
విజయనగరం టౌన్/ తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): గులాబ్ తుపాను నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దయినట్లు, మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
27వ తేదీ రద్దయిన రైళ్లు
రూర్కెలా–జగదల్‌పూర్ స్పెషల్ (08107), భువనేశ్వర్–జగదల్‌పూర్ స్పెషల్ (08445), విశాఖ–రాయగడ స్పెషల్ (08508), విశాఖ–కిరండూల్ (08516), కోర్బా–విశాఖ స్పెషల్ (08517), విశాఖ–కోర్బా స్పెషల్ (08518), భువనేశ్వర్–జునాఘర్ రోడ్ స్పెషల్ (02097).
28వ తేదీ రద్దయిన రైళ్లు
రాయగడ–విశాఖ స్పెషల్ (08507), జగదల్‌పూర్–రూర్కెలా స్పెషల్ (08108), జగదల్‌పూర్–భువనేశ్వర్ స్పెషల్ (08446), జునాఘర్ రోడ్డు–భువనేశ్వర్ స్పెషల్ (02098).
27న రీషెడ్యూల్ చేసిన రైళ్లు
► విశాఖ–గుంటూరు (07240) రైలు 3 గంటలు ఆలస్యంగా ఉదయం 10.10 గంటలకు విశాఖ నుంచి బయల్దేరింది.
► విశాఖ– హజరత్ నిజాముద్దీన్ (02851) రైలు 3 గంటలు ఆలస్యంగా ఉదయం 11.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరింది.
► చెన్నైలో 27వ తేదీ ఉదయం 7 గంటలకు బయల్దేరాల్సిన చెన్నై సెంట్రల్–హౌరా స్పెషల్ (02544) రైలు 15 గంటలు ఆలస్యంగా రాత్రి 10.30 గంటలకు బయల్దేరింది.
► చెన్నైలో 27వ తేదీ రాత్రి 7.15 గంటలకు బయల్దేరాల్సిన చెన్నై సెంట్రల్–హౌరా స్పెషల్ (02822) రైలు 28వ తేదీ ఉదయం 9.30 గంటలకు బయల్దేరుతుంది.
హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు
రైళ్ల రాకపోకల వివరాలను 08922–221202, 221206/ 089128–83331, 83332, 83333, 833334 నంబర్లకు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు.
జారిపడ్డ మట్టిదిబ్బలు, కొండచరియలు
అనంతగిరి/తాడేపల్లి రూరల్: భారీ వర్షాలకు విశాఖ ఏజెన్సీ కొత్తవలస–కిరండూల్ మార్గం (కేకే లైన్)లో బొర్రా–చిమిడిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య, శివలింగపురం 47వ కిలోమీటర్ వద్ద రెండు చోట్ల మట్టిదిబ్బలు జారి రైల్వేట్రాక్‌పై పడ్డాయి. దీంతో ఈ మార్గంలో ఉదయం నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) పరిధిలో సీతానగరం పుష్కర్ ఘాట్‌కు వెళ్లే దారిలో కొండచరియలు జారిపడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.