస్ రైలు కూడా రద్దైంది. -
'కొన్ని రద్దు, కొన్ని మళ్లింపు'
-
'కొన్ని రద్దు, కొన్ని మళ్లింపు'
చెన్నై వరదల కారణంగా.. చెన్నై మీదుగా వెళ్ల వలసిన కొన్ని రైళ్లు రద్దయ్యాయి. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించారు. రద్దైన రైళ్లలో చెన్నై సెంట్రల్- హౌరా కోరమండల్ ఎక్స్ ప్రెస్, చెన్నై - అహ్మదాబాద్ నవజీవన ఎక్స్ ప్రెస్, చెన్నై - తిరుపతి ఎక్స్ ప్రెస్, విశాఖ - సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్, తిరుపతి - చెన్నై ఎక్స్ ప్రెస్, గౌహతి - చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. వరదల కారణంగా భారీ ఎత్తున రైల్వే ట్రాక్ పై నీళ్లు వచ్చి చేరడంతో అధికారులు రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
చెన్నపట్నం ఛిన్నాభిన్నం
- కుండపోత వర్షాలతో చెన్నైని ముంచెత్తిన వరద.. మేడలు, మిద్దెలు సైతం మునక - చెంబరామ్బాక్కమ్లో 49 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదు - ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూత.. విద్యాసంస్థలకు సెలవు - 6వ తేదీ వరకు ఎయిర్‌పోర్టు మూసివేత.. విమాన సర్వీసులు రద్దు - విద్యుత్ సరఫరా బంద్.. నిలిచిపోయిన మొబైల్, ఇంటర్నెట్ సేవలు - రంగంలోకి సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ దళాలు.. బాధితుల తరలింపు - పరిస్థితిని సమీక్షించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంద్రమొచ్చి మీద పడింది! చెన్నపట్నం గుండె చెదిరింది! మన్నూ మిన్నూ ఏకమైంది. నీరు కన్నీరు ఒక్కటైంది. ఎటు చూసినా నీళ్లే.. ఎవరిని కదిపినా కన్నీళ్లే! జల విలయంతో చెన్నై మహానగరం కకావికలమైంది. పక్కనే ఉన్న సముద్రంతో ఏకమైందా అన్నట్టుగా ఆ మహానగరాన్ని వరద చుట్టుముట్టింది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురవడంతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. మంగళవారం చాంబరమ్బాక్కంలో 49 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అడయార్ నది ఉగ్రరూపం దాల్చింది. పలు ప్రాంతాల్లో గుడిసెలు, ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. అపార్టుమెంట్లలో మొదటి అంతస్తు వరకు నీరు చేరింది. బయటకుపోయే దారిలేక అపార్టుమెంట్లలో చిక్కుకున్న వాళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లోతట్టు ప్రాంతాల వారు ఎటుపోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షం ధాటికి ఇప్పటివరకు 197 మంది మృత్యువాత పడ్డారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడం చెన్నై వాసులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. సహాయం చేయడానికి సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మరో 3 రోజులు భారీ వర్షం కురుస్తుందనే వాతావరణ విభాగం హెచ్చరిక తమిళనాడు ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా చెన్నై నగరంలో రైల్వే ట్రాక్‌పై నీళ్లు నిలిచిపోవటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్మీదుగా అక్కడికి రాకపోకలు సాగించే అన్ని రైళ్లూ రద్దయ్యాయి. మరో రెండు రోజుల పాటు వ ర్షాలు కురిసే అవకాశముండడంతో గురు, శుక్రవారాల్లో కూడా రైళ్ల రాకపోకలు స్తంభించే అవకాశం ఉంది. అత్యవసర పనులపై వెళ్లేవారు ఇటు రైళ్లు, అటు బస్సులు/కార్లలో వెళ్లే అవకాశం లేక.., తుదకు విమాన సర్వీసులు కూడా నిలిచిపోవటంతో చెన్నైకు అన్ని దారులు మూసుకుపోయినట్టయింది. రద్దయిన రైళ్లు ఇవే... చెన్నై ఎగ్మోర్-కాకినాడ పోర్టు సర్కార్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ- చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్- చెన్నై సెంట్రల్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్, హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్, న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్,న్యూఢిల్లీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్,హైరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్-న్యూ జల్పాయ్గురి ఎక్స్‌ప్రెస్, పాండిచ్చేరి-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్-హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎగ్మోర్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎగ్మోర్-దాదర్ ఎక్స్‌ప్రెస్, సాయినగర్ షిర్డీ-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, బిట్రగుంట-చెన్నై సెంట్రల్ ప్యాసింజర్, చెన్నై సెంట్రల్-గూడూరు ప్యాసింజర్.విజయవాడ-చెన్నై సెంట్ర ల్ పినాకిని ఎక్స్ప్రెస్గూడూరు వరకే నడిపారు. గూడూరు-చెన్నై మధ్య సర్వీసును రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లు... బెంగళూరు-పాట్నా సంగమిత్ర, ధన్‌బాద్, ఎర్నాకులం రప్తిసాగర్, నిజాముద్దీన్-మధురై తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లను దారిమళ్లించి నడుపుతున్నారు. బుధవారంనాటి పాండిచ్చేరి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌ను గురువారానికి మార్చారు. రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్లివే... సికింద్రాబాద్: 040-27786170, 040-27700868, 040-27786539, విజయవాడ: 0866-2575038, గుంటూరు: 0863-2222014, గూడూరు: 7842307029 చెన్నైకి ఎందుకీ చిక్కులు..? సాక్షి, చెన్నై: భారీ వర్షాల బీభత్సానికి చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. సుమారు కోటి మందికిపైగా ప్రజలు వరద విలయానికి ఇక్కట్లు పడుతున్నారు. తిండి.. నీరు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. రైల్వే, వైమానిక, రోడ్డు రవాణ వ్యవస్థ అతలాకుతలమైపోయింది. ప్రజలు గూడు లేక రోడ్లపై తిరగాల్సి వస్తోంది. అసలు ఇంత విలయానికి చెన్నై ఎందుకు నిలయమైంది. చెన్నైకి ఇన్ని చిక్కులు ఎందుకొచ్చాయి. దీనికి కొందరు పర్యావరణ వేత్తలు పట్టణీకరణ, ప్రణాళిక లేని అభివృద్ధి, ఆక్రమణలే ప్రధాన కారణమని చెపుతున్నారు. తీరప్రాంతంలో ఉన్న చెన్నై తరచు భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. నాయకులు, అధికారులు దీని గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇప్పుడీ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. జనాభా విపరీతంగా పెరుగుతున్నా.. అందుకు తగినట్టుగా మౌలిక వసతులు మెరుగుపడలేదు. పైగా.. నగరంలో ప్రవహిస్తున్న మూడు ప్రధాన నదులు కొసస్తతలయర్, కువుం, అడయార్ నదుల పరీవాహక ప్రాంతాలు ఆక్రమణలతో కుచించుకుపోయాయి. బ్రిటీష్ హయాంలో నిర్మించిన బకింగ్హమ్ కెనాల్ నగరం నుంచి వచ్చే వాన నీటిని తీసుకునేది. దీని నిర్వహణను పాలకులు పట్టించుకోలేదు. ఇక నగర అభివృద్ధి ఒక ప్రణాళిక ప్రకారం క్రమపద్ధతిలో జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో వరద నీరు వెళ్లేందుకు కాల్వల పటిష్టతకు చర్యలు ప్రారంభించారు. అయితే ఈ కాల్వల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. గతంలో నగరంలో 600లకుపైగా చెరువులు ఉండగా.. ఇప్పుడు ఇవి పదుల సంఖ్యకే పరిమితమయ్యాయి. ఇలా సవాలక్ష కారణాలు చెన్నైకి వాన చిక్కులు తీసుకొచ్చాయి. 137 ఏళ్లలో తొలిసారి ‘హిందూ’ పేపర్ రాలేదు సాక్షి, చెన్నై: తమిళనాడులో భారీ వర్షాల ప్రభావంతో ‘ద హిందూ’ పత్రిక ప్రింటింగ్ నిలిపేసింది. పత్రిక స్థాపించిన 137 ఏళ్లలో ప్రింటింగ్ నిలిపేయడం ఇదే తొలిసారి. దీంతో బుధవారం తమిళనాడులో పత్రిక వెలువడలేదు. తమ ప్రింటింగ్ ప్రెస్ చెన్నై నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని మరైమలై నగర్లో ఉందని, వర్షాల కారణంగా కార్మికులు అక్కడకు చేరుకునే పరిస్థితి లేదని, ప్రింట్ చేసినా బయటకు తీసుకెళ్లే మార్గాలు లేకపోవడంతో ప్రచురణ నిలిపేసినట్లు పబ్లిషర్ ఎన్. మురళి తెలిపారు. మరోవైపు మిగతా పత్రికలు యథావిధిగా వెలువడ్డాయి. ముంపు కూడా మూడుముళ్లకు తలొగ్గింది చెన్నై: వర్షాలు, వరదలతో తమిళనాడు పూర్తిగా మునిగినా కొందరు చెన్నైవాసులు మాత్రం ఈ విపత్కర పరిస్థితుల్లోనే దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. ఎటు చూసినా నీళ్లతో బయటకు అడుగుపెట్టలేని పరిస్థితులు ఉన్నా బెరుకులేకుండా కొన్ని జంటలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యాయి. బుధవారం శుభప్రదమైన రోజు కావడంతో తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో అనేక పెళ్లిళ్లు జరిగాయి. ‘బుధవారం పెళ్లిళ్లకు మంచి రోజు కావడంతో వివాహ వేడుకలకు నిర్వహించాం. నాకు తెలిసి ఏ మండపాల్లోనూ వర్షాల వల్ల ఈ రోజు వివాహ వేడుకలు వాయిదా పడలేదు.’ అని ఏవీఎం రాజేశ్వరి కల్యాణ మండపం మేనేజర్ కేఎం.కన్నన్ ఓ వార్తా సంస్థకు వెల్లడించారు. బుధవారం పెళ్లి చేసుకున్నవారు తమ బాల్యంలో ముడి బియ్యం తిని ఉంటారని చమత్కరించారు. రూ.5 కోట్ల సాయం ప్రకటించిన కర్నాటక సాక్షి, బెంగళూరు: భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న తమిళనాడుకు కర్నాటక ప్రభుత్వం రూ.5 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం ఓ ప్రకటన చేశారు. అలాగే అవసరమైన ఔషధాలు, నిత్యావసర వస్తువులను వెంటనే తమిళనాడుకు పంపించాలని ప్రధాన కార్యదర్శి కౌషిక్ముఖర్జీకి సూచించారు. తమిళనాడు అధికారులతో చర్చించి సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం ఆదేశించారు. -
పట్టాలు తప్పిన రైలు ఇంజిన్
-
నగరంలో విషాదఛాయలు
దురంతో ప్రమాదంలో ఇద్దరు నగరవాసుల మృతి 9 మందికి గాయాలు పలు రైళ్ల రద్దు, మళ్లింపు ,మియాపూర్: గుల్బర్గా వద్ద జరిగిన రైలు ప్రమాదంలో నగరానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. మృతుల్లో ఒకరు మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్ చెందిన జ్యోతి(46), కాగా, పుష్పలత అనే మహిళ మృతి చెందింది. ఆ ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఇదే ఘటనలో నగరానికి చెందిన ఎం.లక్ష్మి, అబ్దుల్ ఆష్రాఫ్, రాజీవ్‌రంజన్‌రాయ్, జీవి రామకృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. బి.భాస్కర్‌రావు, బి.మాణిక్యరెడ్డి, బి.యాదమ్మ,వై.శ్రీకాంత్, సుష్మ పోద్దార్ లకు స్వల్ప గాయాలయ్యాయి. టూర్‌కు వెళుతూ... దూలపల్లిలోని రాజ్‌దీప్ గ్రూప్ సంస్థలో స్టార్ ఇన్చార్జిగా పనిచేస్తున్న జ్యోతి భర్త శంకర్, ఇద్దరు కుమారులతో మియాపూర్ జనప్రియ ఫోర్త్ ఫేస్‌లో 207 బి బ్లాక్‌లో నివాసం ఉంటోంది.అరుుతే రాజ్‌దీప్ గ్రూప్ సంస్ధ ఏటా ఉద్యోగులను కంపెనీ నుంచి టూర్‌కు పంపిస్తుంది. ఎప్పటిలానే 22 మందిని ఎంపిక చేసి పూనే పంపించింది. హైదరాబాద్ నుండి ముంబాయ్ వెళ్లే దురంతొ ఎక్స్‌ప్రెస్‌లో జ్యోతితో పాటు మరో 21 మంది శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లారు గుల్బర్గా సమీపంలో వారు ప్రయాణిస్తున్న రైలు ప్రమదానికి గురికావడంతో ఆమె మృతి చెందింది. శనివారం రాత్రి ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో ఆ ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి. పలు రైళ్లు రద్దు దురంతో ఎక్స్‌ప్రెస్ (12220) ప్రమాదం నేపథ్యంలో శనివారం నగరం నుంచి బయలుదేరవలసిన పలు రైళ్లు రద్దుకాగా మరికొన్నింటిని దారిమళ్లించారు. శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరే హైదరాబాద్-గుల్బర్గా ప్యాసింజర్ రద్దయింది. సికింద్రాబాద్-పూనే శతాబ్ది ఎక్స్ గుల్బర్గా వరకే పరిమితం చేశారు. ఫలక్‌నుమా-షోలాపూర్ ఎక్స్‌ప్రెస్ చిత్తాపూర్ వద్ద నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి హుబ్లీ వెళ్లే రైలును వాడి,గుంతకల్ మీదుగా దారిమళ్లించారు. ఫలక్‌నుమా-గుల్బర్గ ప్యాసింజర్ చిత్తాపూర్ వరకు పరిమితమైంది. బీజాపూర్-బొల్లాపూర్ మధ్య నడిచే ప్యాసింజర్ రైలును చిత్తాపూర్-బొల్లారం మధ్య నడిపారు. భువనేశ్వర్-ముంబయిసీఎస్‌టీ కోణార్క్ఎక్స్ప్రెస్, విశాఖపట్నం-కుర్లా ఎల్టీటీ,హైదరాబాద్-ముంబయి హెస్సేన్‌సాగర్, కాకినాడ-కుర్లా ఎక్స్‌ప్రెస్ రైళ్లను సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, లాతూర్ మీదుగా మళ్లించారు.హుబ్లీ-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను గుంతకల్,వాడి మీదుగా మళ్లించారు. రైళ్ల రద్దుతో హైదరాబాద్,సికింద్రాబాద్ స్టేషన్లలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో ఇబ్బందిపడ్డారు. -
నేడు రైల్వే మెగా బ్లాక్
♦ పలు రైళ్లు రద్దు,దారి మళ్లింపు ♦ ఆలస్యంగా నడవనున్న మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ♦ సాయంత్రం 4 గంటలకు జరగనున్న మెగా బ్లాక్ సాక్షి, ముంబై : సెంట్రల్ రైల్వే, హార్బర్ రైల్వే మార్గాలపై ఆదివారం మెగా బ్లాక్ నిర్వహించనున్నారు. దీని పరిణామంగా పలు లోకల్ రైళ్లు రద్దు చేయగా మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లించి నడపనున్నారు. హార్బర్ లైన్ అప్, డౌన్ మార్గంలో మసీద్-చూనాబట్టి రైల్వేస్టేషన్ల మధ్య, వడాలా-మహీం రైల్వేస్టేషన్ల మధ్య అప్, డౌన్ మార్గాల్లో కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెగా బ్లాక్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)-వాషి, బేలాపూర్, పన్వెల్‌ల మధ్య నడిచే లోకల్ రైళ్లన్నింటిని మెగా బ్లాక్ సమయంలో రద్దు చేశారు. మెగా బ్లాక్ సమయలో ప్రత్యేకంగా కుర్లా-పన్వెల్‌ల మధ్య లోకల్ రైళ్లు నడపనున్నారు. సీఎస్టీ-బాంద్రా, అంధేరి మధ్య నడిచే లోకల్ రైళ్లన్నింటినీ మెగా బ్లాక్ సమయంలో రద్దు చేశారు. ఈ మార్గంపై ప్రయాణించే వారంతా సెంట్రల్ రైల్వే ప్రధాన మార్గం, వెస్టర్న్ రైల్వే మార్గంపై తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. సెంట్రల్ ప్రధాన మార్గంలో.. సెంట్రల్ ప్రధాన మార్గంలో థానే-కల్యాణ్ రైల్వేస్టేషన్ల మధ్య డౌన్ ఫాస్ట్‌ట్రాక్‌పై ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు మెగా బ్లాక్ జరగనుంది. దీంతో ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)లో ఉదయం 9.37 గంటల నుంచి మధ్యాహ్నం 2.25 గంటల మధ్య ఫాస్ట్‌ట్రాక్ మీదుగా నడిచే రైళ్లన్నింటినిథానే-కల్యాణ్ రైల్వేస్టేషన్ల మధ్య స్లోట్రాక్ మీదుగా మళ్లించనున్నారు. అలాగే ఈ సమయంలో థానే-కల్యాణ్ మధ్య ఉన్న రైల్వే స్టేషన్లన్నింటిలో ఫాస్ట్ లోకల్ రైళ్లను నిలపనున్నట్లు అధికారులు తెలిపారు. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. మెగా బ్లాక్ నేపథ్యంలో దూరప్రాంతాలకు నడిచే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లపై కూడా ప్రభావం పడనుంది. లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్టీటీ- కుర్లా) నుంచి ఉదయం 11.40 గంటలకు బయలుదేరాల్సిన 16345 డౌన్ నేత్రవతి ఎక్స్‌ప్రెస్ రైలు మెగా బ్లాక్ కారణంగా మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరనుంది. అలాగే థానే, కల్యాణ్ రైల్వేస్టేషన్ల మధ్య దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నింటిని స్లోమార్గంపై మళ్లించనున్నట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. వెస్టర్న్ మార్గంలో.. వెస్టర్న్ రైల్వేమార్గంలో బాంద్రా నుంచి అంధేరీల మధ్య డౌన్ స్లో మార్గంపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. పరిణామ క్రమంలో చర్చిగేట్ నుంచి నడిచే అంధేరి, బోరివలి, విరార్ తదితర లోకల్ రైళ్లన్నింటిని బాంద్రా-అంధేరీ రైల్వేస్టేషన్ల మధ్య డౌన్ హార్బర్ మార్గంపై మళ్లించి నడపనున్నారని వెస్టర్న్ రైల్వే తెలిపింది. -
15న పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-ముద్ఖేడ్ సెక్షన్‌లోని కాపలా లేని రైల్వే గేట్ల వద్ద నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 15వ తేదీన పలు రైళ్లు పూర్తిగాను, మరికొన్ని పాక్షికంగానూ రద్దు కానున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నాందేడ్-నిజామాబాద్, నాందేడ్-మేడ్చల్, నిజామాబాద్-బోధన్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు పూర్తిగాను, బోధన్-మిర్జాపల్లి ప్యాసింజర్ బోధన్ నుంచి నిజామాబాద్ వరకు పాక్షికంగానూ రద్దు కానున్నాయి. కాచిగూడ-మన్మాడ్, పుణే-నిజామాబాద్ ప్యాసింజర్ రైళ్లను ఈ మార్గంలో 35 నిమిషాల నుంచి గంటకు పైగా ఆలస్యంగా నడుపుతారు. అలాగే సుల్తానాబాద్-కరీంనగర్ మార్గంలో నిర్మాణపనుల కారణంగా ఈ నెల 15న కరీంనగర్-సిర్పూర్ కాగజ్‌నగర్ ప్యాసింజర్ ట్రైన్ రద్దు కానుంది. -
పలు రైళ్ల ర ద్దు.. దారి మళ్లింపు
కాజీపేట రూరల్ : రైల్వే రవాణపై హుదూద్ ప్రభావం పడింది. భారీ తుపాన్ కారణంగా ఆదివారం కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లే ప లు రద్దు కాగా మరికొన్ని రైళ్లు దారి మళ్లిం చారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రద్దైయిన రైళ్లు ఇవే.. భువనేశ్వర్ నుంచి ముంబయి వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11020), ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019), విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్ (22203), సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్ (22204), హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ (12728), విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727), సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గరీభ్థ్ ్రఎక్స్‌ప్రెస్ (12740), నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్లే నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (18510) రద్దయిన ట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దారి మళ్లించిన రైళ్లు.. నాందేడ్ నుంచి సంబల్పూర్ వెళ్లే సంబల్‌పూ ర్ ఎక్స్‌ప్రెస్ (18310 ) వయూ విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉండగా వయా బల్లార్షా మీదుగా... హైదరాబాద్ నుంచి హౌరా వెళ్లే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18640 )వయా బల్లార్షా మీదుగా, హైదరాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్ (12704) వయా బల్లార్షా మీదుగా దారి మళ్లించారు. కాజీపేటలో హెల్ప్‌లైన్ ఏర్పాటు హుదుద్ ప్రభావం నేపథ్యంలో కాజీపేట జంక్షన్లో హెల్ప్‌లైన్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. 0870-2576430, రైల్వే నంబర్ 82660కు ఫోన్ చేయూలని రైల్వే అధికారులు ప్రయూణికులకు విజ్ఞప్తి చేశారు. -
పలు రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: పై-లీన్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను శని, ఆదివారాల్లో రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ డివిజన్లలోని 19 రైల్వే స్టేషన్లలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో.. ప్రయాణాలను రద్దు చేసుకొనేందుకు, టిక్కెట్ డబ్బులు తిరిగి చెల్లించేందుకు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం మీదుగా ఒడిశా మార్గంలో కొద్దిరోజులపాటు రైళ్లు నడపడం కుదరదని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ఆదివారం రద్దయిన రైళ్లు: బెంగళూరు-భువనేశ్వర్ (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), భునేశ్వర్-బెంగళూరు (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), భువనేశ్వర్-యశ్వంత్‌పూర్, పూరి-ఓకా, పూరి-చెన్నై, భువనేశ్వర్-బెంగళూర్, భువనేశ్వర్-తిరుపతి, భువనేశ్వర్-సికింద్రాబాద్, భువనేశ్వర్-విశాఖ (ఇంటర్సిటీ), విశాఖ-భువనేశ్వర్(ఇంటర్సిటీ), భువనేశ్వర్-జగదల్పూర్(హీరాఖండ్), అహ్మదాబాద్-పూరీ, ముంబై-భువనేశ్వర్, పూరి-తిరుపతి. ప్యాసింజర్ల రద్దు: ఆదివారం విశాఖ-మచిలీపట్నం(57230) ప్యాసింజర్‌ను విశాఖ, రాజమండ్రి మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. పలాస-విశాఖపట్నం-పలాస, పూరి-గుణుపూర్-పూరి, పలాస-గుణుపూర్-పలాస, విజయనగరం-విశాఖపట్నం-విజయనగరం మధ్య అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. విమానాలకూ దెబ్బ: ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు పలు విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. ఎయిర్ ఇండియా, ఇండి గో, జెట్ ఎయిర్వేస్కు చెందిన దాదాపు 10 విమాన సర్వీసులను రద్దు చేశారు. విశాఖ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేశారు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు సికింద్రాబాద్ : 040-27700868 నాంపల్లి : 040-23200865 విజయవాడ :0866-2575038 రాజమండ్రి :0883-2420541, 2420543 కాజీపేట్ : 0870-2548660 వరంగల్ : 0870-2426232 ఖమ్మం : 08742-256025 మంచిర్యాల :08736-250081 తుని : 08854-252172 అనకాపల్లి :08924 -221698 గుంటూరు :0863-2222014,09701379072 నంద్యాల :07702772080 నల్లగొండ :08682-224392,09701379077 నరసరావుపేట: 08647-223131, 09701379075 మార్కాపురం :08596-222028, 09701379079 గిద్దలూరు :08405-242003 సత్తెనపల్లి :08641-232255 పిడుగురాళ్ల :08649-252255 నడికుడి : 08649-257625, 09701379078 -
పై-లీన్ ఎఫెక్ట్‌తో పలు రైళ్ల రద్దు
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన పై-లీన్ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్‌లను, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. శనివారం 18048 వాస్కోడిగామా- హౌరా ఎక్స్‌ప్రెస్, విశాఖ - భువనేశ్వర్ ఇంటర్‌సిటీతో పాటూ పలు ఎక్స్‌ప్రెస్‌లు రద్దయినట్లు అధికారులు తెలిపారు. 17016 సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను విజయనగరం రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు తిరిగి విజయనగరం నుంచి సికిం ద్రాబాద్ వెళ్లిపోతుంది. రైల్వే విచారణ కేంద్రాల వద్ద హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటుచేశారు. ప్రయాణికులు 08922 - 224240, 225510 నంబర్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చని చెప్పారు. రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులకు రీఫండ్ ఇచ్చేందు కు రైల్వే శాఖ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది.