Updates: బలపడిన వాయుగుండం.. ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ టెన్షన్‌! | AP, Telangana Heavy Rains Flood Updates Sep 9 2024 Latest News Telugu | Sakshi
Sakshi News home page

Updates: బలపడిన వాయుగుండం.. ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ టెన్షన్‌!

Published Mon, Sep 9 2024 8:35 AM | Last Updated on Mon, Sep 9 2024 9:20 PM

AP, Telangana Heavy Rains Flood Updates Sep 9 2024 Latest News Telugu

AP And Telangana Floods News Latest Updates In Telugu

విశాఖ, గోదావరి జిల్లాల్లో ఆకస్మిక వరదలు!

  • వాయుగుండం కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
  • భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉంది.
  • విశాఖ, తూర్పు గోదావారి జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం.
  • 24 గంటలపాటు నదీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
  • ప్రజలను విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అలర్ట్‌ చేసింది.

పూరీ వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం..

  • మరో 24 గంటలపాటు ఉత్తరాంధ్రలో కొనసాగనున్న భారీ వర్షాలు.
  • శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.
  • తీరం వెంబడి కొనసాగుతున్న ఈదురు గాలులు.
  • మత్స్యకారులకు కొనసాగుతున్న హెచ్చరికలు.

వైఎస్సార్ జిల్లా..

  • మైలవరం జలాశయం నుండి పెన్నా నదికి 1000 క్యూసెక్కుల నీటి విడుదల
  • దశల వారీగా రోజు 5000వేల క్యూసెక్కుల నీటి విడుదల చేయనున్న అధికారులు
  • లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశాలు
     

ఏపీలో 46 మంది మృతి!

  • ఏపీలో భారీ వర్షాలకు, వరదలతో ఇప్పటిదాకా 46 మంది మృతి
  • అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలోనే 36 మంది
  • 4,53, 845 వేల ఎకరాల్లో వ్యవసాయ పంట నష్టం
  • 49, 217వేల ఎకరాల్లో ఉద్యానవన పంట నష్టం
  • రాష్ట్రవ్యాప్తంగా 3,913 కిలోమీటర్లు దెబ్బ తిన్న రోడ్లు

ఇదీ చదవండి: ‘విజయవాడ వరద మరణాలు.. సర్కారీ హత్యలే’

తెలంగాణలో 33 మంది మృతి

  • తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో 33 మంది మృతి
  • అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లు
  • తెలంగాణలో 358 గ్రామాలను ముంచెత్తిన వరద
  • దాదాపు 2 లక్షల మంది జీవనంపై ప్రభావం

తెలంగాణకు కేంద్రబృందం

  • ఈనెల 11న తెలంగాణలో పర్యటించనున్న కేంద్రబృందం
  • హైదరాబాద్: ఈనెల 11న రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్రబృందం
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్రబృందం
  • రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్రబృందం
  • అనంతరం వరద బాధితులు, అధికారులతో కేంద్రబృందం సమావేశం
  • కీర్తిప్రతాప్‌ సింగ్ నేతృత్వంలో రానున్న ఆరుగురు సభ్యుల కేంద్రబృందం
  • కీర్తిప్రతాప్‌ సింగ్‌తో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

ముంపు ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: పవన్‌ కల్యాణ్‌

  • పిఠాపురం: కాకినాడ జిల్లా ఏలేరు వదర ప్రాంతాల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటన
  • గొల్లప్రోలు మండలంలో పర్యటించిన పవన్‌
  • ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై కలెక్టర్‌తో మాట్లాడా: పవన్‌
  • ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
  • సుద్దగడ్డ వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం

 

ఎన్టీఆర్‌ జిల్లా
ప్రాణాల మీదకు తెచ్చిన పందెం

  • మున్నేరులో దూకి ఒడ్డుకు వస్తే రూ. 2 వేలు ఇస్తానంటూ పందెం
  • నందిగామ పెద్ద బ్రిడ్జి వద్ద మున్నేరులో దూకిన ఇద్దరు యువకులు
  • మద్యం మత్తులో రోశయ్యతో 2 వేలు పందెం కాసిన మాడుగుల గోపీచంద్(చంటి)
  • పందెంలో భాగంగా గోపీచంద్ తో పాటు నీటిలో దూకిన రోశయ్య
  • నీటిలో మునిగిపోయిన గోపీచంద్
  • గోపీచంద్ ను కాపాడేందుకు యత్నించిన రోశయ్య
  • సాధ్యం కాకపోవడంతో వెనక్కి వచ్చేసిన రోశయ్య
  • నీటిలో మునిగిపోయిన గోపీచంద్‌ కోసం పోలీసుల గాలింపు

ప్రకాశం బ్యారేజ్‌ కేసు.. ఇద్దరి అరెస్ట్‌

  • ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన.. ఇద్దరు అరెస్ట్‌
  • ప్రకాశం బ్యారేజీని భారీ పడవలు ఢీ కొట్టి ధ్వంసం చేసిన ఘటన
  • కుట్ర కోణం కేసుతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులులు
  • కొట్టుకొచ్చిన మూడు పడవలూ.. గొల్లపూడి వాసి కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తింపు  
  • ఉషాద్రితోపాటు, సూరాయపాలెం వాసి కోమటి రెడ్డి రామ్మోహన్‌ అరెస్ట్‌
  • నిందితులను విజయవాడలోని కోర్టుకు తరలించిన పోలీసులు
  • 14 రోజులు రిమాండ్ విధించిన  సీఎంఎం కోర్టు
  • విజయవాడ సబ్ జైలుకు నిందితులను తరలించిన పోలీసులు  
  • ప్రకాశం బ్యారేజ్‌ డ్యామేజ్‌ కేసులో.. A1 గా ఉషాద్రి A2 గా కోమటి రామ్మోహన్


సంబంధిత వార్త: ఆ బోట్లు టీడీపీ వాళ్లవే!


ప్రకాశం బ్యారేజీ దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తి

  • ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తి 
  • 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద మరమ్మతులు పూర్తి
  • దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీల్‌తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేసిన ఇంజినీర్లు 
  • ఐదు రోజులు కష్టపడి మూడు గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు 
  • నిపుణుడు కన్నయ్యనాయుడు మార్గదర్శనలో కౌంటర్ వెయిట్లు ఏర్పాటు
  • రేయింబవళ్లు పనిచేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులను సన్మానించిన కన్నయ్యనాయుడు 
  • మార్గదదర్శనం చేసిన నిపుణుడు కన్నయ్యనాయుడిని సన్మానించిన ఇంజినీర్లు, అధికారులు

ప్రమాదకరంగా మూసీ

  • మూసీకి పోటెత్తిన వరద
  • ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న నీరు
  • మూసారాంబాగ్‌ బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తున్న

కృష్ణా

  • గన్నవరం మండలం కేసరపల్లి వద్ద మూడు రోజుల క్రితం బుడమేరు కాలువలో గల్లంతైన కలదిండి ఫణి ఆచూకీ లభ్యం.
  • కారుకి కొద్ది దూరంలో మృతదేహాన్ని గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.
  • హైదరాబాదు నుండి స్వగ్రామం వెళుతుండగా కేసరపల్లి-ఉప్పులూరు మధ్య బుడమేరు వరదలో గల్లంతైన ఫణి.
  • ఫణి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ వ్యాపారి 
  • ఫణికి భార్య, ఇద్దరు పిల్లలు
  • మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు.
  • పోస్టుమార్టం అనంతరం ఫణి మృతదేహాన్ని స్వగ్రామం మచిలీపట్నం దగ్గర హుస్సేన్ నగర్‌కు తరలింపు

 

కాకినాడ 

  • ఏలేరు ప్రాజెక్టు కు పెరుగుతున్న వరద
  • ఎగువ నుండి ప్రాజెక్టు లోకి చేరుతున్న 45,019 క్యూసెక్ ల వరద నీరు
  • ప్రాజెక్టు లో 22.96 టీఎంసీల నీటి నిల్వలు
  • దిగువకు 21,775 క్యూసెక్ ల వరద నీరు.
  • ఏలేశ్వరం-అప్పన్న పాలెం మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు కాలువ
  • కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి.
  • పెద్దాపురం మండలం కాండ్రకోట వద్ద కొట్టుకుపోయిన డబ్బకాలువ తాత్కలిక వంతెన
  • కిర్లంపూడి, పెద్దాపురం, పిఠాపురం,గొల్లప్రోలు మండలాల్లో నీట మునిగిన పంట చేలు.
  • గొల్లప్రోలు మండలంలో నీట మునిగిన కాలనీలను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్‌
  • ఏలేరు కాలువ ముంపు ప్రాంతాల్లో 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు.
  • పిఠాపురం మండలం గొర్రి ఖండి కాలువకు గండి

 

ఏలేరు వరద.. వైస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధం

  • ఏలేరు వరదను పరిశీలించిన పిఠాపురం వైఎస్సార్‌సీపీ ఇంచార్జి వంగా గీతా
  • పెరుగుతున్న దృష్ట్యా ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • ముంపు ప్రజలను శిబిరాలకు తరలించాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ , అధికారులను కోరుతున్నా
  • ఏలేరు కాలువకు గండ్లు పడడంతో పంట చేలు నీట మునుగుతున్నాయి
  • నీరు లాగిన వెంటనే నష్టపరిహం త్వరిత గతిన అందించేలా ఎన్యూమరేషన్ చేపట్టాలి.
  • ప్రజలకు ఇబ్బందులు వస్తే.. సహయం అందించేందుకు వైస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి

 

నల్లగొండ

  • నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు క్రమంగా తగ్గుతున్న వరద
  • 12 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
  • ఇన్ ఫ్లో: & అవుట్ ఫ్లో : 137871 క్యూసెక్కులు
  • ప్రస్తుత నీటి మట్టం: 588.20 అడుగులు
  • పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలు
  • ప్రస్తుత నీటి నిల్వ: 306.6922  టీఎంసీలు
  • కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

 

వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో

  • విజయవాడలో వరద బాధితుడితో దురుసుగా ప్రవర్తించిన వీఆర్వో విజయలక్ష్మి
  • అజిత్‌ సింగ్‌ నగర్‌ షాదీఖానాలో ఆహారం, తాగునీరుఇవ్వలేదని బాధితుల ఆవేదన
  • ప్రభుత్వం చెప్పినా వీఆర్వో పట్టించుకోవడం లేదంటూ నిరన
  • 259 వార్డు వరద బాధితులకు, వీఆర్వోకు మధ్య తీవ్ర వాగ్వాదాం
  • కోపంతో ఊగిపోతూ ఓ వ్యక్తి చెంపపై కొట్టిన వీఆర్వో విజయలక్ష్మి

 

 

విశాఖ వద్ద పరిస్థితి

విజయ పాల ఫ్యాక్టరీకి భారీ నష్టం

  • సుమారు రూ.75 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు కంపెనీ ప్రకటన
  • ఇంకా వరద నీటిలోనే పాల ఫ్యాక్టరీ
  • ఫ్యాక్టరీకి మరమ్మత్తులు చేపట్టిన సిబ్బంది
  • మరో యూనిట్‌తో ఉత్పత్తిని కొనసాగిస్తున్న కంపెనీ

  •  

మరికొద్ది సేపట్లో పూరీ తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం

  • భూ ఉపరితలంపై ఇవాళ అర్ధరాత్రి వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ క్రమేపీ బలహీనపడుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడి
  • తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో అకస్మాత్తుగా వరదలు సంభవించే అవకాశం
  • శ్రీకాకుళం, పార్వతి పురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
  • కాకినాడ,  ఎన్టీఆర్‌ , ఏలూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలకు ఎల్లో వార్నింగ్
  • చింతపల్లిలో 13,  పూసపాటిరేగ 10, వైజాగ్ ఎయిర్ పోర్ట్ 09 సెం.మీ వర్షపాతం నమోదు
  • కళింగపట్నం నుంచి కాకినాడ వరకు పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ
     

అల్లూరి సీతారామ రాజు జిల్లా

  • జీకే వీధి మండలం గాలికొండ పంచాయతి చట్రాపల్లిలో కొండ చరియలు విరిగిపడి మహిళ మృతి

  • మరో  ముగ్గురికి గాయాలు

  • గాయపడిన కొర్ర పండన్న (60), కొర్ర సుమిత్ర (18), కొర్ర సుబ్బారావు (25)లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స

విజయవాడ:
ప్రకాశం బ్యారేజ్ వరద అప్‌డేట్‌..

  • ప్రకాశం బ్యారేజీకి క్రమంగా తగ్గుతున్న వరద
  • మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
  • ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,72,952 క్యూసెక్కులు
  • 70 గేట్లు ఎత్తివేత

ఏలూరు జిల్లా:  

  • పోలవరం ప్రాజెక్టుకు స్వల్పంగా తగ్గిన గోదావరి వరద.
  • స్పిల్ వే ఎగువన 30.110 మీటర్లు
  • స్పిల్ వే దిగువన 20.995 మీటర్లు  నీటిమట్టం
  • 48 రేడియల్ గేట్ల ద్వారా 5,02,478 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల

 

పూరి వద్ద తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం

  • మరికొద్ది సేపట్లో తీరాన్ని దాటనున్న తీవ్ర వాయుగుండం..
  • పూరి నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు..
  • తీరం దాటిన అనంతరం..  చత్తీస్‌ఘడ్‌ మీదుగా తీవ్రవాయుగుండం పయనించే అవకాశం

 

విరిగిపడ్డ కొండచరియలు

  • కొండ చరియలు విరిగిపడి గిరిజనుల ఇళ్లు ధ్వంసం
  • ముగ్గురు గల్లంతు,నలుగురిని రక్షించిన స్థానికులు
  • సీలేరు-ధారకొండ మధ్య 12 చోట్ల విరిగిపడ్డ కొండచరియలు
  • దాదాపు 16 కి.మీ మేర విరిగిపడ్డ కొండచరియలు
  • గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీలో ఘటన

మధ్యాహ్నానికి తీరం దాటనున్న వాయుగుండం

  • బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
  • పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం
  • వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
  • ఏపీలో 3 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, మరో 3 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌
  • శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
  • విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు
  • ఉత్తర కోస్తా తీరంలో కొనసాగుతున్న మత్స్యకారుల హెచ్చరికలు
  • కళింగపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ హెచ్చరిక
  • భారీ వర్షాలతో ఏపీలో నేడు పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలువు
  • అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌ కంట్రోల్‌ రూమ్‌ 9491998293
  • నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌ కంట్రోల్‌ రూమ్‌ 7075356563
     

పొంగి పొర్లుతున్న మహేంద్ర తనయ.. 

  • శ్రీకాకుళం: రణస్థలం మండలం వల్లభరావుపేటలో రెండు పూరిళ్లు నేలమట్టమయ్యాయి

  • సుభలయ కాలనీలో పాఠశాల ప్రహరీ కూలిపోయింది.

  • నాగావళి నది వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీర గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు

  • పొందూరు మండలం చిన్నబొడ్డేపల్లి గ్రా మం వద్ద రైల్వే అండర్‌ పాసేజ్‌లో భారీగా నీరు చేరడంతో కారు, ట్రాక్టర్‌, ద్విచక్రవాహనాలు చిక్కుకున్నాయ

  • నరసన్నపేట మండలంలోని గుండవల్లిపేటకు చెందిన ఓ ఆగ్రోఫుడ్‌ మిల్లుకు చెందిన ప్రహరీ కూలింది

  • పోలాకి మండలం, సారవకోట మండలాల్లో తంపర భూములు నీట మునిగాయి

  • అరసవల్లి సమీపంలో లక్ష్మీనగర్‌, కామేశ్వర నగర్‌, రాజీవ్‌నగర్‌ కాలనీ, ఇందిరానగర్‌ కాలనీల గుండా వస్తు న్న మిర్తిబట్టి పొంగి పొర్లేలా ఉంది

  • కుప్పిలి ఊట గడ్డ పో టెత్తింది. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, పశువైద్య కేందం, అంగన్‌ వాడీ కేంద్రాల్లోకి నీరు చొచ్చుకు వచ్చింది.

  • మహేంద్ర తనయ నది పొంగి పొర్లుతుండడంతో పాతపట్నం నీలకంఠేశ్వరం ఆలయం వద్ద ఉన్న కాజ్‌వే బ్రిడ్జిపై నుంచి ఆదివారం సాయంత్రం మూడు అడుగుల మేరు నీరు పారింది.

ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం
వాయు గుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో 10 నుంచి 14 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

విద్యా సంస్థలకు సోమవారం సెలవు
ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లోని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. విశాఖ జిల్లాలో వాగులు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో మట్టి కోతకు గురవుతోంది. గోపాలపట్నంలోని రామకృష్ణనగర్‌ వద్ద మట్టి కోతకు గురవుతుండటంతో.. 15కు పైగా ఇళ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో అధికారులు ఆ ఇళ్లన్నీ ఖాళీ చేయించి స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గడిచిన 48 గంటల్లో విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 168.5 మి.మీ., చీపురుపల్లిలో 167.75 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 158.75, ఆమదాలవలసలో 142 మి.మీ. వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లా వై.రామవరంలో 133.5, నెల్లిమర్లలో 129.75 మి.మీ. వర్షపాతం నమోదైంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement