train canceled
-
దానా తుపాను : 86 రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికులు తిప్పలు (ఫొటోలు)
-
పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు సెక్షన్లు నీట మునిగిన నేపథ్యంలో విజయవాడ డివిజన్ మీదుగా నడిచే రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 4న యర్నాకుళం–హతియ (22838), తాంబరం–సంత్రగచ్చి (22842), పుదుచ్చేరి–హౌరా (12868), న్యూ ఢిల్లీ–విశాఖపట్నం (20806), న్యూ ఢిల్లీ–చెన్నై సెంట్రల్ (12622), షిర్డీ సాయినగర్–మచిలీపట్నం (17207), హైదరాబాద్–షాలీమార్ (18046), నాగర్సోల్–నర్సాపూర్ (12788), ఈ నెల 5న యర్నాకుళం–టాటా (18190), ఈ నెల 6న కొచ్చివెల్లి–షాలీమార్ (6081), ఈ నెల 7న కన్యాకుమారి–హౌరా (12666), తిరునులివెల్లి–పురులియ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.ఈ నెల 4న చెన్నై సెంట్రల్– శ్రీమాత వైష్ణోదేవి కాట్రా (16031) వయా విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, రాయ్‌పూర్, నాగ్‌పూర్ మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. విశాఖపట్నం–ముంబై ఎల్టీటీ (18519), 12805 విశాఖపట్నం–లింగంపల్లి (12805), విశాఖపట్నం–విజయవాడ ప్రత్యేక రైలు (08581)ను మంగళవారం పునరుద్ధరించారు. -
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వందకుపైగా ట్రైన్లు రద్దు
తాటిచెట్లపాలెం/రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని ఖుర్దా రోడ్ డివిజన్లో భువనేశ్వర్–మంచేశ్వర్, హరిదాస్పూర్–ధన్మండల్ సెక్షన్ పరిధిలలో మూడో లైన్ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్, ఇంటర్ లాకింగ్ పనుల కోసం ఈ మార్గంలో ప్రయాణించే, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే వందకు పైగా రైళ్లను ఈ నెల 14 నుంచి 30వ తేదీల మధ్య వివిధ రోజుల్లో రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం త్రిపాఠి శనివారం తెలిపారు. కొన్ని రైళ్ల గమ్యాన్ని కుదించడంతోపాటు మరికొన్ని రైళ్లు దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల 14 నుంచి 20 వరకు కాకినాడ–విశాఖపట్నం–కాకినాడ (17267/17268) ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి–విశాఖపట్నం–రాజమండ్రి(07466/07467) స్పెషల్ పాసింజర్, విశాఖపట్నం–విజయవాడ–విశాఖపట్నం (22701/22702) ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–గుంటూరు–విశాఖపట్నం(17240/17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను రెండు వైపులా రద్దు చేసినట్లు వివరించారు. విజయవాడ డివిజన్లో... విజయవాడ డివిజన్లో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగా, కొన్ని పాక్షికంగా రద్దు చేయడంతోపాటు మరికొన్ని దారిమళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విజయవాడ–బిట్రగుంట (07978) రైలు ఈ నెల 13 నుంచి 19 వరకు, బిట్రగుంట–విజయవాడ (07977) రైలు ఈ నెల 14 నుంచి 20 వరకు, బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) ఈ నెల 16 నుంచి 18 వరకు, విజయవాడ–గూడూరు (07500)రైలు ఈ నెల 16 నుంచి 20 వరకు, గూడూరు–విజయవాడ (07458) రైలు ఈ నెల 17 నుంచి 20 వరకు రద్దు చేశారు. కాగా, నర్సాపూర్–గుంటూరు (17282/17281) రైలును ఈ నెల 14 నుంచి 20 వరకు విజయవాడ–గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. యర్నాకుళం–పాట్నా (22643) రైలును ఈ నెల 14, 15 తేదీల్లో, బెంగళూరు–గౌహతి (12509) రైలును ఈ నెల 16, 17, 18 తేదీల్లో, కోయంబత్తూర్–సిల్చర్ (12515) రైలును ఈ నెల 13, 20 తేదీల్లో, భావనగర్ టెరి్మనల్–కాకినాడ పోర్ట్ (12756) రైలును ఈ నెల 12, 19 తేదీల్లో విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. -
నేడు శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు
విజయవాడ ప్యాసింజర్ కూడా.. కాజీపేట రూరల్ : విజయవాడ రైల్వేస్టేçÙ¯ŒS రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం ఆధునీకరణ పనులను పురస్కరించుకుని ఆదివారం శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను అప్ అండ్ డౌ¯ŒS మార్గంలో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సికిం ద్రాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే శాతవాహన రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కాజీపేట జంక్ష¯ŒS నుంచి ఉదయం 4 గంటలకు విజయవాడకు వెళ్లే ప్యాసింజర్ రైలును కూడా రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు. రైల్వే వంతెనల వద్ద హెచ్చరిక బోర్డులు.. కాజీపేట సబ్ డివిజ¯ŒS పరిధిలోని రైల్వే వంతెనల వద్ద అధికారులు నిఘా గస్తీ ముమ్మరం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైలు కట్టలకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎలుగూరు–నెక్కొండ మార్గంలోని వాటర్ లెవెల్ క్రాసింగ్ వద్ద, గుండ్రాతిమడుగు–డోర్నకల్ మధ్యలోని రైల్వే వంతెనల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి గస్తీ ముమ్మరం చేశారు. అలాగే కాజీపేట జంక్ష¯ŒSలో మా¯ŒSసూ¯ŒS గస్తీ రైలును సిద్ధం చేశారు. స్టేష¯ŒS ఘ¯ŒSపూర్, డోర్నకల్, కాజీపేట మార్గాలకు వెళ్లే గస్తీ రైలులో ఇసుక బస్తాలు, బోల్డర్స్ మెటీరియతో పాటు ఎమర్జెన్సీ సిబ్బందిని అప్రమత్తం చేసి రెడీ చేసినట్లు అధికారులు తెలిపారు.