diverted trains
-
ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు పునరుద్ధరణ, దారి మళ్లింపు
సాక్షి, విజయవాడ: వరదలతో విజయవాడ డివిజన్లో రద్దు అయిన పలు రైళ్లను అధికారులు పునరుద్ధరించారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. మచిలీపట్నం–బెంగళూరు (07650) మధ్య ప్రత్యేక రైలును నడిపారు. అహ్మదాబాద్–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12655), చెన్నై సెంట్రల్–కాట్రా (16031), త్రివేండ్రం–హజరత్ నిజాముదీ్ధన్ (12643) యథావిధిగా పునరుద్ధరించారు.అలాగే సికింద్రాబాద్–గుంటూరు (17202) రైలును రెండు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ నుంచి నడిపారు. గూడూరు–సికింద్రాబాద్ (12709) రైలును వయా తెనాలి, గుంటూరు, రేణిగుంట మీదుగా, న్యూఢిల్లీ–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12622) వయా రేణిగుంట, గుంతకల్లు, సికింద్రాబాద్, ఖాజీపేట మీదుగా, సికింద్రాబాద్–గుంటూరు (17202) వయా పగిడిపల్లి, నడికుడి మీదుగా దారి మళ్లించారు. -
Cyclone Gulab: పలు రైళ్ల మళ్లింపు, రీషెడ్యూల్
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): గులాబ్ తుపాను కారణంగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు, మరికొన్నింటిని రీషెడ్యూల్ చేస్తున్నట్లు రెల్వే అధికారులు తెలిపారు. దారి మళ్లించిన రైళ్లు ♦25వ తేదీన అగర్తలలో బయలుదేరిన అగర్తల–బెంగళూరు (05488) రైలు, 26న హౌరాలో బయలుదేరిన హౌరా–సికింద్రాబాద్ (02703, హౌరా–యశ్వంత్‌పూర్ (02245),హౌరా–హైదరాబాద్ (08645), హౌరా–చెన్నై (02543), హౌరా–తిరుపతి (02663), సంత్రాగచ్చిలో బయలుదేరిన సంత్రాగచ్చి– తిరుపతి (02609), టాటాలో బయలుదేరిన టాటా ఎర్నాకుళం (08189) రైళ్లు ఖరగ్‌పూర్, ఝార్సుగుడ, బల్హార్షా మీదుగా ప్రయాణిస్తాయి. ♦26న భువనేశ్వర్‌లో బయలుదేరిన భువనేశ్వర్–ముంబై(01020) రైలు సంబల్పూర్, టిట్లాగఢ్ రాయ్‌పూర్ మీదుగా నడుస్తుంది. 25న అలప్పుజాలో బయలుదేరిన అలప్పుజా–ధన్‌బాద్ (03352), 26న చెన్నైలో బయలుదేరిన చెన్నై–హౌరా (02544) రైళ్లు బల్హార్షా, ఝార్సుగుడ మీదుగా నడుస్తాయి. ♦25న యశ్వంత్‌పూర్‌లో బయలుదేరిన యశ్వంత్‌పూర్–పూరి (02064), 26న తిరుపతిలో బయలుదేరిన తిరుపతి–భువనేశ్వర్ (08480) రైళ్లు బల్హార్షా, సంబల్పూర్ మీదుగా ప్రయాణిస్తాయి. ♦25న త్రివేండ్రం సెంట్రల్లో బయలుదేరిన త్రివేండ్రం–షాలిమార్ (02641), 26న హైదరాబాద్‌లో బయలుదేరిన హైదరాబాద్–హౌరా (08646) రైళ్లు బల్హార్షా, ఝార్సుగుడ, ఖరగ్‌పూర్ మీదుగా నడుస్తాయి. రీషెడ్యూల్ చేసిన రైళ్లు 26న పలు స్టేషన్లలో బయలుదేరే ప్రత్యేక రైళ్లను రీషెడ్యూల్ చేశారు. పూరిలో బయలుదేరే పూరి–తిరుపతి (07480) 11 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ♦హౌరా నుంచి హౌరా–యశ్వంత్‌పూర్ (02873), హౌరా–పాండిచ్చేరి (02867) రైళ్లు 2 గంటలు ఆలస్యంగా బయలుదేరతాయి. ♦సికింద్రాబాద్‌లో సికింద్రాబాద్–హౌరా (02704), యశ్వంత్‌పూర్‌లో యశ్వంత్‌పూర్–హౌరా (02246), యశ్వంత్‌పూర్–హౌరా (02874), తిరుపతిలో తిరుపతి–బిలాస్పూర్ (07481), తిరుపతి–హౌరా (08090) రైళ్లు 3 గంటలు ఆలస్యంగా బయలుదేరతాయి. -
ఇంటర్‌లాకింగ్ ఒక కొలిక్కి
విజయవాడ (రైల్వేస్టేషన్): ఎట్టకేలకు ఆర్.ఆర్.ఐ (రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ సిస్టమ్) తుది దశపనులకు మోక్షం లభించింది. 2005లో ప్రారంభమైన ఈ పనులు 2012 నాటికే పూర్తికావాల్సి ఉన్నా తుది దశలో పెండింగ్‌పడ్డాయి. తుది దశ పనులు సెప్టెంబర్ 28 నాటికి పూర్తవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. ఆర్ఆర్ఐ పనుల దృష్ట్యా సెప్టెంబర్ 20 నుంచి 28 వరకు 19 పాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నామని, 3 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నామని విజయవాడ డివిజన్ పిఆర్వో జే.వి.ఆర్కే రాజశేఖర్ తెలిపారు. శాటిలైట్ స్టేషన్ల ద్వారా దారి మళ్లింపు పనుల వల్ల 215 రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు, కొన్నింటిని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే రైల్వే అధికారులు ప్రకటించారు. విశాఖపట్నంనుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లను గుణదల వయా రాయనపాడు మీదుగాను, చెన్నై నుంచి వచ్చే రైళ్లను కృష్ణా కెనాల్ జంక్షన్ వయా గుంటూరు మీదుగా దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అన్ని ప్లాట్‌ఫాంలపై 24 బోగీలు నిలిపే అవకాశం ఆర్.ఆర్.ఐ తుది దశ పనులు పూర్తయితే స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫాంలపై 24 బోగీల రైళ్లను నిలిపవచ్చు. ఇప్పటివరకు 1, 2, 3, 4, 5, 6, 7 ప్లాట్‌ఫాంలకు మాత్రమే 24 బోగీల రైళ్లను నిలిపే అవకాశముంది. ఆర్.ఆర్.ఐ పనులు పూర్తయితే స్టేషన్‌లోని 8, 9, 10 ప్లాట్‌ఫాంలపై 24 బోగీల రైళ్లను నిలపవచ్చు.అత్యాధునిక సిగ్నళ్ల ఏర్పాటు, ప్లాట్‌ఫాంల విస్తరణతో పాటు పలు సాంకేతిక మార్పులు చేపట్టనున్నారు. ప్రయాణికుల కష్టాలు తీరినట్లే పలు రైళ్లు నిర్ణీత సమయానికి చేరుకున్నా స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు ఖాళీ లేకపోవడంతో గంటల కొద్దీ అవుటర్‌లో నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యేవారు. ఆర్.ఆర్.ఐ తుది దశపనులు పూర్తయితే ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి.