![ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/61458731189_625x300_0.jpg.webp?itok=ig87L6Cb)
ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 40 మంది ప్రయాణికులు బుధవారం ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ, ముంబై, లక్నో, చెన్నై, అహ్మదాబాద్ వెళ్లవలసిన విమానాలలో ఉన్న సీట్లకు మించి ఇండిగో సిబ్బంది టిక్కెట్ల అమ్మకాలు జరగడంతో ప్రయాణికులను ఎయిర్ పోర్టు సిబ్బంది లోపలికి అనుమతించడం లేదు. తెల్లవారుజాము నుంచి ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిరీక్షిస్తున్నారు. తొందరగా పంపించమని ప్రయాణికులు అడిగితే అధికంగా డబ్బులు అడుగుతున్నారని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.