సాక్షి, విజయవాడ: ప్రయాణికుల సంఖ్య తగినంతగా లేకపోవడంతో 10 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి మే 31 వరకు ఐదు రైళ్లను రద్దు చేసింది. నర్సాపూర్–నిడదవోలు(07241), నిడదవోలు–నర్సాపుర్ (07242), సికింద్రాబాద్–బీదర్(07010), బీదర్–హైదరాబాద్ (07009), సికింద్రాబాద్–కర్నూలు సిటీ (07027)లు రద్దయ్యాయి.
కర్నూలు సిటీ–సికింద్రాబాద్(07028)ఈ నెల 29 నుంచి జూన్ 1 వరకు రద్దు చేశారు. మైసూర్–రేణిగుంట(01065)రైలును ఈ నెల 30 నుంచి వచ్చే నెల 28వరకు రద్దు చేశారు. రేణిగుంట–మైసూర్(01066) రైలును మే 1 నుంచి 29 వరకు రద్దు చేయగా, సికింద్రాబాద్–ముంబాయి ఎల్‌టీటీ(02235) రైలును ఈ నెల 30 నుంచి వచ్చే నెల 28 వరకు, ముంబాయి ఎల్‌టీటీ–సికింద్రాబాద్(02236) రైలును మే 1 నుంచి మే 29 వరకు రద్దు చేశారు.
చదవండి: ఏపీ: వాహన విక్రయాల్లో జోష్
విదేశీ ఎగుమతుల్లో ఏపీ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment