AP And Telangana Floods News Latest Updates In Telugu
సీఎం, మంత్రుల కుమ్ములాటలతో బాధితులకు తప్పని ఆకలి రాత్రులు
- సీఎం చంద్రబాబు వద్దే సరుకులు అందలేదని చెప్పిన వరద బాధితులు
- భారీ పబ్లిసిటీ చేసి సరుకులు అందించని ప్రభుత్వం
- వాడు రోడ్డుమీదకొచ్చి నాకెమిచ్చావ్ అని అడుగుతున్నారని చంద్రబాబు ఫ్రస్టేషన్
- చంద్రబాబు వద్ద మంత్రుల నాదెండ్ల మనోహర్, నారాయణల పంచాయతీ
- మంత్రి నాదెండ్ల మనోహర్, ఐఏఎస్ వీర పాండ్యన్‌ల వద్ద సీఎం చంద్రబాబు చిర్రు బుర్రులు
- మీ మంత్రి నారాయణ వల్లే ఫెయిల్ అయ్యామని చంద్రబాబుకి చెప్పేసిన మంత్రి మనోహర్
- నారాయణ వాహనాలు ఇస్తాం.. మేమే పంచుతాం అన్నారు
- కానీ మంత్రి నారాయణ వాహనాలు ఇవ్వలేదు
- మేమే 150 వాహనాలు తెచ్చి సిద్ధం చేశాం
- మంత్రి మనోహర్ గట్టిగా చెప్పడం తో ఖంగుతిన్న సీఎం చంద్రబాబు
- మంత్రుల మధ్య సమన్వయం లేదని సీఎం చంద్రబాబు అసహనం
అదంతా రూమర్.. కేంద్రం ఇంకా సాయం ప్రకటించలేదు: సీఎం చంద్రబాబు
- మనం ఇంకా నష్టం పై రిపోర్ట్ పంపలేదు..రేపు కేంద్రానికి రిపోర్ట్ పంపుతాం
- ఈరోజు రేషన్ పంపిణీ చేయలేకపోయాము
- ఎక్కువ వాహనాలు పెట్టారు..మా వాళ్ళు పద్ధతి లేకుండా చేశారు
- 80 వేలు కుటుంబాలకు ఇవ్వాలి అనుకున్నాం
- ఈరోజు కేవలం 15 వేలు కుటుంబాలకే ఇచ్చాం
- ప్యాకింగ్ కూడా సక్రమంగా చెయ్యలేదు
- 16 డివిజన్ల లో ప్రారంభించారు..వాటిని రేపు పూర్తి చేస్తాం
- రేపు 40 వేల కుటుంబాలకు అందించే ప్రయత్నం చేస్తాం
- ఎల్లుండి నుండి సరుకులను రేషన్ షాపుల్లో మాత్రమే పంపిణీ చేస్తాం
విజయవాడ: వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీలో వైఫల్యం
- కనీసం 25 శాతం బాధితులకు కూడా అందని నిత్యావసర సరుకులు
- 7 రోజులైనా వరద బాధితులకు అందని నిత్యావసర సరుకులు
- 80 వేలు కుటుంబాల్లో 15 వేలు కుటుంబాలకు మాత్రమే పంపిణీ చేసిన అధికారులు
- రేపు వినాయక చవితి ఉన్నా నిత్యావసరాలు అందించని ప్రభుత్వం
- ఈరోజు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవాలకే పరిమితం అయిన నిత్యావసరాల పంపిణీ
తాడేపల్లి.
వరద బాధితులకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం
- నెల జీతం విరాళం ప్రకటించిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్న వైఎస్సార్‌సీపీ
ద్విచక్ర వాహనాల రిపేర్‌కు బారులు తీరిన ప్రజలు
- విజయవాడ భవానీపురంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ మెకానిక్ షెడ్ వద్ద వరద ప్రభావంతో నీట మునిగిన ద్విచక్ర వాహనాలు
- రిపేరుకు బారులు తీరిన దృశ్యం
- ఇంజన్ లోంచి మురుగు నీరు తీసీ రిపేరు చేస్తున్న బైక్ మెకానిక్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో దంచికొడుతున్న వర్షం
- ఒక్కసారిగా మొదలైన ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
- నియోజకవర్గంలోని చందర్లపాడు, కంచికచర్ల ,వీరులపాడు, నందిగామ మండలాల్లో భారీ వర్షం
విజయవాడలో దొంగల బీభత్సం
- బుడమేరు వరద నీటిలో చిక్కుకుని సర్వం కోల్పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బెజవాడ వాసులు.
- మరోపక్క దొంగలతో భయంతో వణుకుపోతున్న బెజవాడ వాసులు
- అర్ధరాత్రి దొంగతనానికి వచ్చి కత్తులతో బెదిరిస్తున్న దొంగలు.
- భయందోళనలో వన్ టౌన్ ప్రజలు.
- దొంగలు బారి నుండి పోలీసులు మమ్మల్ని రక్షించాలంటున్న బెజవాడ వాసులు.
- ముత్యాలంపాడు శ్రీనగర్ కాలనీలో మూడు బైకులు చోరీ జరిగాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు.
- దొంగలు బారి నుండి మమ్మల్ని కాపాడకంటు వేడుకుంటున్న బెజవాడ వాసులు.
- వరద ప్రాంతాల్లో దొంగల పై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలి అంటున్న బెజవాడ వాసులు
నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
- జలాశయం 4 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత
- ఇన్ ఫ్లో : 1,29,816 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 1,79,563 క్యూసెక్కులు
- పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
- ప్రస్తుతం : 884.80 అడుగులు
- పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
- ప్రస్తుతం : 214.8450 టీఎంసీలు
- కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం ఓగిరాల గ్రామాన్ని చుట్టుముట్టిన వరద
- నిన్నటి కంటే నాలుగు అడుగులు పెరిగిన వరద నీరు
- నీరు బయటకు వెళ్లకపోవడంతో ఆందోళనలో గ్రామస్తులు
విజయవాడలో జనాగ్రహం
- పైపులు రోడ్ వద్ద వరద బాధితుల ధర్నా
- వరద సహాయక చర్యల్లో.. ప్రభుత్వం పట్టించుకోవాలని ఆందోళన
- వారం రోజులుగా వరద నీటిలో మగ్గుతున్నా పట్టించుకున్న నాధుడు లేడని ఆగ్రహం
- సింగ్‌నగర్‌లో మళ్లీ చేరిన వరద.. సహాయక చర్యల్లో మళ్లీ అధికారులు విఫలం.. బాధితుల ఆగ్రహం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ
- రాజోలు దీవిలో మరల మొదలైన వరద కష్టాలు
- ధవలేశ్వరం వద్ద వరద ఉధృతి పెరుగుతుండడంతో పాశర్లపూడి అప్పనపల్లి కాజ్‌వే మునక
- కాజ్‌వే పై అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామాలకు రాకపోకలు నిలిపివేసిన రెవెన్యూ పోలీస్ అధికారులు
నల్లగొండ
- నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
- 4 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
- ఇన్ ఫ్లో: 1,55,845 క్యూసెక్కులు
- అవుట్ ఫ్లో: 72,845 క్యూసెక్కులు
- పూర్తి నీటిమట్టం: 590 అడుగులు
- ప్రస్తుతం: 589.70 అడుగులు
- పూర్తి నీటినిల్వ సామర్థ్యం: 312 టీఎంసీ
- ప్రస్తుతo: 311.1486 టీఎంసీ
రాయనపాడు వద్ద పెరిగిన బుడమేరు వరద ఉధృతి
- గత రాత్రి 9:30 గంటల నుంచి పెరుగుతున్న వరద
- రాయనపాడు రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌పైకి చేరుకున్న వరద నీరు
- వరద పెరగడంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు
- రైళ్ల రాకపోకలను నిలిపేసిన రైల్వే
- పలు దారిమళ్లింపు.. మరికొన్ని రీ షెడ్యూల్ చేసిన రైల్వే
వరదలతో రైతులకు వెయ్యి కోట్ల పంట నష్టం
- లక్షా 81 వేల హెక్టార్లలో వరి,పత్తి ఇతర పంటలు నష్టం
- వరదలతో నష్టపోయిన 2 లక్షల 5 వేల మంది రైతులు
- లక్షా 50 వేలకుపైగా హెక్టార్లలో వరి పంట నష్టం
- ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో అత్యధిక నష్టం
- 20 వేల ఎకరాల్లో దెబ్బతిన్న ఉద్యానవన పంటలు
- వర్షాలు, వరదలకు 3,756 కిలోమీటర్లు దెబ్బతిన్న రోడ్లు
- విజయవాడ నగరంలోనూ దెబ్బతిన్న రోడ్లు, డ్రైన్లు
- 533 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న మున్సిపల్ రోడ్లు
కొల్లేరుకు బుడమేరు టెన్షన్
- బుడమేరు గండ్లు పూడ్చివేతతో కొల్లేరుకు వరద
- పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
గోదావరికి పెరుగుతున్న వరద నీరు
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 12.3 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం
- 10 లక్షల 55 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల
- కోనసీమలో ఉదృతంగా ప్రవహిస్తున్న గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు
- గోదావరి వరద నీటిలో మునిగిన గంటి పెదపూడి, కనకయలంక కాజ్వేలు
- ఏజెన్సీ కూనవరం వద్ద 43.86 అడుగుల వద్ద ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న శబరి, గోదావరి నదులు
- విలీన మండలాల్లో 20 చోట్ల నీటి మునిగిన రహదారులు
- సుమారు 85 గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకలు...
సాక్షి, విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో కష్టాలు వీడలేదు. బుడమేరకు వరద కొనసాగుతోంది. ఆరు రోజులుగా విజయవాడలోని పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి.ఇప్పటికీ లోపలి ప్రాంతాలకు ఆహారం అందడం లేదు. 4 లక్షల మంది నిర్రాశయులైతే 2 వేల మందికే ఆశ్రయం కల్పించారు.
ఏ బాధితుడిని కదిలించినా వ్యథా భరిత గాథలే. వరద తగ్గడంతో విజయవాడ–నూజివీడు రహదారిపై రాకపోకలు మొదలైనా అది కేవలం ప్రధాన రోడ్లకే పరిమితమైంది. ఆ రోడ్డుకి అనుబంధంగా ఉన్న ముఖ్యమైన ప్రాంతాలన్నింటిలో ఇంకా మోకాల్లోతు నీరుంది. ఇంట్లో సరుకులు, వస్తువులు నీళ్లలో మునిగిపోవడంతో మొత్తం మళ్లీ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోతున్నారు. ముంపు ప్రాంతాల్లో విపరీతమైన దుర్గంధం రావడం, ఇళ్లను వెంటనే బాగు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో వేలాది కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వీడి వలస వెళ్లిపోతున్నాయి.
వరద ప్రాంతాల్లో అక్కడే ఉంటున్న వారు ఇళ్లలో నీరు బయటకు తోడేందుకు ప్రయతి్నస్తున్నారు. బురదను తొలగించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లను శుభ్రం చేసేందుకు పెద్దఎత్తున ఫైరింజన్లు తెప్పించామంటూ ప్రభుత్వం చెబుతున్నా చాలా పరిమిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రధాన ప్రాంతాల్లో కొన్ని ఇళ్లల్లో నీళ్లు చల్లి వెళ్లిపోవడం మినహా ఫైరింజన్ల వల్ల పెద్దగా ఉపయోగం కనిపించడంలేదు. ముంపులో ఉన్న లక్షల ఇళ్లను ఎవరికి వారే శుభ్రం చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment