AP And Telangana Floods News Latest Updates In Telugu
రేపు తెలంగాణకు కేంద్ర బృందం
- తెలంగాణకు రానున్నకేంద్ర బృందం
- వరద నష్టాన్ని అంచనా వేయనున్న బృందం
ములుగు
- గోదావరికి బారీగా పెరుగుతున్న వరద ఉధృతి
- రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
- 15.80 మీటర్ల మేర ప్రవహిస్తున్న గోదావరి వరద ప్రవాహం
- 15.83మీటర్లు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు
- ముంపు ప్రాంత ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం
- జాతీయ రహదారి పైకి చేరిన గోదావరి వరద నీరు
- ఛత్తీస్‌గడ్-తెలంగాణ మధ్య రాకపోకలు బంద్
కష్టతరంగా బోట్ల తొలగింపు
- ప్రకాశం బ్యారేజీలో కొనసాగుతున్న బోట్ల తొలగింపు కార్యక్రమం
- రేపు కూడా కొనసాగనున్న చర్యలు
- బోట్లను రంధ్రాలు చేసి తొలగించేందుకు చూస్తున్న ఇంజనీర్లు
- కుదరకపోతే.. బెలూన్ల ద్వారా బోట్లను తరలించే యత్నం
భద్రాద్రి కొత్తగూడెం
- భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- 48 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం
- క్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి ప్రవాహం
- 53 అడుగులు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక
- ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు
నల్లగొండ
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు పెరిగిన భారీ వరద
- 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
- ఇన్ ఫ్లో:& అవుట్ ఫ్లో : 234810 క్యూసెక్కులు
- ప్రస్తుత నీటి మట్టం: 589.40 అడుగులు
- పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలు
- ప్రస్తుత నీటి నిల్వ: 310.2522 టీఎంసీలు
- కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
ఎన్టీఆర్
- గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుకు తగ్గిన వరద ఉధృతి
- భారీ వర్షాలకు డైవర్షన్ రహదారిపై మూడుచోట్ల పడ్డ గండ్లు
కృష్ణా
- అవనిగడ్డ మండలం పులిగెడ్డ గురుకుల పాఠశాలలో వైరల్ ఫీవర్స్ కలకలం
- విషజ్వరాలతో బాధపడుతున్న 20 మందికి పైగా విద్యార్ధులు
- జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పది మంది విద్యార్ధులను ఇళ్లకు పంపించేసిన ప్రిన్సిపల్
- పాఠశాలలోని విద్యార్ధులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వేకనూరు పీహెచ్.సీ వైద్య బృందం
- వరదల సమయంలో ఇళ్లకు వెళ్లి వచ్చిన వారిలోనే ఎక్కువ జ్వరాల తీవ్రత ఉందంటున్న ప్రిన్సిపల్ కుమార్
- జ్వరం ఉన్న వారందరికీ టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా పరీక్షలు చేస్తున్న వైద్యులు
- వాటర్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించనున్న వైద్యులు
ప్రకాశం బ్యారేజ్..ఆ బోట్ల తొలగింపు యత్నం
- ప్రకాశం బ్యారేజ్‌ను ఢీ కొట్టిన బోట్ల తొలగింపు ప్రయత్నాలు
- రెండు భారీ క్రేన్‌లతో తొలగించేందుకు అధికారుల యత్నం
- బ్యారేజీకి ప్రమాదం లేకుండా వరదవైపు బోట్లను తిప్పేందుకు ప్రయత్నాలు
- ముగ్గురు గజ ఈతగాళ్లతో పని చేయించిన ఇంజనీర్లు
- బ్యారేజ్‌ను ఢీ కొట్టాక బోల్తా పడ్డ పడవలు
సంబంధిత వార్త: బ్యారేజ్‌ను ఢీ కొట్టిన బోట్లు టీడీపీ నేతలవే!
అల్లూరి సీతారామరాజు
- వరద ముంపు లోనే చింతూరు వాసులు
- పంపు ప్రాంతాలు ఖాళీ చేయాలని ఆలస్యంగా
ప్రకటించిన అధికారులు - ఉన్నపలంగా చేతి కందిన సామాగ్రితో శబరివంతెనపై చేరి తల దాచుకున్న చింతూరు వాసులు
- తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసుకుని కాలం గడుపుతున్న స్థానికులు
- అధికారులు , ప్రజాప్రతినిధులు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేదంటూ తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్న వరద బాధితులు
- తాగునీరు పాలు కూడా అందించలేదంటూ ఆవేదన
- వరద ప్రాంతాల పరిశీలనకే సమయం వెచ్చిస్తున్న అధికారులు
- చింతూరు మండల పరిధిలో 13 చోట్ల రహదారుల పైకి వచ్చిన వరద నీరు
విజయవాడ
- ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ అప్డేట్
- ప్రకాశం బ్యారేజ్ కు క్రమంగా తగ్గుతున్న వరద
- ఇన్ ఫ్లో ,అవుట్ ఫ్లో 2,02,409 క్యూసెక్కులు
- 2 గేట్లు పూర్తిగా ఎత్తివేత,5 అడుగుల మేర 45 గేట్లు,4 అడుగుల మేర 20 గేట్లు ఎత్తివేత
అల్లూరి
- చింతపల్లి మండలం చింతలూరు గ్రామాన్ని పట్టిపీడిస్తున్న విష జ్వరాలు.
- విష జ్వరాలు వాంతులు విరేచనాలతో ఐదుగురు మృతి.
- వారం రోజుల వ్యవధిలో మృతి చెందిన ఐదుగురు
- విష జ్వరాలతో ఆందోళన చెందుతున్న గ్రామస్తులు
- తమను ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన
- అధికారులు వెంటనే స్పందించి తమను కాపాడాలంటున్న గ్రామస్తులు
- చింతపల్లి, నర్సీపట్నం కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న మరి కొంతమంది గ్రామస్తులు
విజయవాడ
- మాచవరంలో విరిగిపడ్డ కొండచరియలు
- ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- మృతుడు రాముగా గుర్తింపు
- క్షతగాత్రులు దేవినేని నగర్‌కు చెందిన కూలీలుగా గుర్తింపు
అల్లూరి జిల్లా: జలదిగ్బంధంలో విలీన మండలాలు
- పోటెత్తి ప్రవహిస్తున్న శబరి సిలేరు, కొండబాగులు
- సీలేరు ప్రాజెక్టు నుండి లక్ష క్యూసెక్కుల నీరు విడుదల కావడంతో ఉదృతంగా ప్రవహిస్తున్న శబరి
- చింతూరు-వీఆర్పురం-కూనవరం-ఎటపాక మండల కేంద్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు
- నాలుగు మండలాల పరిధిలో అనేక నివాస ప్రాంతాలు జలమయం
- నీట మునిగిన జాతీయ రహదారి 326
- ఆంధ్ర ఒరిస్సాల మధ్య రాకపోకలు బంద్
- చిట్టి వద్ద ఎన్‌హెచ్ 35 చేరుకున్న వరద నీరు
- ఆంధ్ర- తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు
⇒ఈనెల 20 నుంచి 22వ తేదీ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 27వ తేదీ నాటికి ఇది తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇది ఉత్తరాంధ్రకు దగ్గరగా వచ్చినా ఆ తర్వాత ఒడిశా వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తుపాను కూడా ఏర్పడవచ్చని, అది ఏపీపై ఎంత ప్రభావం చూపుతుందనేది వారం రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
⇒అలాగే, ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం సోమవారం ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో మంగళవారం వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్రానికి వర్ష ప్రభావం తగ్గుముఖం పట్టింది.
⇒మరోవైపు.. తీవ్ర వాయుగుండం ప్రభావానికి ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వై. రామవరంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చింతపల్లిలో 13.4, ముంచింగిపుట్టులో 13.3, గంగవరంలో 12.4, అడ్డతీగలలో 11.7 సెంటీమీటర్ల వర్షం పడింది.
⇒అనకాపల్లి జిల్లా గోలుగుండలో 11.2, విజయనగరం పూసపాటిరేగలో 11, అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో 10.9, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 10.5, అనకాపల్లి జిల్లా నాతవరంలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. అల్లూరి, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు.. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురలో 6.2 సెంటీమీటర్ల వర్షం పడింది. ఉత్తరాంధ్రలోని మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment