AP: పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు | Andhra Pradesh: Many Trains Are Cancelled And Diverted - Sakshi
Sakshi News home page

AP: పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు

Published Wed, Aug 30 2023 8:29 AM | Last Updated on Wed, Aug 30 2023 9:12 AM

Many Trains Are Cancelled And Diverted - Sakshi

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్‌లోని అనకాపల్లి–తాడి సెక్షన్ల మధ్య జరుగుతున్న ట్రాఫిక్‌ బ్లాక్‌ పనుల కారణంగా ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 3వ తేదీ వరకు పలు రైళ్లను పూర్తిగా, మరి కొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

రద్దయిన రైళ్లు: మచిలీపట్నం–విశాఖపట్నం (17219) రైలు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 3 వరకు, విశాఖపట్నం–మచిలీపట్నం (17220) రైలు ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు, విజయవాడ–విశాఖపట్నం (22702/22701) రైళ్లు సెప్టెంబర్‌ 2, 4 తేదీల్లో, రాజమండ్రి–విశాఖపట్నం (07466/07467), గుంటూరు–విశాఖపట్నం (17239), కాకినాడ పోర్టు–విశాఖపట్నం (17267/17268) రైళ్లు సెప్టెంబర్‌ 4న, విశాఖపట్నం–గుంటూరు (17240) రైలు సెప్టెంబర్‌ 5న రద్దు చేశారు.

పాక్షికంగా రద్దు: తిరుపతి–విశాఖపట్నం (22708) రైలు సెప్టెంబర్‌ 1, 3 తేదీల్లో, విశాఖపట్నం–తిరుపతి (22707) సామర్లకోట–విశాఖపట్నం మధ్య సెప్టెంబర్‌ 3, 5 తేదీల్లో, విజయవాడ–విశాఖపట్నం (12718/12717) రైళ్లు విశాఖపట్నం–­అ­నకాపల్లి మధ్య ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశారు.
చదవండి: AP: కార్ల అమ్మకాలు రయ్‌ రయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement