
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండిగో విమానం గాలిలో అదే పనిగా చక్కర్లు కొడుతూ.. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయి.. గాలిలోకి ఎగిరిన తర్వాత విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు.. విమానాన్ని కాసేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టించారు. దీంతో ప్రయాణికులు ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ కాసేపు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే, ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానం ఎట్టకేలకు తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment