తాటిచెట్లపాలెం/రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని ఖుర్దా రోడ్ డివిజన్‌లో భువనేశ్వర్–మంచేశ్వర్, హరిదాస్‌పూర్–ధన్‌మండల్ సెక్షన్ పరిధిలలో మూడో లైన్ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్, ఇంటర్ లాకింగ్ పనుల కోసం ఈ మార్గంలో ప్రయాణించే, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే వందకు పైగా రైళ్లను ఈ నెల 14 నుంచి 30వ తేదీల మధ్య వివిధ రోజుల్లో రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం త్రిపాఠి శనివారం తెలిపారు.
కొన్ని రైళ్ల గమ్యాన్ని కుదించడంతోపాటు మరికొన్ని రైళ్లు దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల 14 నుంచి 20 వరకు కాకినాడ–విశాఖపట్నం–కాకినాడ (17267/17268) ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి–విశాఖపట్నం–రాజమండ్రి(07466/07467) స్పెషల్ పాసింజర్, విశాఖపట్నం–విజయవాడ–విశాఖపట్నం (22701/22702) ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–గుంటూరు–విశాఖపట్నం(17240/17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను రెండు వైపులా రద్దు చేసినట్లు వివరించారు.
విజయవాడ డివిజన్‌లో...
విజయవాడ డివిజన్‌లో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగా, కొన్ని పాక్షికంగా రద్దు చేయడంతోపాటు మరికొన్ని దారిమళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విజయవాడ–బిట్రగుంట (07978) రైలు ఈ నెల 13 నుంచి 19 వరకు, బిట్రగుంట–విజయవాడ (07977) రైలు ఈ నెల 14 నుంచి 20 వరకు, బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) ఈ నెల 16 నుంచి 18 వరకు, విజయవాడ–గూడూరు (07500)రైలు ఈ నెల 16 నుంచి 20 వరకు, గూడూరు–విజయవాడ (07458) రైలు ఈ నెల 17 నుంచి 20 వరకు రద్దు చేశారు.
కాగా, నర్సాపూర్–గుంటూరు (17282/17281) రైలును ఈ నెల 14 నుంచి 20 వరకు విజయవాడ–గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. యర్నాకుళం–పాట్నా (22643) రైలును ఈ నెల 14, 15 తేదీల్లో, బెంగళూరు–గౌహతి (12509) రైలును ఈ నెల 16, 17, 18 తేదీల్లో, కోయంబత్తూర్–సిల్‌చర్ (12515) రైలును ఈ నెల 13, 20 తేదీల్లో, భావనగర్ టెరి్మనల్–కాకినాడ పోర్ట్ (12756) రైలును ఈ నెల 12, 19 తేదీల్లో విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు.
Comments
Please login to add a commentAdd a comment