Updates: బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద.. హైదరాబాద్‌లో వర్షం షురూ | AP Telangana Heavy Rains Flood Updates Sep 5 2024 Latest News Telugu | Sakshi
Sakshi News home page

Updates: బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద.. హైదరాబాద్‌లో వర్షం షురూ

Published Thu, Sep 5 2024 6:56 AM | Last Updated on Fri, Sep 6 2024 2:49 PM

AP Telangana Heavy Rains Flood Updates Sep 5 2024 Latest News Telugu

Telugu States Heavy Rains Latest News Updates:

వరద పరిస్థితిని కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు వివరించిన సీఎం చంద్రబాబు.

చంద్రబాబు కామెంట్స్‌..

  • ఊహించని వర్షాలు పడ్డాయి.
  • భారీ వరదలతో పాటు మానవ తప్పిదాలు కూడా ఈ సమస్యకు కారణాలు.
  • కృష్ణా నది కరకట్టలను మరింత బలపరిచేలా చర్యలు తీసుకోవాలి.
  • బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ కూడా రంగంలోకి దిగుతోంది.
  • 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజ్‌ను పటిష్ట పరచాలి.
  • వరదలు వచ్చిన పరిస్థితిని కేంద్రానికి వివరించాం.


శివరాజ్‌సింగ్‌ కామెంట్స్‌..

  • ఏపీకి కేంద్రం అండగా ఉంటుంది.
  • సహాయక చర్యలను చంద్రబాబు చూసుకుంటున్నారు.
  • రైతులు, సామాన్యులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. 
     

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వర్షం

  • హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది.
  • వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి.
  • సాయంత్రం సమయం కావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.
  • బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, యూసుఫ్‌గూడ, మెహిదీపట్నం,
  • ఎస్‌ఆర్‌ నగర్‌, కూకట్‌పల్లి, బాచుపల్లి, ప్రగతినగర్‌, నిజాంపేట్‌, మియాపూర్‌ సహా తదితర ప్రాంతాల్లో వరద కురుస్తోంది.

బుడమేరుకు పెరిగిన వరద

  • బుడమేరులో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది.
  • రామకృష్ణాపురంలోకి చేరిన వరద నీరు
  • ఈరోజు మధ్యాహ్నం నుంచి మళ్లీ కాలనీలోకి వరద నీరు.
  • రెండు అడుగులకు చేరుకున్న వరద నీరు
  • వరదల నుంచి ఇప్పుడే తేరుకుంటున్న రామకృష్ణకాలనీ.
  • అంతలోనే వరద వస్తుందటంతో కాలనీవాసుల్లో ఆందోళన

భారత్‌ బయోటెక్‌ భారీ విరాళం

  • ఏపీలో వరద బాధితుల సహాయార్థం భారత్‌ బయోటెక్‌ సంస్థ రూ.కోటి విరాళం
  • ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాతాకు జమచేసినట్ వెల్లడించిన భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల
  • ఈ సాయం వరద బాధితులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్న భారత్‌ బయోటెక్‌
  • త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్టు ప్రకటన విడుదల
     

రేపు ఖమ్మంలో కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ పర్యటన

  • రేపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖమ్మం జిల్లాలో పర్యటన
  • భారీ వర్షాలు, వరదలతో నష్ట పోయిన పంట పొలాల పరిశీలన
  • మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటన
  • కూసుమంచి మండలం జుజ్జులారావుపేటలో రైతులతో ముఖాముఖి
  • కేంద్రమంత్రి పర్యటన వివరాలు వెల్లడించిన మంత్రి తుమ్మల
     

సీఎం చంద్రబాబుకు తప్పిన ప్రమాదం!!

  • విజయవాడ మధురానగర్‌ రైల్వే ట్రాక్‌పై చంద్రబాబుకు తప్పిన ప్రమాదం
  • ట్రాక్‌పై చంద్రబాబు ఉండగానే వచ్చిన రైలు, వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
  • రైల్వే ట్రాక్‌ అవతలి పక్కకు వెళ్లిపోయిన సీఎం చంద్రబాబు
  • రైలు వెళ్లిపోయిన తర్వాత పర్యటన కొనసాగించిన చంద్రబాబు

ప్రకాశం బ్యారేజ్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి

  • విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ను పశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 
  • వరద పరిస్థితులను తెలుసుకుంటున్న కేంద్ర మంత్రి

భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నాయకులు
గుంటూరు:

  • తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గం వరద భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి మెరుగు నాగార్జున, తెనాలి నియోజకవర్గ ఇన్చార్జి అన్నాబత్తుల శివకుమార్
  • వేమూరు ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు

జూరాల అప్‌డేట్‌
మహబూబ్ నగర్ జిల్లా: 

  • జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద.
  • 06 గేట్లు ఎత్తివేత  
  • ఇన్ ఫ్లో : 85 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 77 వేల 739 క్యూసెక్కులు
  • పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 318.516 మీటర్లు, ప్రస్తుత నీటి సామర్థ్యం: 317.910 మీటర్లు
  • పూర్తిస్థాయి నీటి నిల్వ: 9.657 టీఎంసీలు , ప్రస్తుత నీటి నిల్వ : 8.434 టీఎంసీలు
  • ఎగువ, జూరాల జల విద్యుత్ కేంద్రం లో మొత్తం 5 యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతుంది.

వరద బాధితులకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆహార పంపిణీ

  • విజయవాడ ముంపు గ్రామాల ప్రజలకు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో
  • 10,000 వాటర్ బాటిళ్లు
  • 12 క్వింటాల పులిహార రైస్
  • విజయవాడలో బాధితులకు పంపిణీ

భద్రాద్రి కొత్గూడెం జిల్లా
భద్రాచలం వద్ద ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు గోదావరి 45.1 అడుగులు వద్ద  ప్రవాహం

 

ఏలూరు జిల్లా

  • ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కొల్లేరు సరస్సు
  • చిన్నఎడ్లగాడి వద్ద జాతీయ రహదారిపై కొల్లేరు ప్రవాహం
  • జాతీయరహదారిపై మోకాళ్ల లోతు నీటిలో రాకపోకలకు అంతరాయం
  • పాదచారులు,ద్విచక్రవాహనదారులు రావద్దంటూ పోలీసుల హెచ్చరిక
  • ఇవాళ సాయంత్రానికి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం

 

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి  కొనసాగుతున్న  వరద

  • 3 గేట్లు ఎత్తి  నీటిని విడుదల
  • ఇన్ ఫ్లో 15.000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో. 15.000
  • పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు, 17 టీఎంసీలు
  • ప్రస్తుత నీటిమట్టం 1404 అడుగులు, 17టీఎంసీలు

తప్పులో కాలేసిన పవన్‌కల్యాణ్‌

విజయవాడ:

  • వరద సహాయ చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యం
  • ఫేక్ ఫోటోలతో అధికారులతో సమీక్ష చేసిన పవన్ కళ్యాణ్
  • అవ్వే ఫేక్ ఫొటోతో పబ్లిసిటీ చేసుకోబోయిన పవన్ 
  • ఎక్స్‌లో చేసిన ట్వీట్‌తో బయటపడ్డ అవగాహన రాహిత్యం
  • సీఎం చంద్రబాబుని పొగిదేందుకు ఫేక్ ఫోటోలు పోస్ట్ చేసిన పవన్ 
  • ఏఐ ఫోటోలను పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్
  • విమర్శలు రావడంతో మళ్ళీ ఆ ఫోటో ఎక్స్ నుంచి తీసేసిన పవన్
  • ప్రచారం కోసం టీడీపీ తయారు చేసిన ఫేక్ ఫొటోను పోస్ట్ చేసి విమర్శల పాలైన పవన్ కళ్యాణ్

మరో అల్ప పీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన..

  • పశ్చిమ మధ్య బంగాళాఖాతం-వాయువ్య బంగాళాఖాతం సమీపంలో అల్ప పీడనం
  • రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • కోస్తాంధ్ర అంతట విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
  • పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌
  • అల్ప పీడనం కారణంగా తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో గాలులు
  • రానున్న మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదు.
     

ప్రకాశం బ్యారేజ్‌ గేట్‌ రిపేర్లు..

  • కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజ్‌ గేట్‌ రిపేర్‌ పనులు.
  • బోట్లు ఢీకొనడంతో డ్యామేజ్‌ అయిన బ్యారేజ్‌ 69వ గేటు
  • ధ్వంసమైన కౌంటర్‌ వెయిల్‌ స్థానంలో మరొకటి ఏర్పాటుకు అధికారుల చర్యలు. 

 

విజయవాడ:

ఆరు రోజులుగా వరద నీటిలోనే పాయకాపురం,బర్మా కాలనీ వాసులు

  • నడుము లోతుకు పైగా ఇళ్ల చుట్టూ వరద నీరు
  • అరకొరగానే ప్రభుత్వ సహాయక కార్యక్రమాలు
  • ఇళ్ల వద్దకే అన్నీ పంపిస్తామని చెప్పిన సీఎం
  • నడుము లోతు నీటిలో కిలోమీటర్ దూరం వెళితేకానీ దొరకని ఆహారం,నీరు
  • లోపల కాలనీ వాసులను పట్టించుకోకపోవడం పై వరద బాధితులు ఆగ్రహం
  • సర్వం కోల్పోయామంటున్న వరద బాధితులు
  • వరద ఇళ్లల్లోకి చేరడంతో మొదలైన బురద కష్టాలు
  • ఇంట్లో వస్తువులు..సర్టిఫికెట్లు తడిచిపోవడంతో ఆందోళనలో వరద బాధితులు
  • తమ కష్టార్జితం బురదపాలైందంటూ ఆవేదన
  • తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న వరద బాధితులు

 

ఏలూరు జిల్లా:

ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కొల్లేరు సరస్సు

  • చిన్నఎడ్లగాడి వద్ద జాతీయ రహదారిపై కొల్లేరు ప్రవాహం
  • జాతీయరహదారిపై మోకాళ్ల లోతు నీటిలో రాకపోకలకు అంతరాయం
  • పాదచారులు, ద్విచక్రవాహనదారులు రావద్దంటూ పోలీసుల హెచ్చరిక
  • ఇవాళ సాయంత్రానికి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం

ఏపీలో కేంద్ర బృందం పర్యటన..

  • వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం
  • భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం
  • నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకోనున్న కేంద్ర బృందం
  • ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షిస్తున్న కేంద్ర బృందం
  • భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను కేంద్ర బృందానికి వివరిస్తున్న అధికారులు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:
లంక గ్రామాల ప్రజలకు మరల మొదలైన వరద కష్టాలు

  • వరద నీటిలో మునిగిన కనకాయలంక కాజ్ వే
  • చాకలిపాలెం - కనకాయిలంక కాజ్వే మునిగి పోవడంతో నిలిచి పోయిన రాకపోకలు 
  • పడవల పైనే ప్రయాణం సాగిస్తున్న లంక ప్రజలు
  • గత నెలలో నెల రోజులు పాటు వరద నీటిలో అవస్థలు పడ్డ  లంక గ్రామాల ప్రజలు

విజయవాడ: మళ్లీ పెరుగుతున్న వరద

  • అడుగు మేర పెరిగిన వరద
  • భయాందోళనలో సింగ్‌నగర్‌, అజిత్‌నగర్‌, వాంబే కాలనీ వాసులు
  • ఇప్పటికే 5 రోజులుగా వరద నీటిలోనే ఉన్న ప్రజలు

విజయవాడ: వరదల్లో మరణ మృదంగం

  • మరో 15 మంది వరదలకు మృతి
  • నిన్న 15 మృతదేహాలు వరదల్లో తేలిన వైనం
  • 47 కి చేరిన మృతుల సంఖ్య
  • నాలుగు రోజులు నీట ముంగడంతో గుర్తు పెట్టలేని రీతిలో పలు మృతదేహాలు
  • వరద తగ్గడంతో సింగ్ నగర్ నుండి వెళ్లిపోతున్న బాధితులు
  • నాలుగు రోజులు నరకం అనుభవించడంతో విజయవాడ వదిలి వెళ్లిపోతున్నా బాధితులు
  • ఇళ్లు బురదమయం, కాలనీలు దుర్గంధభరితం కావడంతో వెళ్లిపోతున్నా బాధితులు
  • ప్రభుత్వ పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా తెలియని దుస్థితి
  • ప్రభుత్వ సేవలపై నమ్మకం లేక ఊళ్లకు, బంధువుల ఇళ్లకు కట్టు బట్టలతో వెళ్లిపోతున్న బాధితులు
  • 40 పునరావాస కేంద్రాలు మూసేసి ప్రభుత్వం
  • 3 లక్షల మంది బాధితుల్లో కనీసం 15 వేల మందికి కూడా పునరావాసం కల్పించని ప్రభుత్వం
  • బురద, దుర్గంధమైన ఇళ్ళ ను, కాలనీలు ఫైర్ ఇంజన్ల తో శుభ్రం చేయాల్సిన దుస్థితి
  • కార్లు, బైక్ లు, ఆటో లు, ఫ్రీజ్లు, టీవీలు, మంచాలు  అన్నీ వరద పాలు
  • వరద నీటిలో కలిసిపోయిన డ్రైనేజీలు
  • వ్యాధులు ప్రబలుతాయన్న ఆందోళనలో వరద బాధితులు

గోదావరికి పెరుగుతున్న వరద

  • ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 10.70 అడుగుల వరద నీటిమట్టం నమోదు

  • ఎనిమిది లక్షల 36 వేల క్యూసెక్కులు నీరు సముద్రంలో విడుదల

  • 1800 క్యూసెక్కుల నీరు డెల్టా కాలువలకు సరఫరా

  • వరద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు

మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం

  • క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం
  • వాయుగుండం ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశం
  • ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన
  • నేటి నుంచి 4 రోజుల పాటు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు
  • ఆదివారం వరకు మత్స్యకారుల వేటపై నిషేధం

విజయవాడలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఐదు రోజులుగా జల దిగ్భందంలోనే విజయవాడ ఉంది. మళ్లీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

వరద తగ్గు ముఖం పట్టే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. గల్లంతైన వారి లెక్క తేలటం లేదు. బంధువుల అచూకి తెలియక పలువురు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వీరి గోడు మాత్రం ఆలకించడం లేదు. మంగళవారం వరకు 32 మంది మృతి చెందినట్లు వెల్లడికాగా, బుధవారం మరో 15 మృతదేహాలు వెలుగు చూశాయి. దీంతో మృతుల సంఖ్య 47కు చేరింది. ఇంకా పలు మృతదేహాలు నీటిలో తేలియాడు­తున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నప్పటికీ వాటి లెక్క తేలడం లేదు. కొన్ని ప్రాంతాలకు ఇంకా ఎవరూ వెళ్లలేదు.

ఆ ప్రాంతంలో పరిస్థితి ఏమిటో తెలియదు. ఇంకెన్ని శవాలు బురదలో ఉన్నాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి బుధవారం సాయంత్రం వరకు 22 మృతదేహాలు వచ్చాయి. 11 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మరో 11 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఇందులో ఆరు మృతదేహాలు కుళ్లిపోయి, పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. కాగా, పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను బంధువులు ప్రైవేటు అంబులెన్స్‌లలోనే తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయలేదు.  

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement