సాక్షి, విశాఖపట్నం: వరద సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన విపత్తే అంటూ ధ్వజమ్తెతారు. విజయవాడ వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమన్నారు.
వరదలు వచ్చినప్పుడు ప్రజలను ప్రభుత్వం కాపాడాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన విజయవాడ విపత్తు సంభవించింది. చంద్రబాబుకు పబ్లిసిటి మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను రక్షించడంపై లేదు. బుడమేరు కాల్వ నుంచి వరద వస్తుందని తెలిసి కూడా డీఈ హెచ్చరికలను లెక్క చేయలేదు. 20 గంటల ముందు వరద వస్తుందని తెలిసి కూడా తాము స్పందించలేదని మరి కొంతమంది అధికారులు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక వరదలపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదు. చంద్రబాబు అమరావతిలో ఉన్నారు కాబట్టి వరదలు రావనుకున్నారా?’’ అంటూ గుడివాడ అమర్‌నాథ్ దుయ్యబట్టారు.
‘‘మునిగిపోతారని తెల్సి కూడా ప్రజలను వదిలేస్తారా..? విజయవాడ వరద మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే. అల్లూరి జిల్లాలో గతంలో వర్షాలు వస్తే 250 గ్రామాల ప్రజలను సురక్షితంగా రక్షించాము. దీనికి సీఎం చంద్రబాబు, అధికారులు బాధ్యత వహించాలి. పడవలను వైఎస్సార్‌సీపీ నాయకుల వదిలేశారని బురద జల్లుతున్నారు. ప్రభుత్వం మీదే కదా అధికారంలో ఉంది. విచారణ చేయండి. ప్రచారం కోసం జేసీబీలపై చంద్రబాబు తిరిగారు.’’ అని అమర్‌నాథ్ ధ్వజమెత్తారు.
సంబంధింత వార్త: ఎటు చూసినా ఆక్రందనలే
‘‘అనకాపల్లి జిల్లాలో వర్షాలకు పంటలు మునిగిపోయాయి. ఒక్క అధికారి జిల్లాలో కనిపించలేదు. కొవిడ్ సమయంలో ఐదు కోట్ల మంది ప్రాణాలను వైఎస్ జగన్ కాపాడారు. వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన డోర్ డెలివరీ వాహనాలు సహాయక చర్యల్లో ఉపయోగపడ్డాయి. వైఎస్ జగన్ రిటైన్ వాల్ నిర్మించకపోతే మరింత ప్రమాదం జరిగి ఉండేది. 45 మంది మరణాలకు చంద్రబాబు బాధ్యత వహించాలి’’ అని అమర్‌నాథ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment