గుంతకల్లు టౌన్ :
మహారాష్ట్రలోని సోలాపూర్ రైల్వే డివిజన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ముంబై–చెన్నై మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. హుబ్లీ–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17319) రైలును బళ్లారి–గుంతకల్లు–వికారాబాద్–హోటగీ మీదుగాను, నాగర్‌కోయిల్–చెన్నై సెంట్రల్ (16352), చెన్నై సెంట్రల్–అహ్మద్‌బాద్ ఎక్స్‌ప్రెస్ (19419)ను గుంతకల్లు–బళ్లారి–విజయపుర–హోటగి స్టేషన్‌ల మీదుగాను దారి మళ్లించినట్లు రైల్వే వర్గాల ద్వారా తెలిసింది. ఏప్రిల్ 30న బయల్దేరిన మూడు రైళ్లను సోలాపూర్–గుల్బర్గా మధ్య రద్దు చేశారు. గుంతకల్లు మీదుగా నడిచే పలు రైళ్లు ఆలస్యమయ్యాయి.