diverted
-
ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు పునరుద్ధరణ, దారి మళ్లింపు
సాక్షి, విజయవాడ: వరదలతో విజయవాడ డివిజన్లో రద్దు అయిన పలు రైళ్లను అధికారులు పునరుద్ధరించారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. మచిలీపట్నం–బెంగళూరు (07650) మధ్య ప్రత్యేక రైలును నడిపారు. అహ్మదాబాద్–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12655), చెన్నై సెంట్రల్–కాట్రా (16031), త్రివేండ్రం–హజరత్ నిజాముదీ్ధన్ (12643) యథావిధిగా పునరుద్ధరించారు.అలాగే సికింద్రాబాద్–గుంటూరు (17202) రైలును రెండు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ నుంచి నడిపారు. గూడూరు–సికింద్రాబాద్ (12709) రైలును వయా తెనాలి, గుంటూరు, రేణిగుంట మీదుగా, న్యూఢిల్లీ–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12622) వయా రేణిగుంట, గుంతకల్లు, సికింద్రాబాద్, ఖాజీపేట మీదుగా, సికింద్రాబాద్–గుంటూరు (17202) వయా పగిడిపల్లి, నడికుడి మీదుగా దారి మళ్లించారు. -
ఢిల్లీలో పొగమంచు.. విమానాలు మళ్లింపు
సాక్షి, న్యూఢిల్లీ: పొగ మంచు కమ్మేయడంతో దేశ రాజధాని ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలు దారి మళ్లించారు. విజిబిలిటీ తగ్గిపోవడంతో శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య హైదరాబాద్, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా నగరాల నుంచి ఢిల్లీకి వస్తున్న 20 విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్సర్ ఎయిర్‌పోర్టులకు దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి లక్నో, జైపూర్, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన విమానాలను రన్‌వే పైనే నిలిపివేసినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. -
దంపతుల పోట్లాట దెబ్బకు.. దారి మళ్లిన విమానం!
న్యూఢిల్లీ: భార్యాభర్తల గొడవలంటే ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అయితే ఆ గొడవ దెబ్బకు బుధవారం ఏకంగా ఓ అంతర్జాతీయ విమానాన్నే దారి మళ్లించాల్సి వచ్చింది! మ్యూనిచ్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానం ఈ ఘటనకు వేదికైంది. విమానం మ్యూనిచ్ నుంచి బయల్దేరిన కాసేపటికే అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు గొడవ పడ్డారు. భర్తది జర్మనీ కాగా భార్యది థాయ్‌లాండ్. భార్య ఫిర్యాదుతో విమానాన్ని పైలట్ ఢిల్లీ మళ్లించి భర్తను పోలీసులకు అప్పగించారు. అయితే, క్షమాపణలు చెప్పడంతో అతన్ని మరో విమానంలో బ్యాంకాక్ పంపడం కొసమెరుపు! ఇదీ చదవండి: నిజంగా ఇది వింతే మరి.. పెద్దాయన పెద్ద పేగులో ఈగ.. -
AP: పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్లోని అనకాపల్లి–తాడి సెక్షన్ల మధ్య జరుగుతున్న ట్రాఫిక్ బ్లాక్ పనుల కారణంగా ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు పలు రైళ్లను పూర్తిగా, మరి కొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రద్దయిన రైళ్లు: మచిలీపట్నం–విశాఖపట్నం (17219) రైలు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు, విశాఖపట్నం–మచిలీపట్నం (17220) రైలు ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 4 వరకు, విజయవాడ–విశాఖపట్నం (22702/22701) రైళ్లు సెప్టెంబర్ 2, 4 తేదీల్లో, రాజమండ్రి–విశాఖపట్నం (07466/07467), గుంటూరు–విశాఖపట్నం (17239), కాకినాడ పోర్టు–విశాఖపట్నం (17267/17268) రైళ్లు సెప్టెంబర్ 4న, విశాఖపట్నం–గుంటూరు (17240) రైలు సెప్టెంబర్ 5న రద్దు చేశారు. పాక్షికంగా రద్దు: తిరుపతి–విశాఖపట్నం (22708) రైలు సెప్టెంబర్ 1, 3 తేదీల్లో, విశాఖపట్నం–తిరుపతి (22707) సామర్లకోట–విశాఖపట్నం మధ్య సెప్టెంబర్ 3, 5 తేదీల్లో, విజయవాడ–విశాఖపట్నం (12718/12717) రైళ్లు విశాఖపట్నం–అనకాపల్లి మధ్య ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశారు. చదవండి: AP: కార్ల అమ్మకాలు రయ్ రయ్ -
ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ.. అయినా దక్కని ప్రాణం
ఢిల్లీ నుంచి దోహా వెళుతున్న ఇండిగో విమానం ఏ320-271ఎన్లో గాల్లో ఉండగానే.. అందులోని ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్థాన్‌లోని కరాచీకి మళ్లీంచాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు. కరాచీ ఎయిర్‌పోర్టు కూడా ఇండిగో విమానం టేకాఫ్‌కు అనుమతించింది. అయితే అప్పటికే సదరు ప్రయాణికుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిని నైజీరియాకి చెందిన 60 ఏళ్ల అబ్ధుల్లాగా అధికారులు గుర్తించారు. కరాచీలోని సివిల్ ఏవియేషన్ అధికారులు మాట్లాడుతూ..ప్రయాణికుడు విమానంలో అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కోసం పైలెట్ మమ్మల్ని అభ్యర్థించాడు. అత్యవసరంగా ల్యాండింగ్ చేసినా.. ఆ ప్రయాణికుడు చనిపోవడంతో మేము చాలా చింతిస్తున్నాం’ అని అన్నారు. కరాచీలోని అధికారులు అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసి, మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా జారీ చేశారు. అప్పటి వరకు ఇండిగో విమానం కరాచీలోనే దాదాపు ఐదు గంటల వరకు నిలిపేశారు. ఇదిలా ఉండగా, ఇండిగో ఎయిర్‌లైన్స్ ఓ తాజా ప్రకటనలో.. సంబంధిత అధికారుల సమన్వయంతో విమానంలోని ఇతర ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. అలాగే ఇండిగో విమానం మృతి చెందిన ప్రయాణికుడితో తిరిగి ఢిల్లీకి చేరుకున్నట్లు తెలిపింది. (చదవండి: టైర్ పేలడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు..) -
విమానంలో ఐదుగురు ఎంపీలు, దారి మళ్లింపు
సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతా నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానాన్ని సోమవారం అకస్మాత్తుగా దారి మళ్లించారు. ట్రాఫిక్, విమానంలో ఇంధనం తక్కువగా ఉన్న కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సలహా మేరకు కోల్‌కతా నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని అమృత్‌సర్‌కు మళ్లించారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారిలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన అయిదుగురు ఎంపీలు కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన కోల్‌కతా-ఢిల్లీ విమానంలో (ఏఐ-021) మొత్తం 242 మంది ప్రయాణికులుండగా, ఇందులో బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు లోక్‌సభ ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు మొత్తం ఐదుగురు ఎంపీలున్నారు. ఐదుగురు వీరంతా సోమవారం నాటి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 తోపాటు, ఆర్టికల్ 35ఏ రద్దు బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. బీఎస్పీ, వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్, ఏఐడీఎంకే, ఆప్ ఎంపీలు బిల్లుకు మద్దతు తెలుపగా.. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేంచారు. దీనికి నిరసనగా రాజ్యసభ నుండి వాకౌట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ట్వీట్ చేశారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభ సోమవారం సాయంత్రం ఆమోదించింది. Air India Kolkata-Delhi flight (AI-021) was diverted to Amritsar due to traffic and low holding fuel, as advised by Air Traffic Control (ATC). Five MPs from Bengal (three Lok Sabha MPs and two Rajya Sabha MPs) are on-board; they were coming to attend Parliament today. pic.twitter.com/VrEZvGUwR0 — ANI (@ANI) August 5, 2019 -
యుద్ధభయం; విమానాల దారి మళ్లింపు
లండన్: హొర్ముజ్ జలసంధి చుట్టు పక్కల ప్రాంతాల్లో వెళ్లే పౌర/వాణిజ్య విమానాలు కూడా పొరపాటున కూల్చివేతకు గురయ్యే అవకాశాలు ఉంటాయంటూ అమెరికా హెచ్చరించడంతో పలు విమానయాన సంస్థలు తమ విమానాల ప్రయాణ మార్గాలను మార్చుకున్నాయి. బ్రిటిష్ ఎయిర్వేస్, ఖంతాస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, మలేసియా ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా, ఎమిరేట్స్, కేఎల్ఎం సహా పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా నిర్ణయం ఫలితంగా న్యూయార్క్–ముంబై విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్టు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఆ మార్గంలో విమానం నడిపి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించలేమని తెలిపింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తాయని ప్రపంచ దేశాలు ఆందోళన నేపథ్యంలో పౌర విమానాల దారి మళ్లించినట్టు తెలుస్తోంది. ఇరాన్‌లోని ఎంపిక చేసిన మూడు లక్ష్యాలపై గురువారం రాత్రే దాడి చేయాలని అంతా సిద్ధం చేసినప్పటికీ, దాడి చేస్తే 150 మంది చనిపోతారని తెలియడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో శుక్రవారం ప్రకటించారు. ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా నిఘా డ్రోన్‌ని ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డులు కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడం తెలిసిందే. (చదవండి: ఆఖరి క్షణంలో ఆగిన యుద్ధం) -
శంషాబాద్‌లో విమాన రాకపోకలు బంద్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో గురువారం విమాన రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ పేలి మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గురైన విమానం రన్‌వే పైన నిలిచిపోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు పలు విమానాలను వేరే విమానాశ్రయాలకు దారి మళ్లించడంతో పాటు కొన్నింటిని రద్దు చేశారు. త్వరంలో రన్‌వేను క్లియర్ చేసి సర్వీసులు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. గన్నవరంలో ప్రయాణికుల ఆందోళన విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని అధికారులు క్యాన్సిల్ చేశారు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం 8 గంటలకు 70 మంది ప్రమాణికులతో బయలుదేరాల్సిన విమానాన్ని రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని తెల్లవారుజాము సదరు ప్రయాణికులకు మేసేజ్ పంపించారు. అయితే అకస్మాత్తుగా మెసేజ్‌లు పంపడమేంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాన్ని క్యాన్సిల్ చేసినా, మరో ప్రత్యామ్నాయం చూపలేదంటూ అధికారుల తీరుపై అసహనం వ్యకం చేస్తూ ఆందోళన చేశారు. -
ఇంటర్నెట్తో వాయిస్ కాల్స్ మళ్లింపు
సాక్షి, కడప అర్బన్ : సమాజంలో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ కోవలోనే ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్ మళ్లిస్తూ ప్రభుత్వ బొక్కసానికి చిల్లుపెడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కడప డీఎస్పీ షేక్ మాసూంబాషా విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని హాజీ గఫూర్‌సాబ్ వీధిలో ఉంటున్న హిమాయతుల్లా షరీఫ్ కుమారుడు షేక్ ముక్కపాలెం హఫీజుల్లా ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్‌ను అక్రమంగా మళ్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాడు. సమాచారం అందుకున్న కడప వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ, ఎస్ఐలు, సిబ్బంది అతడిని అరెస్టు చేశారు. అతని నుంచి ఒక్కొక్కటి రూ.లక్షకు పైగా విలువజేసే మూడు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(వీఓఐపీ) వస్తువులు, 120 ఒడాఫోన్, రిలయన్స్ సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారన్నారు. వీఓఐపీ ద్వారా కాల్స్ చేస్తే అది కంప్యూటర్ ద్వారా దేశంలోని అనధికారిక ఎక్స్ఛేంజిలకు వస్తుందని, అక్కడినుంచి సాధారణ కాల్స్ మాదిరి మారుతాయని ఆయన వివరించారు. ఆ కాల్స్‌ను నిందితుడు తనకు తెలిసిన సాంకేతికత, ఆధునిక పరికరాలతో సాధారణ కాల్స్ మాదిరి మార్చి డబ్బులు సంపాదించుకుంటున్నాడని డీఎస్పీ చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు. బీఎస్ఎన్ఎల్, ఇతర సెల్‌ఫోన్ సంస్థలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడన్నారు. హఫీజుల్లాకుతోడు విజయవాడలో చిరంజీవి అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తూ కాల్స్ మళ్లించడంలో నైపుణ్యం పొందాడన్నారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కృషి చేసిన చిన్నచౌక్ ఎస్ఐలు యోగేంద్ర, మోహన్, ఎస్బీ ఎస్ఐ నాగరాజు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
రైళ్ల దారి మళ్లింపు
గుంతకల్లు టౌన్ : మహారాష్ట్రలోని సోలాపూర్ రైల్వే డివిజన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ముంబై–చెన్నై మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. హుబ్లీ–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17319) రైలును బళ్లారి–గుంతకల్లు–వికారాబాద్–హోటగీ మీదుగాను, నాగర్‌కోయిల్–చెన్నై సెంట్రల్ (16352), చెన్నై సెంట్రల్–అహ్మద్‌బాద్ ఎక్స్‌ప్రెస్ (19419)ను గుంతకల్లు–బళ్లారి–విజయపుర–హోటగి స్టేషన్ల మీదుగాను దారి మళ్లించినట్లు రైల్వే వర్గాల ద్వారా తెలిసింది. ఏప్రిల్ 30న బయల్దేరిన మూడు రైళ్లను సోలాపూర్–గుల్బర్గా మధ్య రద్దు చేశారు. గుంతకల్లు మీదుగా నడిచే పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. -
పచ్చ పార్టీ నేతల దోపిడీ పర్వం
-
విమానంలో శాంసంగ్ టాబ్లెట్ పొగలు
ఇప్పటికే గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్ల ఘటనతో తీవ్ర సతమతమైన శాంసంగ్‌కు మరో చిక్కు వచ్చి పడింది. మరోసారి మరో విమానంలో ఈ ఫోన్ పేలిందని తెలిసింది. ఆ పేలుడు ఘటనతో డెట్రాయిట్ నుంచి అమ్స్టెర్డామ్ వెళ్లే డెల్టా విమానాన్ని శనివారం ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు మళ్లించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మాంచెస్టర్‌కు వెళ్తున్న ఈ విమానంలో శాంసంగ్ పాబ్లెట్ సీటు లోపలికి పడిపోయి, దానిలో ఇరుక్కు పోయింది. అనంతరం ఆ టాబ్లెట్ పేలి సీటు కవర్ నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. ఆ వింత వాసన, పొగలను గమనించిన ప్రయాణికులు డెల్టా అధికారులకు వెంటనే సమాచారాన్ని అందజేశారు. దీంతో ఆ విమానాన్ని మాంచెస్టర్‌కు మరలించారు. శాంసంగ్ టాబ్లెట్ వల్ల పాడైపోయిన సీటును కొత్త దానితో పునరుద్ధరించారు. రెండు గంటల అనంతరం మళ్లీ డెల్టా విమానం అమ్‌స్టెర్‌డామ్‌కు పయనమైంది. అయితే ఈ ఘటనను శాంసంగ్ ఖండిస్తోంది. బహిరంగ కారణాలే ఈ ఘటనకు దోహదం చేసి ఉంటాయని, గెలాక్సీ నోట్7 వల్ల ఈ పొగలు వ్యాపించలేదని శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. సమస్యాత్మకమైన బ్యాటరీగల ఫోన్లను తాము రీకాల్ చేస్తున్నామని, ఈ ఘటన శాంసంగ్ ఫోన్ వల్ల కాకపోవచ్చని స్పష్టంచేస్తోంది.డెల్టా అధికారులను తాము ఆశ్రయిస్తామని, దీనిపై విచారిస్తామని పేర్కొంటోంది. మరోవైపు ఈ ఘటనను ఎఫ్ఏఏ సమీక్షిస్తోంది. -
సీఎం భార్య దత్తత గ్రామానికే నిధులన్నీ?
మిగతా పల్లెల గతేమిటి? సర్కారుపై ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం పామర్రు : స్మార్ట్ విలేజ్ అభివృద్ధి అంటూ ఒక్క గ్రామానికే రూ. 7 కోట్ల ప్రభుత్వ నిధుల్ని కట్టబెట్టడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని అసెంబ్లీలో వెఎస్సార్ సీపీ డిప్యూటీ ప్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని కొమరవోలు గ్రామాన్ని సీఎం సతీమణి నారా భువనేశ్వరీ దత్తత తీసుకోగా, ఇప్పటివరకూ గ్రామానికి ఆర్డీఎఫ్ నిధులు రూ.7కోట్లు మంజూరు చేయటం జరిగిందన్నారు. సీఎం సతీమణి దత్తత తీసుకున్నారని అంత భారీమొత్తంలో ప్రజల సొమ్మును ఒక్క గ్రామానికే ఇవ్వడం విడ్డూరంగా ఉన్నదన్నారు. నియోజకవర్గంలో అనేక గ్రామాలకు సరైన రహదారులు లేక బరద రోడ్లతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన గ్రామాల పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రభుత్వం స్థానికంగా గెలిచిన ప్రజా ప్రతినిధులను ఉత్సవిగ్రహాలుగా మార్చి, ఓడిపోయినవారికి, పరిపాలనలో భాగస్వామ్యంలేని వారికి పెద్దపీట వేయడం ఏమిటని ప్రశ్నించారు. కావాలంటే సొంత డబ్బును ఖర్చు పెట్టుకోవాలని సూచించారు. దీనిపై రాబోయే అసెంబ్లీ సమావేశాలలో గట్టిగా నిలదీస్తామన్నారు. దాసు గంగాధరరావు, ఆరుమళ్ల శ్రీనా«ద్‌రెడ్డి, ఎన్‌సాంబిరెడ్డి పాల్గొన్నారు. -
కృష్ణా పుష్కరాలకు ట్రాఫిక్ మళ్లింపు
ఏలూరు (మెట్రో): కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఈనెల 12వ తేదీ నుంచి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం విలే కరుల సమావేశంలో డీఐజీ మాట్లాడారు. చెన్నై నుంచి విశాఖ వెళ్లే వాహనాలు, విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాల దారి మళ్లించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. త్వరలోనే ట్రైల్ రన్ వేసి మార్గాలను ప్రకటిస్తామని చెప్పారు. ట్రాఫిక్ మళ్లింపు విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు. పుష్కర యాత్రికుల వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ స్థలాల వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఘాట్ ప్రాంతంలో ప్రత్యేకంగా లోపలికి, బయటకు వేర్వేరుగా మార్గాలను ఏర్పాట్లుచేశామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. -
పోలవరం కాల్వ దగ్గర టీడిపినేతల పూజలు
-
వైఎస్సార్ నేతలపై కక్ష సాధింఫు
-
బియ్యం, పంచదార పక్కదారి
-
పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు
విశాఖ : హుదూద్ తుఫాను ప్రభావంతో సోమవారం కూడా పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. కాగా పలు రైళ్లను దారి మళ్లించారు. వాటి వివరాలు * ముంబై-భువనేశ్వర్, తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ రద్దు *రాత్రి 11 గంటలకు బయల్దేరాల్సిన నిజాముద్దీన్ -విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు *విజయవాడ-విశాఖ పాసింజర్ రాజమండ్రి వరకే *ఉదయం 10 గంటలకు బయల్దేరాల్సిన హైదరాబాద్-హౌరా-ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ మీదగా మళ్లింపు * నాగర్ సోయల్-షాలిమర్ గురుదేవ్ ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ మీదగా మళ్లింపు *ముంబై-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట్-బలార్షా మీదగా మళ్లింపు *పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు *ముంబై-విశాఖ ఎక్స్‌ప్రెస్ విజయవాడ వరకే *కాజీపూట-విశాఖ లింక్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ వరకే *నిజాముద్దీన్-విశాఖపట్నం స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ విజయవాడ వరకు కుదించిన రైళ్ల సర్వీసుల వివరాలు: *సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరాల్సిన ముంబై-విశాఖ ఎక్స్‌ప్రెస్ తుని వరకు *మధ్యాహ్నం 2.30 గంటలకు కాజీపేటలో బయల్దేరే కాజీపేట్-విశాఖ లింక్ ఎక్స్‌ప్రెస్ తుని వరకు *సాయంత్రం 6.15 గంటలకు విశాఖలో బయల్దేరాల్సిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ తెనాలి నుంచి ప్రారంభం *మధ్యాహ్నం 12.40 గంటలకు బయల్దేరాల్సిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సామర్లకోట నుంచి ప్రారంభం *విజయవాడ నుంచి వెళ్లే రత్నాచల్ సామర్లకోట వరకే *గుంటూరు నుంచి వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ సామర్లకోట వరకే *నర్సాపూర్-విశాఖ లింక్ ఎక్స్‌ప్రెస్ సామర్లకోట వరకు -
రైల్వే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైళ్లు నిలివేత