
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): గులాబ్ తుపాను కారణంగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు, మరికొన్నింటిని రీషెడ్యూల్ చేస్తున్నట్లు రెల్వే అధికారులు తెలిపారు.
దారి మళ్లించిన రైళ్లు
♦25వ తేదీన అగర్తలలో బయలుదేరిన అగర్తల–బెంగళూరు (05488) రైలు, 26న హౌరాలో బయలుదేరిన హౌరా–సికింద్రాబాద్ (02703, హౌరా–యశ్వంత్‌పూర్ (02245),హౌరా–హైదరాబాద్ (08645), హౌరా–చెన్నై (02543), హౌరా–తిరుపతి (02663), సంత్రాగచ్చిలో బయలుదేరిన సంత్రాగచ్చి– తిరుపతి (02609), టాటాలో బయలుదేరిన టాటా ఎర్నాకుళం (08189) రైళ్లు ఖరగ్‌పూర్, ఝార్సుగుడ, బల్హార్షా మీదుగా ప్రయాణిస్తాయి.
♦26న భువనేశ్వర్‌లో బయలుదేరిన భువనేశ్వర్–ముంబై(01020) రైలు సంబల్‌పూర్, టిట్లాగఢ్ రాయ్‌పూర్ మీదుగా నడుస్తుంది. 25న అలప్పుజాలో బయలుదేరిన అలప్పుజా–ధన్‌బాద్ (03352), 26న చెన్నైలో బయలుదేరిన చెన్నై–హౌరా (02544) రైళ్లు బల్హార్షా, ఝార్సుగుడ మీదుగా నడుస్తాయి.
♦25న యశ్వంత్‌పూర్‌లో బయలుదేరిన యశ్వంత్‌పూర్–పూరి (02064), 26న తిరుపతిలో బయలుదేరిన తిరుపతి–భువనేశ్వర్ (08480) రైళ్లు బల్హార్షా, సంబల్‌పూర్ మీదుగా ప్రయాణిస్తాయి.
♦25న త్రివేండ్రం సెంట్రల్‌లో బయలుదేరిన త్రివేండ్రం–షాలిమార్ (02641), 26న హైదరాబాద్‌లో బయలుదేరిన హైదరాబాద్–హౌరా (08646) రైళ్లు బల్హార్షా, ఝార్సుగుడ, ఖరగ్‌పూర్ మీదుగా నడుస్తాయి.
రీషెడ్యూల్ చేసిన రైళ్లు
26న పలు స్టేషన్లలో బయలుదేరే ప్రత్యేక రైళ్లను రీషెడ్యూల్ చేశారు. పూరిలో బయలుదేరే పూరి–తిరుపతి (07480) 11 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది.
♦హౌరా నుంచి హౌరా–యశ్వంత్‌పూర్ (02873), హౌరా–పాండిచ్చేరి (02867) రైళ్లు 2 గంటలు ఆలస్యంగా బయలుదేరతాయి.
♦సికింద్రాబాద్‌లో సికింద్రాబాద్–హౌరా (02704), యశ్వంత్‌పూర్‌లో యశ్వంత్‌పూర్–హౌరా (02246), యశ్వంత్‌పూర్–హౌరా (02874), తిరుపతిలో తిరుపతి–బిలాస్‌పూర్ (07481), తిరుపతి–హౌరా (08090) రైళ్లు 3 గంటలు ఆలస్యంగా బయలుదేరతాయి.
Comments
Please login to add a commentAdd a comment