Cyclone Gulab
-
ఠారెత్తించిన ఎండలు
సాక్షి, విశాఖపట్నం: గులాబ్ తుపాను ప్రభావంతో విస్తారంగా కురిసిన వర్షాల వల్ల వాతావరణం చల్లగా మారిందని భావించిన ప్రజలకు ఆదివారం భానుడు ప్రతాపం చూపించాడు. నడి వేసవిని తలపిస్తూ ఎండలు ఠారెత్తించాయి. చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా కంచికచర్లలో అత్యధికంగా 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, నెల్లూరు జిల్లా బాలాయపల్లెలో 38.6, గోపాలపురంలో 38.4, కర్నూలు, రేణిగుంటలో 38.3, అనకాపల్లిలో 38.2, పమిడిలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుండగా.. షహీన్ తుపాను పాకిస్తాన్ వైపు వెళ్లడంతో రాజస్థాన్‌లో అధిక పీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి నైరుతి రుతు పవనాలు నెమ్మదిగా తిరోగమించడం ప్రారంభించాయి. దీంతో రాష్ట్రం వైపుగా తూర్పు, దక్షిణ గాలులు బలంగా వీస్తున్నాయి. ఈ గాలులు రాష్ట్రంపై ఉన్న తేమని తీర ప్రాంతం వైపు తీసుకెళ్తున్నాయి. ఈ పరిస్థితి వల్ల రాగల 2 రోజుల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. మూడో వారంలో తుపాను! అక్టోబర్ మూడో వారంలో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. క్రమంగా తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని భావిస్తున్నారు. గడచిన 24 గంటల్లో కొమరాడలో 48.5 మి.మీ., పార్వతీపురంలో 37.3 మి.మీల వర్షపాతం నమోదైంది. -
ఆంధ్రప్రదేశ్: పంట నష్టం అంచనాలకు ప్రత్యేక ఫీచర్
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే ప్రతీ రైతన్నను ఆదుకోవాలన్న సంకల్పంతో పంట నష్టం అంచనాలను పక్కాగా తేల్చేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఈ– క్రాప్‌తో సహా ఇతర సేవల కోసం ఇటీవల వినియోగంలోకి తెచ్చిన వైఎస్సార్ రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫాం (ఆర్బీ– యూడీపీ) యాప్‌లో అదనంగా విపత్తు నిర్వహణ సేవ(డిజాస్టర్) పేరిట ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ – క్రాప్‌తో అనుసంధానించిన ఈ యాప్ ద్వారా పంట నష్టం అంచనాలు రూపొందించడం ద్వారా పరిహారం చెల్లింపుల్లో మరింత పారదర్శకత రానుంది. జాప్యం లేకుండా శరవేగంగా ‘గులాబ్’ తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 1,62,721 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 8,637 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. సాధ్యమైనంత త్వరగా తుది అంచనాలను లెక్క తేల్చి సీజన్ ముగిసేలోగా పంటలు దెబ్బతిన్న ప్రతీ రైతుకు పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు పంట నష్టం అంచనాలను మదింపు చేస్తున్నాయి. గతంలో నిర్దేశిత ఫార్మాట్లో పంట నష్టం వివరాలను నమోదు చేసి ఫొటోలు తీసుకునే వారు. ఆ వివరాలను మదింపు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించే వారు. అయితే ఈ విధానం వల్ల పంటనష్టం అంచనాలు రూపొందించడం, పరిహారం చెల్లింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకునేవి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఆర్బీ యూడీపీ యాప్‌లో ప్రత్యేకంగా తెచ్చిన డిజాస్టర్ ఫీచర్ ద్వారా జియో కోఆర్డినేట్స్‌తో సహా పంట నష్టం అంచనాలు పక్కాగా లెక్కతేల్చే అవకాశం ఏర్పడింది. జియో కో ఆర్డినేట్స్‌తో సహా వివరాలు నమోదు ఆర్బీ యూడీపీ యాప్‌లో డిజాస్టర్ ఐకాన్‌ను క్లిక్ చేసి పంట దెబ్బతిన్న రైతు ఆధార్ నంబర్ నమోదు చేస్తే చాలు. ఈ – క్రాప్‌తో అనుసంధానించడం వల్ల రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారు? ఎంత దిగుబడి వస్తుందని అంచనా వేశారు? తదితర వివరాలన్నీ చూడవచ్చు. అవన్నీ సరైనవిగా నిర్ధారించుకున్న తర్వాత డిజాస్టర్ బాక్స్‌లో పంట నష్టం తీవ్రతను బట్టి పూర్తిగా లేదా పాక్షికం అని పేర్కొనాలి. దెబ్బతిన్న పంట విస్తీర్ణం వివరాలతో పాటు ఎలాంటి వైపరీత్యం (వరద/ కరువు/ భూమికోత) వల్ల జరిగిందో నమోదు చేయాలి. ఆ తర్వాత నష్ట తీవ్రతను బట్టి ముంపు/నేలకొరగడం/ఇసుక మేటలు వేయడం లాంటి వివరాలను పొందుపర్చిన తర్వాత ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయగానే జియో కో ఆర్డినేట్స్‌తో సహా పంట నష్టం వివరాలను ఆటోమేటిక్‌గా నమోదు చేస్తుంది. సీజన్ ముగిసేలోగా పరిహారం ‘వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న రైతులకు పరిహారం చెల్లింపులో మరింత పారదర్శకత తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యాప్‌లో ప్రత్యేక ఫీచర్లు అందుబాటులోకి తెచ్చాం. ఆర్బీ యూడీపీ యాప్‌లో కొత్తగా తీసుకొచ్చిన విపత్తు నిర్వహణ సేవ (డిజాస్టర్) ఫీచర్ ద్వారా గులాబ్ తుపాన్ వల్ల జరిగిన పంట నష్టం తుది అంచనాలను ప్రత్యేక బృందాలు రూపొందిస్తున్నాయి. సీజన్ ముగిసేలోగా నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం’ – కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి బోగస్, బినామీలకు ఆస్కారం లేని రీతిలో.. చివరగా నష్టపోయిన రైతుతో పాటు పరిశీలనలో గుర్తించిన అంశాలపై ఆర్బీకేలో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) తమ అభిప్రాయాలను ఆడియో రికార్డ్ ద్వారా అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తారు. పంట వేయగానే పంట వివరాలను ఆర్బీ యూడీపీ యాప్ ద్వారా ఈ క్రాప్‌తో నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. డిజాస్టర్ ఫీచర్‌తో వివరాలను అనుసంధానించడం వల్ల బోగస్ లేదా బినామీ పేర్లు నమోదు చేసే అవకాశం ఉండదు. అంతేకాదు దెబ్బతిన్న పంటల ఫొటోలు, వీడియోలు జియో కో ఆర్డినేట్స్‌తో సహా నమోదు చేస్తుండడం ద్వారా ఇష్టమొచ్చినట్లు నష్ట తీవ్రత నమోదు చేసే అవకాశం ఉండదు. యాప్ ద్వారా పంట నష్టం వివరాలను నమోదు చేస్తుండడం వల్ల భవిష్యత్‌లో తుపాన్లు, వరదలు లాంటి వైపరీత్యాల వేళ పంట కోల్పోయే వాస్తవ సాగుదార్లకు మాత్రమే పెట్టుబడి రాయితీ అందే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు. గులాబ్ తుపాన్ వల్ల జరిగిన పంట నష్టం అంచనాలు అక్టోబర్ 15 కల్లా కొలిక్కి వస్తాయని, ఆ వెంటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. -
కడప: శభాష్ నరేంద్ర.. వరదను సైతం లెక్క చేయక
సాక్షి, వైఎస్సార్: ఖాకీలంటే నేటికి కూడా సమాజంలో చాలా మందికి ఒకలాంటి భయం.. బెరుకు. పోలీసులను చూడగానే పారిపోయే వారు నేటికి కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ నేచర్ వల్ల పోలీసులకు-జనాలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. ఇక ఖాకీలంటే కఠినంగా ఉండటమే కాదు.. ఆపదలో ఉంటే ముందుగా స్పందించేది కూడా వారే. ఇందుకు నిదర్శనంగా నిలిచిన సంఘటనలు ఎన్నో. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. భారీ వరదలో చిక్కుకుపోయిన వ్యక్తిని కొట్టుకుపోకుండా కాపాడి.. జనాల ప్రశంసలు పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్. ఆ వివరాలు.. (చదవండి: కన్నుమూస్తూ మరొకరికి పునర్జన్మ) గులాబ్ తుపాన్ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లాయి. వరద నీరు రోడ్లకు మీదకు చేరి ప్రజా రవాణాకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో కడప జిల్లాలో చెరువు పొంగి రోడ్డు మీదుగా ప్రవహించడం ప్రారంభించింది. దాంతో అదే రోడ్డు మార్గంలో బైక్ మీద వస్తోన ఓ వ్యక్తి వరద ధాటికి తట్టుకోలేక బండి మీద నుంచి పడిపోయాడు. రెండు క్షణాలు ఆలస్యం అయి ఉంటే అతడు కూడా వరదలో కొట్టుకుపోయేవాడు. (చదవండి: నువ్వు సూపరహే.. 67 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో అద్భుతం) ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో పోలీసు కానిస్టేబుల్ నరేంద్ర అక్కడే ఉన్నాడు. సదరు వ్యక్తి బైక్ మీద నుంచి పడగానే అప్రమత్తమైన నరేంద్ర.. వరదను లెక్క చేయకుండా వెళ్లి.. అతడు కొట్టుకుపోకుండా కాపాడాడు. వరదకు భయపడకుండా.. ప్రాణాలను పణంగా పెట్టి మరి ఆ వ్యక్తిని కాపాడినందుకు కానిస్టేబుల్ నరేంద్రను ప్రశంసించారు జనాలు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. చదవండి: తెలుగు రాష్ట్రాలను వణికించిన గులాబ్ తుపాన్ పాకిస్తాన్ వైపు -
నష్టపరిహారం చెల్లిస్తామని స్పీకర్ తమ్మినేని హామీ
-
AP: 1,200 కి.మీ. రోడ్లకు గులాబ్ దెబ్బ
సాక్షి, అమరావతి: గులాబ్ తుపాను రాష్ట్రంలో రోడ్లను దెబ్బకొట్టింది. తుపాను తీవ్రతకు రాష్ట్రంలో 5 జిల్లాల్లో దాదాపు 1,200 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు రహదారులు, భవనాలశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ శాఖ అధికారుల బృందాలు తుపానుకు దెబ్బతిన్న రోడ్లను రెండు రోజులుగా పరిశీలిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 306 కిలోమీటర్లు, విజయనగరం జిల్లాలో 122, విశాఖపట్నం జిల్లాలో 355, పశ్చిమ గోదావరి జిల్లాలో 280, కృష్ణాజిల్లాలో 130 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతోపాటు ఈ జిల్లాల్లో 100 వరకు కల్వర్టులు, మోరీలు దెబ్బతిన్నాయి. ఆర్ అండ్ బీ శాఖ అధికారులు రెవెన్యూ, పోలీసు శాఖలతో కలిసి ప్రస్తుతానికి రోడ్లపై రాకపోకలను పునరుద్ధరించారు. రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం రూ.50 కోట్లు అవసరమని, పూర్తిస్థాయిలో మరమ్మతులకు మరో రూ.300 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. అధికారుల బృందాలు రెండు రోజుల్లో తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే రోడ్లకు తక్షణ మరమ్మతులు చేపడతారు. అనంతరం పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు తక్షణం మరమ్మత్తులు: మంత్రి పెద్దిరెడ్డి వర్షాల కారణంగా దెబ్బతిన్న గ్రామీణ రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్ రహదారులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే రహదారులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన పనులపై నివేదికలను తక్షణం సిద్ధం చేయాలని సూచించారు. మండలాల్లో అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాల్సిన రోడ్లను గుర్తించాలని, గతంలో ప్రారంభించి అసంపూర్తిగా ఉండిపోయిన రహదారులను పూర్తిచేయాలని సూచించారు. తాజాగా తుపాను ప్రభావిత జిల్లాల్లో రహదారులకు ఆర్థిక చేయూత కోరేందుకు కేంద్ర ప్రభుత్వానికి నష్టం తీవ్రతను తెలిపే నివేదికలను పంపాలని ఆదేశించారు. తాజాగా చేపట్టబోయే రహదారుల నిర్మాణం, మరమ్మతుల్లో నాణ్యత విషయంలో రాజీపడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఈఎన్సీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
వేలాది ఎకరాల్లో నేలకొరిగిన వరి పంట
-
తెలుగు రాష్ట్రాలను వణికించిన గులాబ్ తుపాన్ పాకిస్తాన్ వైపు
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాన్ ప్రస్తుతం ఆరేబియా సముద్రంలో కేంద్రీకృతమై తుపాన్‌గా మారి సెప్టెంబర్ 30న పాకిస్తాన్ వైపుగా దూసుకోస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ గులాబ్ తుపాన్ కళింగపట్నం- గోపాలపూర్ మధ్య తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా భారత్‌లో కొన్నిప్రాంతాల్లో అక్కడక్కడ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం గుజరాత్ దిశగా రావడంతో గుజరాత్‌లోనూ పక్కనే ఉన్నఖంభాట్ గల్ఫ్‌లోనూ ఒక మోస్తారుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. (చదవండి: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ముగ్గురు పిల్లలతో సహా..) ఈ క్రమంలో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఈశాన్య అరేబియా సముద్రంలోకి ఉద్భవించి, గురువారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత అది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు పశ్చిమ తీరం నుంచి పశ్చిమ వాయువ్య దిశలో ఉన్న పాకిస్తాన్ మక్రాన్ తీరాలకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. అయితే భారత తీరం నుంచి మాత్రం దూరంగా వెళుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ గులాబ్ తుపాన్ ప్రభావంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడిన సంగతి తెలిసిందే. (చదవండి: ‘విమాన సేవలను తిరిగి పునరుద్ధరించండి’) -
రైతులను నిండా ముంచిన భారీ వర్షాలు
-
విస్తారంగా కురిసిన వర్షాలకు భారీగా దెబ్బతిన్న రహదారులు
-
రైతులను నిండా ముంచిన భారీ వర్షాలు
-
పశ్చిమ గోదావరి జిల్లాలో నీట మునిగిన వేలాది ఎకరాల్లోని పంట
-
నిండుకుండలా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టు
-
ఎర్రకాలువకు పెరుగుతున్న నీటిమట్టం
-
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
-
హైదరాబాద్: నేడు భారీ వర్ష సూచన!
సాక్షి, హైదరాబాద్: వాయుగుండం ప్రభావంతో మంగళవారం నగరంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. సోమవారం కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు చెరువులను తలపించగా..మళ్లీ కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు పలు బస్తీల వాసులు అవస్థలు పడ్డారు. బల్దియా సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలుండడంతో నగరంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టంచేసింది. విపత్తుస్పందనా దళం, బల్దియా, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. కాగా మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు సులేమాన్ నగర్లో 1.4 సెంటీమీటర్లు, మాదాపూర్, బోరబండ, చర్లపల్లి, శ్రీనగర్ కాలనీల్లో అరసెంటీమీటరు మేర వర్షపాతం నమోదైంది. చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వర్షం: ఏటా ఇదే సీన్.. అయినా! -
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహరాణిపేట (విశాఖ దక్షిణ): వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో బలపడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా విశాఖ, తూ.గో.జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గులాబ్ తుపాను ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల మంగళవారం కూడా వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 7.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
ప్రతి రైతునూ ఆదుకుంటాం
సాక్షి, అమరావతి: గులాబ్ తుపానుతో పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతునూ ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఒక్క ఎకరా పంటను కూడా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే జరిగిన నష్టంపై ప్రాథమికంగా అంచనాకు వచ్చామన్నారు. అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నాయని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం కన్నబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు ప్రాజెక్టులు నిండి పంటలు బాగుంటే ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రాయలసీమలో వ్యవసాయం సంక్షోభంలో ఉందంటూ గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఏ మాత్రమైనా ఆదుకున్నారా అని ప్రశ్నించారు. గత రెండేళ్లలో సీఎం జగన్ వ్యవసాయానికి అత్యధిక కేటాయింపులు చేశారని గుర్తు చేశారు. ‘కాలువ’వి అర్థం లేని విమర్శలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు టీడీపీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఇతర పంటలు వేస్తున్నారన్నారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు ఏనాడైనా అక్కడి ప్రాజెక్టుల గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. చివరకు హంద్రీనీవా ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌కు రాయలసీమ దుస్థితి తెలుసు కాబట్టే ఇక్కడి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాయలసీమ రైతుల గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదన్నారు. సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాం.. మూడు రోజుల నుంచి గులాబ్ తుపాను వల్ల పలుచోట్ల పంట నష్టం జరిగిందన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో పంటలు నీట మునిగాయని తెలిపారు. ఇప్పటివరకు 1,56,756 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. అత్యధికంగా 1,16,823 ఎకరాల్లో వరి, 21,078 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నాయన్నారు. అపరాలు, వేరుశనగ, పత్తి పంటలకు కూడా నష్టం జరిగిందన్నారు. కృష్ణా జిల్లాలో 10,588 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగిందని చెప్పారు. 7,207 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతినగా దాదాపు 6,800 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. రైతులు ఒక్క ఎకరం నష్టపోయినా ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. 169 మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనాకు వచ్చామన్నారు. ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు నిర్వహించి, సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 2014–2019 వరకు ధాన్యం సేకరణ, వరి కాకుండా మిగతా పంటలు చూస్తే.. అప్పటి టీడీపీ ప్రభుత్వం 11,22,912 మెట్రిక్ టన్నుల పంటలను రూ.3,921 కోట్లతో కొనుగోలు చేసిందన్నారు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలోనే 19,39,987 మెట్రిక్ టన్నుల «పంటలను మొత్తం రూ.6,454 కోట్లతో కొనుగోలు చేసిందని చెప్పారు. -
తేరుకున్న గ్రామాలు
దొండపర్తి (విశాఖ దక్షిణ)/వంగర/విజయనగరం/సీతానగరం/మునగపాక: గులాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలతో ముంపు గ్రామాలు పూర్తిగా తేరుకున్నాయి. రెండు రోజులుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారు ఇళ్లకు చేరుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సరఫరాను 98 శాతం వరకు పునరుద్ధరించారు. విశాఖ విమానాశ్రయంలోకి చేరిన వరద నీటిని మళ్లించడంతో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలోని 30 మండలాల్లో 244 గ్రామాలు జలమయం కాగా.. మంగళవారం నాటికి 95 శాతం గ్రామాలు ముంపు నుంచి పూర్తిగా తేరుకున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజల కోసం 28 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 10,512 మందిని తరలించగా.. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో 8,352 మంది తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 2,160 మంది మాత్రం పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. జిల్లాలో 12 సబ్స్టేషన్లు దెబ్బతినగా వాటిని పునరుద్ధరించారు. 198 వీధి దీపాలు ధ్వంసం కాగా.. మరమ్మతులు పూర్తిచేశారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడగా.. 74 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పునరుద్ధరించారు. పాడేరు ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు, నేలకొరిగిన భారీ వృక్షాలను తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. పరవాడ మండలం లంకెలపాలెంలో వరద ప్రవాహానికి ఏలేరు కాలువ వంతెన వద్ద రోడ్డు కోతకు గురైంది. అధికారులు అక్కడకు చేరుకుని తాత్కాలిక మరమ్మతులు చేయించి లంకెలపాలెం, పరవాడ గ్రామాల మధ్య ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. విశాఖలో జాతీయ రహదారి పక్కన మురుగు కాలువల్లో పూడిక తొలగిస్తున్న సిబ్బంది శ్రీకాకుళంలో ముమ్మరంగా సహాయక చర్యలు శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సేవలందిస్తున్నాయి. వంగర మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములు నాయుడు ప్రాజెక్టును వరద ముంచెత్తింది. ఫలితంగా సోమవారం అర్ధరాత్రి కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి గ్రామాలు నీటమునిగాయి. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ప్రాజెక్టును పరిశీలించారు. ఎస్పీ అమిత్ బర్దార్ డ్రోన్ కెమెరాల సాయంతో వరద గ్రామాల్లో పరిస్థితిని సమీక్షించారు. నాగావళి ఉగ్రరూపంతో అంపిలి, అన్నవరం, గోపాలపురం, చిన్నమంగళాపురం గ్రామాల్లో వరద నీరు చేరింది. అధికారులు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. బాధిత కుటుంబాలకు ఆహార పొట్లాలను అందజేశారు. కోలుకుంటున్న విజయనగరం తుపాను దెబ్బ నుంచి విజయనగరం జిల్లా ప్రజలు కోలుకుంటున్నారు. మంగళవారం సాయంత్రానికి చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఇవ్వగలిగారు. మరోవైపు తుపాను బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 24 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,205 మందికి వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికులు కలిసి తొలగిస్తున్నారు. వరద ఉధృతి తగ్గుతుండటంతో పంట నష్టాల గణన వేగవంతమైంది. కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జేసీలు కిశోర్‌కుమార్, మహేష్‌కుమార్‌లు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మరోవైపు ఎంపీ బెల్లాన చంద్రశేఖరరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు, శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య తదితరులు రైతులు, ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. గొర్రెల కాపరి సురక్షితం విజయనగరం జిల్లా సీతానగరం మండల పరిధిలోని కొత్తవలస ఆనకట్ట దిగువన గల మెట్టపైకి గొర్రెలను తోలుకెళ్లిన దుక్క సింహాచలం సువర్ణముఖి నది ప్రవాహం మధ్య సోమవారం చిక్కుకుపోయిన విషయం విదితమే. అతడిని అర్ధరాత్రి దాటాక విశాఖపట్నం నేవీ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో ఒడ్డుకు చేర్చారు. గోడకూలి వృద్ధురాలి దుర్మరణం విశాఖ జిల్లా మునగపాక మండలం పల్లపు ఆనందపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు కర్రి జోగులమ్మ (65) అనే వృద్ధురాలిపై మంగళవారం ఉదయం పక్కింటి గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రెండు రోజులపాటు భారీ వర్షాలకు గోడ తడిసిపోవడంతో ఈ ఘటన జరిగింది. గోదావరి పరవళ్లు కొవ్వూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 4,43,330 క్యూసెక్కులను దిగువకు విడిచిపెడుతున్నారు. బుధవారం సాయంత్రానికి 8 లక్షల క్యూసెక్కులకు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో నీటిమట్టాలు పెరుగుతుండంతో ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి అధికమైంది. అక్టోబర్ నెలాఖరున గోదావరికి ఈ స్థాయి వరద రావడం ఇదే ప్రథమం. 2005 అక్టోబర్ 21 తర్వాత ఇప్పుడే ఈ సమయంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. -
గులాబ్ ఎఫెక్ట్: పంట చేలు.. కన్నీళ్లు
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: గులాబ్ తుపాను వల్ల కురిసిన భారీ వర్షంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగడంతో అనేక ప్రాంతాలను వరద ముంచెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా 2.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఇంతకుమించి వేలాది ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు అనధికార సమాచారం. నిజామాబాద్, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, పెద్దపల్లి, ములుగు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగినట్టుగా అంచనా వేసినట్లు సమాచారం. ఇతర జిల్లాల్లో మోస్తరు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. మొత్తంగా ఈ వానాకాలంలో ఇప్పటివరకు 12.80 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినటు సమాచారం. కాగా తాజా వర్షాలతో వరి, పత్తి, సోయా, మొక్కజొన్న, పొగాకు, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. రహదారులపై వరద ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి. కొన్నిచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 35 వేలకు పైగా చెరువులు నిండినట్లు సమాచారం. కాగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో పరిస్థితి సమీక్షించి, సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. నిజామాబాద్‌లో అత్యధిక సగటు వర్షపాతం నిజామాబాద్ జిల్లాలో సోమవారం 20.4 సెంటీమీటర్ల అత్యధిక సగటు వర్షపాతం నమోదయ్యింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరి, మంజీర పరీవాహక ప్రాంతాల్లోని బోధన్, నవీపేట, నందిపేట మండలాల్లో పంటలు భారీగా నీటమునిగాయి. జిల్లాలో 7,943 ఎకరాల్లో వరి, 1,551 ఎకరాల్లో సోయా, 402 ఎకరాల్లో మొక్కజొన్న, 250 ఎకరాల్లో పొగాకు పంటలు దెబ్బత్నిట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. చెరువులు భారీగా పొంగి ప్రవహిస్తుండడంతో అనేక చోట్ల లోలెవల్ వంతెనల పైనుంచి నీరు ప్రవహించింది. డిచ్పల్లి మండలం సుద్దపల్లి తండా చెరువులో పడి ఒకరు మృతి చెందారు. నీట మునిగిన బాసర బైపాస్ వంతెన భీమ్‌గల్ మండలం గోన్‌గొప్పుల్ వద్ద బోరపు వాగు బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరదలో భారత్ గ్యాస్‌కు చెందిన 200 నిండు సిలిండర్లతో ఉన్న లారీ కొట్టుకుపోయింది. డ్రైవర్‌ను పోలీసులు, స్థానికులు రక్షించారు. ముత్తకుంట గ్రామ శివా రులో లోలెవల్ వంతెనపై ప్రవహిస్తున్న వరదలో లారీ చిక్కుకుపోగా అందులోని ఏడుగురు కూలీ లను గ్రామస్తులు రక్షించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు పలు ప్రాంతాల్లో పర్యటించారు. నిజాంసాగర్ గేట్ల ఎత్తివేత కామారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా జుక్కల్‌లో 14.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండడంతో గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని లింగాపూర్‌లో మంగళవారం పందిరి భగవాన్‌రెడ్డి (54) అనే రైతు మోపెడ్‌పై కూరగాయలు విక్రయిం చి తిరిగివస్తూ వరదలో కొట్టుకుపోయాడు. గ్రామస్తులు గాలించగా మృతదేహం లభించింది. నిర్మల్‌కు మళ్లీ వాన దెబ్బ రెండునెలల క్రితమే జడివానతో దెబ్బతిని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నిర్మల్ జిల్లాను గులాబ్ తుపాన్ మళ్లీ దెబ్బకొట్టింది. వేల ఎకరాల్లో పంటను వరద ముంచెత్తింది. గోదావరి, స్వర్ణ, కడెం, సుద్ధవాగులు పోటెత్తడంతో తీరప్రాంతాల్లో పంటలకు భారీగానే నష్టం వాటిల్లింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తడంతో దిగువన గల సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం, దస్తురాబాద్ మండలాల్లోని వందల ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతంలో కూడా పంటలు నీట మునిగాయి. ఎస్సారెస్పీ నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదల శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం ఉదయం వరద ఉధృతి పెరి గింది. దీంతో 33 వరద గేట్ల ద్వారా 4 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నా రు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (90 టీఎం సీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి 1088.90 అడుగుల వద్ద 79 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ట్రాక్టర్‌పై బయటకు వచ్చిన కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ మరోసారి వరద నీటిలో చిక్కింది. కలెక్టరేట్ భవనం పక్కనే ఉన్న క్యాంపు ఆఫీస్‌లో కలెక్టర్ అనురాగ్ జయంతి నివాసం ఉంటున్నారు. ఆయన మంగళవారం ఉదయం సిరిసిల్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో వరదలను పరిశీలించడంతో పాటు బాధితుల పరామర్శకు సిద్ధమయ్యారు. కానీ చుట్టూ వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కారులో బయటకు రావడం సాధ్యం కాలేదు. దీంతో ట్రాక్టర్ తెప్పించుకుని బయటకు వచ్చి పట్టణంలో పర్యటించారు. రాష్ట్రంలో 50.6 మి.మీ సగటు వర్షపాతం సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రంలో సగటున 50.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 4.5 మి.మీ కాగా రోజంతా కురిసిన వానతో కొత్త రికార్డు నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోని జాక్రాన్పల్లిలో 228.9 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఎగువున కురిసిన వర్షాలతో హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లు నిండుకున్నాయి. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో మూసి పొంగి పొర్లుతోంది. భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాలిపేరు 9 గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టులోకి 11వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 32.1 అడుగులకు చేరుకుంది. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో నీట మునిగిన సీతమ్మ విగ్రహం నీట మునిగింది. రెండురోజులు తేలికపాటి వర్షాలు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇలావుండగా సోమవారం నాటి వాయుగుండం పశ్చిమ–వాయవ్య దిశగా కదిలి మంగళవారం విదర్భ పరిసర ప్రాంతాల్లో నాగపూర్‌కు నైరుతి దిశగా 250 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం నాటికి మరింత బలహీనపడనుంది. ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలి: స్పెషల్ సీఎస్ రాష్ట్రంలో వరద పరిస్థితులను ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ మంగళవా రం ఇంజనీర్లతో సమీక్షించారు. క్షేత్రస్ధాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది సెలవులు రద్దు భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపా రు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సెలవు మంజూరు చేయకూడదని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల జ్వర సర్వే చేపట్టాలన్నారు. నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది తమ పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సూచించారు. హెచ్ఎండీఏలో ప్రత్యేక బృందాలు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల పరిధిలో ఉన్న 185 చెరువులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం 15 మంది ఇంజనీర్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది. అలాగే వరద పరిస్థితులపై ఫిర్యాదులకు జలసౌధ కంట్రోల్ రూమ్‌లో 040–23390794 నంబర్ ఏర్పాటు చేసింది. అంత్యక్రియల్లో పాల్గొని, స్నానానికి వెళ్లి.. హనుమకొండ జిల్లా నడికూడ మండలం నార్లాపూర్ గ్రామంలో వాగులో పడి గ్రామానికి చెందిన ఈర్ల అభినవ్ (22), ఈర్ల కౌశిక్ (22) మంగళవారం గల్లంతయ్యారు. అదే గ్రామానికి చెందిన కొమురయ్య సోమవారం రాత్రి చనిపోగా.. మంగళవారం అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం వాగులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కోతకు గురైన అప్పా చెరువు కట్ట భారీ వర్షాలకు హైదరాబాద్ నగర శివారులోని ‘అప్పా’చెరువు కట్ట రెండు ప్రాంతాల్లో కోతకు గురైంది. పలు లోతట్టు ప్రాంతాలతో పాటు బెంగళూరు జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. నిజామాబాద్ జిల్లా ముత్తకుంట గ్రామ శివారులో లోలెవల్ వంతెనపై ప్రవహిస్తున్న చెరువు అలుగు నీటి వరదలో లారీ చిక్కుకు పోగా అందులోని ఏడుగురు కూలీలను గ్రామస్తులు తాడు సహాయంతో రక్షించారు. -
మూసారాంబాగ్: మూసీలో మృతదేహం కలకలం
సాక్షి, హైదరాబాద్: గులాబ్ తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతేరపిలేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో డెడ్‌బాడీ కలకలం సృష్టించింది. మూసీలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోతున్న మృతదేహం వెలుగు చూసింది. పైనుంచి భారీగా వరద వస్తుండటంతో మృతదేహం వెలికితీతకు అడ్డంకి ఏర్పడింది. చదవండి: గులాబ్ గుబులు..! సోషల్‌మీడియాలో రకరకాలుగా స్పందిస్తోన్న నెటిజన్లు..! -
పొంగిపొర్లుతున్న రాజేంద్రనగర్ అప్ప చెరువు
-
గులాబ్ తూఫాన్ ప్రభావంతో ఒడిశాలో విస్తారంగా వర్షాలు
-
పశ్చిమగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం
-
నేడు తెలంగాణలో ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థలకు సెలవు
-
గులాబ్ తుఫాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో వానలు
-
గులాబ్ తూఫాన్ ఎఫెక్ట్...
-
హైదరాబాద్‌లో కుండపోత వర్షం: ఏటా ఇదే సీన్.. అయినా!
సాక్షి, హైదరాబాద్: కుండపోత వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ సిటీ చిగురుటాకులా వణుకుతోంది. సోమవారం కురిసిన జడివానతో నగరజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు చెరువులను తలపించగా..లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఎడతెరిపి లేని వానతో జనం ఇళ్లనుంచే బయటకు రాలేని పరిస్థితి తలెత్తింది. వచ్చే 24 గంటల్లోనూ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ పరిధిలోని మూడు లక్షల మ్యాన్‌హోల్ మూతలను ఎట్టి పరిస్థితుల్లో తెరవరాదని జీహెచ్ఎంసీ, జలమండలి హెచ్చరించాయి. గ్రేటర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో, పురాతన భవనాల్లో నివాసం ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. పోలీస్, జలమండలి, విద్యుత్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పరిస్థితిని సమీక్షించాయి. చదవండి: Telangana: నేడు, రేపు భారీ వర్షాలు ఏటా ఇదే సీన్ ఏటా సెప్టెంబరులో పేరుగొప్ప మహానగరంలో ఎటు చూసినా ఇదే సీన్. శతాబ్దకాలంగా నగరంలో భారీ వర్షాల చరిత్రను పరిశీలిస్తే నాడు 1908లో మూసీ వరదలు..2000 సంవత్సరంలో సిటీని సగం ముంచేసిన భారీ వర్షాలు..ఇక 2016లో పలు ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి...ఈ విపత్తులన్నీ ఇదే నెలలో చోటుచేసుకోవడం గమనార్హం. నిపుణుల కమిటీ సూచనల అమలేదీ..? మహానగరాన్ని వరదల సమయంలో నిండా మునగకుండా చూసేందుకు 2003లో కిర్లోస్కర్ కమిటీ విలువైన సూచనలు చేసింది. సుమారు 1500 కి.మీ మార్గంలో విస్తరించిన నాలాలపై ఉన్న పదివేలకు పైగా ఉన్న ఆక్రమణలను తొలగించడంతోపాటు వరదనీటి కాల్వలను విస్తరించాలని సూచించింది. జరిగిన పనులను పరిశీలిస్తే..గత కొన్నేళ్లుగా సుమారు 30 శాతమే పనులు పూర్తయ్యాయి. మరో 70 శాతం పనులు పూర్తికాకపోవడంతో భారీ వర్షం కురిసిన ప్రతీసారీ సిటీ నిండా మునుగుతోంది. మూడేళ్ల క్రితం ముంబయి ఐఐటీ, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సంస్థల నిపుణులు ఇంకుడు కొలనులు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో సిటీకి ముంపు సమస్య 50 శాతానికి పైగాతీరుతుందని అప్పట్లోనే స్పష్టంచేసినా యంత్రాంగం పట్టించుకోలేదు. చదవండి: హైదరాబాద్‌లో కాస్త తగ్గుముఖం పట్టిన వర్షం.. Moosrambagh Bridge closed due to heavy rain.#HyderabadRains#TelanganaRains pic.twitter.com/1CNzmO1kuS — Qadri Syed Rizwan (@Qadrisyedrizwan) September 25, 2021 #HyderabadRains @KTRTRS situation in dammaiguda. Last year too my parents were in similar situation. What measures did your govt take in this one year? Absolutely NOTHING. They sent only one tractor to evacuate people and guess what tractor couldnt enter my parent's house lane pic.twitter.com/cyLRArdwIx — Srujana (@SrujanaAM) September 27, 2021 -
రైళ్లకు గులాబ్ ఎఫెక్ట్
విజయనగరం టౌన్/ తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): గులాబ్ తుపాను నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దయినట్లు, మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు. 27వ తేదీ రద్దయిన రైళ్లు రూర్కెలా–జగదల్పూర్ స్పెషల్ (08107), భువనేశ్వర్–జగదల్పూర్ స్పెషల్ (08445), విశాఖ–రాయగడ స్పెషల్ (08508), విశాఖ–కిరండూల్ (08516), కోర్బా–విశాఖ స్పెషల్ (08517), విశాఖ–కోర్బా స్పెషల్ (08518), భువనేశ్వర్–జునాఘర్ రోడ్ స్పెషల్ (02097). 28వ తేదీ రద్దయిన రైళ్లు రాయగడ–విశాఖ స్పెషల్ (08507), జగదల్పూర్–రూర్కెలా స్పెషల్ (08108), జగదల్పూర్–భువనేశ్వర్ స్పెషల్ (08446), జునాఘర్ రోడ్డు–భువనేశ్వర్ స్పెషల్ (02098). 27న రీషెడ్యూల్ చేసిన రైళ్లు ► విశాఖ–గుంటూరు (07240) రైలు 3 గంటలు ఆలస్యంగా ఉదయం 10.10 గంటలకు విశాఖ నుంచి బయల్దేరింది. ► విశాఖ– హజరత్ నిజాముద్దీన్ (02851) రైలు 3 గంటలు ఆలస్యంగా ఉదయం 11.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరింది. ► చెన్నైలో 27వ తేదీ ఉదయం 7 గంటలకు బయల్దేరాల్సిన చెన్నై సెంట్రల్–హౌరా స్పెషల్ (02544) రైలు 15 గంటలు ఆలస్యంగా రాత్రి 10.30 గంటలకు బయల్దేరింది. ► చెన్నైలో 27వ తేదీ రాత్రి 7.15 గంటలకు బయల్దేరాల్సిన చెన్నై సెంట్రల్–హౌరా స్పెషల్ (02822) రైలు 28వ తేదీ ఉదయం 9.30 గంటలకు బయల్దేరుతుంది. హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు రైళ్ల రాకపోకల వివరాలను 08922–221202, 221206/ 089128–83331, 83332, 83333, 833334 నంబర్లకు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు. జారిపడ్డ మట్టిదిబ్బలు, కొండచరియలు అనంతగిరి/తాడేపల్లి రూరల్: భారీ వర్షాలకు విశాఖ ఏజెన్సీ కొత్తవలస–కిరండూల్ మార్గం (కేకే లైన్)లో బొర్రా–చిమిడిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య, శివలింగపురం 47వ కిలోమీటర్ వద్ద రెండు చోట్ల మట్టిదిబ్బలు జారి రైల్వేట్రాక్‌పై పడ్డాయి. దీంతో ఈ మార్గంలో ఉదయం నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) పరిధిలో సీతానగరం పుష్కర్ ఘాట్‌కు వెళ్లే దారిలో కొండచరియలు జారిపడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
విద్యుత్ సరఫరాకు అంతరాయం
సాక్షి, అమరావతి/అరసవల్లి: గులాబ్ తుపాను కారణంగా తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల పరిధిలో సంస్థకు వాటిల్లిన ప్రాథమిక నష్టం రూ.7.87 కోట్లుగా అధికారులు తేల్చారు. 213 ప్రత్యేక బృందాలతో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో తుపాన్ ప్రభావం అధికంగా ఉండటంతో అక్కడ భారీ నష్టం ఏర్పడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గోదావరి, ప.గోదావరి జిల్లాల్లో ఒక ఎక్స్ట్రా హైటెన్షన్ సబ్ స్టేషన్‌తో పాటు 33/11 కేవీ సబ్ స్టేషన్లు 380, ఫీడర్లు 276, స్తంభాలు 107, లైన్లు 10 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. 11 కేవీ ఫీడర్లు 1,623, స్తంభాలు 1,120, లైన్లు 51.19 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. ఎల్టీ లైన్లకు సంబంధించి 66.58 కిలోమీటర్ల మేర, ఎల్టీ కేటగిరిలోనే 1,719 స్తంభాలు, 678 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమైనట్టు ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది గుర్తించారు. తుపాను వల్ల 24 పట్టణాలు, 103 మండలాలు, 3,821 గ్రామాల్లో 11,26,959 వ్యవసాయేతర, 4,767 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శరవేగంగా పునరుద్ధరణ పనులు ముందస్తు ప్రణాళిక ప్రకారం పునరుద్ధరణ పనులు మొదలుపెట్టిన విద్యుత్ శాఖ ఈహెచ్‌టీ సబ్ స్టేషన్, 33/11 కేవీ సబ్స్టేషన్లు 364, ఫీడర్లు 255, స్తంభాలు 75, లైన్లు 5.5 కిలోమీటర్ల మేర బాగు చేశారు. 11 కేవీ ఫీడర్లు 1,255, స్తంభాలు 390, లైన్లు 23.35 కిలోమీటర్లు, ఎల్టీ లైన్లు 18.55 కిలోమీటర్లు, ఎల్టీ పోల్స్ 403, ట్రాన్స్ఫార్మర్లు 154 చొప్పున మరమ్మతులు పూర్తి చేశారు. 8,85,419 వ్యవసాయేతర, 1,463 వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. మంగళవారం ఉదయానికల్లా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మరమ్మతులు పూర్తిచేసి విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరిస్తామని ఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు చెప్పారు. సోమవారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, మిగిలిన జిల్లాల్లో కొన్నిగంటలపాటు అంతరాయం ఏర్పడిందన్నారు. -
ముంపు నీరు పోతే నష్టం ఉండదు
సాక్షి, అమరావతి: ‘గులాబ్’ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని వ్యవసాయ, ఉద్యాన పంటలపై కొంత మేర ప్రభావం చూపిస్తున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ ఆరు జిల్లాల్లో దాదాపు 1,56,756 ఎకరాల్లో వ్యవసాయ, 6,463.65 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. దీంతో ముంపునీరు పోయేందుకు వ్యవసాయ శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. మరోవైపు.. సీఎం జగన్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్‌కు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగాయి. అలాగే, ముంపులో ఉన్న పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఆర్బీకే స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ముంపులో 1.16 లక్షల ఎకరాల వరిపంట ఇక వ్యవసాయ, ఉద్యాన శాఖల ప్రాథమిక అంచనా ప్రకారం.. వ్యవసాయ పంటలకు సంబంధించి 1,16,823 ఎకరాల్లో వరి, 21,078 ఎకరాల్లో మొక్కజొన్న, 11,974 ఎకరాల్లో పత్తి, 4,708 ఎకరాల్లో మినుములు, 689 ఎకరాల్లో వేరుశనగ, 541 ఎకరాల్లో రాజ్మా, 466 ఎకరాల్లో చెరకు, 239 ఎకరాల్లో పెసలు, 150 ఎకరాల్లో మిరప, 62 ఎకరాల్లో పొగాకు, 25 ఎకరాల్లో రాగులు పంటలు ముంపునకు గురయ్యాయి. ఇక ఉద్యాన పంటల విషయానికి వస్తే.. 3,260.9 ఎకరాల్లో అరటి, 1,517.5 ఎకరాల్లో మిర్చి, 1,105.85 ఎకరాల్లో కూరగాయలు, 376.55 ఎకరాల్లో బొప్పాయి, 136.75 ఎకరాల్లో పసుపు పంటలతో పాటు 22.75 ఎకరాల్లో పూల తోటలు ముంపునకు గురవగా, 374 కొబ్బరి చెట్లు దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. పంటలను కాపాడుకోవచ్చు ముంపునకు గురైన పొలాల్లోని పంటలను కాపాడుకునేందుకు ఆర్బీకే స్థాయిలో వీడియో సందేశాల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. ముందు నీరు నిలబడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత వ్యవసాయ సిబ్బంది సూచనల మేరకు తగిన మోతాదుల్లో ఎరువులు, మందులు జల్లుకుంటే పంటలను కాపాడుకోవచ్చు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకునేందుకు చర్యలు చేపట్టాం. – హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ పక్వానికొచ్చిన పండ్లను కోసేయండి ముంపునకు గురైన ఉద్యాన పంటలను రక్షించుకునేందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్పే సూచనలను రైతులు పాటించాలి. పక్వానికి వచ్చిన అరటి, బొప్పాయి పండ్లను కోసెయ్యాలి. నేలకొరిగిన పంటలను నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి. సీఓసీ, మాన్కోజెబ్ వంటి శిలీంద్ర సంహారిణిని రైతులకు అందించేందుకు ఆదేశాలిచ్చాం. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్ ఉద్యాన శాఖ ముంపు ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు పర్యటించాలి మంత్రి కన్నబాబు ఆదేశం గులాబ్ తుపాను ప్రభావిత జిల్లాల్లోని అన్నదాతలకు అండగా నిలబడాలని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి సోమవారం ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ శాఖ జేడీలతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కన్నబాబు మాట్లాడుతూ.. ఈ ఆరు జిల్లాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం.. 1.63 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లుగా గుర్తించారన్నారు. వర్షపునీరు సాధ్యమైనంత త్వరగా కాలువల ద్వారా పోయేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ, ఉద్యాన వర్శిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తల బృందాలు ముంపునకు గురైన పంట పొలాలు, తోటలను పరిశీలించి నష్ట తీవ్రతను తగ్గించేలా రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. వ్యవసాయ సలహా మండళ్ల సభ్యులు కూడా పర్యటించి రైతులకు అండగా నిలబడాలని.. రైతులకు 24 గంటలూ అందుబాటులో ఉంటూ వారికి ధైర్యం చెప్పాలని మంత్రి సూచించారు. ముంపునీరు తగ్గగానే ఏ ఒక్క రైతు నష్టపోకుండా పూర్తి పారదర్శకంగా తుది అంచనాలు రూపొందించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు హెచ్. అరుణ్‌కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
Telangana: నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలుకురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో కుండపోత వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గులాబ్ తుపాను సోమవారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడిందని, మంగళవారం ఉదయం నుంచి దాని ప్రభావం తగ్గిపోతుందని పేర్కొంది. అయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్త నం ఏర్పడిందని.. దాని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని వెల్లడించింది. ఇప్పటికే 35శాతం అధికం జోరు వానలతో భారీగా వర్షపాతం నమోదవుతోందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి సీజన్లో సాధారణంగా ఇప్పటివరకు 70.72 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని.. ఈసారి సోమవారం ఉద యం వరకు 95.70సెంటీమీటర్లుగా నమోదైందని పేర్కొంది. సాధారణ వర్షపాతం కంటే ఇది 35% అధికమని తెలిపింది. ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 21 జిల్లాల్లో అధికం, 7 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని పేర్కొంది. అప్రమత్తంగా ఉండండి భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై కేసీఆర్ సోమవారం ఢిల్లీలో సీఎస్ సోమేశ్‌కుమార్, ఇతర అధికారు లతో సమీక్షించారు. పోలీసు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయం తో కృషి చేయాలని, తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. ఇక సమీక్ష అనంతరం సీఎం సూచనల మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైతే హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్‌లోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలన్నారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్‌రూమ్ ఏర్పా టుచేసి పరిస్థితిని పర్యవేక్షించాలని.. ముఖ్య సమాచారాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు తెలి యజేయాలని చెప్పారు. కాగా.. జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయా లని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. -
ఉత్తరాంధ్రలో కుండపోత
బలహీనపడిన తుపాను శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో తీరం దాటిన తుపాను సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. పశ్చిమ ఒడిశా వైపు కదులుతూ అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. గులాబ్ తుపాను వల్ల గాలులు 95 కిలోమీటర్ల వేగానికి పరిమితమవగా వర్షాలు మాత్రం విపరీతంగా కురిశాయి. అది కూడా ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా శ్రీకాకుళం నుంచి కృష్ణాజిల్లా వరకు భారీ వర్షాలు పడ్డాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలపైనా ప్రభావం ఉండటంతో అక్కడా భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం వర్షం బాగా తెరిపి ఇవ్వొచ్చని వాతావరణ శాఖ పేర్కొనడం ఊరట కలిగిస్తోంది. సాక్షి, అమరావతి /సాక్షి నెట్వర్క్: గులాబ్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో కుండపోత వర్షం కురిసింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడినట్టుగా ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెగకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రాకపోకలు స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విశాఖ జిల్లాలో అనూహ్యంగా 11.8 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 8 సెం.మీ., విజయనగరం జిల్లాలో 8.9 సెం.మీ. సగటు వర్షం కురిసింది. విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం పడింది. నగర శివారులోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8.30 వరకు 33.3 సెం.మీ. వర్షం కురిసింది. పెందుర్తిలో 28.8, గాజువాకలో 23.7, పరవాడలో 22.9 సెం.మీ. వర్షం పడింది. అడవివరంలో 31.9, న్యూ రైల్వే కాలనీలో 31.4, అప్పన్నపాలెం, ధారపాలెం ప్రాంతాల్లో 31.2 సెం.మీ. వర్షం పడింది. రైతుబజార్, కొత్తపాలెం, సింహాచలం ప్రాంతాల్లో 30 సెం.మీ. వర్షం పడింది. విశాఖ పరిసరాల్లోని అన్ని ప్రాంతాల్లో 20 నుంచి 30 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కళింగపట్నంలో 24.2, గంగవరంలో 22.4, నెల్లిమర్లలో 22.1, పూసపాటిరేగలో 20.7, సబ్బవరంలో 20.2 సెం.మీ. వర్షం పడింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 451 కేంద్రాల్లో 6సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. హుద్‌హుద్, తిత్లీ తర్వాత మన రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపిన తుపాను గులాబ్ అని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వర్షాలతో నాగావళి, వంశధార నదుల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 60 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అందులో 99 శాతం మంది విశాఖ జిల్లా నుంచే ఉన్నారు. వీరికోసం 105 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. 62 మండలాలపై తీవ్ర ప్రభావం వర్షాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని 62 మండలాలపై తీవ్ర ప్రభావం చూపాయి. విశాఖ జిల్లాలో 32, శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 15 మండలాలు వర్షాల ధాటికి విలవిల్లాడాయి. వీటి పరిధిలో మొత్తం 375 గ్రామాల్లో ఎడతెగని వర్షాలు కురిసినట్టు విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. 1,800కు పైగా ఇళ్లు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా విద్యుత్ శాఖ కొద్ది గంటల్లోనే పునరుద్ధరించింది. విశాఖ విమానాశ్రయంలోకి నీరు భారీ వర్షానికి తోడు, మేహాద్రి గెడ్డ రిజర్వాయర్ గేట్లు ఎత్తేయడంతో వరద నీరు విశాఖ విమానాశ్రయంలోకి చేరింది. పాత, కొత్త టెర్మినళ్లలో మోకాలి లోతు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఊపిరి పీల్చుకున్న తూర్పుగోదావరి తూర్పు గోదావరి జిల్లాలో కుండపోత వర్షం పడినా పెద్దగా నష్టం కలిగించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కడియంలో 14 సెం.మీ, తాళ్లరేవులో 12.1, కరప, కాకినాడ అర్బన్, యు.కొత్తపల్లి, పెదపూడి, రాజమహేంద్రవరం రూరల్, ఆత్రేయపురం, అమలాపురాల్లో 10 సెం.మీ మించి వర్షం పడింది. మారేడుమిల్లి మండలంలోని చావడికోట పంచాయతీ బొడ్లంక సమీపంలోని పెళ్లిరేవు వాగు ప్రధాన రహదారిపై నుంచి పొంగి ప్రవహిస్తోంది. ఇదే సమయంలో లలిత అనే మహిళను ప్రసవానికి తరలించాల్సి రావడంతో ఇబ్బందులెదురయ్యాయి. రహదారి ఇవతలి వైపు అంబులెన్స్ ఉంచి స్థానికులు ఆమెను స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. అవతల వైపు మరో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మారేడుమిల్లి పీహెచ్‌సీకి సకాలంలో తరలించారు. ‘పశ్చిమ’లో పొంగిన వాగులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి తెరిపిలేకుండా భారీవర్షాలు కురిశాయి. దెందులూరు–సానిగూడెం రహదారిలో సైఫన్ వద్ద గుండేరు వాగుకు గండి పడటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దోసపాడు–కొవ్వలి గ్రామాల పరిధిలోని డ్రెయిన్లు పొంగాయి. కృష్ణాలో భారీ వర్షం కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు విజయవాడ నగరం, జిల్లాలోనూ రోడ్లు జలమయమయ్యాయి. విజయవాడలోని చిట్టినగర్ వద్ద కొండచరియలు విరిగి పడటంతో ఓ ఇల్లు ధ్వంసమైంది. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న భవనం కూలింది. జిల్లాలో అత్యధికంగా రెడ్డిగూడెంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాడేపల్లిలో 33.25 సెం.మీ. వర్షపాతం గుంటూరు జిల్లాలో సోమవారం వేకువజామునుంచి ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. డెల్టా ప్రాంతంలో లోతట్టు గ్రామాలు జలమయమయ్యాయి. సోమవారం ఉదయం 8 నుంచి తాడేపల్లిలో 33.25 సెం.మీ, మంగళగిరిలో 29.75, పెదకూరపాడులో 28.75, తాడికొండలో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరంలో సీఎస్ సమీక్ష విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు ఏకధాటిగా కురిసిన వర్షంతో 40,876.7 హెక్టార్ల విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, అరటి, బొప్పాయి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాగావళి, సువర్ణముఖి, గోస్తనీ, చంపావతి, గోముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నష్టాలపై సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ కలెక్టరేట్లో సమీక్షించారు. గజపతినగరం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలను ఆయన పరిశీలించారు. మరోవైపు తుపాను పశ్చిమంగా ప్రయాణించి బలహీన పడింది. ఇది వాయవ్య దిశగా పయనించి మంగళవారానికి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి వంతెనను తాకుతూ ప్రవహిస్తున్న సువర్ణముఖి ఐదుగురి మృతి.. ఇద్దరు గల్లంతు తుపాను కారణంగా కురిసిన భారీవర్షాలు, వచ్చిన వరదలకు ఐదుగురు మరణించారు. ఒక బాలుడి సహా ఇద్దరు గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామానికి చెందిన రైతు విజనగిరి శ్రీను నువ్వుల బుట్టలు తెచ్చుకునేందుకు పొలం వెళ్తూ గెడ్డలో పడిపోయాడు. గ్రామస్తులు అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. విశాఖ జిల్లా వేపగుంట నాయుడుతోట సమీపంలోని సీపీఐ కాలనీలో ఇంటిగోడ కూలడంతో దులసి భావన(31) మృతి చెందింది. కొండవాలు నుంచి వచ్చిన భారీ రాళ్లు ఇంటి ప్రహరీపై పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖలోని చినముషిడివాడ సమీపంలోగల గిరిప్రసాద్‌నగర్–3లో కుశ్వంత్‌కుమార్ (7) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ విద్యుదాఘాతానికి గురై మరణించాడు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎస్సీ పేటకు చెందిన సొసైటీ మాజీ డైరెక్టర్ కొత్తూరి నాగేశ్వరరావు(50) పొలం వెళుతూ పర్రెడ్డిగూడెం సమీపంలో వర్షపు నీటిలో కాలు జారి కొట్టుకుపోయారు. వర్షం తగ్గిన తర్వాత తూరలో ఇరుక్కున్న ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. గోపాలపురంలో ఇంటివద్ద నీట మునిగిన మోటర్‌ను ఆన్ చేస్తూ ముల్లంగి విజయభారతి (52) విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. విశాఖ జిల్లా సీతానగరానికి చెందిన కోరాడ కృష్ణవంశీరెడ్డి (16) స్నేహితులతో కలిసి చేపల కోసం వెళ్లి స్టీల్‌ప్లాంట్ రైల్వేగేటు సమీపంలో ఉన్న కాలువలో పడిపోయాడు. ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయాడు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ధర్మపురి వద్దనున్న గెడ్డలో చేపలు పట్టడానికి వెళ్లిన గేదెల రామారావు వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. రాత్రి వరకు గాలించినా అతడి ఆచూకీ దొరకలేదు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం కొత్తవలస ఆనకట్ట దిగువన ఉన్న మెట్టపైకి సోమవారం గొర్రెలను మేతకు తోలుకెళ్లిన దుక్క సింహాచలం సువర్ణముఖి నది ప్రవాహం మధ్యన చిక్కుకున్నాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఏపీ: ‘భారత్ బంద్’ ప్రశాంతం
సాక్షి, అమరావతి: గులాబ్ తుపానుతో భారీవర్షం కురుస్తున్న వేళ పటిష్ట బందోబస్తు మధ్య రాష్ట్రంలో సోమవారం ‘భారత్ బంద్’ ప్రశాంతంగా ముగిసింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు జరిగిన దేశవ్యాప్త బంద్‌లో రాజకీయ పార్టీలు తమ జెండాలను పక్కనబెట్టి రైతు సంక్షేమమే అజెండాగా పాల్గొన్నాయి. జన ప్రయోజనమే తమ ప్రాధాన్యత అని నినదించాయి. రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ బంద్‌కు మద్దతు తెలపడంతో బస్సులు, బడులు బంద్ అయ్యాయి. దారులు మూసుకుపోయాయి. రైళ్లు రద్దయ్యాయి. వాణిజ్య సముదాయాలు, వ్యాపారకేంద్రాలు మధ్యాహ్నం వరకు మూతపడ్డాయి. ముందస్తు హెచ్చరికలతోపాటు భారీవర్షం కూడా తోడవడంతో అత్యవసరమైతే తప్ప జనం రోడ్ల మీదకు రాలేదు. సినీ థియేటర్లలో ఉదయం ఆటలు రద్దయ్యాయి. పాడేరు ఏజెన్సీలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అంబులెన్స్, డాక్టర్లు.. ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలిగించకుండా శాంతియుతంగా నిరసనలు తెలిపినట్టు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ ప్రకటించింది. వర్షాలను లెక్కచేయకుండా ఉదయం ఏడు గంటలకే వామపక్షాల, కార్మికసంఘాల నేతలు ఆందోళనకారులతో కలిసి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేయవద్దని కోరుతూ భారీ ప్రదర్శనలు నిర్వహించి ప్లకార్డులు ప్రదర్శించారు. తిరుపతిలో రైలు పట్టాలపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని బయటకు పంపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఆందోళనకారులు నినాదాలతో హోరెత్తించారు. కార్మిక కర్షక మైత్రి, లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యత వర్ధిల్లాలని, సాగురంగాన్ని కార్పొరేట్ సంస్థల నుంచి కాపాడాలని, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని, విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయవద్దని, లేబర్ కోడ్లను రద్దుచేయాలని, రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. భారత్ బంద్కున్న చారిత్రక నేపథ్యం దృష్ట్యా రాజకీయ పార్టీలు అంతర్గత విభేదాలను, వైరుధ్యాలను పక్కనబెట్టి బంద్‌లో పాల్గొన్నాయి. రైతుసంఘాలు భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో వర్షంలోనే విశాఖలో బంద్ కొనసాగింది. నిరసనకారులు రోడ్లపై బైఠాయించి బంద్‌లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లోను బంద్ విజయవంతమైంది. పలుచోట్ల వినూత్నంగా కేంద్ర ప్రభుత్వానికి నిరసనలు తెలిపారు. రైతుల గుండెచప్పుడు ఢిల్లీకి వినిపించడంలో సహకరించినందుకు ధన్యవాదాలని కిసాన్ మోర్చా నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బంద్‌కు బీజేపీ దూరంగా ఉంది. రైతు సంఘాల ఆందోళనకు వైఎస్సార్సీపీ సంఘీభావం – వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి సాక్షి, అమరావతి: రైతు సంఘాల పిలుపు మేరకు సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలకు రైతు పక్షపాత పార్టీగా వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటించినట్లు ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వచ్ఛందంగా ఆర్టీసీ బస్సులను కూడా నిలిపేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే మాదిరిగా దేశవ్యాప్త రైతు సంఘాల ఆందోళనలకు వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటించినట్లు ఆయన గుర్తుచేశారు. -
Andhra Pradesh: తక్షణమే రూ.5 లక్షలు
మానవ తప్పిదాలు జరగొద్దు ఒడిశాలో కూడా బాగా వర్షాలు కురుస్తున్నందున అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశాలున్నాయని, అందువల్ల వంశధార, నాగావళి తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట సహాయ శిబిరాలకు తరలించాలన్నారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటిని విడుదల చేయాలని, మానవ తప్పిదాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. దేవుడి దయవల్ల హుద్‌హుద్, తిత్లీ స్థాయిలో గులాబ్ తుపాను లేదని, అయితే అతి భారీ, భారీ వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. సాక్షి, అమరావతి: గులాబ్ తుపాను మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద వెంటనే రూ.ఐదు లక్షల చొప్పున చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బాధితులకు సాయం అందించడంలో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని, డబ్బుల విషయంలో వెనకడుగు వేయవద్దని స్పష్టం చేశారు. అత్యంత ప్రాధాన్యతగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. తుపాను బాధితులకు నాణ్యమైన ఆహారంతో పాటు మందులు, మంచినీరు సరఫరా చేయాలని సూచించారు. పది రూపాయలు ఎక్కువైనా నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, ఉదారంగా ఉండాలని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. విజయనగరం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ నుంచి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, విపత్తు నిర్వహణ కమిషనర్ కన్నబాబు, శ్రీకాకుళం నుంచి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ ఇందులో పాల్గొన్నారు. తుపాను అనంతర పరిస్థితులు.. సహాయ చర్యలపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టి ప్రతి అరగంటకూ సమాచారం సేకరిస్తూ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అక్కడే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్దాస్కు సూచించారు. సీఎస్, జిల్లాల అధికారులతో సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్ విశాఖలో వేగంగా నీటి పంపింగ్.. బాధితుల పట్ల మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. సహాయం చేయడంలో డబ్బుల విషయంలో వెనకడుగు వేయవద్దని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యతతో కూడి ఉండాలని, మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలన్నారు. అవసరమైన అన్నిచోట్లా సహాయ, పునరావాస శిబిరాలను ప్రారంభించాలని సూచించారు. విశాఖ నగరంలో ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటిని పంపింగ్ చేసి తొలగించే పనులు ముమ్మరంగా చేపట్టాలని, వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఆ కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలి ఇళ్లలోకి నీరు చేరి అవస్థలు పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలని, ఆయా కుటుంబాలకు రూ.1,000 చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సహాయ శిబిరాల నుంచి బాధితులు తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1,000 చొప్పున ఇవ్వాలని సూచించారు. వర్షపు నీరు కారణంగా తాగునీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించాలని, జనరేటర్లతో వాటర్ స్కీంలు నిర్వహించాలని ఆదేశించారు. పంట నష్టం అంచనాలు రూపొందించాలి పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్ చేయాలని, నష్టం అంచనాలు వెంటనే సిద్ధం చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎన్యుమరేషన్ చేసేటప్పుడు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. సజావుగా రవాణా: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శ్రీకాకుళం నుంచి సమీక్షలో పాల్గొన్న సీఎస్ అదిత్యనాథ్‌దాస్ తొలుత తుపాను అనంతర పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గంటకు 80 – 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, మిగిలిన చోట్ల అంత తీవ్రత లేదని తెలిపారు. అక్కడక్కడా విరిగిపడ్డ చెట్లను తొలగించామని, జాతీయ రహదారితో పాటు ప్రధాన మార్గాల్లో రవాణాకు ఎక్కడా ఆటంకం లేదని వెల్లడించారు. అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో నిమగ్నమై అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. విశాఖ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశామని వివరించారు. – క్యాంపు కార్యాలయం నుంచి సమీక్ష సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి (డిజాస్టర్ మేనేజ్మెంట్) వి. ఉషారాణి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, అడిషనల్ డీజీ ఏ.రవిశంకర్, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్, సివిల్ సఫ్లైస్ కమిషనర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘గులాబ్’ ఎఫెక్ట్.. తెలంగాణలో మళ్లీ కుండపోత, వీడియోలు
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గులాబ్ తుపాను ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున మొదలైన వాన పొద్దంతా కురుస్తూనే ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో, గ్రేటర్ హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మిగతాచోట్ల కూడా ఓ మోస్తరు వానలు పడ్డాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో రహదారులపై నీరు చేరింది. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వర్షాలతో పలు రైళ్లను రద్దు చేస్తున్న దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో 16.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిరిసిల్లను ముంచెత్తిన వరద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తారంగా వానలు కురిశాయి. వాగులు ఉప్పొంగుతున్నాయి. మిడ్‌మానేరు, లోయర్ మానేరు జలాశయాల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని సోమవారం రాత్రి మళ్లీ వరద ముంచెత్తింది. పట్టణంలోని శాంతినగర్, మెహర్‌నగర్, పద్మనగర్, జేపీనగర్, అనంతనగర్, సర్ధార్‌నగర్, అశోక్‌నగర్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలువురు బాధితులను ఇతర ప్రాంతాలకు తరలించారు. #HyderabadRains happening now #heavyrain #StaySafe pic.twitter.com/BCqQGSQ56T — Amaresh Chanddel (@amareshchandel) September 27, 2021 వరంగల్ ఆగమాగం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, చిట్యాల, మహబూబాబాద్, నర్సంపేట, జనగాం, ములుగు, పరకాలతోపాటు మరికొన్ని మండలాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. ఏజెన్సీలోని 23 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు మళ్లీ నీటమునిగాయి. 28 కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ములుగు జిల్లాలోని బొగత జలపాతం, మహబూబాబాద్ జిల్లాలో భీమునిపాదం జలపాతం పొంగిపొర్లుతున్నాయి. Non Stop Raining in Chengicherla #boduppal #HyderabadRains #HyderabadRain pic.twitter.com/vQZqpep4UF — SAMRAT VAMSHITEJA CHOPPARA (@samratvamshi) September 27, 2021 హైదరాబాద్ మల్లెపల్లిలో కాల్వను తలపిస్తున్న రహదారి ►మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో సీలింగ్ పెచ్చులు ఊడి పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ►ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మంజీరా నది పోటెత్తింది. ఘనపురం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం జలదిగ్బంధమైంది. ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేస్తున్నారు. ►యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వద్ద బిక్కేరు వాగు పొంగిపొర్లుతోంది. బీబీనగర్ మండలం రావిపహాడ్– అనాజ్‌పురం గ్రామాల మధ్య వంతెనపై నుంచి వరద పోటెత్తడంతో రాకపోకలను నిలిపివేశారు. మోత్కూరు, చౌటుప్పల్, రామన్నపేట, లక్కారం–చౌటుప్పల్ మధ్య ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. Kattedan electric substation #HyderabadRains ..so many complaints...all fell in deaf ears... Sad and still have hope govt takes some good decision for the nala here. @KTRTRS @GHMCOnline @TsspdclCorporat @TSIICLtd @GadwalvijayaTRS @Director_EVDM @ZC_Charminar @DC_RajendraNgr pic.twitter.com/BFvaPPcWcK — Sudarshan Bothra (@SudarshanBothra) September 27, 2021 వరదనీరు చేరడంతో చెరువులా మారిన చౌటుప్పల్ పట్టణంలోని గాంధీపార్క్ ►సూర్యాపేట జిల్లా చౌటపల్లి, మఠంపల్లి, బక్కమంతులగూడెం, పెదవీడు, చింతలమ్మగూడెం చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. మునగాల మండలం తాడువాయి శివారులో ఉన్న రహదారిపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. ►కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం దాకా భారీ వర్షం కురిసింది. కెరమెరి, దహెగాం మండలాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. రాంపూర్, మొట్లగూడతో పాటు పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ►మంచిర్యాల జిల్లాలో వాగులు ఉప్పొంగడంతో వేమనపల్లి మండలంలో 15 గ్రామాలు, కోటపల్లి మండలంలో 14, భీమిని, కన్నెపెల్లి మండలాల్లో 8 గ్రామాలకు, నెన్నెల మండలంలో 7, చెన్నూర్ మండలంలో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ►భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా, మున్నేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 100కుపైగా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. 3,172 ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీటమునిగాయి. #HyderabadRains @KTRTRS situation in dammaiguda. Last year too my parents were in similar situation. What measures did your govt take in this one year? Absolutely NOTHING. They sent only one tractor to evacuate people and guess what tractor couldnt enter my parent's house lane pic.twitter.com/cyLRArdwIx — Srujana (@SrujanaAM) September 27, 2021 నిండా మునిగిన హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సోమవారం పొద్దంతా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులపై నీరు చేరి.. జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు అవస్థ పడ్డారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో.. జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటికి రావొద్దని సూచించింది. The 'century old' excuse given last year might have expired. Civic body may have to invent new excuse.#HyderabadRains pic.twitter.com/PuwlfqQhW4 — P Pavan (@PavanJourno) September 27, 2021 -
భారీ వర్షాలు: నేడు తెలంగాణలో సెలవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటం, మరో రెండు రోజు లూ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు మంగళవారం సెలవు ప్రకటించింది. భారీ వర్షాలపై సమీక్ష సందర్భంగా సెలవు అంశంపై నిర్ణయం తీసుకోవాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్ సూచించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే రెవెన్యూ, పోలీస్, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాల శాఖలు, ఇతర అత్యవసర సర్వీసుల ఉద్యోగులు మాత్రం విధి నిర్వహణలో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. (చదవండి: భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ) పరీక్షలన్నీ వాయిదా.. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న, వచ్చే రెండు, మూడు రోజుల్లో జరగాల్సిన అన్నిరకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 28, 29 తేదీల్లో జరగాల్సిన ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు కూడా వాయిదా వేసినట్టు తెలిపారు. ఆయా పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా.. బ్రాహ్మణ పరిషత్తు ఆధ్వర్యంలో బెస్ట్ పథకానికి మంగళవారం జరగాల్సిన ఇంటర్వ్యూలను బుధవారానికి వాయిదా వేసినట్టు పరిషత్తు అడ్మినిస్ట్రేటర్ కె.చంద్రమోహన్ ప్రకటించారు. (చదవండి: హైదరాబాద్‌లో కాస్త తగ్గుముఖం పట్టిన వర్షం..) -
గులాబ్ గుబులు..! సోషల్‌మీడియాలో రకరకాలుగా స్పందిస్తోన్న నెటిజన్లు..!
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను ప్రభావంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి నీరుచేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నగరప్రజల్లో గులాబ్ తుపాన్ గుబులు పుట్టిస్తుంది. సాయంత్రం నాలుగంట్ల సమయంలోనే నగరంలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఇక భారీ వర్షాల పట్ల సోషల్‌మీడియాలో నెటిజన్లు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కొంత మంది నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా..మరికొంత మంది నెటిజన్లు భారీ వర్షాల నేపథ్యంలో ఎలక్ట్రిక్, జీహెచ్ఎమ్సీ, ట్రాఫిక్ సిబ్బంది చేస్తోన్న చర్యలను మెచ్చుకుంటున్నారు. ఏకధాటిగా కురుస్తోన్న వానను లెక్కచేయకుండా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సిబ్బంది పోల్ ఎక్కి కరెంట్ సరఫరాను మెరుగుపర్చేందుకు చేస్తోన్న కృషికి నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. నగరంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా.. ట్విటర్లో ఓ నెటిజన్..‘మేము అందరం మీరు చెప్పినట్లుగానే హెల్మెట్స్ పెట్టుకొని బైక్‌లను నడుపుతున్నాం. అసలు ఇక్కడ రోడ్ ఎక్కడ ఉందని ప్రభుత్వాన్ని వ్యంగ్యంగా ప్రశ్నించాడు. మరో నెటిజన్ నీళ్లలో బైక్ నడిపితే ఊహలకి.. వాస్తవానికి చాలా తేడా ఉందంటూ .. మీమ్‌ను షేర్ చేశాడు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చుట్టుపక్కల ఉండే మూగజీవాలను రక్షించేందుకు పలు టోల్ ఫ్రీ నంబర్లను షేర్ చేస్తున్నారు. Dear Govt.. we are all driving with helmets, but where is the road?🤔#GHMC @KTRTRS @GadwalvijayaTRS @GHMCOnline @trspartyonline @HYDTP #HyderabadRains pic.twitter.com/wBBj9qpm9E — Ahmed | అహ్మద్ | احمد حسین (@iamwithahmed) September 27, 2021 True... 🖐#HyderabadRains @HiHyderabad pic.twitter.com/vg45xerMo3 — Raaz✍🏼🌱 (@Raaz_BRS) September 27, 2021 Real Heroes During rain ❤ We should respect them and treat them in polite way...they too have family Allah hum ki hifazath farmaye#HyderabadRains 💦💦💦 @asadowaisi @KTRTRS @TsspdclCorporat @DRFEVDM pic.twitter.com/0ytYjsIUsI — Mohammed Inayath ulla sharief (@InayathShafi) September 27, 2021 #Hyderabad Please note 👇#HyderabadRains #AnimalSafety pic.twitter.com/vuEBR40Lhe — iamsowmya (@iamsowmya18) September 27, 2021 -
భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గులాబ్ తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన, ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్....! రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సీఎస్‌తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ, పోలీస్, పంచాయితీ రాజ్, నీటిపారుదల, ఫైర్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రాణ ఆస్తి నష్టం కలుగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. అవసరమైతే, హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్‌లో ఉన్న ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన లోతట్టు ప్రాంతాలు , చెరువులు, కుంటలు, బ్రిడ్జి ల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పరిస్థితులను సమీక్షించాలని అన్నారు. డీజీపీ ఎమ్. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమీషనర్లు, ఎస్.పిలని ఆదేశించామని తెలిపారు. ఈ మేరకు పోలీస్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందని అన్నారు. చదవండి: Gulab Cyclone: తెలంగాణలో భారీ వర్షాలు -
వర్షం తగ్గుముఖం పట్టగానే విద్యుత్ ను పునరుద్దరించాలని సీఎం జగన్ ఆదేశం
-
హైదరాబాద్‌లో కాస్త తగ్గుముఖం పట్టిన వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. సుమారు మధ్యాహ్నం 2 గంటల నుంచి మోస్తరు వర్షం, సాయంత్రం 4 గంటల నుంచి అత్యంత భారీ వర్షం కురిసింది. రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉన్న కారణంగా జీహెచ్ఎంసి, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. మరో 12 గంటల పాటు గులాబ్ తుఫాన్ ప్రభావం ఉండనున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. గత అనుభవాల దృష్ట్యా తెలంగాణ విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. కరెంట్ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ అంతా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో పలు ప్రాంతాల్లోని రోడ్లపైకి, కాలనీల్లోకి వరద నీరు చేరింది. మరో అయిదారు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో చీకటి అలుముకుంది. పట్టపగలే కారు చీకటి అలముకుంది. కుండపోతగా వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హైదరాబాద్ హై అలర్ట్ హైదరాబాదీలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ నేడు, రేపు హై అలర్ట్ ప్రకటించింది. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అవసరమైతే 040-23202813 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. చదవండి: Gulab Cyclone: తెలంగాణలో భారీ వర్షాలు తెలంగాణలో 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హన్మకొండ, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. Got to love #HyderabadRain! Yes, it's that dark at 4.15 pm!@Hyderabadrains#HyderabadRains @HiHyderabad @WeAreHyderabad @Rajani_Weather @balaji25_t @HYDmeterologist @Hyderabadiiiiii #HyderabadRains #hyderabad pic.twitter.com/IruTDl8fqp — Aveek Bhowmik (@Aveekishere) September 27, 2021 -
ఎమర్జెన్సీ టీంలను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
-
తుఫాన్ ఎఫెక్ట్ తో పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు
-
వర్షానికి కొట్టుకుపోయిన షాపులు
-
తుఫాన్ ఎఫెక్ట్ తో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు
-
Cyclone Gulab: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం
-
ఖైరతాబాద్ మెట్రో దగ్గర నిలిచిన వరద నీరు
-
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
-
Cyclone Gulab: ‘మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం’
సాక్షి, అమరావతి: గులాబ్ తుపాను, అనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. తుపాను అనంతర పరిస్థితులను సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ సీఎం జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అరగంటకూ విద్యుత్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చుకోవాలని సూచించారు. ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకుని, విద్యుత్‌ను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఇవాళ కూడా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎస్‌కు ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయొద్దని అన్నారు. సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని, మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలన్నారు. అవసరమైన అన్నిచోట్లా సహాయక శిబిరాలను తెరవాలని సీఎం అధికారులను ఆదేశించారు. విశాఖ నగరంలో ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటిని పంపింగ్ చేసి తొలగించే పనులు ముమ్మరంగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. సహాయ శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశించారు. తాగునీటి వనరులు వర్షపు నీరు కారణంగా కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున వాటర్ ట్యాంకర్లు ద్వారా తాగునీటిని అందించాలని సూచించారు. జనరేటర్లతో వాటర్ స్కీంలు నిర్వహించాలని, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్ చేయాలన్నారు. నష్టం అంచనాలు వెంటనే సిద్ధంచేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్యుమరేషన్ చేసేపటప్పుడు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఒడిశాలో కూడా బాగా వర్షాలు కురుస్తున్నందున, అకస్మాత్తుగా వర్షాలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. వంధార, నాగావళి నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని ఆధికారులను ఆదేశించారు. అవసరమైన చోట వారిని సహాయ శిబిరాలకు తరలించాలని, రిజర్వాయర్లలో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. నీటిని విడుదల చేయాలన్నారు. ఈ సమీక్షలో విజయనగరం నుంచి సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్, విపత్తు నిర్వహణ కమిషనర్ కన్నబాబు, శ్రీకాకుళం నుంచి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. -
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తిన వానలు
-
గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు
-
తీరం దాటినా గులాబ్ తుఫాన్
-
Cyclone Gulab: పలు రైళ్ల మళ్లింపు, రీషెడ్యూల్
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): గులాబ్ తుపాను కారణంగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు, మరికొన్నింటిని రీషెడ్యూల్ చేస్తున్నట్లు రెల్వే అధికారులు తెలిపారు. దారి మళ్లించిన రైళ్లు ♦25వ తేదీన అగర్తలలో బయలుదేరిన అగర్తల–బెంగళూరు (05488) రైలు, 26న హౌరాలో బయలుదేరిన హౌరా–సికింద్రాబాద్ (02703, హౌరా–యశ్వంత్‌పూర్ (02245),హౌరా–హైదరాబాద్ (08645), హౌరా–చెన్నై (02543), హౌరా–తిరుపతి (02663), సంత్రాగచ్చిలో బయలుదేరిన సంత్రాగచ్చి– తిరుపతి (02609), టాటాలో బయలుదేరిన టాటా ఎర్నాకుళం (08189) రైళ్లు ఖరగ్‌పూర్, ఝార్సుగుడ, బల్హార్షా మీదుగా ప్రయాణిస్తాయి. ♦26న భువనేశ్వర్‌లో బయలుదేరిన భువనేశ్వర్–ముంబై(01020) రైలు సంబల్పూర్, టిట్లాగఢ్ రాయ్‌పూర్ మీదుగా నడుస్తుంది. 25న అలప్పుజాలో బయలుదేరిన అలప్పుజా–ధన్‌బాద్ (03352), 26న చెన్నైలో బయలుదేరిన చెన్నై–హౌరా (02544) రైళ్లు బల్హార్షా, ఝార్సుగుడ మీదుగా నడుస్తాయి. ♦25న యశ్వంత్‌పూర్‌లో బయలుదేరిన యశ్వంత్‌పూర్–పూరి (02064), 26న తిరుపతిలో బయలుదేరిన తిరుపతి–భువనేశ్వర్ (08480) రైళ్లు బల్హార్షా, సంబల్పూర్ మీదుగా ప్రయాణిస్తాయి. ♦25న త్రివేండ్రం సెంట్రల్లో బయలుదేరిన త్రివేండ్రం–షాలిమార్ (02641), 26న హైదరాబాద్‌లో బయలుదేరిన హైదరాబాద్–హౌరా (08646) రైళ్లు బల్హార్షా, ఝార్సుగుడ, ఖరగ్‌పూర్ మీదుగా నడుస్తాయి. రీషెడ్యూల్ చేసిన రైళ్లు 26న పలు స్టేషన్లలో బయలుదేరే ప్రత్యేక రైళ్లను రీషెడ్యూల్ చేశారు. పూరిలో బయలుదేరే పూరి–తిరుపతి (07480) 11 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ♦హౌరా నుంచి హౌరా–యశ్వంత్‌పూర్ (02873), హౌరా–పాండిచ్చేరి (02867) రైళ్లు 2 గంటలు ఆలస్యంగా బయలుదేరతాయి. ♦సికింద్రాబాద్‌లో సికింద్రాబాద్–హౌరా (02704), యశ్వంత్‌పూర్‌లో యశ్వంత్‌పూర్–హౌరా (02246), యశ్వంత్‌పూర్–హౌరా (02874), తిరుపతిలో తిరుపతి–బిలాస్పూర్ (07481), తిరుపతి–హౌరా (08090) రైళ్లు 3 గంటలు ఆలస్యంగా బయలుదేరతాయి. -
Cyclone Gulab: ‘గండం’ దాటింది
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, సాక్షి, అమరావతి, మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్రకు కునుకు లేకుండా చేసిన గులాబ్ తుపాను కొద్ది గంటలు ముందుగానే ఆదివారం రాత్రి కళింగపట్నం–గోపాలపూర్ మధ్య తీరం దాటింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో తీరాన్ని తాకిన తుపాన్ అనంతరం కళింగపట్నానికి పశ్చిమంగా ఒడిశా వైపు పయనిస్తూ తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కుంభవృష్టితో తుపాను ప్రభావం తీవ్రంగా కనిపించింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో తీరం వెంట గంటకు 80–90 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గులాబ్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జోరు వర్షాలతో నాగావళి పరవళ్లు తొక్కుతోంది. తోటపల్లి ప్రాజెక్ట్ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మడ్డువలస వద్ద కూడా అదే పరిస్థితి ఉంది. హిర మండలం గొట్టాబ్యారేజీ వద్ద వంశధారలో నీటి ప్రవాహం పెరగడంతో 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో భారీ వర్షానికి జలమయమైన రహదారి చివరిలో నెమ్మదించి.. శ్రీకాకుళం జిల్లాను వణికించిన గులాబ్ ఆఖరులో శాంతించింది. తిత్లీ సమయంలో గంటకు 195 కిలోమీటర్ల వేగంతో రాకాసి గాలులు వీయగా హుద్‌హుద్ వేళ 215 కిలోమీటర్ల వేగంతో పెను తుపాన్ విరుచుకుపడింది. గులాబ్ మాత్రం 80–90 కిలోమీటర్ల వేగానికి పరిమితమైంది. రాత్రి తొమ్మిది నుంచి పది గంటల సమయంలో 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రహదారులకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ నెల 28న మరో అల్పపీడనం ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో 28వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం దాటే సూచనలున్నాయని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గోపినాథపురం సమీపంలో రోడ్డుపై పడిన చెట్లను తొలగిస్తున్న సిబ్బంది శ్రీకాకుళం జిల్లాలో 40.4 మి.మీ సగటు వర్షపాతం ఆదివారం రాత్రి 8.30 నుంచి 10.30 గంటల మధ్య శ్రీకాకుళం జిల్లాలో 40.4 మి.మీ, విశాఖపట్నం జిల్లాలో 37.3 మి.మీ, విజయనగరం జిల్లాలో 26.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కళింగపట్నంలో 148.5 మి.మీ, ఎచ్చెర్లలో 109.5, అడవివరంలో 108, నిమ్మాడలో 96.5, తులుగులో 96.5, విశాఖ నగరంలో 93.3, నరసన్నపేటలో 78.3, రాగోలులో 77, తమ్మినాయుడుపేటలో 71.8, పొలాకిలో 71 మి.మీ వర్షం కురిసింది. ఉత్తరాంధ్రకు వరద హెచ్చరిక ఆదివారం రాత్రి నుంచి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, విశాఖ జిల్లాలోని అనేక చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఉభయగోదావరి జిల్లాల్లోను వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల వంశధార, మహేంద్ర తనయ నదులు పొంగి ప్రవహించే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. తుపాను కారణంగా విశాఖలోని పెదజాలరిపేట వద్ద ఒడ్డుకు చేర్చిన పడవలు పునరావాస కేంద్రాలకు తరలింపు.. శ్రీకాకుళం జిల్లాలో 38 పునరావాస కేంద్రాల్లోకి 1,358 మందిని తరలించారు. బందరువానిపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో 500 మందికి పునరావాసం కల్పించారు. వజ్రపుకొత్తూరు మండలంలో 182 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంచినీళ్లపేటలో 12 మందిని, బైపల్లి గ్రామంలో 54 మందిని, ఎల్‌డీపేటకు చెందిన 26 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మెట్టూరుకు చెందిన 65 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన సదుపాయాలు కల్పించారు. పూడిలంకలో 73 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. 27 మండలాల్లో ‘గులాబ్’ ప్రభావం తుపాను దృష్ట్యా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. 27 మండలాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేసి యుద్ధప్రాతిపదికన పరికరాలు, సిబ్బందిని తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. 276 ప్రైవేటు క్రేన్లు, 64 జనరేటర్లు అందుబాటులో ఉంచారు. 25,500 విద్యుత్ స్థంభాలు, 2,732 ట్రాన్స్ఫార్మర్లు స్టోర్‌లో ఉంచారు. శ్రీకాకుళం జిల్లాలో 1400 మందితో 70 బృందాలు, విజయనగరం జిల్లాలో 700 మందితో 35 బృందాలు, విశాఖపట్నం జిల్లాలో 1440 మందితో 72 బృందాలను రంగంలోకి దించారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి 24 గంటలూ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించారు. తుపాను నేపధ్యంలో ఏపీఈపీడీసీఎల్ చేపట్టిన ఏర్పాట్లపై డిస్కం సీఎండీ కె.సంతోషరావుతో కలసి ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ సమీక్ష నిర్వహించారు. లైన్మెన్ నుంచి చైర్మన్ వరకూ ఎవరికీ సెలవులు ఉండవని, పునరుద్ధరణ పనులపై సీఎం జగన్ పర్యవేక్షణ ఉంటుందని, తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బోటు బోల్తా.. ఐదుగురు సురక్షితం శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేట గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు ఒడిశా నుంచి కొత్త బోటు కొనుగోలు చేసి వస్తుండగా అక్కుపల్లి సమీపంలో గంగువాడ కొండ దగ్గర సముద్రంలో బోటు బోల్తాపడడంతో గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురు సురక్షితంగా అక్కుపల్లి, బాతుపురం ప్రాంతాల్లో తీరానికి చేరుకోగా గల్లంతైన బుంగ మోహన్‌రావు (18) కోసం గాలిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలతో.. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టింది. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని గమనిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తొలిసారి తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. వలంటీర్లను రంగంలోకి దించి ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూశారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో ఐదు, కంచిలి మండలంలో 3, ఇచ్ఛాపురంలో 3, పలాసలో 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పోలాకి మండలం సముద్ర తీర ప్రాంతంలో పర్యటించారు. పశు సంవర్ధకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఎస్పీ అమిత్ బర్దార్ బారువ మండలం కొత్తూరు, సంతబొమ్మాళి మండలం సున్నపల్లి గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులకు జాగ్రత్తలు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. -
రెండు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను ప్రభావంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వరుసగా రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా అదిలాబాద్, మంచిర్యాల, కుమ్రుంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా రెండురోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని జోనల్ కమిషనర్లందరికీ సూచించింది. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి సమీక్షించాలి రాష్ట్రంలో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎస్.. ఆదివారం అక్కడినుంచే కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గులాబ్ తుపాను ప్రభావం మరో రెండురోజుల పాటు మొత్తం రాష్ట్రంపై ఉండనుందని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టు తెలిపారు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు. పోలీస్, ఇతర సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకూడదు లోతట్టు ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎస్ కోరారు. తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సేవలను పొందాలని చెప్పారు. వాగులు, వంకల్లో వరద నీరు ప్రవహించే సమయంలో ప్రజలు దాటకుండా ఆయా ప్రాంతాల్లో నిఘా ఉంచాలని అన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేకంగా అధికారులను నియమించి ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని, స్థానికుల సహాయంతో వరద నష్టం నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు. ఇప్పటివరకు 94.4 సెం.మీ. వర్షపాతం నైరుతి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 94.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్1 నుంచి ఆదివారం నాటికి 70.4 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... ఇప్పటివరకు 34 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యధికంగా సంగారెడ్డిలో 9.38 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 8.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. -
గులాబ్ తుపాన్ ప్రభావం: పలు రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: గులాబ్ తుపాను ప్రభావంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. భువనేశ్వర్-సికింద్రాబాద్, భువనేశ్వర్- తిరుపతి, పూరీ-చెన్నై సెంట్రల్, సంబల్పూర్-హెచ్ఎస్ నాందేడ్, రాయగూడ-గుంటూరు, భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగుళూరు సిటీ, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మరికొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. చదవండి: Cyclone Gulab: తీరం వెంబడి బలమైన గాలులు Cyclone Gulab: అప్రమత్తం.. 1358 మందికి పునరావాసం -
Cyclone Gulab: అప్రమత్తం.. 1358 మందికి పునరావాసం
సాక్షి, శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా గులాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్నిరకాల సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. తుపాను ప్రభావిత మండలాలైన 13 మండలాల్లో 61 కేంద్రాలను ఏర్పాటు చేసామని చెప్పారు. ఇప్పటికే 38 పునరావాస కేంద్రాల్లోకి 1358 మందిని తరలించి, వారికి వైద్యం, భోజనం, ఇతర ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. గార మండలంలోని ఎస్.మత్స్యలేశం, మొగదల పాడు, నగిరెడ్లపేట తుపాను సురక్షిత కేంద్రాలతో పాటు బందరువానిపేట జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 500 మందికి పునరావాసం కల్పించామని అన్నారు. కవిటి మండలంలోని కుసుమపురం, మాణిక్యపురం, ఎద్దువాణిపాలెం, కవిటి.. ముత్యాలపేట తుపాను సురక్షిత కేంద్రాల్లో 342 మందికి, వజ్రపు కొత్తూరులోని హుకుంపేట, మంచినీళ్లపేట, కె.ఆర్.పేట, బైపల్లి, మెట్టూరు మరియు వజ్రపు కొత్తూరు తుఫాన్ రక్షిత కేంద్రాల్లోకి 182 మందికి ఇప్పటివరకు తరలించామన్నారు. ఇచ్చాపురం మండలంలో డొంకూరు, ఈదుపురం తుపాను రక్షిత కేంద్రాలతో పాటు డొంకూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 100 మందికి, సంతబొమ్మాళి మండలంలో ఆర్.సున్నపల్లి తుపాను రక్షిత కేంద్రంలో 100 మందికి, పోలాకిలోని గుప్పిడిపేట, రాజారాంపురం పునరావాస కేంద్రాల్లోకి 54 మందిని తరలించినట్లు కలెక్టర్ చెప్పారు. కంచిలి మండలంలోని కుట్టుమ పునరావాస కేంద్రానికి 30 మందికి, పలాస మండలంలోని అమలకుడియా, సరియాపల్లి, బొడ్డపాడు, రంగోయి కేంద్రాలకు 30 మందికి, సోంపేట మండలంలోని బారువ పునరావాస కేంద్రానికి 20 మందిని మొత్తం 1,358 మందికి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ చెప్పారు. గులాబ్ తుపాన్ ప్రభావంతో వీచిన బలమైన గాలులకు కంచిలి మండలంలోని మద్దిపుట్టుగ గ్రామంలో 2 ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోగా వాటిని తక్షణమే అధికారులు మరమ్మతులు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సోంపేట మండలంలోని మాకన్నపురంలో ఒక ఇల్లు, కాశీబుగ్గ హరిజన వీధిలో ఒక ఎలక్ట్రికల్ పోల్ విరిగినట్లు ఇప్పటివరకు అందిన సమాచారమని కలెక్టర్ తెలిపారు. పలుచోట్ల రహదారులకు అడ్డంగా విరిగిన చెట్లను తక్షణమే చెట్లను తొలగించడం జరుగుతుందని చెప్పారు. ఇంకా మిగిలిన ప్రాంతాల నుండి నష్టపోయిన వివరాలు అందాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. -
Cyclone Gulab: తీరం దాటిన తుపాను
సాక్షి, శ్రీకాకుళం/విజయనగరం: కళింగపట్నం-గోపాలపూర్ మధ్య గులాబ్ తుపాను తీరం దాటింది. జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భావనపాడు, నౌపాడ ప్రాంతాల్లో పలు చెట్లు నేల కూలాయి. తుపాను దెబ్బకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలను కూడా నిలిపివేశారు. అక్కునపల్లి బీచ్‌లో ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతు కాగా, నలుగురు మత్స్యకారులు సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు. కాగా, గులాబ్ తుఫాన్ పై విశాఖ కేంద్రంగా ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్ సమీక్ష నిర్వహించగా, విశాఖ కలెక్టరేట్లో అధికారులతో విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సమీక్ష చేపట్టారు. తుపాను తీరం దాటే సమయంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలోని 15 మండలాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి అందజేస్తూ సీఎస్ అదిత్య నాథ్ చర్యలు చేపడుతున్నారు. చదవండి: Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్ తుపాను -
Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్ తుపాను
-
మత్స్యకారులపై గులాబ్ తుఫాన్ ప్రభావం
-
విజయనగరం : ముంపు ప్రాంతాలను నిరంతరం పర్యవేస్తున్నఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది
-
శ్రీకాకుళం : తీర ప్రాంతాలకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
-
గులాబ్ తుఫాన్ ఈరోజు అర్థరాత్రి తీరం దాటే అవకాశం :వాతావరణ శాఖ
-
అప్రమత్తంగా ఉండండి: సీఎం జగన్
-
సీఎం వైఎస్ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్
-
అప్రమత్తంగా ఉండండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంద్ర జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధమయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లోను కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి: సీఎం జగన్ తుపాను నేపథ్యంలో అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను అనంతరం పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, ఉత్తరాంధ్ర, దక్షిణా ఒడిశా తీరాలను గులాబ్ తుపాను తాకనుంది. ఈరోజు అర్థరాత్రి గోపాల్పూర్-కళింగపట్నం మధ్య తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. దాంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు భారీ సూచనలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చదవండి: Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్ తుపాను -
Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్ తుపాను
సాక్షి, విశాఖపట్నం/ అమరావతి: ఉత్తరాంధ్ర తీరం వైపు గులాబ్ తుపాను దూసుకొస్తోంది. శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మరింత బలపడి శనివారం సాయంత్రానికి గులాబ్ తుపానుగా మారింది. ఇది ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో 370 కి.మీ., శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి తూర్పు దిశలో 440 కి.మీ. దూరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండంగా ఉన్నప్పుడు గంటకు 14 కి.మీ. వేగంతో కదిలిన గులాబ్ తుపానుగా మారిన తర్వాత గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతోంది. ఇది శనివారం అర్థరాత్రి తీవ్ర తుపానుగా బలపడింది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. సముద్ర మట్టానికి 5.6 కిమీ ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో తుపాను మరింత చురుగ్గా కదులుతోంది. ఇది క్రమంగా బలపడి.. పశ్చిమ దిశగా కదులుతూ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ కాస్త పరిస్థితుల మార్పు చెందితే సోంపేటలోని బారువ వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కి.మీ. వేగంతోనూ.. గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈ నెల 27వ తేదీ వరకూ మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశాలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండనుందని అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, సోంపేట, గంజాం జిల్లాల్లో మీటరు ఎత్తు వరకూ అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండనున్న కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విశాఖ జిల్లా తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దంటూ రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు దండోరా వేయించారు. పోర్డులకు మూడో ప్రమాద హెచ్చరిక తుపాను నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో చెట్లు నేలకొరిగే ప్రమాదం ఉంది. బొప్పాయి, అరటి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రైతులు అప్రమత్తంగా వ్యవహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్రకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముందు జాగ్రత్తగా విశాఖపట్నంలో ఒక ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందం, ఒక ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాన్ని సిద్ధంగా ఉంచారు. శ్రీకాకుళానికి మరో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. పోలీస్, రెవెన్యూ, రవాణా, టెలీ కమ్యూనికేషన్స్, విద్యుత్, తాగునీటి సరఫరా శాఖలను అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లకు ఆదేశాలందాయి. రోడ్లు దెబ్బతిని ట్రాఫిక్ సమస్యలు ఎదురైతే యుద్ధప్రాతిపదికన సరిచేసేలా సిద్ధంగా ఉండాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించింది. కోవిడ్ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉంచుకోవాలని, కోవిడ్–19 బారిన పడిన వారికి అవసరమైన వైద్య సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 28న మరో అల్ప పీడనం ఈ నెల 27న ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో 28వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం దాటే సూచనలున్నాయని అధికారులు భావిస్తున్నారు. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న 86 వేల కుటుంబాలను గుర్తించి తుపాను షెల్టర్లకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో 24 గంటలు పనిచేసేలా ‘స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్’ ఏర్పాటు చేశారు. మూడు జిల్లాల్లో జిల్లా స్థాయిలోను, తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే 76 మండలాల్లో మండల స్థాయిలోను ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్లను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు వలంటీర్ల సేవలను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించేలా గ్రామ, వార్డు సచివాలయాల్లోను కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.