సాక్షి, అమరావతి: తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంద్ర జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధమయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లోను కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.
అప్రమత్తంగా ఉండండి: సీఎం జగన్
తుపాను నేపథ్యంలో అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను అనంతరం పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, ఉత్తరాంధ్ర, దక్షిణా ఒడిశా తీరాలను గులాబ్ తుపాను తాకనుంది. ఈరోజు అర్థరాత్రి గోపాల్‌పూర్-కళింగపట్నం మధ్య తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. దాంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు భారీ సూచనలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment