
సాక్షి, విజయవాడ: వరదలతో విజయవాడ డివిజన్‌లో రద్దు అయిన పలు రైళ్లను అధికారులు పునరుద్ధరించారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. మచిలీపట్నం–బెంగళూరు (07650) మధ్య ప్రత్యేక రైలును నడిపారు. అహ్మదాబాద్–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12655), చెన్నై సెంట్రల్–కాట్రా (16031), త్రివేండ్రం–హజరత్ నిజాముదీ్ధన్ (12643) యథావిధిగా పునరుద్ధరించారు.
అలాగే సికింద్రాబాద్–గుంటూరు (17202) రైలును రెండు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ నుంచి నడిపారు. గూడూరు–సికింద్రాబాద్ (12709) రైలును వయా తెనాలి, గుంటూరు, రేణిగుంట మీదుగా, న్యూఢిల్లీ–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12622) వయా రేణిగుంట, గుంతకల్లు, సికింద్రాబాద్, ఖాజీపేట మీదుగా, సికింద్రాబాద్–గుంటూరు (17202) వయా పగిడిపల్లి, నడికుడి మీదుగా దారి మళ్లించారు.
Comments
Please login to add a commentAdd a comment