
టైర్ పేలడంతో రన్‌వే నిలిచిన ఇండిగో విమానం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో గురువారం విమాన రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ పేలి మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గురైన విమానం రన్‌వే పైన నిలిచిపోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు పలు విమానాలను వేరే విమానాశ్రయాలకు దారి మళ్లించడంతో పాటు కొన్నింటిని రద్దు చేశారు. త్వరంలో రన్‌వేను క్లియర్ చేసి సర్వీసులు పునరుద్ధరిస్తామని వెల్లడించారు.
గన్నవరంలో ప్రయాణికుల ఆందోళన
విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని అధికారులు క్యాన్సిల్ చేశారు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం 8 గంటలకు 70 మంది ప్రమాణికులతో బయలుదేరాల్సిన విమానాన్ని రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని తెల్లవారుజాము సదరు ప్రయాణికులకు మేసేజ్ పంపించారు. అయితే అకస్మాత్తుగా మెసేజ్‌లు పంపడమేంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాన్ని క్యాన్సిల్ చేసినా, మరో ప్రత్యామ్నాయం చూపలేదంటూ అధికారుల తీరుపై అసహనం వ్యకం చేస్తూ ఆందోళన చేశారు.