AP And Telangana Floods News Latest Updates In Telugu
హైదరాబాద్
- ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్లు విరాళంగా అందించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ.
- సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేసిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. నారాయణరెడ్డి
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు క్రమంగా పెరుగుతున్న వరద
- 10 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల
- ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో: 125943 క్యూసెక్కులు
- పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు
- ప్రస్తుత నీటి మట్టం: 589.90 అడుగులు
- పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలు
- ప్రస్తుత నీటి నిల్వ: 311.7462 టీఎంసీలు
- కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
విలీన మండలాల్లో తగ్గుముఖం పట్టిన వరద ప్రభావం
- జాతీయ రహదారి-30 పై కొనసాగుతున్న రాకపోకలు
- జాతీయరహదారిపై కొనసాగుతున్న వరద ఉధృతి
- ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు
- చింతూరు డివిజన్ పరిధిలో వరదలకు ప్రభావితమైన 113 గ్రామాలలోని 19766 కుటుంబాలు
- ముంపులో ఉన్న 54 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేత
- మొత్తం నాలుగు మండలాల్లో 38 చోట్ల రహదారులపై చేరిన వరదనీరు
దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
- ఏపీవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు
- ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పోటెత్తిన కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులు
- ప్రభుత్వ నిర్వాకంతో విరుచుకు పడ్డ బుడమేరు, ఏలేరు, కొల్లేరు పంట పొలాలను ముంచెత్తాయి
- ప్రకృతి ప్రకోపానికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవడంతో మరో 15 రోజుల్లో చేతికందాల్సిన పంట వరదపాలైంది.
- దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
- ప్రాథమిక అంచనా ప్రకారం 19 జిల్లాల్లో 5.93లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
- వీటిలో 18 రకాల ఆహార, వాణిజ్య పంటలు 5.42లక్షల ఎకరాల్లో, మరో 51వేల ఎకరాల్లో 21 రకాల ఉద్యాన పంటలు పాడైపోయాయి
- మొత్తం 3.08 లక్షల మంది రైతులు నష్టపోయారు
- ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రైతులకు అపార నష్టం
నేడు మరో అల్పపీడనం!
బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉపరితల అవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది 15న పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని వెల్లడించారు. దీని ప్రభావం ఏపీపై ఉండబోదని స్పష్టం చేశారు.
ఏపీలో పెరిగిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాతావరణంలో వేడి ఎక్కువవుతోంది. గురువారం అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కావలిలో 38.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.మరో వారం ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment